• Venello Cheekati Rahasyam Kathalu

    Venello Cheekati Rahasyam Kathalu

    0
    225.00
    Add to cart
  • Vidyardhi Vyasalu

    Vidyardhi Vyasalu

    0

     ఈ గ్రంథమునందు విద్యార్థులు తప్పని సరిగా అలవరచుకోనదగిన, క్రమశిక్షణ, ఆత్మావిశ్వాసము, సమయపాలన, శారీరక, మానసిక దృఢత్వము, బాహ్యామభ్యంతర శుచి, ఒత్తిడిని అధిగమించుట, శీల నిర్మాణము, ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిత్వ వికాసము, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలూ, సమతా భావములు వంటి సద్గుణములు పెంపొందించుకొనుటకు ఉపయుక్తమైన, ఆదర్శ విద్యార్థి, ఉత్తమ గురువు, యోగాసనములు, ప్రాణాయామము, శీలము, నైతిక విలువల వంటి వ్యాసములు ఆణిముత్యములు. ప్రతి విద్యార్థియు ఈ పుస్తకము చదివి ఆ ఆణిముత్యముల విలువను పొందురుగాక!

    100.00
    Add to cart
  • Vijayamlo Bhagaswamyam - విజయంలో భాగస్వామ్యం

    Vijayamlo Bhagaswamyam – విజయంలో భాగస్వామ్యం

    0

    భార్యా భర్తలు అన్యోన్యంగా వుంటూ పొరపొచ్చాలు లేకుండా కాపురం చేయాలంటే, దాంపత్య విజయంలో సమాన భాగస్వామ్యం పొందాలంటే ఎలా ప్రవర్తించాలో, పరస్పరం ఎలా సహకరించుకోవాలో ఆ విషయాలన్నింటినీ వివరంగా చర్చించారు రచయిత.

    దాంపత్యాన్ని ఒక అందమైన కలగా మలచుకోవటానికి, సంసార సహజీవనం సజావుగా సాగటానికి వ్యక్తులు ముందుగా తమను తాము అర్థం చేసుకుని, ఒక అంచనా వేసుకుని పరస్పర సహకారంతో ముందుకు సాగాలంటే ఏం చేయాలో, ఎలా ప్రవర్తించాలో, శాస్త్రీయ దృక్పథంతో చక్కగా వివరించారు రచయిత.

    పూర్వపు సమాజానికి ప్రస్తుత సమాజానికి చాలా తేడా ఉంది. వ్యక్తుల అభిప్రాయాలలో ఆలోచనలలో ఎన్నో మార్పులొచ్చాయి. ఆధునిక యోచనల ప్రభావం వల్ల మనుషులలో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేసుకుని ముందుకు సాగిపోవటానికి ఉపయుక్తమైన సమాచారం యీ పుస్తకంలో వుంది. భార్యా భర్తలు ఒకరి ఆలోచనా విధానాన్ని మరొకరు గౌరవిస్తూ, ఇద్దరికీ నష్టం కలగనంతవరకు ఒకరినొకరు అభిమానిస్తూ, గౌరవించుకుంటూ ప్రేమ ద్వారా ఒకరి ఆలోచనను మరొకరి వైపు తిప్పుకుంటూ దాంపత్యాన్ని కొనసాగించినప్పుడే ఆ సంసారం విజయవంతమవుతుంది అంటారు రచయిత. ”ప్రేమంటే రెండు గుండెలు ఒకే ట్యూన్‌లో శబ్దించటం కాదు. రెండు ఆలోచనలు భిన్నంగా శబ్దించి ఒకే ఆలోచనగా రూపుదిద్దుకోవడం, వంటి ఎక్స్‌ప్రెషన్స్‌ బాగున్నాయి.

    రచయిత తన విశిష్ట వచనశైలిలో జీవితంలో మానవ సంబంధాల ప్రాముఖ్యతను బాగా వివరించారు. ప్రేమ తత్వానికి, ప్రేమైక జీవన సౌందర్య నిర్వచనానికి, అవినాభావ సంబంధ అనుబంధ బాంధవ్యాల విశ్లేషణకి, అనితర సాధ్యమైన భాష్యాన్ని చెప్పిన విలువైన పుస్తకం ”విజయంలో భాగస్వామ్యం’.

    150.00
    Add to cart
  • Vijayaniki Aidu Metlu - విజయానికి అయిదు మెట్లు

    Vijayaniki Aidu Metlu – విజయానికి అయిదు మెట్లు

    0

    మిమ్మల్ని మీరు ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవటం కోసం, మీ మానసిక బలహీనతల్నీ, సమస్యల్నీ అధిగమించడం కోసం, మీ అంతర్గత శక్తులను పఠిష్టం చేసుకోవడం కోసం, మానవ సంబంధాలు మెరుగు పర్చుకోవడం కోసం టెన్షన్‌, బోర్‌, నిరాసక్తత పారద్రోలటం కోసం, ఆర్ధికంగా నిలదొక్కుకోవటం కోసం, అంతిమ విజయం సాధించటం కోసం, అందరికీ అర్ధమయ్యే రీతిలో రూపొందించబడిన వ్యక్తిత్వ వికాస పుస్తకం – యండమూరి వీరేంద్రనాథ్‌ రాసిన ‘విజయానికి అయిదు మెట్లు’.

    ఏదైనా సమస్య మనతోపాటే ఉంటుంది. అది మన హృదయపు గదిలోనే ఉంటుంది. ఆ గదికి తాళం వేసుంటుంది. దాన్ని పారద్రోలటానికి తాళం చెవి మాత్రం దొరకదు. అలాంటి తాళం చెవి ఎలా సంపాదించాలన్నదే ఈ పుస్తకం ముఖ్యోద్దేశం. మనసుగదిలోంచి సమస్యను పారదోలటమే ఈ పుస్తకపు ఆశయం.

    మనోవిజ్ఞానానికి సంబంధించిన రచనలు తెలుగులో చాలా తక్కువగా ఉన్నాయి. ఆలోటును తీరుస్తూ, చక్కగా అందరికీ అర్ధమయ్యే భాషలోనే కాక ఒకసారి చదవడం ప్రారంభిస్తే మరి వదలకుండా పాఠకునిచేత చివరంటా చదివించే ఆకర్షణీయమైన శైలిలో, విషయం వివరించిన తీరు బాగుంది.

    ప్రపంచం అంతా నిన్ను వదిలిపెట్టినప్పుడు నీతో వుండేవాడే మంచి స్నేహితుడు. పుస్తకం మంచి స్నేహితుడు. అది చెప్పేది వినగల్గితే ఆ స్నేహితుడి కన్నా గొప్ప తెలివైన వాడు ఇంకెవరూ వుండరు. ఎంతో మంది రచయితలు తమ జీవితపుటనుభవాల్నీ, విజ్ఞానాన్నీ కలబోసి అవతలివాళ్ళకు చెప్పటం కోసం అహోరాత్రులూ శ్రమించిన తపనా రూపమే పుస్తకమంటే. అదిగో అలాంటి మంచి స్నేహితుడిని మీకు పరిచయం చేస్తున్నందుకు ఆనందిస్తున్నాం.

    300.00
    Add to cart
  • Vijayaniki Aro Mettu - విజయానికి ఆరో మెట్టు

    Vijayaniki Aro Mettu – విజయానికి ఆరో మెట్టు

    0

    మనిషి మంచిమనుగడకి, మరింత సుఖంగా బ్రతకడానికి, గెలుపుకి, తనను తాను తెలుసుకోవడానికి ముఖ్యమయిన ఆయుధం భారతదేశంలోనే ఉద్భవించింది. దాని పేరు ‘భగవద్గీత’. ”వారు నీ భార్య వలువలు విప్పారు. నీ ఇల్లు తగులబెట్టారు. రాజ్యం నుంచి నిన్ను తరిమికొట్టారు… లే… పిడికిలి బిగించు. కత్తి తీసుకో. వారిని హతమార్చి నీ పగ తీర్చుకో” అంటూ కృష్ణుడు అర్జునుడి ఆవేశం మీద ఆడుకోవచ్చు. కానీ అలా చెయ్యలేదు. మనిషి యుద్ధం ఎందుకు చెయ్యాలో తార్కికంగా చెప్పాడు. ఎన్నో జీవిత సత్యాల్ని విప్పాడు. కష్టాలకి దు:ఖ కారణాలు వివరించాడు. మనసు అశాంతికి, సంఘర్షణకు గురయినపుడు మానసిక వైద్యులు చేసేది. సైకోథెరపీ (టాక్‌ థెరపీ). ఈ నాటి మానసిక వైద్యుల కంటె ఎన్నో వేల సంవత్సరాలకు ముందే మానసిక ఆందోళనకు గురయిన అర్జునుడికి సైకోథెరపీ చేసిన మొట్టమొదటి సైకియాట్రిస్ట్‌ చరిత్రలో శ్రీకృష్ణుడే.

    మనిషి తన జీవితకాలంలో సంపాదించుకోవలసిన ధైర్యం, సంపద, ఆరోగ్యం, కీర్తి, జ్ఞానం, శాంతి అనే ఆరు ఆస్తులను సముపార్జించటానికి భగవద్గీత ఏ విధంగా తోడ్పడుతుందో వివరించే పుస్తకమే ‘విజయానికి ఆరోమెట్టు’. త్యాగం, తత్వజ్ఞానాలను బోధించే భగవద్గీత ఉద్దేశ్యం కర్మఫలత్యాగం. ఫలితాన్ని ఆశించకుండా ఉండడం ఎలా సాధ్యమవుతుంది ? సమస్య ఎందుకు వస్తుంది ? ఎదురైన సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలి ? అంతిమంగా సాధించే ప్రయోజనాలేమిటి ? అనే విషయాలను అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లుగా గీతలోని శ్లోకాలసాయంతో సోదాహరణంగా వివరించిన యండమూరి వీరేంద్రనాథ్‌ ప్రతి అక్షరం ప్రతివాక్యం చాలా సూటిగా, స్పష్టంగా ఉంది. ”భగవద్గీతా ? ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే” అన్న స్థితినుంచి వచ్చేతరాన్ని పరిరక్షించుకోవటం కోసం రాసిన పుస్తకమిది.

    అలనాటి అర్జునుడికి సైకోథెరపీ చేసిన కృష్ణుడిలాగే ఈ విజయానికి ఆరోమెట్టు ద్వారా వీరేంద్రనాథ్‌ తెలుగు సాహితీ ప్రపంచంలో మోడరన్‌ కృష్ణుడిగా నిలిచిపోతాడని, ఈ పుస్తకం చదివిన తర్వాత మీరనుకుంటే మే మేమీ ఆశ్చర్యపోము.

    195.00
    Add to cart
  • Vyakthitva Vikasam

    Vyakthitva Vikasam

    0

    జీవితాన్ని సమాజాన్ని, సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనో విజ్ఞాన మాసపత్రిక రేపు వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆలోచనాధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత నరసింహారావు.

    ఆందోళన, అసమర్థదత భావన, నిరాశ, నిస్సహాయత, మనస్సులోని మాట పైకి చెప్పలేని బిడియం, రకరకాల భయాలు, వైఫల్యాలు, ఏ పని చేయలేని నీరసం, అనిశ్చితి నుండి బయట పడవేసి సామాన్యులను సైతం అత్యంత శక్తివంతులుగా మార్చివేసే అసాధారణ గ్రంథం. లక్షలాది జీవితాలను అత్యున్నతంగా మార్చివేసే అసాధరణ గ్రంథం. లక్షలాది జీవితాలను అత్యున్నతంగా మార్చివేస్తున్న అత్యంత శక్తివంతమైన తెలుగు పుస్తకం.

      -సి.నరసింహారావు.

    200.00
    Add to cart
  • Wabi Sabi

    Wabi Sabi

    0
    399.00
    Add to cart
  • With Your Permission

    With Your Permission

    0

    వెన్నెల చల్లగానూ లేదు, వేడిగానూ లేదు. వెన్నెల జలదరింపుగా ఉంది. నొప్పిగా ఉంది. గాయంగా ఉంది… దుఃఖం దుఃఖంగా ఉంది. కన్నీళ్లు కూడా నొప్పిగా ఉన్నాయి. మెదడంతా పచ్చి పుండై నొప్పిని నరనరంలో పాకిస్తుంటే కన్నీరు హృదయంలోకి, చర్మం మీద ఇంకిపోతూ దేహం నొప్పితో ముడుచుకు పోతున్నది…

    కన్నీరెందుకు… ఈ నొప్పీ ఎందుకు మరి? నీ కోసమా బిపిన్… తెలీదు. ఈ అవమానం జరిగినందుకా… ఆడదాన్నైనందుకు… లేదా ఆడదాని దేహం నాకున్నందుకా ఇలాంటి గాయం? నాకేనా… ఒక్క నాకేనా. అందరికీనా… ఆడవాళ్ళందరికీనా లేదా కొందరు ఆడవాళ్లకేనా? నువ్వెందుకో బాగా గుర్తుకు వస్తున్నావు. నదికి సముద్రం జ్ఞాపకం వచ్చినట్లు, పూలకు తనని పట్టించుకోకుండా తన పక్కనించే వెళ్లిపోయిన చిరుగాలి జ్ఞాపకం వచ్చినట్లు, మండే ఎడారికి వానజల్లు జ్ఞాపకం వచ్చినట్లు, ఆకలేసిన పాపాయికి తల్లి పాల పరిమళం జ్ఞాపకానికి వచ్చినట్లు, నాకు… నా బిపిన్ చంద్రా నువ్వే జ్ఞాపకం వస్తున్నావెందుకు? నా గాయం మాన్పే మందువనా నువ్వు. ఎందుకు మరి? నిన్ను కోల్పోయినందుకా… లేక నా జీవితం ఇలా అగాధంలో పడిపోతున్నందుకా… ఎందుకు…? నేను తీసుకున్న నిర్ణయం సరైంది కానందుకా? ఎంత నమ్మకమో కదా నీకు నా మీద. అది పూర్తిగా ధ్వంసం…………….

    200.00
    Add to cart
  • Yaaraadakonda - యారాడ కొండ

    Yaaraadakonda – యారాడ కొండ

    0

    జాలరుల కుగ్రామంగా మొదలైన విశాఖపట్నం, రెండో ప్రపంచ యుద్ధం తరువాత మహానగరంగా అవతరించడానికి మూలకారణమైన భౌగోళిక విశేషం యారాడ కొండ. విశాఖపట్నం ఎదుగుదలకు అదొక కొండగుర్తు. ఎంతో మందికి ఉపాధినీ, కొంత మందికి సంపదనూ ప్రసాదించిన బంగారు కొండ అది. ఆ కొండ విశాఖపట్నం కథను చెప్పుకొస్తే అది ఎలా ఉంటుంది? గడచిన వందేళ్ల కాలంలో అక్కడి మనుషులూ, వాళ్ల ఆశలూ, ఆశయాలూ, వ్యధలూ, బాధలూ, సుఖ సంతోషాలనూ, అలాగే వీటన్నింటినీ నడిపించిన శక్తులనూ యారాడ కొండ నమోదుచేసి వినిపించిన గాథకు నవలా రూపం ఈ రచన. మూలాలను తెలుసుకున్నప్పుడే ఎదుగుదల అర్థవంతం కాగలదనే నమ్మికతో ఏరికూర్చిన సృజన ఈ ‘యారాడ కొండ’ నవల.

    పేజీలు : 201

    250.00
    Add to cart
  • Yatra 1 & 2

    Yatra 1 & 2

    0
    260.00
    Add to cart
  • Yuva

    Yuva

    0

    కొత్త స్వరాల అన్వేషణలో

    (an appeal)

    ఇదంతా వొక ఆందోళన జీవి గోల. వద్దనుకునే పాఠకులు యీ పేజీలు తప్పించి నేరుగా లోపలి కథల్లోకి వెళ్లిపోవచ్చు.

    ܀ ܀ ܀

    చుట్టూ చీకటి. దారి అగమ్యం. చేతిలో దిక్సూచి లేదు. ఎక్కడ యెలా మొదలు కావాలో తెలీదు. అంతా యెగుడు దిగుళ్ళు. నడక ప్రతి అడుగులోనూ సంశయం. వెతుకులాట దేనికోసమో యేర్పడదు. కాళ్ళకి చుట్టుకునే తీగపై ఆశ. అది పామేమోనని భయం. కొన్నిటిని గుర్తించి నిర్వచించుకోవడం దగ్గరే మొదటి గండం యెదురవుతుంది. కొన్ని లేవని బెంగ. దూరంగా వొక వొంటరి చుక్క మెరుస్తుంది. అది వేకువ రాకడని తెలుపుతుంది. చూపు తేటబడుతుంది. దారి గోచరిస్తుంది.

    అకస్మాత్తుగా ఆగిన కథో జీవితమో వొక ఆసరాతో మళ్ళీ మొదలౌతుంది. ఇదొక నిరంతర

    ప్రయాణం.

    ܀

    కొత్త తరం పాత తరం భుజాల మీద కూర్చుని చూస్తుంది కనకనే యెక్కువ దూరం చూడగలుగుతుంది – ఇవే మాటలు కాదు గానీ తన జీవితానుభవం నుంచి యిటువంటి అర్థం వచ్చే మాటలే అంటాడు ఐజాక్ న్యూటన్. మన యెదుగుదలకూ పురో గమనానికీ మనకంటే పెద్దవాళ్ళు అంతకుముందే నిర్మించిన దారి వొకటి వుంది కాబట్టి ఆ దారిలో నడవడం తేలిక అని ఆయన వుద్దేశ్యం. అయితే పాత దారుల్లో నడవడమో వాటిని పొడిగించుకోవడమో మాత్రమే చేస్తే కొత్త దారులు యెప్పుడు యెలా పరుచుకుంటాయి అన్నది పెద్ద ప్రశ్న. శాస్త్ర సాంకేతిక రంగాల్లో న్యూటన్ మాటల్ని కొంతవరకు అంగీకరించవచ్చేమో గానీ సృజనాత్మకతకి నెలవైన………………

    375.00
    Add to cart
  • Vennello godari