-
Aagamanam – ఆగమనం
0₹70.00మరింత శ్రద్దగా వింటే ఆ మూలుగు మూసివున్న ఆ గది తలుపుల వెనుక నుంచి వస్తున్నట్టు తెలుస్తోంది. అద్దాల తలుపుల వెనుక కర్టేన్స్ వున్నాయి.
లోపల ప్రసన్న కుర్చీని కట్టేసి వున్నాడు. చేతులు – పెడరెక్కలు విరిచి కట్టేసి వున్నాయి. నోటికి గుడ్డ బిగించి వుంది. ఆ మూలుగు వస్తున్నది అతని దగ్గి నుంచే అతడు కట్లు విదిపిమ్చ్కోవటానికి పెనుగులాడుతున్నాడు…
జమున గబ గబా గది తలుపులు తెరిచింది.
ప్రసన్నా ! ప్రసన్నా ! అంటూ పరుగెత్తుకెళ్ళి అతడి చేతులకి కట్టిన కట్లు విప్పింది. అతని నోటికి కట్టేసిన బట్ట లాగేసింది.
నేను రాకపోతే ఎంత ప్రమాదం జరిఎది ? ఆ పని కుర్రాడు, ఆ రాస్కెల్ – ఆవేశంగా అంటోంది.
కట్లు ఊడిపోగానే ప్రసన్న కుర్చీలో నుంచి లేచాడు. అతని శరీరం నిటారుగా అయింది.జమునని చూడగానే అతడు పళ్ళు బిగించాడు. అతని చేతులు వచ్చి జమున భుజాల్ని గట్టిగా పట్టుకున్నాయి….
ప్రసన్న గతం అతణ్ణి వెన్నాడింది. ఇష్టపడి చేసుకున్న శోభ తన అనైతిక ప్రవర్తనతో ప్రసన్నకు మనశాంతి లేకుండా చేసింది. అయితే జమున అతడికి చేరువ అవుతుంది. ఆమె అందరిలాంటిది కాదు ఆమె వ్యక్తిత్వం ప్రసన్నను ఆకర్షిం చింది .
కొందరి ఆగమనం ఆనంద శిఖరాలకి చేరిస్తే, మరికొందరి ఆగమనం పతనపు లోయలలోకి తోసేస్తుంది. జమున ఆగమనం ప్రసన్న జీవితాన్ని ఏ మలుపు తిప్పింది? యద్దనపూడి సులోచనా రాణి అధ్బుత పరిశీలనాత్మక నవల. -
Aahaaramae Aoushadham – ఆహారమే ఔషధం
0₹150.00ఆరోగ్యం సహజమైంది. అనారోగ్యం అసహజమైంది. పోషకాహారంపై గల అవగాహనారాహిత్యమే అనారోగ్య కారణమని రచయిత నమ్మకం.
జన బాహుళ్యంలో ఆహారంపై అవగాహన పెంచటం ఆయన లక్ష్యం. ఆ లక్ష్యంతో వ్రాయబడినవే ఈ పరిశోధనాత్మక వ్యాసాలు. ఆహారమే ఔషధం. వ్యాధుల నివారణే ఆరోగ్య రహస్యం.
పేజీలు : 256
-
Aalochinchu – ఆలోచించు
0₹50.00‘ఆలోచించుకో, నిన్ను నువ్వు తరచి ప్రశ్నించుకో, భగవంతుడు ఉన్నాడూ లేడు, అతనిలో నమ్మకం ఉంది, లేదు – ఇదికాదు ముఖ్యం. నీకు మంచితనంలో నమ్మకం ఉందా?”
‘భగవంతుని ప్రతీక మంచితనం. అయితే మంచి అనే దాని నిర్వచనం ఏమిటి? నీకు మంచిది అనిపించిది యితరులకు మంచి కాకపోవచ్చు. అది వారికి చెడుగా పరిణమించవచ్చు.”
”అందుకనే ప్రతీదానికీ కారణం వెతకమంటాను. ప్రతి పనికీ వెనుక కారణం ఉంటుంది. ప్రతి బాధకూ, ప్రతి దు:ఖానికీ ఎక్కడో ఒకచోట కారణం ఉంటుంది. ప్రతి రుగ్మతకీ కారణం వెదకి మందువేసినట్లే మన బాధలు ఏ కారణం వల్ల మొలకెత్తాయో – ఎక్కడ పుట్టాయో తెలుసుకోవాలి., అందుకనే ఆలోచించమంటున్నాను’ స్వామీజీ లలితతో అన్న మాటలివి.
ఏమని ఆలోచించాలి? ఏం అర్ధం చేసుకోవాలి? తనే ఇటువంటి పనిచేస్తే అతను అర్ధం చేసుకుంటాడా? ఏ భర్తా ఇటువంటి సందర్భాల్లో భార్యని అర్థం చేసుకున్నట్లు తను వినలేదు. అన్ని కావ్యాల్లో, అన్ని నవలల్లో – పురుషుడు స్త్రీని అర్ధం చేసుకోమని, మరో స్త్రీతో తనని పంచుకొమ్మని భార్యని కోరాడే తప్ప ఇటువంటి కోర్కె ఏ భార్యా భర్తని కోరలేదు.
స్త్రీ అబల! ఎందుకని? పవిత్రత, పాతివ్రత్యం, ప్రకృతి – యిలా ఎన్నో కారణాలు చెబుతారు. ప్రతీసారీ స్త్రీని సహించు. సహనం కోల్పోకు, అర్ధం చేసుకో అంటూ అడుగుతారు. తానెందుకు అర్ధం చేసుకోవాలి?
స్త్రీ పురుష ప్రకృతులను ఢీకొని చేసి మిమ్ములను ఆలోచింప చేసే నవల. ప్రతి స్త్రీ తప్పక చదవాలి. ఇది మాలతీచందూర్ అపూర్వసృష్టి.
-
-
Aasayala Aakharimettu – ఆశయాల ఆఖరిమెట్టు
0₹70.00తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.
ఆశయాల ఆఖరిమెట్టు
మనిషి ఆశాజీవి!
అడుగు అడుగుకీ ఓటమివున్నా – అడుగడుగునా ఆశని వెతుక్కోడం అలవాటు చేసుకున్నాడు. ఎక్కడో దూరాన తళుక్కుమని మెరిసే లక్ష్యాన్ని చేరుకోడానికి అతను ఆరాటపడుతున్నాడు. అతని లక్ష్యసిద్ధికి అనంత అవాంతరాలు.
అతని పేరు యాదగిరి. అందరూ గిరి అని పిలుస్తుంటారు. తక్కువకులంలో పుట్టడం అతని పాపం కాదు, కానీ, అతను కులమతాల ప్రసక్తిలో కొన్నేళ్ళు నలిగిపోయేడు. తక్కువ ఎక్కువలు కులాల్లో వుండవు. గుణాల్లో వుంటాయని అతని నమ్మిక. శ్రద్ధగా చదివేడు, తన లక్ష్యాన్ని డాక్టరై చేరుకున్నాడు. కానీ… ప్రేమలు పగలు, ఈర్ష్య అసూయలు, దగా మోసాలు, పచ్చి స్వార్థం అతని మీద విలయతాండవం చేసేయి. విసిగి పోయేడు. ఓడిపోయేడు. కట్టుకున్న భార్యనే హత్యచేసేడు.
అతని ఆశయాలకు ఆఖరిమెట్టు ఇదేనా?
మాదిరెడ్డి సులోచనగారు మీ ఆలోచనలకు వదిలిన విలువైన ప్రశ్న.
పేజీలు : 150
-
Abhinetri – అభినేత్రి
0₹70.00ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.
అభినేత్రి
”రాజేశ్వరీ ఆర్ట్స్” నాట్యమండలి వారు నిర్వహించే నాటకం చూడటానికి జనం తండోప తండాలుగా రాకపోయినా నాట్యమండలి నడవడానికి డబ్బు వస్తుంది.
దాని మేనేజర్ సభాపతి బయటికి వచ్చి ఒకసారి ఆదుర్దాగా జనాన్ని చూసి వెళ్ళబోయాడు. పరుగెత్తుకుంటూ వచ్చే తబలిస్టు సాయినాథ్ కనిపించాడు.
”రాణి బస్సుస్టాండులో లేదు గురూ!” ఒగరుస్తూ చెప్పాడు.
సభాపతికి ముచ్చెమటలు పోశాయి. ”కనకతార” ఆడతామని టిక్కట్లు అమ్మారు. మధ్యాహ్నం కథానాయికగా వేసే అమ్మాయి రాణి సభాపతితో పోట్లాడింది. అంతమాత్రానికే చెప్పకుండా పోతుందనుకోలేదు.
”ఇప్పుడెలా?”
”పోనీ, దమయంతిని వేషం వెయ్యమనండి.”
”నీకు బుర్రుందా సాయీ! ”కనకతార” కథ కోసం వస్తారటోయ్ జనం. ఆ రాణిది పిటపిటలాడే వయసు, మత్తెకించే అందం, దానికోసం వస్తారు.”
”పోనీ, అనివార్యకారణాల వల్ల నాటకం వెయ్యటం లేదని ప్రకటిద్దాం.”
”ఈ నాటకాల కోసం బంగారం లాంటి పొలం, మేడ అమ్మాను. ఇక కాళ్ళు చేతులే మిగిలాయి. అవి విరగకొట్టుకోమంటావా?”
”మరేం చేద్దాం? అరగంటే వుంది సమయం.”
ఇద్దరూ ఆలోచనలో పడిపోయారు. సభాపతి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తలపంకించాడు….
పేజీలు :159
-
Achanta Sarada Devi Kathalu – ఆచంట శారదా దేవి కథలు
0₹280.00శారదాదేవి తనకు తెలియని జీవితాన్ని అసలు ముట్టుకోరు. తన అనుభవ పరిధిలో వున్నా మనుషుల్ని, సన్నివేశాల్ని, జీవన వాతావరణాన్ని తన కథలకు ఇతి వృత్తాలుగా చేసుకున్నారు. వాటికీ నిసర్గ కోమలమైన తన భావగంధం పూసి గాఢమైన అనుభూతులుగా మలచి, పాఠకుల ముందు పరిచారు. వారి కథలు సహజంగా, స్వచ్చంగా, నిరాడంబరంగా, సరళంగా, అందంగా, మనసులోంచి అలవోకగా పుట్టినట్టు ఉంటాయి. ఎదుటి వారి మనసులను సుతారంగా తాకుతూ ఉంటాయి. ఈ కథలు చదువుతుంటే నిర్మలమైన నదిలో స్నానం చేసినట్లు ఉంటుంది. -ఎస్వి.భుజంగరాయశర్మ.
“జీవితం అనే తోటలో ఏరిన వివిధ పుష్పాలు, తెలుగు భారతికి పగడాలమాల ఈ కథానికలు”.
-రాజమన్నారు.
“వికాసోన్ముఖమైనఅనుభవ పరిణితి చాలని సీమంతిని హృదయంలోని వేదన ఇది. ‘ఇంతేనేమో’ అనికాని’ఇంతే’ అని ధైర్యంతో చెప్పలేని హృదయ దైన్యం, ధైర్యంగా వేషం వేసుకోవడానికి ముందు జీవిత నేపథ్యంలో చూపే అవ్యవస్థ, తొందర- ఈ వేదన. దాన్ని ఎంతో సహనుభూతితో ఈ ప్రబంద సంగ్రహంలోని ఒక్కొక్క ఖండికలోనూ చల్లగా సన్నని కంఠంతో చిత్రించారు. శ్రీమతి అచంట శారదాదేవి”.
-రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ.
“ఏ ఉత్తమ రచనకైనా అనుభవం అతి ముఖ్యం. ఈ అనుభవం వల్లనేనిజాయితి కలుగుతుంది. అతి ప్రధానమైన ఈ నిజాయితీకి అందము, అలంకరణ కోసమూ ఊహా, కల్పనా సాయపడతాయి. నిజమైన అనుభవము ఈ ఊహా, కల్పనలతో ఎంతో ఆకర్షవంతంగా అమరుతుంది అది సాధించినవారు మనకు సన్నిహితులవుతారు. శారదాదేవి ఇట్లాంటి రచయిత్రి.” -బుచ్చిబాబు. -
Addala Meda – అద్దాల మేడ
0₹80.00ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.
అద్దాల మేడ
”పద్మినీ… పద్మినీ…” ఎవరో తలుపులు బాదుతున్నారు. ఒళ్ళు విరుచుకుని లేచింది పద్మిని. గడియారం వంక చూచింది. అయిదు కావస్తూంది. పనిమనిషైనా టీ తెచ్చి లేపలేదు.
”పద్మినీ! అబ్బ కాలింగ్ బెల్ పెట్టించవమ్మా అంటే వినదుకదా.” బయట గొణుగుడు వినిపించింది. త్వరగా వెళ్ళి తలుపులు తీసింది. నిండుగా వేడిదుస్తులు వేసుకున్న స్త్రీతోపాటు చల్లని ఈదరగాలి లోపలికి వచ్చింది. వెంటనే తులుపులు మూసింది పద్మిని.
”మీరా కోమలగారూ! మీవారేరీ?”
”రామేశ్వరము వెళ్ళినా శనేశ్వరము తప్పదని, సముద్రాలు దాటివచ్చినా పేకాటరాయుళ్ళకు కరువులేదు. ఈ రోజు శనివారము బడి లేదుగా పారాయణము జరుగుతూంది. నువ్వు వస్తే అలా పోస్టాఫీసువైపు వెళ్ళి ఉత్తరాలు వచ్చాయేమో చూద్దామని వచ్చాను.”
”నేను పడుకోందే పిల్లలు పడుకోరని, అలా నడుము వాల్చాను. నిదుర పట్టేసింది. కూర్చోండి. ఆంచీ! (అమ్మాయీ)” అని పిలిచింది. ఓ పదహారేళ్ళ కన్య చక్కని సిల్కు పువ్వుల గౌను వేసుకుని, కాల్ళకు బోటు ఆకారములో నున్న బూట్లు ధరించి తలకు చుక్కల బట్ట కట్టుకుని వచ్చింది.
”తరాల్లే మెహెతే! (పిలిచారా అమ్మగారూ?)”
”ఉలత్‌యినా ఆంచి. (రెండు కాఫీలు తే)” అన్నది. అమ్మాయి వెళ్ళిపోయింది…..
పేజీలు : 187
-
Adhiguruvu Acharya Chandala
0₹100.00ఇది భారత భూమి నడిబొడ్డున హైందవ పుణ్యభూమిగా భావించబడే కాశీనగరంలో జరిగిన యథార్థ సంఘటన. భారత తాత్విక మేథోరంగాన్ని ఒక కుదుపు కుదిపిన చారిత్రక సంఘటన. హైందవ చరిత్రకారుల ప్రకారం శంకరా చార్యులు సాక్షాత్ శివ స్వరూపం. అతనికి ఒక సందర్భంలో ‘చండాలుడు’ ఎదురొచ్చి తత్వాన్ని బోధించి జ్ఞానోదయం కలిగిస్తాడు. ‘శివుడు చండాలుని రూపంలో వచ్చారు’ అనేది హైందవ చరిత్రకారుల అభిప్రాయం. ఒక శివునికి మరొక శివుడు ఎదురొచ్చి జ్ఞానోదయం కల్పించి నట్లుగా చరిత్రను వక్రీకరించారు. ఇది ఎలా సాధ్యం?
భారతదేశపు తాత్వికరంగంలో హైందవ, బౌద్ధ వాజ్ఞ్మయాలను ఔపోసన పట్టిన మహా తాత్వికులు, మహా విజ్ఞాని ‘ఆచార్య చండాలుడు’. ఒకే దేశంలో ఒకే సమయంలో, ఒకే ప్రదేశంలో శంకరా చార్యులు, ఛండాలుడు లాంటి ఇద్దరు తాత్వికులు వుండడం తప్పు కాదు గదా! ఇద్దరు హైందవులైతే వారిని గురించి వ్రాసేవారు. కాని ‘ఛండాలుడు’ అంటరాని కులంలో పుట్టిన వ్యక్తి. అందుకే హైందవ చరిత్రకారులు అతని గురించి వ్రాయలేదు. వాస్తవ చరిత్ర ఏమిటో తెలియజేయాలని నేను ఈ గ్రంథాన్ని వ్రాయాల్సి వచ్చినది.
– బొనిగల రామారావు
-
Adhikarulu Asrita Janulu – అధికారులు ఆశ్రితజనులు
0₹100.00తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.
అధికారులు ఆశ్రితజనులు
బ్రతక నేర్చిన వాడికి యీ లోకం పచ్చల పల్లకి. నోట్లో నాలుకలేని వాడికి యిదే లోకం గచ్చపొదలా కనిపిస్తుంది. నాగరాజుకు మేడలు, మిద్దెలు లేవు కాని, మేడలు, మిద్దెలు గల మోతుబరులతో పరిచయం వుంది.
నాగరాజుకి ఏ అధికారమూ లేదు, కాని అధికారులందరినీ అతను తన యింటికి ఆహ్వానిస్తాడు. కలెక్టర్లు మొదలుకుని, సాధారణ అధికారులవరకూ అతని చమత్కారాలకీ, చాకచక్యాలకీ లొంగని వారుండరు.
అధికారుల్ని అయిన విధానా, కాని విధానా, ఆశ్రయించి – తన యింట్లో చిల్లిగవ్వ లేకపోయినా, వారి హోదాలనే, అంగళ్ళలో ధనంగా పణం పెట్టి, తను కుహనా పరువు ప్రతిష్ఠలను మెట్టుమెట్టుగా పెంచుకో గలిగిన నాగరాజు వంటి పరాన్నభుక్కులు, నిత్యం ఏదో రూపంలో మీ చుట్టూ తిరుగుతూనే వుంటారు.
నాగరాజుల స్వభావాలలాగే, రోజులన్నీ ఇటువంటి వారి పాలిట ఒక్కలాగ వుండవు. జీవిత నాగుపాము కుచ్చిత అనుభవాల విషం కక్కినపుడు ఎంతమూలగా నక్కి వందామనుకున్నా, వారి బ్రతుకులు వికృతరూపాలలో బయటపడక తప్పదు.
అప్పుడు – వారి వ్యక్తిత్వాలలో, బ్రతుకు తెరువులో, బూలతనం మీయెదుట నిలుస్తుంది.
ఈ నాగరాజు లాంటివారే మీ దృష్టికి తగలకపోవచ్చు. కాని సంఘంలో ఇటువంటి వ్యక్తుల కార్యకలాపాల స్వభావం యీ నవల విప్పి చెపుతుంది. తస్మాత్ జాగ్రత్త!
పేజీలు : 251