-
Arthanareeswarudu – అర్ధనారీశ్వరుడు
0₹120.00పశ్చిమ తమిళనాడులో నమక్కాల్ జిల్లా తిరుచెంగోడు పట్టణ ప్రాంతంలోని ఒక సామాజిక సంప్రదాయం ఈ నవలకు నేపథ్యం. దాన్ని ఆచార్య పెరుమాళ్ మురుగన్ తమిళంలో ‘మధోరు బాగన్’ అనే నవలగా 2010లో రాశాడు. దాని తెలుగు అనువాదమే ‘అర్ధనారీశ్వరుడు”. 1940 సం|| నేపథ్యంలో వ్యవసాయము, పశుపోషణ జీవనంగా గల ఒక జంట కాళి, పొన్నల కథ ఇది. ఎన్ని ”గుళ్ళూ, గోపురాలు దర్శించినా” సంతానం కలగదు. పిల్లలు కలగనపుడు తిరుచెంగోడు అర్ధనారీశ్వరుడికి జరిగే రథోత్సవం వేడుకల్లో 14వ రోజున సాంఘిక కట్టుబాట్లను వదలి, ఆ రాత్రి ఎవరు ఎవరితోనైనా శృంగారంలో పాల్గొని పిల్లల్ని కనవచ్చుననే సాంప్రదాయం ఆనాడు ఉండేది. దీని నాధారంగా చేసుకొని హృద్యంగా ఈ నవల రచించబడింది. పశ్చిమ తమిళనాడులోని కొగునాడు ప్రాంతంలోని కొన్ని సామాజిక వర్గాలు మురుగన్ మీద కాలు దువ్వినాయి. అలజడి ప్రారంభమయింది. ఈ నవలలో ప్రస్తావించిన అంశాలు తమ సామాజిక వర్గాన్ని, స్త్రీలను కించపరచేవిగా ఉన్నదనీ, దీన్ని నిషేధించాలనీ కొన్ని హిందూ మతోన్మాద సంస్థలూ, కుల సంఘాలు వక్రమార్గంలో ఎడతెరిపి లేని ఆందోళన అన్ని రూపాల్లో కొనసాగించాయి. రచయితైన మురుగన్‌ను వేటాడారు. దాదాపుగా సాంఘిక బహిష్కరణ చేశారు. మురుగన్‌తో ప్రభుత్వ అధికారుల సమక్షంలో క్షమాపణలు చెప్పించాయి. అయినా గొడవ కోర్టుదాకా వెళ్ళింది. విచారణ సం||ర కాలం జరిగింది. మతోన్మాదుల ఉన్నాదాన్ని కోర్టు కొట్టివేసింది. ఈ రచనను తెలుగులోకి ప్రసిద్ధ రచయిత ఎల్.ఆర్.స్వామి అనువదించారు.
పేజీలు : 152
-
Arugu
0₹200.00వస్తువు తజన్యమైన ఇతివృత్తమూ, రచన తదనుకూలమైన భాష, సన్నివేశ పాత్ర ప్రవర్తనాదులూ, ఆసక్తి కలిగించే ఈ లక్షణాలు శ్రీ నక్షత్రం వేణుగోపాల్ కథానికలు సంపుటి ‘అరుగు’ లో ప్రత్యక్షమై, పాఠకులు పరమానందం పొందుతారు. కథానికల్లో పరిచిత విషయం ప్రత్యక్షమయితే, పునశ్చరణతో చదువరులు ఉత్తేజితులౌతారు. అపరిచితాంశాలు ఆవిష్కృతమైతే, ఆశ్చర్యానుభూతులకు సహృదయులు లోనవుతారు. –
తెలుగు పాఠకులు తెలుగు భాషలో ఇంతకు పూర్వం అంతగా పరిచయం లేని విశేష జీవితం చెప్పే ట్రూ ఫేస్ అమెరికా కథలు, శ్రీ వేణు చెబుతుంటే విని చదివి, ఆశ్చర్యపోతారు, ఆనందిస్తారు, అర్థం చేసుకుంటారు. శ్రీ నక్షత్రం వేణుగోపాలకు కథా నిర్వహణ ఆసక్తికరంగా చేయడం బాగా పట్టుబడింది. పాత్ర సృష్టి, సన్నివేశ కల్పన, అతిశయోక్తులు లేకుండా సుందరంగా సహజంగా రాయడం తెలిసి వచ్చింది. ఈ కథానికలు సహజత, స్పష్టత, ఆర్జవం, సౌకుమార్యం సాధించుకున్న మంచి రచనలు. ఉత్తమ కథానికా మార్గంలో మునుముందుకు సాగుతున్న శ్రీ నక్షత్రం వేణుగోపాల్ ఉజ్వల భవిష్యత్తును సాధిస్తాడని పాఠకులు నమ్ముతారు.
-కొలకలూరి ఇనాక్
సరిగ్గా ఏడాది క్రితం వేణు నక్షత్రం నాకు ఫోన్ చేసి మూడు దశాబ్దాల క్రితపు మంజీరా రచయితల సంఘ సమావేశాల్లో కలిసిన జ్ఞాపకాలను తడుముతూ తనను పరిచయం చేసుకొన్నారు. మంజీరా రచయితల సంఘంతో కలిసిన అనుభవాలు ఎవరికైనా సంతోషకరమైనవే. దిశానిర్దేశం చేస్తూ తెలంగాణాలో రచయితలను తయారుచేసిన, నడిపించిన చరిత్ర ఆ సంస్థది. అలాంటి సంస్థతో సంబంధంవల్ల 90ల నాటికే రచనా రంగంలోకి ప్రవేశించిన వేణు నాకిప్పుడు ఇలా పరిచయం అయ్యారు. ముందుగా ఆయన పేరులోని నక్షత్రం నన్ను బాగా ఆకర్షించింది. ఆకాశంలోని, అనంతకోటి నక్షత్రాలలో ఒకటి ఎంత చక్కగా ఆయన పేరుకు ముందు పుట్టుకతోనే చేరిపోయిందికదా అనుకున్నా, కథలు రాయటం, లఘుచిత్రాలు తీయటం, నటించటం వంటి అభిరుచులు ప్రయత్నపూర్వకంగా ఆయన ఎన్ని నక్షత్రాలను కలగంటే, ఎన్ని నక్షత్రాలను ఆవాహన చేస్తే సాధ్యమైంది! ?
మొత్తం మీద వాస్తవికతకు దగ్గరగా ఉండే నక్షత్రం వేణుగోపాల్ కథలు చదవటం మంచి అనుభవం. జీవితాన్ని ఆవరించుకొన్న కనిపించని భీభత్సాన్ని కనిపింపచేయటం ఆయన కథల లక్ష్యం, సంపదలు, సంపాదనల యావలో మనిషి మాయం కావటం పట్ల ఆయన వేదన, వ్యష్టి నుండి సమిష్టి ఆయన కామన,
– కాత్యాయిని విద్మహే
-
Asatyaniki Avala
0₹250.00ఈ యావత్ప్రపంచం అబద్ధం…
ఏది శాశ్వతం కాదు…
నేనన్నది కూడా పిచ్చి భ్రమ మాత్రమే…
సత్యమై, నిత్యమైనది వేరే వుంది,
దాన్ని పొందుదామన్నది ఎంత అసహ్యమైంది?
దీనికి, ఈ సోకాల్డ్ అసత్యానికి ఆవల ఏదైనా ఉండొచ్చు.
అది సత్యమై తీరాలా?
దాన్ని కూడా దాటి వెళ్లాలన్న కామన
మనిషన్న వాడికి కలక్కుండా వుంటుందా?
ఈ అసంబద్ధమైన ఆలోఛన్నే తుడిచి అవతల పారేసే శక్తే మనకుంటే ఎంత బావుణ్ణు..
కానీ, సుప్త చేతననబడే ఈ సబ్ కాన్షస్ మైండ్ వున్నంత వరకూ…
ఈ చీకటి అరుపులు తప్పవేమో!
-
-
-
Athmayogam Sri Vidya Sadanasaram
0₹200.00ఇది శాస్త్రవచనం కాదు. వేదభాష్యం అంతకన్నాకాదు. ఇది శ్రీవిద్యా సాధనకు సంబంధించిన చర్చ మాత్రమే. ఈ చర్చ అంతర్గత భావానికి భంగం కలిగించకుండా ఒక విషయం నుండి మరియొక విషయానికి మారుతూ ముందుకు సాగుతుంది. ఈ కథనంలో కపటంగానీ , సందర్భానుకుల కల్పనలు గానీ లేవు. కేవలం నిజాలు మాత్రమే ప్రస్తావించబడినాయి. ఇది సత్యాన్వేషణ చుట్టూ తిరిగే సత్యవిషయ సంకలనం. సాధనా మార్గంలో కలిగే సందేహాలను నివృత్తి చేసే కొన్ని సమాధానాల క్రోడీకరణ.
సాధన అంటే ఏమిటి? ఎందుకు చెయ్యాలి? ఎలా చెయ్యాలి? సాధనయొక్క ఫలితాలేమిటి? దాని పర్యవసానంగా భగవతుని ఉనికిని గ్రహించడం ఎలా సాధ్యం? లాంటి లాంటి విషయాలను గురించి ఇక్కడ స్పృశించడం జరిగింది.
-
-
-
Atma Darshanam
0₹200.00నీ నిజతత్వాన్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. ఇదే ఆధ్యాత్మిక సారం. లౌకిక జీవితాన్ని జీవిస్తూనే ఆత్మపథంలో ఎలా ప్రయాణించాలో, దుఃఖం నుండి, అజ్ఞానం నుండి, జనన మరణ చక్రం నుండి మరియు కర్మబంధం నుండి విముక్తిని ఎలా పొందాలో ఆచరణాత్మకంగా బోధించే మార్గదర్శి ఈ గ్రంథం. ధ్యానం మరియు ఆత్మజ్ఞానాలతో మోక్షాన్ని, ఆత్మదర్శనాన్ని ఎలా పొందాలో విడమరచి చెప్తుంది. ఈ గ్రంథం. ముక్తి, మోక్షం, నిర్వాణం, ఆత్మసాక్షాత్కారం, సచ్చిదానందం, బ్రహ్మవిద్య, దైవం వంటి ఎన్నో క్లిష్టమైన ఆధ్యాత్మిక అంశాలను సులభరీతిలో బోధపరిచే అద్భుతమైన పుస్తకమిది. దేశ, మత, ప్రాంతాలకు అతీతమైనది ఆత్మదర్శనం. ఎటువంటి సమస్యనైనా అధిగమింపజేయగలిగేది ఆత్మదర్శనమే. బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులను అధిగమించడం ఆత్మదర్శనంతోనే సాధ్యం. ఆత్మస్థితిని పొందిన ఒక ఆత్మజ్ఞాని యొక్క అనుభవపూర్వక జ్ఞానప్రవాహమే ఈ సంకలనం. ఈ మార్గదర్శకత్వంలో ప్రతి సాధకుడు ఆత్మదర్శనాన్ని పొందుగాక!
-
Atomic Habits
0₹299.00ప్రతి రోజు ఒక శాతం మెరుగుపరచుకునే విప్లవాత్మక పద్ధతి।
ప్రజలు అనుకుంటారు జీవితాన్ని మార్చుకోవాలంటే భారీగా ఆలోచించాలని అయితే ప్రపంచ ప్రఖ్యాత అలవాట్ల నిపుణుడు జేమ్స్ క్లియర్ మరో మార్గం కొనుగోన్నారు। నిజమైన మార్పు కొన్నిచిన్న చిన్న నిర్ణయాల సామూహిక ప్రభావం వల్ల కలుగుతుందని తెలియజేస్తారు – రోజు రెండు పుష్ అప్ లు చేయడం , ఐదు నిముషాలు ముందుగా లేవడం , ఒక పేజీని ఎక్కువగా చదవడం।।। వీటినే క్లియర్ అటామిక్ హబిట్స్ అంటారు।
సంచలనం సృష్టించిన ఈ పుస్తకంలో క్లియర్ చిన్న చిన్న మార్పులు జీవితాన్ని మార్చే ఫలితాన్ని ఎలా అంధిస్తాయో తెలియజేస్తారు। వీటిని మనస్తత్వశాస్త్రం, న్యూరో సైన్స్ ఆధారంగా సాధికారికంగా వివరిస్తారు। ఈ పరంపరలో ఒలింపిక్ స్వర్ణపతాక విజేతలు వున్నతమైన సి।ఐ।ఓ।లు ప్రసిద్ధి పోందిన శాస్త్రజ్ఞుల స్ఫూర్తిదాయకమైన కథలని, తెలియజేస్తారు।
మీ జీవితం పట్ల , నిత్య జీవితంలో మీ దృక్పథంలోనూ మార్పుని తీసుకువచ్చే ప్రత్యేకమైన పుస్తకమిది। -
Attagari Kadhalu
0₹300.00ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన కధలు
సాహిత్య అకాడమీ వారు ఆమె రచించిన “అత్తగారి కధలు”కు బహుమతి ఇచ్చారు.1994లో ఆమె రచన “నాలో నేను” పుస్తకానికి జాతీయ బహుమతి లభిస్తుంది.
తెలుగు కాల్పనిక సాహిత్యంలో ఆద్యంతం ఉత్తమమైన హాస్యాన్ని చిందించే అపూర్వమైన కధలు బహుముఖ ప్రజ్ఞాశాలిని శ్రీమతి భానుమతి రామకృష్ణ రచించిన “అత్తగారి కధలు”. అత్తగారి అలవాట్లు ఇతరులను అక్షేపించేందుకు వాడె పదజాలం రచయిత్రి నిశిత పరిశీలనలోంచి జాలువారి ప్రవాహవేగంతో సాగే సరళ సుందరమైన ఆమె శైలిలో అత్తగారు ఎల్లప్పుడు సజీవమూర్తిగా దర్శనమిస్తుంది. అత్తగారి పాత్ర నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో ఆవిర్భవించిన ఉత్తమ ఏకైక తెలుగు హాస్య స్త్రీ పాత్ర.
మన తెలుగు కుటుంబాలలో దాదాపుగా అంతరించి పోతున్న ఒక గొప్ప ఇనిస్టిట్యూషన్ కు అత్తగారి పాత్ర సాహిత్యంలో ఏకైక ప్రతినిధి. భానుమతి గారు వాక్యవిన్యాసం ఎంతో మనోహరము గా ఉంటుందో ప్రతి వాక్యం ఎంత హాస్య స్పోరకంగా ఉంటుందో “అత్తగారి కధలు” పుస్తకంలో యాధృచ్చికంగా ఏ పేజి చదివినా సుభోధకం అవుతుంది.