• Andagadu

    Andagadu

    0

    ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు ఎన్ని తరాలు గడిచినా చలనం ఉండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే ఉంటాయి. మాదిరెడ్డి సులోచన సమగ్ర సాహిత్యం ఈ తరం పాఠకులకు అందచేయ్యాలనీ, ఈ నవలల్ని పాఠకులు ఆదరిస్తారనీ మా ఆలోచనలకు మిత్రులనుండి, పాఠకుల నుండి సోదర ప్రచురణ కర్తల నుండి ఎంతో ప్రోత్సాహం వచ్చింది. వారికి మా ధన్యవాదాలు.

                                                        – నవోదయ రామమోహనరావు

    120.00
    Add to cart
  • Andamaina Jeevitam - అందమైన జీవితం

    Andamaina Jeevitam – అందమైన జీవితం

    0

    సృష్టిలోని అలౌకికమైన తీయదనాలలో ముఖ్యమైంది స్నేహం. దానిని అనుభవించ గలిగినవారికే దాని ప్రాముఖ్యత అర్ధమవుతుంది.

    అది ఇద్దరు మగవాళ్ళ మధ్య కావచ్చు. ఇద్దరు ఆడవాళ్ళ మధ్య కావచ్చు. లేక అరుదుగా ఓ మగ, ఓ ఆడ మధ్య కావచ్చు. అంతేకాదు వివాహితులైన ఆడ, మగ మధ్య కూడా కావచ్చు. స్నేహం విషయంలో వాళ్ళు ఆడ, మగ అవడం యాదృచ్ఛికం అవుతుంది.

    శృంగారపరమయిన భావాలకి లోను కాకుండా స్నేహం చేయగలగడం ఆడ, మగలకి సాధ్యం కాదా ? ఆ స్నేహంలోని మాధుర్యాన్ని నిష్కల్మషంగా చవి చూడగలగడం అనుభవం లోకిరాకూడదా ?

    పై బెర్త్‌లోంచి వినపడుతున్న భర్త గురక. రైలు ఏదో స్టేషనులో ఆగింది. బయట ఆరి వెలుగుతూ ఎగిరే మిణుగురు పురుగులు. శాంతి చేతిని బయటి పెట్టి ఎగురుతున్న మిణుగురు పురుగులను పట్టుకుని తన జుట్టు మీద ఉంచుకోసాగింది. చిన్నప్పుడు రాత్రిళ్ళు దొడ్లొకి వెళ్ళి మిణుగురు పురుగులని గ్లాసులో పట్టుకున్న సంఘటన గుర్తుకు వచ్చింది శాంతికి.

    సిగ్నల్‌ ఇవ్వడంతో రైలు మళ్ళీ బయలుదేరింది. శాంతి తన పెట్టె అందులోంచి తనడైరీ తీసి, అందులోంచి రెండు తెల్లకాగితాలని తీసి ఓ ఉత్తరం రాయడం మొదలుపెట్టింది.

    ‘డియర్‌ ప్రియతమ్‌,

    మీరు ఉత్తరం రాసి నాకు మీ చిరునామా తెలియగానే దానికి జవాబు రాయబోయే ముందు ఈలెటర్‌ మీకు పోస్ట్‌ చేస్తాను……..

    తన భర్త ‘ఇంక పడుకోరాదు’ అని పై బెర్త్‌లోంచి అరిచేదాకా శాంతి కిటికీకి ఆనుకుని కూర్చుని, కిటికిలోంచి పడే వెన్నెల వెలుగులో ప్రియతమ్‌కి తన మొదటి ఉత్తరం రాస్తూనే ఉంది – అంటూ ముగించారు శ్రీమల్లాది వెంకట కృష్ణమూర్తి గారు తమ అందమైన జీవితం నవలని.

    స్త్రీ పురుషుల మధ్య సెక్స్‌కి దారితీయని సుగంధ స్నేహసుధ సాధ్యమని నిరూపించే నవల ‘అందమైన జీవితం’.

    220.00
    Add to cart
  • Andani Pilupu

    Andani Pilupu

    0

    “చిన్నా!” నన్ను ఆ పేరుతో పిలిచి ప్రలోభపెట్టకు, చెప్పు – నా తండ్రెవరు? నిజం చెప్పు. అనుకోని ఈ ప్రశ్నకు అంజనీదేవి తెల్లబోయింది. ముఖం పాలిపోయింది. తనను సంబాలించుకుంది. ఏమిట్రా పిచ్చిపట్టిందా? నీ తండ్రెవరో నీకు తెలియదా? పిచ్చి భ్రమలో పెంచావు. ఇప్పుడైనా నిజం చెప్పకపోతే పిచ్చిపడుతుంది. “మీ తండ్రి శ్రీహరిగారు.” కాదు అబద్దం అతను రామస్వామిగారి ఇల్లరికపు అల్లుడు. నీ అందానికి దాసుడై భార్యబిడ్డలను అనాధలను చేసి వచ్చిన ఘనుడు. కన్న కొడుకుకు సంజాయిషీగా ఆ తల్లి చెప్పిన కన్నీటికథే “అందని పిలుపు.”

    80.00
    Add to cart
  • Placeholder

    Andari Manishi – అందరి మనిషి

    0

    ‘అందరి మనిషి’ లోని కథలను శశిశ్రీ 2011-2014 మధ్య రాశారు. కొన్ని ఎప్పుడు రాసింది తెలియడం లేదు. ‘రాతిలో తేమ’ కథల సంపుటిలో శశిశ్రీ తన కథలను తానే రెండు భాగాలుగా విభజించారు. అవి 1. అంతర్లోకం 2. బహిర్లోకం. ముస్లిముల జీవితాన్ని, హిందువులతో ముస్లిముల సంబంధాలను చిత్రించేవి మొదటి విభాగం. పూర్తిగా ముస్లిమేతర జీవితాలమీద రాసినవి బహిర్లోకం. ‘అందరి మనిషి’ లోని పదకొండు కథలను కూడా అలాగే విభజించుకోవచ్చు. ‘పెద్దల పండగ’, ‘పురానా హవేలి’ పూర్తిగా ముస్లిం జీవిత ప్రతిఫలనాలు, ‘ఆరాత్రి ఆపాట’, ‘ఫో’, ‘అరుపు’ హిందూ ముస్లిం సంబంధ కథలు, ‘గుండెతడి’, ‘అందరి మనిషి’, ‘కిర్రుచెప్పులు’, ‘యెమ్టీఫెలో’, ‘గురువింద’, ‘కూపం’, ముస్లిమేతర జీవిత ప్రతిబింబాలు.

    95.00
    Add to cart
  • Andhakaramlo… - అంధకారంలో…

    Andhakaramlo… – అంధకారంలో…

    0

    అంధకారంలో …. రంగనాయకమ్మ నవల ………. ‘రాజేశ్వరి’ని చాలమంది చూసే ఉంటారు. చూస్తూనే ఉంటారు. జనసమ్మర్దం లేని ఏ రోడ్డువారో, ఏ చెట్టుకిందో, సంతోషమూ, విచారమూ ఏదీ వ్యక్తం చెయ్యదు. ఊరికే నించుని వుంటుంది. కొంచెం అక్కడక్కడే తచ్చాడుతూ ఉంటుంది. ఎవరన్నా వెకిలి నవ్వు నవ్వి పోకిరీమాట విసిరితే ఆశపడి దగ్గరికొస్తుంది. నిరాశ కలిగితే నెమ్మదిగా కదిలి నిశ్శబ్దంగా నడుస్తూ మన దృష్టికి దూరమౌతుంది.
    శరీరాన్ని అమ్ముకోకపోతే బతకలేని స్థితి స్త్రీకి కలగటం, అనాగరికతకీ, సంఘ పతనానికీ నిదర్శనం. ఈ నవలలో రాధ-రాజేశ్వరి-మహలక్ష్మమ్మ-సుందరమ్మ వంటి పాత్రలమీద మనకు సానుభూతి కలుగుతుంది. అదొక్కటే చాలదు. అట్లాంటి పరిస్థితులు సంఘంలో ఎందుకు వున్నాయో కారణాలు గ్రహించాలి. మనిషి నవ్వుకీ, నిట్టూర్పుకు కూడా సంఘంతో సంబంధం ఉంది. ఏ నిర్మల హృదయాల ప్రేమ విఫలతకైనా, ఏ నిస్సహాయుల మానసికక్షోభకైనా ఏ నిరుపేదల కష్టపరంపరకైనా సంఘంతో సంబంధం ఉంది.
    మనం మన బిడ్డలకు ఉగ్గుపాలతో నూరిపోసే ధర్మ కషాయాలూ, తల్లిదండ్రుల వికార సంసార శోభలూ, పాఠశాలల్లో పిల్లల చైతన్యాన్ని వేళ్ళతో సహా ఊడబీకే విద్యావిధానాలూ, బయట సమాజ ఆరోగ్య ప్రభావాలూ-ఇన్ని కలసి జీవితం తయారవుతున్నప్పుడు, వ్యక్తుల్నీ, వారి స్వభావాల్నీ, వారి చేష్టల్నీ, నిందించీ, విమర్శించీ సాధించేదేమీ ఉండదు. ఏ సుఖశాంతులకోసమైతే సంఘధర్మాలకు కట్టుబడాలో, ఆ సుఖశాంతులకోసమే అవసరమైతే సంఘధిక్కారమూ చేయాలి. నిజమైన మేలుచేసే వారెప్పుడూ దాన్ని ప్రశ్నించి ధిక్కరించేవారే.
    ఈ నవల పూర్తిగా చదివిన తర్వాత  చిన్న రాజేశ్వరి అయినా మంచి జీవితం జీవిస్తే ఎంత బాగుండును అనిపిస్తుంది. ఆ చిన్న రాజేశ్వరి మంచి జీవితం జీవించాలంటే, మనుషుల మెదళ్ళూ, వ్యవస్థలూ, ప్రభుత్వాలూ, ఇజాలూ, అన్నీ కదిలే సమస్య ఇది. అర్ధవంతమైన ‘బాపు’ ముఖచిత్రంతో, ప్రఖ్యాత రచయిత్రి రంగనాయకమ్మగారు రాసిన నవలకిది ఐదవ ముద్రణ.

    50.00
    Add to cart
  • Andhamaina Viplavam

    Andhamaina Viplavam

    0

    ఇటలీలో కళాచంద్రోదయం

    ఆరువందల ఏళ్ల క్రితం మన ప్రపంచంలో ఓ అద్భుతం జరిగింది. పద్నాలుగవ శతాబ్దపు తొలి నాళ్లలో ఇటలీలో ఒక విప్లవం మొదలయ్యింది.

    కత్తులతో, కాగడాలతో, నినాదాలతో, నెత్తుటి రాతలతో చేసిన హింసాపూరిత విప్లవం కాదది.

    అదొక అందమైన విప్లవం. మానవ మేధ లోతుల్లో రాజుకున్న విప్లవం. చిత్రకళ, శిల్పం, స్థాపత్యం, సాహిత్యం , విజ్ఞానం, నగర నిర్మాణం, సాంస్కృతికం ఇలా ఏదీ వదలకుండా మానవ జీవన విభాగాలన్నిటి మీద తన సర్వాంగ సుందరమైన ప్రభావాన్ని ప్రసరించి యూరప్ నాగరికత మీద శాశ్వత ముద్ర వేసింది. ఆ విప్లవం.

    ఆ విప్లవం పద్నాల్గవ శాతాబ్దంలో ఎందుకు జరిగింది?

    ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే క్రైస్తవ మత చరిత్రను క్లుప్తంగా గమనించాలి. ఒకటవ శతాబ్దంలో యూరప్, ఆసియాకి సరిహద్దుల వద్ద జుడెయాలో క్రైస్తవ మతం ఆవిర్భవించింది. ఆ కాలంలో జుడెయా రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ప్రభుత అనుసరించే పేగన్ (Paganism) మతానికి ఈ కొత్త మతభావాలు విరుదంగా ఉండడంతో, రోమన్ పాలకుల నుండి, సమాజం నుండి కూడా ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొంది. మొదటి నాలుగు శతాబ్దాల కాలం పలు రోమన్ పాలకుల నుండి క్రైస్తవులు ఎన్నో రకాల వేధింపులకి గురయ్యారు. ఇలా ఉండగా ఐదవ శతాబ్దపు చివరి దశలో రోమన్ సామ్రాజ్యం తూర్పు, పశ్చిమ విభాగాలుగా విడిపోయింది. పశ్చిమ విభాగం పూర్తిగా ఛిన్నాభిన్నమై పతనం కాగా, తూర్పు విభాగం | కాంస్టాంటినోపుల్ రాజధానిగా మరో వేయేళ్లపాటు వర్ధిల్లింది. – తూర్పు రోమన్ సామ్రాజ్యాన్నే బైజాంటైన్ సామ్రాజ్యం అని అంటారు. ఈ | కొత్త సామ్రాజ్యం క్రైస్తవ మతాన్ని సాధికార మతంగా స్వీకరించింది. దాంతో క్రైస్తవ మతం బాగా బలాన్ని పుంజుకుంది. అన్ని రకాల సామాజిక వ్యవహారాల మీద మతం పట్టు క్రమంగా బలపడుతూ వచ్చింది. జీవితం పట్ల మనిషి దృక్పథాన్ని కూడా మతమే శాసించింది. ఆ దృక్పథం ప్రకారం జన్మతః మానవుడు పాపి. మతం | బోధించిన జీవన సరళిని అనుసరించి జీవిస్తే, జన్మానంతరం సద్గతిని పొంది,…………

    300.00
    Add to cart
  • Andhrapradesh Dharmika Mariyu Hindumatha Samsthala Mariyu Dharmadaya Chattamu, 1987

    Andhrapradesh Dharmika Mariyu Hindumatha Samsthala Mariyu Dharmadaya Chattamu, 1987

    0

      ధార్మిక, మత సంస్థలు తృప్తికరముగా నిర్వహింపబడక పోవుచుండుట వలనను, వాటి ఆస్తుల నిర్వహణకు ప్రస్తుత మత లౌకిక ఆచారములను సంతృప్తిగా పాటింపబడుటకు, ఆంధ్రప్రదేశ్ ధార్మిక, హిందూ మత సంస్థల మరియు ధర్మాదాయముల చట్టము, 1966లోను, తిరుమల తిరుపతి దేవస్థానముల చట్టము, 1979లో నున్న నిబంధనలు అందుకు సరిపోవునంత మేరకు లేకపోవుటవలన, ప్రభుత్వము తిరుమల తిరుపతి దేవస్థానములతో సహా అన్ని సంస్థల ధర్మాదాయముల ఆస్తులను సమర్ధవంతముగా నిర్వహింపబడుటకు, నిధులను అర్ధవంతముగా వినియోగింప బడుటకు, ట్రస్టీలు తమకు వంశపారంపర్యానున్న ఆధారముతో చేయుచున్న క్లెయింలను, ట్రస్టీల ఎంపికకు వారి నియామకమునకు మరియు, వారు ప్రవర్తనా నియమావళిలో పాటించవలసిన విధానములను, దేవాలయములలో వంశపారంపర్యానున్న అర్చకుల మిరాసీదారుల మరియు యితర అధికార సిబ్బంది పొందుచున్న హక్కుల స్వభావము, ఆగమ శాస్త్రానుసారము, సాంప్రదాయానుసారము అట్టి సిబ్బంది పూజలు, పునస్కారములను నిర్వహించుటకు వారికి ముట్ట చెప్పవలసిన ప్రతిఫలము, మరియు ధర్మాదాయశాఖ సాధారణ పనితీరుపై తగిన మార్గదర్శక సూత్రములను సూచించుటకు ప్రభుత్వము న్యాయమూర్తి చల్లా కొండయ్య కమీషన్ ను యేర్పాటు చేసింది. కమీషను తన రిపోర్టును 28.2.1986నాడు ప్రభుత్వమునకు అందచేయగా ప్రభుత్వము దానిని పరిశీలించి కొన్ని మార్పులతో ఆ రిపోర్టును ఆమోదించింది.

    270.00
    Add to cart
  • Andolana Padakandi Aanandamga Jeevinchandi

    Andolana Padakandi Aanandamga Jeevinchandi

    0

    ఆందోళన అందరికీ కలుగుతుంది. ఉద్యోగం, పనీపాటా, డబ్బూ, కుటుంబ జీవితం, మానవ సంబంధాలూ, ఇవన్నీ మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఆందోళన కలిగిస్తాయి. ఈ పుస్తకంలో మీ జీవితం నుంచి శాశ్వతంగా ఆందోళనని పారదోలేందుకు పనికొచ్చే కొన్ని ఉపాయాలు సూచించబడ్డాయి.
    కొన్ని వేల మంది తమ జీవితాలలోంచి ఆందోళనని తొలగించి విజయం ఎలా సాధించారో డేల్‌ కార్నెగీ ఈ పుస్తకంలో వివరించాడు. వాళ్ళల్లో కొంతమంది ప్రముఖులు ఉన్నప్పటికీ అధికశాతం సామాన్యులే ఉన్నారు. రచయిత సుఖశాంతులతో జీవించటానికి పనికివచ్చే వ్యావహారిక సూచనలని ఇందులో ఇచ్చాడు.

    250.00
    Add to cart
  • Animal Farm (Telugu)

    Animal Farm (Telugu)

    0
    300.00
    Add to cart
  • Ankelato Aatalu
  • Annamalaiku Ardhamaindi Mari Manakemaindi?

    Annamalaiku Ardhamaindi Mari Manakemaindi?

    0

    అరుణాచల శ్రీ రమణులు – అన్నామలైస్వామి గురుశిష్య సంబంధం విశిష్టమైనది. గురువు, శిష్యనకు నేర్పవలసింది నేర్పాడు. ఇక తనని అంటి పెట్టుకొని ఉండవద్దు అని పంపించి వేశాడు. పక్షికి రెక్కలొచ్చేంత వరకే తల్లి కాపాడుతుంది. పసి పిల్లవాడు తల్లి వొళ్లో ఆడుకోవడం కొంతకాలం వరకే. ఆ తర్వాత ప్రతి ఒక్కరు, ఎదగాలి. ముందుకు సాగాలి.

                                   పదేళ్ల తర్వాత ఆశ్రమం బయటకి వచ్చిన అన్నామలై స్వామి , ఏకాంత జీవనం గడుపుతూ, తనకు తెలిసింది పదిమందికి భోదిస్తూ సుమారు ఎనభైతొమ్మిదేళ్లు బ్రతికాడు.

                                     శ్రీ రమణులు అన్నామలైని అడుగడుగునా మలిచిన తీరు, సాధకులకు ముచ్చట గొల్పుతుంది. అన్నామలై స్థానంలో మనల్ని మనం ఊహించుకుంటే, ఈ ఆత్మ విద్యను ఎంత సుళువుగా నేర్వగలమో తెలుస్తుంది.

                                                                                            -నీలంరాజు లక్ష్మీప్రసాద్.

    70.00
    Add to cart
  • Antam Chusina Asuya

    Antam Chusina Asuya

    0

    రచయిత గురించి
    మాదిరెడ్డి సులోచన శంషాబాదు గ్రామంలో 1935 లో జన్మించారు. వీరిది సాంప్రదాయక వ్యవసాయక కుటుంబం. ఈమె ఎం.ఎ, ఎం.ఇడి చేసి 1971 వరకు సుమారు 10సంవత్సరాలు ఉపాధ్యాయినిగా పని చేశారు. భర్తతో బాటు ఇధియోపియా,జాంబియా దేశాలకు వెళ్లి అక్కడ కూడా ఉపాధ్యాయినిగా పనిచేసారు ఈమె 1965 లో ‘జీవయాత్ర’ పేరుతో మొదటి నవల రాసారు. ఈమె దాదాపు 150 కధలు, 72 నవలలు, 2 నాటికలు, 10 ఏకాంకికలు రాసారు. వీనిలో 10 నవలలు సినిమాలుగా రూపొందాయి. తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే ఆలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు. ప్రేమలు, పెళ్ళిళ్ళు కంటే కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఉత్తమ ఉపాధ్యాయిని, ఉత్తమ కధా రచయిత్రి అవార్డులు పొందారు.

    80.00
    Add to cart