-
Chempadebba Philosophy- Naa Istam- 2.0
0₹250.00ఒక మనిషిని చుట్టూ ఉన్న పరిస్థితులే తయారు చేస్తాయి” అని కార్ల్ మర్క్స్ చెప్పినట్టు… అయాన్ రాండ్ … ఫ్రెడరిక్ నిషే, ఆర్ధర్ షోపెన్ హోవర్ , నా విజయవాడ ఫ్రెండ్ , జేమ్స్ హాడ్లి ఛేజ్, ఫ్రెడరిక్ ఫోర్సెత్, ముప్పాళ్ళ రంగనాయకమ్మ, మ్యాడ్ మ్యాగజైన్లు , సెక్స్ పుస్తకాలు, చందమామ, బాలమిత్ర కథలు, స్టీఫెన్ స్పిల్ బర్గ్, కె.బాలచందర్ లాంటి నా జీవితంలో ఎదురైనా ప్రతివ్యక్తి అనుభవాల నుంచి నాకు నచ్చి,నేను తీసుకుని , నావి చేసుకున్నవి నాలో ఒక భాగం. అయితే ఇంకోభాగం నేను మంచి స్టూడెంట్ కాకపోవటం, నా ఇష్టమొచ్చినట్టు చేయడానికి అనుమతించిన నాన్న ఉండటం, ఐదేళ్ళు విజయవాడ విధుల్లో వీరంగం చేయడం , నన్ను ఒక సినిమా ఉన్మాది చేసిన ప్రసాద్ మామయ్య, సినిమాల గురించి విశ్లేషణ అలవాటు చేసిన మురళి మామయ్య లాంటి వాళ్ళు నా జీవితంలో తారసపడటం మూలాన కూడా “నేను” నేనయ్యాను. నేను “నా” ల మిగిలాను.”నా ఇష్టం” వచ్చినట్టు బ్రతికాను, బ్రతుకుతున్నాను , బ్రతకబోతున్నాను.
-
Chinta Deeskhitulu – Balasaahityam – చింతా దీక్షితులు బాల సాహిత్యం
0₹230.00పూర్వం రేడియోలో పిల్లల కోసం ‘బాలానందం’ కార్యక్రమం వుండేది. ఇప్పుడు అనేక తెలుగు టీవి ఛానళ్లున్నాయి, ఏ ఒక్క ఛానలైనా బాలసాహిత్యం ఊసెత్తుతుందా? కొన్ని ఛానళ్లు బాలలకి పాటల పోటీలు నిర్వహిస్తున్నాయి. వాటిల్లో అన్నీ సినిమా పాటలే పాడతారు, బూతుపాటలకక్కడ నిషేధం లేదు.
మాతృభాష నిరంతరాయంగా మనుగడ సాగిస్తేనే బాలసాహిత్యం కూడా విలసిల్లుతుంది. తెలుగులో మాట్లాడటమే నామోషీ అనుకునే జనంలో మాతృభాష పట్ల చైతన్యాన్ని పెంచేందుకు కృషి జరగాలి. ఏవో కొన్ని ప్రభుత్వ సంస్థలు తెలుగు భాషను ఉద్ధరిస్తాయని అనుకోవటం అత్యాశే!
ఇలాంటి విషమ పరిస్ఠితుల్లో ‘చింతాదీక్షితులు’ మనకు స్ఫూర్థి కావాలి. తెలుగులో వున్న తరతరాల బాలసాహిత్యాన్ని శోధించి, సాధించి తెలుగు సాహిత్యానికి వెలుగులద్దిన వారు చింతాదీక్షితులుగారు. ఆయన ఒక్కరే ఆనాడు ఆ మహత్తర కార్యానికి, పూనుకుని మరుగున పడిన లేదా మేధోచౌర్యానికి గురౌతున్న బాలసాహిత్యాన్ని తల్లిబిడ్డలకందించిన వారు చింతాదీక్షితులు గారు.
-
Chiranjeevi Indiraku – చిరంజీవి ఇందిరకు
0₹60.001928వ సంవత్సరం వేసవిలో హిమవత్పరతమందలి మసూరిలో ఉన్న తన కుమార్తె ఇందిరకు జవహర్‌లాల్ నెహ్రూ జనపద మందు ఉంటూ ఈ జాబులు వ్రాశారు.
జననం : 1889. కాశ్మీర దేశస్థులు. తండ్రి ప్రఖ్యాత న్యాయవాది మోతీలాల్ నెహ్రూ, తల్లి : స్వరూపరాణి. జన్మస్థానం ప్రయాగ : ‘అలహాబాద్’ ఇంటివద్దే కొంతకాలం ప్రైవేట్‌గా చదువుకొని హారోలో, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాలలో విద్యనభ్యసించారు. అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించారు. 1918లో ఇండియన్ ¬మ్‌రూల్ లీగుకు కార్యదర్శి అయినారు. 1918 నుంచి అఖిల భారత కాంగ్రెస్ సభ్యుడుగా ఉన్నారు. 1921లో మొదటిసారి కారాగృహవాసాన్ననుభవించారు. రచనాకాలం నాటికి ఎనిమిది మారులు శ్రీకృష్ణ జన్మస్థానాన్ని చూచి వచ్చారు. 1929లో కాంగ్రెస్ కార్యదర్శి అయినారు. 1930లోను 1936, 37, 46లలోనూ కాంగ్రెస్ అధ్యక్షులయినారు. 1950 నుంచి 1955 వరకు కాంగ్రెస్ అధ్యక్షులుగా వున్నారు.ఈయన గొప్ప ప్రజాస్వామ్యవాది. ఆంగ్లంలో అనేక గ్రంథాలను రచించారు. వీరి రచనలలో ‘సోవియట్ రష్యా’, ‘ప్రపంచ చరిత్ర’, ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ అన్నవి ప్రసిద్ధ రచనలు. 1947లో భారతదేశం స్వాతంత్య్రం పొందిన నాటి నుంచి 1964వ సంవత్సరం మే 27న మరణించే వరకు ఆయన భారత ప్రధానిగా ఉన్నారు. తరువాతికాలంలో ఆయన కుమార్తె శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశానికి ప్రధానిగా ఎన్నుకోబడి దేశాభివృద్ధికి ఎన్నో సంస్కరణలు చేపట్టారు.
-
Chirasmarana
0₹70.00“చిరస్మరణ” నవల రచనకు సంబంధించి ఈ సందర్భంలో ఒకటి రెండు మాటలు వ్రాయడం అప్రస్తుత మనిపించదు. భారతదేశ శ్రమజీవులు కొనసాగిస్తూ వచ్చిన వర్గ సమారా ఇతిహాసం సుదీర్ఘమయింది. దాని గగుర్పాటు కలిగించే ఒక అధ్యాయం కేరళలోని కయ్యూరు రైతుల పోరాటం. అదే ‘చిరస్మరణ’ రచనకు ప్రేరణ. ఆ ఇతివృత్తం నా మనస్సును తాకినది, తట్టినది నా విద్యార్థి దశలో.
“చిరస్మరణ” లోని అనేక పాత్రలు వాస్తవ జీవితం నుంచే నవల పుటలకు నడిచి వచ్చాయి. అయితే అవి ఇక్కడ పాత్ర నిర్వహణ కోసం రంగ ప్రసాదన వేష భూషణాలను నిరాకరించలేదు. మాస్టర్ పాత్రకు మాధవన్ – మాధవేట్టన్ – స్ఫూర్తి, ప్రభుపాత్రకు కామత్. మరికొన్ని పాత్రల విషయంలో జనాభా లెక్కలు చెప్పమొగం వేయవచ్చు. కాని అలాంటివారు ఉండి ఉండరు – అని ఖరాఖండిగా చెప్పడం కష్టం. “చిరస్మరణ” జయప్రియతను సంపాదించాకపోయినా, అల్ప సంఖ్యాకులైన పాఠకులకు చాలా ఇష్టమయిందనితోస్తుంది.
– తిరుమల రామచంద్ర
-
Chittadavilo Chinna Pranulu – చిట్టడవిలో చిన్న ప్రాణులు
0₹50.00అదొక చిట్టడవి. ఆ అడవి ఎప్పుడూ చిన్నా, పెద్దా జంతువుల అరుపులతో, రకరకాల పక్షుల కూతలతో సందడిగా ఉంటుంది. అక్కడక్కడా గుత్తులు గుత్తులుగా పూసిన పూల సువాసన అడవంతా తిరుగుతూ ఉంటుంది. ఆ అడవి మధ్యన చిన్న నీటి గుంట ఉంది. ఆ గుంట చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. ఒక కోతి ఆ చెట్ల కొమ్మల మీదకు దూకుతూ ఆకులన్నీ దూసి నీళ్ళలోకి విసురుతోంది. ”ఏమిటమ్మా ఆ దూకుడు? కాయలో పళ్ళో అయితే పిల్లలు తింటారు. ఈ ఆకులేమిటి… బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు” నీళ్ళలోంచి బయటకొచ్చి విసుగ్గా అంది ఓ తాబేలు.
”పళ్ళు కావాలని మర్యాదగా అడగవచ్చు కదా!” అంది కోతి. అంటూనే చకచకా అవతలి చెట్లమీదకి దూకేసింది పళ్ళ కోసం.
”కావు…కావు…” అని అరుచుకుంటూ ఆయాసంగా అక్కడ వాలింది ఓ కాకి.
కాకి పిలుపుకు నెమ్మదిగా ఒడ్డు దగ్గరకు వచ్చింది తాబేలు. ”ఏరి వీళ్ళంతా…అంతదూరం నుంచీ ఎంతో ఆత్రంగా ..ఎగురుకుంటూ వచ్చాను. తీరా చూస్తే ఇక్కడెవరూ లేరు”. అంది కాకి నిరాశగా….
-
Chitti Raja (Telugu)
0₹80.00Chitti Raja (Telugu) – Third Edition 2025 print
చిన్ని గ్రహం నుంచి వచ్చాడు. ఓ చిట్టిరాజా, సహారా ఎడారిలో పాడైపోయిన తన విమానాన్ని బాగుచేసుకొంటున్న ఓ పైలట్న పలకరిస్తారు. ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తాడు. పైలట్ను తబ్బిబ్బు చేస్తాడు. అబ్బురపరుస్తాడు. ఆనందింపజేస్తాడు.
కనిపించి ఆనందపరిచినట్టే ఇట్టే మాయమై ఆలోచింపజేస్తాడు. చిట్టిరాజు పెద్దవాళ్లకు ఓ కనువిప్పు -
Cinema Kadhalu
0₹225.00ఈ భూమి మీద పుటిన ప్రతి జీవి తన పరిణామ క్రమంలో ముందుకు సాగుతూ తమ జాడలను వదిలివెళ్తుంది. కానీ మనిషి వేరు. సాహిత్యం, సంగీతం, చిత్రకళ, చలనచిత్రం, శిల్పకళ లాంటి ఎన్నో కళారూపాలతో ఈ భూమి మీద తన ఉనికిని ప్రత్యేకం చేసుకున్నాడు. కళలే లేని మానవ చరిత్రని ఉహించగలమా? అటువంటి కళల్లో అన్నింటికంటే సరికొత్తది చలనచిత్రకళ. ఎన్నో శతాబ్ధాలుగా ఏదుగుతూ వచ్చిన కళారూపాలను తనలో ఇముడ్చుకొన్న శక్తివంతమైన మాధ్యమం చలన చిత్రం. వందేళ్ల క్రితం మొదలై తనకై తనగా అభివృద్ధి చెందుతూ, మిగితా కళారూపాలనుంచి స్ఫూర్తి పొందుతూ కొత్తకొత్త రూపాలను సంతరించుకుంటూ వస్తున్న ఈ కళకు, సాహిత్యంలో ఏంతో అవినాభావ సంబంధం ఉంది. మొదట్నుంచి కూడా సాహిత్యమే సినిమాకు ముడిసరుకు. సాహిత్యంలో గొప్పవిగా బావించబడ్డ ఎన్నో కధలు, నవలలు చలనచిత్రాలుగా రూపొందాయి.
-వెంకట్ శిద్ధారెడ్డి.
-
Cinema Oka Alchemy
0₹230.00అత్యంత ఆధునిక కళాప్రక్రియగా రూపొందిన సినిమా తన సంస్కరణవాడ, గ్రామీణ మూలాల నుంచి వేరుపడి ఇవాళ అది పూర్తి వ్యాపారాత్మకమైంది. నాటకరంగం విషాదంగా నిష్క్రమిస్తున్న వేళ, సినిమా వేయిపడగలు విప్పి హోరెత్తుతోంది. ఆధునిక వ్యాపారవేత్తలు, మాఫియా కలాపోశాకులుగా తల ఎత్తాక.. ఈ రంగం నుంచి ఇంకా ఏమైనా ఆశించగలమా? హరిపురుషోత్తమ రావు అన్నట్లు ‘యథాపాలకవర్గం, తథాసాంస్కృతిక రంగం.’
ఈ ప్రధాన స్రవంతికి భిన్నంగా ప్రపంచంలో ప్రత్యామ్నాయ సినిమా కొత్త ఆశలతో చిగురిస్తోంది. మానవీయకోణం నుంచి సామాజిక ఆవరణంలోకి సాగిన భిన్న ప్రదేశాల, భిన్న ఇతివృత్తాల ఆశావహ చిత్రాల సమాహారమే వెంకట్ సిద్దారెడ్డి వెలువరించిన దృశ్యమాలిక ‘సినిమా ఒక ఆల్కెమీ.’
-
Dabbu Oka Shakthi Pravaham Part 1 & 2
0₹900.00డబ్బు అంటే ఏమిటి?
‘డబ్బు’ ఇది ఏమాత్రం పరిచయం అవసరంలేని పదం. ప్రపంచంలోని ప్రతిఒక్కరూ (ఆత్మజ్ఞానులు తప్ప మిగిలిన అందరూ కొంచెం ఎక్కువగానో, తక్కువగానో అందరూ డబ్బుకోసం పరుగులు పెట్టేవారే, ప్రయత్నం చేసేవారే, చింతించేవారే.
మరి అందర్నీ ఇంతగా ప్రభావితం చేస్తున్న ఈ డబ్బు గురించి మనకు తెలుసా? అసలు ‘డబ్బు’ అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు మీ సమాధానం ఏమిటో
“ఇది కూడా ఒక ప్రశ్నేనా… డబ్బంటే ఏంటో తెలీదా” అని అనుకుంటున్నారా? అయితే చెప్పండి.
దీనికి వివిధ రకాల సమాధానాలు రావచ్చు. ఎవరి జవాబు ఎలా ఉన్నా, మనలో చాలామందికి ‘డబ్బు’ అంటే ఏమిటో స్పష్టంగా తెలీదు. విచిత్రమేమిటంటే, మనకు తెలియదని కూడా మనకు తెలీదు! ‘డబ్బు’ అంటే ఏమిటో మనకు సరిగా అర్థంకాకపోయినా, మనకు తెలుసుననే భ్రమలో దానివెనక దానికోసం పరుగులు పెడుతున్నాం, ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకే ఇన్ని తంటాలు!
సరే, మళ్ళీ మన ప్రశ్న దగ్గరకొద్దాం. డబ్బు అంటే ఏమిటి? సాధారణంగా చాలామంది అనుకునేది, డబ్బంటే మనం రోజూ చూసే (లేదా) ఖర్చుపెట్టే కాగితపు డబ్బు లేదా నాణేలు అని. కానీ అది డబ్బు కాదు! దానిని “కరెన్సీ (Currency)” అంటారు. లేదా ద్రవ్యము, నగదు అని అంటారు. అయితే మరి డబ్బు అంటే ఏమిటి?
వివిధ స్థాయిలలో డబ్బు యొక్క అసలైన అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న ఊహాత్మక కథ సహాయంతో మన ప్రయత్నం మొదలు పెడదాం.
బాగా ధనవంతుడైన ఒక కోటీశ్వరుడున్నాడనుకుందాం. అతను ఒకసారి వ్యాపారరీత్యా ఏ అండమాన్ నికోబర్ దీవులకో వెళ్ళాడు అక్కడ ఒక హోటల్లో బస చేశాడు. తిరిగి బయలుదేరేటప్పుడు హోటల్ బిల్ కట్టడానికి తన క్రెడిట్ కార్డును ఉపయోగించాడు. అయితే ఏదో సాంకేతిక లోపం వల్ల (because of some technical problem) అక్కడ అప్పుడు ఎలాంటి లావాదేవీ యంత్రాలు…………