• Rangabhoomi - రంగభూమి

    Rangabhoomi – రంగభూమి

    0

    కల్పన కంటే సత్యమే సుందరంగా ఉంటుందని నిరూపించిన కథక చక్రవర్తి ప్రేమ్ చంద్. భూస్వామ్య వ్యవస్థ కూలిపోతూ పారిశ్రామిక నాగరికత తోసుకు వస్తున్న సమయంలో, పాత వ్యవస్థలోని కొంత మంచి కూడా ఎలా నశించిపోతుందో చిత్రించే నవల రంగభూమి. గుడ్డివాడు, బిచ్చగాడు ఐన సూరదాసు భూమిని మోసం ద్వారా జాన్ సేవక్ అనే పరిశ్రమికాధిపతి కొని, సిగరెట్ ఫ్యాక్టరీ స్థాపించడం, గ్రామ జీవితంలోని ప్రశాంతత ధ్వంసమై, కృత్రిమత్వం, కుటిలత్వం సూరదాసు తుపాకి గుండ్లకు బలై చనిపోతాడు.

    గాంధీజీ సిద్ధాంతాలతో సంపూర్ణ విశ్వాసం గల ప్రేమ్ చంద్ జీవితాంతం త్యాగమయ జీవితం  గడిపాడు. సోషలిస్టు ప్రపంచం గోర్కీ సాహిత్యంతో ఆకర్షితుడై, 1936లో ప్రథమ అభ్యుదయ రచయితల మహాసభకు అధ్యక్షత వహించి ఆ ఉద్యమానికి మూల పురుషుడైనాడు. ప్రేమ్ చంద్ ఉత్తమ రచనలలో ఒకటి రంగభూమి.

    500.00
    Add to cart
  • Rangula Cheekati Kathalu - రంగుల చీకటి కథలు

    Rangula Cheekati Kathalu – రంగుల చీకటి కథలు

    0

     ఈ కధల్ని నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఇండ్ల చంద్రశేఖర్ అనే రచయితని నేను ఎరగను. అతడి కధల్ని నేను చదవలేదు. కొన్ని అంతర్జాల పత్రికల్లోనూ, రెండో మూడో ఆదివారం దిన పత్రికల్లోనూ వచ్చినట్లుంది. అతడు ఎలా ఉంటాడో తెలీదు. ఎక్కడి వాడో తెలీదు. ఏ ప్రాంతాన్ని పరిచయం చేస్తున్నాడో తెలీదు. ఏ జీవితాన్ని తెలుగు పాఠకుల కళ్ళ ముందు బొమ్మ కటిస్తున్నాడో తెలీదు. మొత్తం మీద పన్నెండు కధలు నా చేతిలోకొచ్చి చేరేయి. ఆఫీసు పని వత్తిది, ఇటీవల కాలపు సమస్యలు – కధల్ని ఒక్కొక్కటి చదివేసరికి నెల – ఈ నాలుగు మాటలు రాయడానికి మరికాసిన రోజులు –

                                                        చంద్రశేఖర్ ది ఒంగోలు పక్కనుండే కందులూరు పల్లె నుంచి వచ్చిన వాడు. హైదరాబాద్ లో స్థిరపడినట్టుంది. ఈ కధల్లో చిత్రించిన వాతావరంణం, జీవితం, నా ముందు రూపు కట్టిన అనేక పాత్రలు, జీవితం చుట్టూ అల్లుకున్న సమస్త భావోద్రేకాలు – ఈ కధలు నవ్విస్తాయి, ఏడిపిస్తాయి కలల్లో నడిపిస్తాయి, సెంటిమెంటుని పండిస్తాయి, వీర ఆగ్రహాన్ని, ఆవేశాన్ని రగిలిస్తాయి.

                                                                             -చంద్రశేఖర్ ఇండ్ల.

    100.00
    Add to cart
  • Ratnamma Gaari Kodalu Subbamma Gaari Allullu

    Ratnamma Gaari Kodalu Subbamma Gaari Allullu

    0

    “ఏం వినాలి? అన్నీ వింటున్నాం . ఈ కేసు ఆగక పోతే, మళ్ళీ ఎప్పుడో వస్తుందట. ఇక భయంతో బతకటమేనా మేము? ‘పెళ్ళి’ అంటే, కాస్త బుద్ధిమంతురాలో కాదో సరిగా చూసుకోనక్కర్లేదా? అది సిగరెట్లు కాల్చినా నచ్చింది. ఎవడి తోటో సినిమాలకు పోయినా నచ్చింది. ‘అందం, అందం’ అని పిచ్చిగా ప్రవర్తించావు. ఇప్పుడు అందంగా లేదా? ఆ దేశం కల్చర్, ఈ దేశం కల్చర్ అంటారు. ఇక్కడి వుద్యోగాలు చాలవా – అంటే, అమెరికాలో కాలు పెట్టడమే ‘గొప్ప’ అనుకున్నావు. అలాగైతే, ఆ దేశపు కల్చర్ ప్రకారమే నడువూ. అది నచ్చదా? తీరా చేస్తే, తిరుగుబోతు కల్చర్ ముండని నెత్తికెక్కించుకున్నావు. ఏం జరిగింది? మాకు జైలు అప్పగించావు.”

    “నా భర్తగా, ఒకర్ని కులాలతో సంబంధం లేకుండా ఎంచుకున్నానంటే, ఆ అన్యాయాన్ని నేను వదిలేసినట్టే! ఆ తేడాని నేను పోగొట్టుకున్నట్టే. ఒక మనిషి, ఒక చెత్త గుణాన్ని వొదులుకుంటే, సమాజాన్నంతా మారమని చెప్పినట్టే.”

    “ఒక్క మాట చెప్పండి! మీది పెద్ద కులం అనుకుంటారు. మీ ఒంటి మీద పెద్ద కులం ఎక్కడుందో చెప్పండి! “

    80.00
    Add to cart
  • Sathyavathi Kadhalu - సత్యవతి కథలు

    Sathyavathi Kadhalu – సత్యవతి కథలు

    0

    సమాజం తనకి నిర్దేశించిన పాత్రలో ఒదిగిపోయిన అస్తిత్వాన్ని కోల్పోయిన కాలం తరువాత, అస్తిత్వ స్పృహ పెంచుకుని తనను తను ప్రతిష్టించుకునే పోరాటంలో, కొంత విజయం సాధించిన స్త్రీలు, ఆ పైన ప్రపంచీకరణతో మరింత సంక్లిష్టమైపోయిన జీవన పోరాటంలో ఉక్కిరి బిక్కిరైపోతున్న స్త్రీలూ పురుషులూ, వారి ఆశలు, ఆరాట పోరాటాలు, విజయాలు, వైఫల్యాలు, శ్రీఘ్రగతిన మారుతున్న ఆర్ధిక రాజకీయ పరిస్థితుల్లో తరిగిపోతున్న మానవీయ విలువలను కాపాడుకునే ప్రయత్నాలు, ఆ క్రమంలో సంఘర్షణలు సత్యవతి కథల నిండా కనపడతాయి. జీవితాన్ని తడిమేదే సాహిత్యం అని నమ్మే సత్యవతి కథలు ఒక ఆశావాదంతో ముగుస్తాయి. జీవితంపట్ల ఆశను, ప్రేమను వెలిగిస్తాయి.

    270.00
    Add to cart
  • Simhaavalokanam - సింహావలోకనం

    Simhaavalokanam – సింహావలోకనం

    0

    సింహావలోకనం  – మూలం : యశ్‌పాల్‌, అనువాదం : ఆలూరి భుజంగరావు

    సింహావలోకనం …. ఈ దేశ ప్రజలకు మానవోచితమైన జీవితాన్ని – జీవనాన్ని, స్వేచ్ఛా – స్వాతంత్య్రాలనూ సమకూర్చడం కోసం నిరంతరం సంఘర్షపథంలో  రక్తతర్పణం గావిస్తూ విప్లవాన్ని ఆవాహనం చేస్తున్నాం! – యశ్‌పాల్‌

    ప్రజల జీవితాన్ని, జీవనాన్ని – కలుషితం చేస్తూ, పాలకవర్గాలు, వారి తొత్తులూ దోపిడి, అణచివేతల్నూ, నిరంతర హత్యల్నూ, దొంగ ఎదురు కాల్పుల్నూ సాగిస్తూ విప్లవ పోరాటాల్ను రక్తపుటేరుల్లో ముంచడంతోపాటు వంచనా శిల్పంతో ప్రజల మేధస్సులు విభ్రమింప చేయ ప్రయత్నిస్తున్నంత కాలం ఈ దేశానికి – సింహావలోకనం – ప్రాసంగికమే. – ఆలూరి భుజంగరావు

    120.00
    Add to cart
  • Swamuloru - స్వాములోరు

    Swamuloru – స్వాములోరు

    0

    అతడో చిల్లర దొంగ. హీనుడు. స్త్రీలోలుడు. క్రూరుడు. డబ్బు వ్యామోహపరుడు. సర్వదుర్గుణాలపుట్ట. తేలికగా డబ్బు సంపాదించాలని స్వామి అవతారం ఎత్తాడు. ఆశ్రమం నిర్మించాడు. భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తా అన్నాడు. రోగాల్ని తగ్గిస్తానన్నాడు. పిల్లలు లేని దంపతులకి పిల్లలు పుట్టిస్తానన్నాడు. మాయలూ మంత్రాలూ చేసాడు. జనాన్ని నమ్మించాడు. వంచించాడు. వక్రబుద్ధులు చూపెట్టాడు. అంతులేని సంపద పోగేసుకున్నాడు. ఆశ్రమంలో అత్యాచారాలు జరిగాయి. హత్యలు జరిగాయి. పెద్ద పెద్ద అధికార్లూ, పోలీసులూ, మంత్రులూ స్వామి పాదాక్రాంతులయ్యారు.

    నేటి మన సమాజంలో స్వాములుగానూ, బాబాలుగానూ చలామణి అవుతూ పూజలందుకుంటున్న అనేకమంది దగుల్బాజీల కోవలోని వాడే ఈ స్వామికూడా! స్వామి క్రూరత్వానికి ఒక అబల గురైంది. భర్తని పోగొట్టుకుంది. స్వామి స్వరూపాన్ని గ్రహించింది. స్వామిని కటకటాల వెనక్కి పంపిస్తానని ప్రతిన బూనింది.

    ఆ అబల ఆవేదననీ, ఆరాటాన్నీ, పోరాటాన్నీ, ఉద్యమాన్నీ ఉత్తేజపూరితంగానూ, స్వాముల బతుకుల్నీ, బండారాల్నీ, దుష్టత్వాల్నీ, కపటత్వాల్నీ, దుర్మార్గాల్నీ మోసాల్నీ, ధనకాంక్షల్నీ ఆసక్తికరంగానూ, ఉత్కంఠ భరితంగానూ అక్షరీకరించిన నవల ‘స్వాములోరు’.

    పేజీలు : 159

    120.00
    Add to cart
  • Telugu Bhashaa Charitra - తెలుగు భాషా చరిత్ర

    Telugu Bhashaa Charitra – తెలుగు భాషా చరిత్ర

    0

    తెలుగుభాషకు సంబంధించిన ముఖ్యమైన అనేక అంశాలు ఇందులో చోటుచేసుకున్నాయి. గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ”తెలుగు భాషా చారిత్ర’ ను విద్యార్ధులకు బోధించిన అనుభవంతో ఈ గ్రంథం పాఠకుల ముందుకు తెచ్చారు రచయిత ప్రొఫెసర్‌ వెలమల సిమ్మన్న.

    ”తెలుగు భాషా చరిత్ర” ఏడో ముద్రణ ఇది. ఇందులో మరికొన్ని కొత్త అంశాలు చోటు చేసుకున్నాయి. విద్యార్ధులకు, పరిశోధకులకు, ఉపాధ్యాయులకు, భాషాభిమానులకు ఈ గ్రంథం ఎంతగానో వుపయోగపడుతుంది.

    విద్యార్ధుల విజయాన్ని కోరుకుంటూ ….- సిమ్మన్న

    600.00
    Add to cart
  • Vidhatha

    Vidhatha

    0

     ప్రజాస్వామ్యం వచ్చినా బానిసత్వం పోలేదు! ఎన్ని రాజకీయ పార్టీలు మారినా రాజరికం మారలేదు! కార్ల్ మార్క్స్ కోరుకున్న సమసమాజం ఎక్కడ? రవీంద్రుడు కలలుగన్న స్వేచ్ఛా స్వాతంత్ర్యం ఏమయ్యింది?

    ఈ కర్మభూమిలో ఎంతమంది మహానుభావులు మట్టినా ఇంకా మన జీవితాలు ఇలాగే ఎందుకున్నాయి?మరి దీనికి శాశ్వత పరిష్కారమేమిటి? ప్రజలా? ప్రభుత్వాలా? వ్యవస్థలా? భావవిప్లవమా?వెదకగలిగితే ఈ నవలలో పరిష్కారం కనపడుతుంది!

    ఈ నవలలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడం జరిగింది. ఇప్పుడున్న మానవ సంబంధాలలో, అలాంటి ప్రపంచం ఒకటి ఎంతయినా అవసరమని, నిజంగా నమ్మి రాసిన పుస్తకం ఇది. వందమంది నిజాయితీపరులు ఉంటే ఈ ప్రపంచాన్నే మార్చివేస్తానన్న ‘శ్రీ స్వామీ వివేకానందు’ని వాక్యమే ఈ నవలకి ప్రేరణ!

    100.00
    Add to cart
  • Viswa Kathaa Satakam - విశ్వ కథా శతకం

    Viswa Kathaa Satakam – విశ్వ కథా శతకం

    0

    వంద కథల విందు

    ”రచయిత లక్ష్యం కథ చెప్పటమూ, పాఠకులకు వినోదం కలిగించటమూ కాదు. లోకం కప్పుకున్న ముసుగుల్ని తొలగించి చూడగలగాలి రచయిత. తప్పనిసరిగా ఇది వయ్యక్తికానుభవమే. వ్యక్తులు, పరిస్థితులు, సంఘటనలు అన్నీ రచయిత తను అర్థం చేసుకున్న దృష్టికోణం నుండి మాత్రమే రాయగలడు. తనలో కలిగిన స్పందననే పాఠకులకూ కలుగచేయటానికి ప్రయత్నిస్తాడు. అప్రయత్నంగా కబుర్లు చెప్పినట్టుగా వుంటే కథ పండిందన్నమాట” అంటాడు కథకులందరికీ ప్రాత:స్మరణీయుడు మపాసా.

    ఇందులోని ప్రతి కథనూ మపాసా సూచించిన గీటురాయితో పరీక్షించి చూడండి. మీకే తెలుస్తుంది. ఒక్కొక్క కథా సానపట్టిన వజ్రమని.

    దేశ సరిహద్దులు దాటి, ఖండాంతరాలను అధిగమించి, శతాబ్దాలకు వారధికట్టి, లోకం చుట్టివచ్చిన కథలివి.

    Pages : 462
    400.00
    Add to cart
  • Viswambhara - విశ్వంభర

    Viswambhara – విశ్వంభర

    0

    భారతీయ జ్ఞానపీఠ పురస్కారం పొందిన కావ్యం.

    ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల విశ్వంభర.

    ఇతివృత్తం – తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో అగత్యం లేని మనషి కథ.

    ఈ కథకు నేపథ్యం ప్రకృతి.

    మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులు.

    అలాగ్జాండర్‌, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్‌, బుద్ధుడు, లింకన్‌, లెనిన్‌, మార్క్స్‌, గాంధీ – ఇలా ఇలా ఎన్నెన్ని రూపాలో మనిషికి!

    కామం, క్రోధం, లోభం, మదం, ఆత్మశోధనం, ప్రకృతిశక్తుల వశీకరణం – ఇలా ఇలా ఎన్నెన్ని విభిన్న ప్రవృత్తులో మనిషికి!

    ఆదిమదశనుంచీ ఆధునికదశవరకు మనిషి చేసిన ప్రస్థానాలు ఈ కావ్యంలో ప్రకరణాలు.

    మనిషి సాధన త్రిముఖం – కళాత్మకం, వైజ్ఞానికం, ఆధ్యాత్మికం. ఈ సాధనలో అడుగడుగున ఎదురుదెబ్బలు. క్షతుడైనా మనిషి తిరోగతుడు కాలేదు. ‘విశ్వంభర’ కావ్య రచనకు పూర్వం నాలో గీసుకున్న రేఖాచిత్రమిది.

    75.00
    Add to cart
  • Gamyam

    Gamyam

    0

    నదికి తన గమ్యం తెలియకకపోయినా, అది తన గమనాన్ని ఆపకుండా సముద్రం వైపు సాగిపోతుందని, అలాగే ప్రతి మనిషి తన గమ్యం వైపు ఎన్ని కష్టాలు, సమస్యలు వచ్చిన సాగిపోవాలని గమ్యం కథ చెబుతుంది.

              జీవితం అన్నది పులపాన్పు కాదని, కష్టాల కడలి అనీ అయినా మొక్కవోని ధైర్యంతో దానిని ఎదురీదాలని ఈ కథ సారాంశం.

              మనిషికి నిరాశ పనికిరాదు, ఆశాజ్యోతి చీకట్లను పారద్రోలుతుంది.

               ఈ కథ సంపుటిలోని 22 కథలు మనుషుల సమగ్ర జీవనయానాన్ని ఆవిష్కరిస్తాయి. సమస్యల్ని ఎలా ఎదుర్కొని ముందుకు సాగాలో చెప్పకనే చెబుతాయి. మనుషులు నిజాయితీగా బ్రతకాలనీ, నైతిక విలువలు పాటించాలని నిర్దేశిస్తాయి……

                                                                        – గన్నవరపు నరసింహమూర్తి

    130.00
    Add to cart
  • The Girlfriend Arrangement

    The Girlfriend Arrangement

    0

    Et quo dolorem culpa id quos consequatur. Doloremque veniam commodi cumque. Excepturi qui quae ad ipsam quae optio sapiente.

    761.67
    Add to cart