-
Tenuginti Balarasalu Panuganti Sakshi Vyasalu – తెనుగింటి బాల రసాలు పానుగంటి సాక్షి వ్యాసాలు
₹110.0012 అధ్యాయాలుగా సాగిన ఈ గ్రంథం – సాక్షివ్యాస విజ్ఞాన సర్వస్వంగా రూపొందింది. ఆయన విషయాలను వింగడించిన తీరు, యుక్తియుక్తంగా వాదాలను మలిచి చూపిన వైనం, లోతైన అవగాహన, సరళమైన వ్యక్తీకరణ ఇవన్నీ ఈ గ్రంథానికి వన్నెతెచ్చాయి. వర్తమాన తరానికి ఒక తాజా భోజనం వడ్డించినట్లుగా ఈ రచన ప్రాసంగిక రమ్యంగా వుంది.
-
Unnava Lakshminarayanagari Malapalli Oka Paramarsha
₹200.00ప్రవేశిక
బహుముఖమైన మానవ జీవిత చిత్రణకు అనువైన ఆధునిక వచన సాహిత్య ప్రక్రియ ‘నవల’. జీవితాన్ని సహజంగా చిత్రించి, వ్యాఖ్యానించటమేగాక, అందలి సమస్యల్ని చర్చించి, పరిష్కార మార్గాల్ని గూడా నవల చూపగలుగుతోంది. వ్యక్తి జీవితంలోనూ, సమాజంలోనూ వస్తున్న పరిణామాల్ని చక్కగా ప్రతిబింబిస్తూ, కొత్త కొత్త శిల్ప ధోరణుల్ని సంతరించుకుంటూ, ‘నవల’ నానాటికీ ఎదుగుతోంది. ఇట్లా ప్రజా జీవితానికి సన్నిహితంగా ఉంటున్నది కాబట్టే ‘నవల’ ఇతర సాహిత్య ప్రక్రియల కంటే అధికంగా ఆదరింపబడుతోంది.
తెలుగు నవలకు నూరేళ్లు దాటాయి. ఈ నూరేళ్ల పైచిలుకు కాలంలో వేల సంఖ్యలో నవలలు వెలువడ్డాయి. వీటిలో “యివీ మా తెలుగు నవలలు” అని తెలుగు జాతి చెప్పుకోదగ్గ స్థాయిలో గల ఉత్తమ నవలలు కొన్ని ఉన్నాయి. దీనిలో “మాలపల్లి, ఒకటి అని నిస్సందేహంగా చెప్పవచ్చు..
తెలుగు నవలా సాహిత్య చరిత్రలో విశిష్ట స్థానాన్ని సాధించుకొన్న ‘మాలపల్లి” పరామర్శకు “మాలపల్లి” రచయిత శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారి జీవిత విశేషాలు, ఆనాటి మాలపల్లి ప్రచురణ, ఆదరణలకు సంబంధించిన విశేషాలు తెలిసి కోవడం అవసరం.
ఉన్నవ జీవిత విశేషాలు :
‘మాలపల్లి’ నవలా రచయిత, సుప్రసిద్ధ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమర యధులు, ఆంద్రోద్యమ సూత్రధారుల్లో ఒకరూ, శారదానికేతన సంస్థాపకులూ అయిన ఆ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారు గుంటూరు జిల్లా వేములూరు పాడులో 1877 డిసెంబరు 4న జన్మించారు. (ఈశ్వర నామ సంవత్సర కార్తీక బహుళ 30, ప్రక్క గ్రామమైన ‘అమినాబాదు’లో ప్రాథమిక విద్య అభ్యసించిన అనంతరం, గుంటూరు ఎ.ఇ.యల్.యమ్. కళాశాలలో యఫ్.ఎ. వరకు చదువుకొన్నారు. ఉపాధ్యాయుడుగా,…………..
-
Untitled
₹185.00ఒక రచయితగా సాటి రచయితలు ఏం రాస్తున్నారో తెలుసుకోవడం చాలా ఆసక్తిగా చూస్తుంటాను. ఒక పబ్లిషర్‌గా కొత్త రచయితలు ఎవరున్నారా అని అన్వేషిస్తూనే ఉంటాను. రచయితగా స్వరూప్ వాక్యం చదివి ఈర్ష్య కలిగింది. తెలుగులో కన్సిస్టెంట్ గా ఇంతమంచి వాక్యం రాసే రచయితను నేనైతే ఇంతవరకూ చూడలేదు. ఒక పబ్లిషర్‌గా స్వరూప్ అనే రచయితను కనుక్కోవడం ఒక యురేకా మొమెంట్. స్వరూప్ ఫేస్ బుక్ లో రాసిన మ్యూజింగ్స్ ని పబ్లిష్ చేయడం ఆన్వీక్షికి ప్రచురణాలయానికి ఒక గర్వకారణం. స్వరూప్ రాతలు చదువుతుంటే అతను ఏమేం పుస్తకాలు చదువుతుంటాడో అని తెలుసుకోవాలనిపిస్తుంది. ఫేస్ బుక్ లో పోస్ట్ రాసే ముందు అతనేం తింటాడో, తాగుతాడో అని క్యూరియస్ గా ఉంటుంది. అసలు అతను జీవితాన్ని, ప్రపంచాన్ని చూసే కళ్ళని కొన్ని రోజులు అద్దెకు తీసుకోవాలనిపిస్తుంది. స్వరూప్ మ్యూజింగ్స్ చదవడమంటే తెలుగు భాషను కొత్తగా డిస్కవర్ చేసినట్టుంటుంది. ఎప్పుడైనా కథలో ఎక్కడో ఒక చోట ఒక మంచి అబ్జర్వేషన్ ని రాసి శభాష్ అని భుజం తట్టుకుంటుంటాం. కానీ స్వరూప్ ప్రతీవాక్యం ఒక వండరలా తోస్తుంది.
వెంకట్ శిద్దారెడ్డి రచయిత, సినీ దర్శకులు
-
Virigina Vigrahaalu – విరిగిన విగ్రహాలు
₹80.00సృజనాత్మక సాహితీ సేచనతో భారతదేశ సాహితీ క్షేత్రాన్ని సంపద్వంతం చేసిన సాహితీవేత్తగా కిషన్‌చందర్ తెలుగు పాఠక లోకానికి సుపరిచితులు. తెలుగులో వెలువడిన ఆయన రచనలు అనేకం పాఠకుల అశేష ఆదరాభిమానాల్ని చూరగొన్నాయి.
కిషన్ చందర్ 1914 నవంబర్ 23న పంజాబ్‌లో జన్మించారు. ఎం.ఏ., ఎల్.ఎల్.బి. పట్టా పుచ్చుకున్నారు. ప్రధానంగా ఆయన నవలా రచయిత. ఆయన నవలలు అనేకం భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, రష్యన్, డేనిష్, పోలిష్, జర్మన్, హంగేరియన్, చైనా భాషలలోకి అనువదించబడ్డాయి.
ఆయన రచనలు సమాజ స్వరూపానికి అద్దం పడతాయి. మహోదాత్త శ్రమకీ, ప్రేమకీ నీరాజనమిస్తాయి. పాఠకుణ్ణి ఆకట్టుకునే శైలి, జీవిత వైవిధ్యం, మానసిక అంతర్మథనానికి మాటలతో రూపమివ్వటం – కిషన్‌చందర్ ప్రతిభా సంపన్నతకు ప్రతీకగా నిలుస్తాయి.
పేజీలు : 100
-
Vyasa Ramaniyam By Sri Ramana
₹120.00సమకాలీన సాహిత్యం, కథలు, వార్తాపత్రికలు, కాలమ్స్ చదివే అలవాటు బొత్తిగా లేని నాకు 2010 వరకూ శ్రీరమణగారు తెలియకపోవటం వింతేమీ కాదు. 2010లో బొంబాయిలో మిత్రుడి ఇంట్లో మూణెల్లు ఉన్నా. మా అమ్మానాన్నల అన్యోన్యత మాటల్లో వచ్చినప్పుడు, మా మిత్రుడి తల్లి అంటూండేది, “కౌటిల్యవాళ్ళ అమ్మానాన్నా మిథునం జంటరా” అని. దానికి నా క్వశ్చన్మార్కు ఫేసు చూసి మావాడు, “శ్రీరమణ అని ఒక కథారచయిత ఉన్నారే, ఆయన రాసిన కథ ‘మిథునం.’ చదువు, బావుంటుంది” అన్నాడు. తెలుగుపీపుల్. కామ్ అప్పట్లో పబ్లిష్ అయ్యి ఉన్న కథని ప్రింటు తీసి ఇచ్చాడు. గంటలో గబగబా చదివా. మళ్ళా నింపాదిగా ఇంకో నాలుగు సార్లు చదివాను. నచ్చింది. అలా రచయిత కళ్ళల్లోంచి చెప్పుకొచ్చే కథనం నాకు బాగా ఇష్టం. పాఠకుణ్ణి తనతోపాటు నడిపించుకెళ్ళగలిగే ప్రతిభ చాలా కొద్దిమందికి ఉంటుంది.
-
కరుణశ్రీ సాహిత్యం 1
₹225.00ఉదయశ్రీ కావ్యస్పందనతో మందాకిని పొంగింది. నందనం నవ్వింది. బృందావనం వెలిసింది. మందారం విరిసింది. మకరందం కురిసింది. ఆమకరందం తెలుగుజాతిని పోతన వేమనల తర్వాత మరింత ప్రభావితం చేసింది. కరుణశ్రీ మాటలతో బొమ్మల్ని గీశారు. అక్షరాలతో మానవతాశిల్పాన్ని చెక్కారు. ఏయిజానికి చెందని హ్యూమనిజం మాత్రం తొణికిసలాడే ప్రజాకవి కరుణశ్రీ.
-
కరుణశ్రీ సాహిత్యం 2
₹225.00ఉదయశ్రీ కావ్యస్పందనతో మందాకిని పొంగింది. నందనం నవ్వింది. బృందావనం వెలిసింది. మందారం విరిసింది. మకరందం కురిసింది. ఆమకరందం తెలుగుజాతిని పోతన వేమనల తర్వాత మరింత ప్రభావితం చేసింది. కరుణశ్రీ మాటలతో బొమ్మల్ని గీశారు. అక్షరాలతో మానవతాశిల్పాన్ని చెక్కారు. ఏయిజానికి చెందని హ్యూమనిజం మాత్రం తొణికిసలాడే ప్రజాకవి కరుణశ్రీ.
-
కరుణశ్రీ సాహిత్యం 5
₹200.00ఉదయశ్రీ కావ్యస్పందనతో మందాకిని పొంగింది. నందనం నవ్వింది. బృందావనం వెలిసింది. మందారం విరిసింది. మకరందం కురిసింది. ఆమకరందం తెలుగుజాతిని పోతన వేమనల తర్వాత మరింత ప్రభావితం చేసింది. కరుణశ్రీ మాటలతో బొమ్మల్ని గీశారు. అక్షరాలతో మానవతాశిల్పాన్ని చెక్కారు. ఏయిజానికి చెందని హ్యూమనిజం మాత్రం తొణికిసలాడే ప్రజాకవి కరుణశ్రీ.
-
Shakespeare Naataka Kathalu – షేక్స్‌పియర్ నాటక కథలు
₹80.00నాటకాన్నినవరసాలలో ఆవిష్కరించడంలో తన రచనా కౌశలంతో ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యానందాలలో ఓలలాడించిన విశ్వ విఖ్యాత నాటక రచయిత విలియమ్ షేక్స్ పియర్. ఈ అపురూప నాటక కథలులో షేక్స్ పియర్ రచించిన వెన్నిస్ వర్తకుడు, కింగ్ లియర్, కవలల కలకలం, నడిరేయి మిడిమేలం, జూలియస్ సీజర్, మెక్బెత్ ఆరు నాటకాలను కథారూపంలో మీకు అందిస్తున్నాం. ఈ ఆరు సుప్రసిద్ధమయినవే. ఆనంద ఆశ్చర్య వినోదాలతో పాటు లోకంలోని వివిధ రకాలైన వ్యక్తులు, వారి గుణస్వభావాలు – ఆశ, లోభం, క్రోధం, మొహం, అహంకారం మనుషుల్ని ఎలా బలితీసుకుంటాయో ఈ కథల్లో ఆయా పాత్రలద్వారా మనకు తేటతెల్లమవుతుంది. మనుషుల్లో ప్రాథమికంగా ఉండాల్సిన దయ, కరుణ, ప్రేమలకు ఈ కథలు ప్రభోదిస్తాయి.
– ప్రచురణకర్తలు
-
Divyaa – దివ్యా
₹200.00”ఇది చరిత్ర కాదు, చారిత్రక కల్పన మాత్రమే. వ్యష్టి, సమిష్టి ప్రవృత్తుల పురోగమనం చారిత్రక భూమికపై చిత్రించబడిన చిత్రం. చారిత్రక వాతావరణాన్ని ఆధారంగా చేసుకొని కళానురాగంతో రూపొందించిన కాల్పనిక చిత్రం. అందులోనే యథార్ధాన్ని ప్రతిబింబింప జేయడానికి చేసిన ప్రయత్నం.
మానవుని కంటే గొప్పది – అతని ఆత్మవిశ్వాసమే: అతడు నిర్మించుకున్న విధానమే. తన విశ్వాసానికీ, విధానానికీ పరతంత్రుడవుతాడు మానవుడు. అతడే స్వయంగా వాటిని మార్చివేస్తాడు కూడా. ఇదే సత్యాన్ని కళానురాగంతో, కాల్పనిక చిత్రంలో, చారిత్రక వాతావరణంలో చిత్రించడానికి చేసిన ప్రయత్నం దివ్యా.
పేజీలు : 247
-
Jeevanayanam – జీవనయానం
₹250.00నది జీవితం వంటిది. నది బిందువుగా మొదలవుతంది. జీవితం కూడా బిందువులా మొదలవుతుంది. నదిలో ఉపనదులు కలుస్తాయి. అది విశాలం అవుతుంది. జీవితంలో అనుభవాలు కలుస్తాయి. ఇది విశాలం అవుతుంది. నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది. అయినా కదలిక కనిపించదు. జీవితం ప్రశాంతంగా ఉన్నంత కాలం ప్రవహిస్తుంది. అయినా కదలిక కనిపించదు. కొండలు కోనలు ఎదురవుతాయి. నది జలపాతం అవుతుంది. హోరును సృష్టిస్తుంది. జీవితంలో ఆపదలు ఎదురవుతాయి. అప్పుడే జీవితనాదం వినిపిస్తుంది. జీవితం వికసిస్తుంది. ఇంద్రధనుస్సులు సృష్టిస్తుంది. చిక్కుల్లోనే మనిషి ఎదుగుతాడు! ఆపదల్లోనే ఉన్నతుడు అవుతాడు. మనిషి అయినా జాతి అయినా అంతే. ఇది చరిత్ర చెప్పిన సత్యం!
-
Deepika – దీపిక
₹200.00పెనుగొండ లక్ష్మీనారాయణ అభ్యుదయ రచయితల సంఘంలో ప్రదాన బాధ్యతలో ఉన్నారు. ఆధునిక తెలుగు సాహిత్య పరిణామాలతో సన్నిహితంగా ప్రయాణించినవారు. అభ్యుదయ సాహిత్యోద్యమంలో ఉద్ధండులతో కలిసి స్వయంగా పాల్గొన్నవారు. ప్రజా సాహిత్యం పట్ల, ప్రజా సాహిత్య చరిత్ర పట్ల వాస్తవిక దృష్టి కలిగినవారు. ‘దీపిక’ పేరుతో వెలువరించిన ఈ పుస్తకం వారి సాహితీ అనుభవానికి అద్దం పట్టింది. ఈ పుస్తకంలో పెనుగొండ తెలుగు సాహిత్యంలోని అనేక అంశాలకు సంబంధించి సాధికార సమాచారం ఇచ్చారు. అభ్యుదయ సాహిత్యోద్యమం రథసారధులు రాంభట్ల కృష్ణమూర్తి, సెట్టి ఈశ్వరరావు, ఆవంత్స సోమసుందర్, రెంటాల గోపాలకృష్ణ వంటి వారి సాహిత్య కృషిని ఎంతో స్ఫూర్తిమంతంగా పరిచయం చేసారు. సాహిత్య చరిత్రకు సంబంధించి దారితప్పించే ‘తొలి మలితరం తెలుగు కథలు’ సంకలనం గురించి వివరంగా చర్చించి తప్పులకు రుజువులు చూపిస్తూ సరిచేసిన వ్యాసం చాలా విలువైన సమాచారం ఇస్తుంది. పి.వి.నరసింహారావు రసిన ‘గొల్లరామవ్వ’ కథను చారిత్రకాంశాల నేపథ్యంలో విశ్లేషించారు…..