-
KarunaKumara Kathalu
₹150.00గ్రామజీవనమే కథా వస్తువుగా తీసుకుని మోతుబరీ భూస్వాముల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి పూటకు గతిలేని కష్టజీవుల దయనీయ జీవిత గాధలను కండ్లకు కట్టినట్లు చిత్రీకరిస్తూ బలవంతులు బలహీనులపై చూపే పాశవిక ప్రవృత్తినీ, కర్కశ కఠిన మనస్తత్వాలను తూర్పారపట్టి, ఎంతో రసభరితంగా బహిర్గతం చేసిన పరమ కరుణారస హృదయులు శ్రీ కరుణ కుమార. అయన గతించగా ఇక ఆంధ్ర కథా సాహిత్యానికి మిగిలినవి ఆయన కథలే. అప్పుడీ కథలు ఉదయిని, భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, కిన్నెర, స్వతంత్ర మొదలైన పత్రికలలో ప్రచురితమైనాయి. అప్రకటితములుగా కూడా మిగిలిపోయాయి కొన్ని.
ఆంధ్రదేశంలో అడుగునపడియున్న ఉత్తమ సాహిత్యాన్ని అచ్చోత్తించి పాఠక లోకానికి అందించడం వారి ఉన్నతాశయం. ముందు కూడా తెలుగు సాహిత్య లోకాన్ని మరింత సుసంపన్నం చేయగలరని విశ్వసిస్తున్నాను.
– ఇవటూరి కామేశ్వరరావు
-
Kasyapa Yodhudu – కశ్యప యోధుడు
₹200.00మాతృభూమి రక్షణకై యోధుడుగా మారిన ఒక బ్రాహ్మణ యువకుని కథ. మహారాజు క్షమాపణలు చెప్పటాన్ని అక్కడి ప్రజలు ఊహించలేదు. వారందరూ అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటూ మౌనంగా ఉన్నారు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సముద్రఘోషగా ఖాసి సైన్యం సూర్యదేవాలయాన్ని చేరుకుంది. నిరాయుధులైన అందరినీ వధించిన తరువాత నిశ్ఛేష్టులై విగ్రహాల్లా నిల్చొని ఉన్న రాజును, రాజగురువును ఖాసిం స్వయంగా తన ఖడ్గంతో వధించాడు. అద్భుతమైన సౌందర్యం, ఆధ్యాత్మికత వెల్లివిరిసిన దేవాలయ ప్రాంగణం రక్తసిక్తమై ఒక్కసారిగా భయానకంగా తయారైంది. సూర్యుడు కూడా ఈ ఘోరాన్ని చూడలేనట్టు మబ్బుల వెనకాల దాక్కున్నాడు. కొద్దిసేపటికే వర్షం ముంచెత్తి ఆకాశం తన బాధను తీర్చుకుంది. ఎంతో పవిత్రమైనదిగా చెప్పుకునే మాతృభూమి ముస్లింల వశమైంది.
కశ్యపాపుర మహాసామ్రాజ్యానికి రాజు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్తితి ఎందుకొచ్చింది? యోధానుయోధులను కన్న భరతభూమి పోరాటపటిమ లేకుండా ఖాసిం సైన్యానికి ఎందుకు దాసోహమైంది? కట్టుబాట్లు, సాంప్రదాయాలు అంటూ వేదమంత్రాలు వల్లెవేసుకునే సౌమ్యుడైన బ్రాహ్మణ యువకుడు యుద్ధమే ఊపిరిగా బ్రతికే ఖాసింని ఎదుర్కొనే యోధుడుగా ఎలా మారాడు..? ”మాతృభూమిని రక్షించటం అంటే పరాయి దాస్య శృంఖలాల నుండి విముక్తి చేయటమేనా? తరతరాలుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న అతి ముఖ్యమైన సమస్యకు పరిష్కారం కనుగొనగలిగాడా?”… తెలుసుకోవాలంటే ఈ నవల చదవక తప్పదు.
-
Kishan Chandar Rachanalu – 1 Gadidala Kathalu – కిషన్ చందర్ రచనలు – 1 గాడిదల కథలు
₹100.00సాహిత్యంలో వ్యంగ్యానికున్న శక్తి అందరికీ తెలిసిందే! వ్యంగ్యం అనండి; అవహేళన అనండి; అందులో కిషన్ చందర్ పెట్టింది పేరు. శరీరానికి దెబ్బ తగలకుండా మనస్సుకు మెత్తగా చురుకపెట్టే శక్తి కిషన్ చందర్ రచనకుంది. గాడిదను ఆసరగా తీసుకొని ఢిల్లీ రాజనీతినీ, బొంబాయి వ్యాపారనీతినీ ఎండ గట్టాడు కిషన్ చందర్ ”ఒకానొక గాడిద ఆత్మకథ”లోనూ ‘తిరిగి వచ్చిన గాడిద”లోను. అదే గాడిద మరో దేశానికి ప్రయాణం చేసి తన అనుభవాలను పాఠకుల కందించేలా రాశాడు ”నేఫాలో గాడిద”లో.
పేజీలు : 216
-
Krishna Sastry Sahityam Modati Samputam (Krishna Paksham) – కృష్ణశాస్త్రి సాహిత్యం – 1 – కృష్ణపక్షము
₹50.00ఒకసారి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు బెజవాడ నుండి బళ్లారి వెళ్తుండగా రైలు నడకలోని సమాన లయకు స్పందించి…. చుట్టూ వున్న నల్లమల అడవుల సోయగానికి పరవశించి ఆకులో ఆకునై పూవులో పూవునై అంటూ పలవరించారట. భావకవిత్వానికి అది మొదటి శృతి. అక్కడి నుంచీ కృష్ణపక్షం కవితలు ఆవిర్భవించడం మొదలయింది.
ఊహా ప్రేయసి, ఆత్మాశ్రయత్వం, వేదన, ప్రకృతి, విరహం, పదాల పోహళింపు, లయ…. వీటన్నిటి కలగలుపే ”కృష్ణపక్షము’. ఇదంతా 1921లో ప్రారంభమయి 1925లో పూర్తయింది. 1922లో కృష్ణశాస్త్రి భార్యా వియాగంతో కన్నీరు ఖండకావ్యం వచ్చింది. ఆ తర్వాత 1926లో ప్రవాసము, 1928లో ఊర్వశి వెలువడ్డాయి. కృష్ణపక్షము తెలుగు కవితా ప్రపంచంలో ఓ పెను సంచలనాన్ని రేపింది. భావకవిత్వం గొంతు సవరించు కుంది కృష్ణపక్షంతోటే. కృష్ణపక్షాన్ని వెక్కిరిస్తూ శుక్లపక్షం వంటి కొక్కిరింత రచనలు వచ్చినా అవి నిలువలేదు. కృష్ణపక్షం మాత్రం నేటికీ వెన్నెలలు కురిపిస్తూనే వుంది. అలా మిన్నెల్ల విహరించి మెరుపై మెరిసిన కృష్ణపక్షముతో పాటు ఈ సంకలనంలో ప్రవాసము, ఊర్వశి కూడా ఉన్నాయి.
నాకుగాదులు లేవు. నాకుషస్సులు లేవు అంటూ నిర్వేదం ప్రకటించి. ఏననంత శోకభీకర తిమిర లోకైకపతిని! అంటూ ప్రకటించుకుంటారు ఇందులో కృష్ణశాస్త్రిగారు. అంతేనా…. తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ జతగూడి దోబూచి సరసాలనాడి దిగిరాను దిగిరాను దివి నుండి భువికి అంటూ భీష్మించుకు కూచుంటారు. -
Kunalamma Padalu – కూనలమ్మ పదాలు
₹30.00కూనలమ్మ పదాలు – ఆరుద్ర
సాహిత్యం అర్ణవమైతే ….. ఆరుద్ర మధించని లోతుల్లేవు. సాహిత్యం అంబరమైతే …. ఆరుద్ర విహరించని ఎత్లుల్లేవు. అతడు పట్టి బంగారం చెయ్యని సాహిత్య శాఖలేదు, ఆ శాఖపై అతడు పూయించని పువ్వుల్లేవు.
కేవలం కవిత్వాన్నే తీసుకున్నా అతడు చేసినన్ని ప్రయోగాలు, అంత అందంగా చేసినవారు ఆధునిక కవుల్లో మరొకరు లేరేమో! కవిత్వం కాక, కథలు, నవలలు, నాటకాలు, పత్రికా వ్యాసాలు, పరిశోధనలు – ఇలాగ అతని రచనా వ్యాసంగం బహుముఖంగా జరిగింది.
అతని ”కూనలమ్మ పదాలు” ప్రతిపద రమణీయం, పదపద చమత్కారకం. సమకాలిక జీవితం మీద చురుకైన విసుర్లతో, కరుకైన కసుర్లతో ఈ పదాలు రసప్రదాలు. -
Manishi Lopali Mahasamudralu
₹80.00నా చిన్న మాట….
పదిహేడేళ్ళ అమ్మాయి తన ప్రాణాన్ని థానే తీసేసుకుంది. కలకలం రేపింది. చిన్నాపెద్దా “అయ్యో” అన్నారు. గాలి కూడా సానుభూతి చూపింది. ఆకాశం కన్నీళ్ళు కార్చింది. “జీవితాన్ని ఎం చూసిందని” అన్నారు. నిజమే! కలలకు చోటులేని ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. “అంత బరువెం మౌసిందని” అన్నారు మరికొందరు. పరీక్షలో ఫెయిలవడం కూడా ఒక కారణమేనా అన్నారు. ఏమో! ఎం తెలుసు. ఆ పరీక్ష చుట్టూ ఎన్ని కలల సాలిగూళ్లు అల్లుకున్నాయో. సమాజం తనకై నిర్మించిన ఎన్ని సౌధాలను ఆ వైఫల్యం కూల్చివేసిందో. మొత్తనికి ఆ ఘటన నన్ను కుదిపేసింది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
-కిల్లాడ సత్యనారాయణ.
-
Manishi Roopalu – మనిషి రూపాలు
₹280.00కొండప్రాంతాలలో నివసించే ఒక వితంతు యువతి కథ ఇది. ఇందులో మనిషి యొక్క అనేక రూపాలను ఎంతో నైపుణ్యంతో చిత్రించాడు రచయిత. మన సంఘంలో ప్రబలివున్న వైరుధ్యాలనూ, తారతమ్యాలనూ వేలెత్తి చూపించాడు. మనిషి పరిస్థితులకు కేవలం బానిస అనీ, పరిస్థితులే అతని జీవితాన్ని నడిపిస్తాయనీ నమ్ముతాడు రచయిత.
యశ్‌పాల్ విప్లవవాది. అతను తన జీవితంలో అనేక పోరాటాలను ఎదుర్కొన్నాడు. అతని రచనల్లో సాంఘిక, రాజకీయ భావాలు స్పష్టంగా కనిపిస్తాయి. నిరుపేదలపై జరుగుతున్న దౌర్జన్యాన్ని ఎదుర్కొనేందుకు, సాంఘిక చైతన్యం కలగజేసేందుకు అతను తన కలాన్ని శక్తివంతంగా ఉపయోగించారు.
పేజీలు : 314
-
Mrutyunjayulu – మృత్యుంజయులు
₹80.00జనంలోంచే వస్తారు ‘మృత్యుంజయులు’
ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా, ఏ వ్యవస్థలోనైనా పాలకవర్గం పాలితవర్గం నడుమ పోరాటమంటూ ప్రారంభమయితే నాటి పరిస్థితుల అనుకూల్యతను అనుసరించి అంతిమ విజయం ఉంటుంది. ఇది చారిత్రక సత్యం. అలాటి సత్యావిష్కరణకు సృజన రూపం ‘మృత్యుంజయులు’ నవల.
1946లో తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైంది. ఆ పోరాటం వస్తువుగా 1947లో ‘మృత్యుంజయులు’ నవల అచ్చయింది. ఆ పోరాటానికి తొలి అక్షరరూపం ఈ నవల. రచనా కాలానికి రచయిత బొల్లిముంత శివరామకృష్ణ వయసు 27 ఏళ్ళు. యువకుడుగా తన కాలంలో తన సమీప ప్రాంతం తెలంగాణలో ప్రారంభమైన ప్రజాపోరాట నేపథ్యాన్ని అవగాహన చేసుకొని, దాని ఆంతర్యాన్ని అర్థం చేసుకొంటూ, ఆ పోరాటం జరుగుతున్న తీరుతెన్నుల్ని గమనిస్తూ, ప్రజలపక్షమే అంతిమ విజయమని వైతాళిక గీతికగా ఆవిష్కరించిన కథా కథనం ‘మృత్యుంజయులు’ నవల.
-
Noone Sukka Inkinni Kathalu – నూనె సుక్క ఇంకిన్ని కథలు
₹120.00సమూహంలోంచి వెలివేయబడితే అది ఒంటరితనం. ఆ సమూహాన్నే వెలివేస్తే అది ఏకాంతం. ఒంటరితనం భయపెడుతుంది, ఏకాంతం పునరుజ్జీవింపచేస్తుంది. – ఒంటరి ఏకాంతం
జిందగీ అంటేనే ఊర్లు, పట్నాలల్ల బత్కేటివన్ని పానమున్న పీనిగెలు. పానంతోటి బత్కాలంటే ఊర్లల్లనే బత్కాలె. – రెండో ఉత్తరం
మాత కైకేయి కోరిక అయోధ్యావాసుల పాలిట దు:ఖహేతువైనది, అదే మా పాలిట వరమైనది. – కాకి రామం
మనం అడిగినవన్నీ ఇచ్చేవాడే దేవుడు అయితే, మరి మనకు కావలసినవన్నీ మనం అడగకుండానే, మనల్ని అడగకుండానే ఇచ్చే ఈ ప్రకృతిని ఏమనాలి? దేవుడే ప్రకృతి-ప్రకృతే దేవుడు. – 3456 జిబి
”ఆడపుట్క’ పుట్టుంటే సల్లగ బతుకుతుంటివి కొడకా,” అన్నది అమ్మ – బలిపసువు
పేజీలు : 143
-
Nuvvellipoyaka
₹250.00“బ్రేకప్ ఒక కెథార్సిస్. ఇది నిలిచే బంధం కాదేమో అన్న ఆలోచనతో మొదలై, మేము విడిపోయాము అన్న ప్రకటన దాకా పూర్తి స్పృహతోతీసుకోవాల్సిన నిర్ణయాలు వుంటాయి. వాటికి నిందలు, కొట్లాటలు, బాధలు, ఏడుపులు,
జ్ఞాపకాలు ఇవన్నీ అడ్డం పడతాయి. ఒకరు తోడుగా వుంటారన్న నమ్మకం నుంచి నాకు నేనే తోడు అన్న ధైర్యం దాకా సాగే ప్రయాణం ఇది.ఇదంతా ఒక మనిషిని ప్రక్షాళన చేస్తుంది.ఫీనిక్స్ పక్షిలా మళ్లీ బతికిస్తుంది.” |
this is how it ends
ఝాన్సీ పాపుదేశి • నాగేంద్ర కాశి .వి. మల్లికార్జున్ • ఉషాజ్యోతి బంధం – కడలి సత్యనారము మూడి • వెంకట్ ఇద్దారెడ్డి • మానస ఎండ్లూరి – రిషి శ్రీనివాస • అరుణ పప్పు • మహి బెజవ
-
Olga Nunchi Gangaku
₹300.00మనిషి నేడు ఉన్న స్థితిలో ప్రారంభం నుంచీ లేడు. ఈ స్థితికి రావడానికి ఎన్నో గట్టి పోరాటాలు చెయ్యవలసి వచ్చింది. “మానవ సమాజం” అన్న పుస్తకంలో నేను మానవ సమాజ వికాసాన్ని గురించి సిద్ధాంతపరమైన వివేచన చేశాను. దాన్నే సరళంగా చెప్పొచ్చు. ఆ సరళ చిత్రణ వల్ల మానవ సమాజం ఎలా వికాసం చెందిందో అర్థం చేసుకోవడం తేలిక అవుతుందన్న అభిప్రాయం కలిగింది. దాంతో “వోల్గా నుంచి గంగకు” రాశాను. ఇందులో నేను మనదేశపు పాఠకుల సౌలభ్యం కోసం ఇండోయూరోపియన్ జాతిని తీసుకున్నాను.
వికాస దృష్ట్యా ఈజిప్టు, సురియానీ లేదా సింధు జాతులు ఇండోయూరోపియను జాతి కన్నా వేల సంవత్సరాలు ముందు ఉన్నాయి. కాని వాటిని తీసుకున్నట్లయితే రచయితకీ, పాఠకులకి కూడా ఇబ్బందులు ఎక్కువవుతాయి. ప్రతి కాలంలోని సమాజాన్నీ నేను ప్రామాణికంగా చిత్రించడానికి ప్రయత్నించాను. కాని మొదటి ప్రయత్నంలో తప్పులు దొర్లడం సహజం. ఇంకా ప్రామాణికంగా శుద్ధంగా చిత్రించడానికి ముందు ముందు రాబోయే రచయితలకి నా ప్రయత్నం దోహదపడతాయి అనుకుంటాను.
– రాహుల్ సాంకృత్యాయన్
-
Padi Rupaayala Notu – పది రూపాయల నోటు
₹100.00పది రూపాయల నోటు అనేది డబ్బుకు గుర్తు.
దాని చుట్టూ సమాజంలో ఎన్నో విభిన్నమైన పాత్రలను
రచయిత అద్బుతంగా ప్రవేశపెట్టాడు. పెట్టుబడిదారీ
అనంతర సమాజంలో అవసరమైన ఉన్నత మానవ
విలువలకు పెట్టుబడిదారీ సమాజంలోనే
పునాదులేర్పడతాయని ఈ నవలలోని కొన్ని పాత్రల
ద్వారా రచయిత మనకు చూపిస్తాడు.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలపై
ఆధారపడి వుంటాయన్న సత్యాన్ని తెలియజేశాడు.
కిషన్ చందర్ రచనలు సమాజ స్వరూపానికి అద్దం
పడతాయి. మ¬దాత్త శ్రమకి, ప్రేమకీ నీరాజన
మిస్తాయి. పాఠకుణ్ణి ఆకట్టుకునే శైలీ, జీవిత వైవిధ్యం,
మానసిక అంతర్మథనానికీ మాటలతో రూపమివ్వటం
ఆయన ప్రతిభా సంపన్నతకు ప్రతీకగా నిలుస్తాయి.
పేజీలు : 136