-
Jamilya
0₹50.00జమీల్య
జమీల్య ఓ అపురూపమైన ప్రేమకధ. తరచూ దీన్ని ‘ ప్రపంచంలోనే బహు సుందరమైన ప్రేమకధగా’ అభివర్ణించినా….. అంతకు మించిన బలీయమైన సామజిక సందర్భం , సంస్కృతుల సంఘర్షణ,సమకాలీనజీవన సంక్లిష్టతలను ప్రతిఫలించడం దీని గాడతను మరింత పెంచింది. అందుకే ఇప్పటికీ ఐత్ మాతోవ్ రచనలన్నింటి లోకి ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన నవలగా, నిలబడుతోంది.దీన్ని ఆయన ౧౯౫౮ లో కిర్గిజ్, రష్యన్ భాషలు రెంటిలోనూ రాసారు. ౫౯ లో లూయీ ఆరగాన్ చేసిన ఫ్రెంచ్ అనువాదంలో జమీల్యా యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షించింది. తర్వాత ఎన్నో భాషల్లోకి అనువాదమైంది. తొలినాళ్ళలో ఈ నవల కిర్గ్ స్తాన్ లో ఎన్నో ప్రకంపనలు సృష్టించింది. ఈ సాంప్రదాయ సమాజానికి ప్రతినిధి జమీల్యా భర్త. స్త్రీ గా ఆమె పట్ల ప్రేమ చూపడం కంటే కూడా … ఆమెను తన అస్తిలా, సొత్తులా భావిస్తాడాయన. అందుకే ధనియార్ దగ్గర తనకు కావల్సినా ప్రేమ దొరికినప్పుడు ఆమె వెనుదిరిగి చూడదు. దనియార్ నుంచి ఆమెకు ప్రత్యేకమైన భరోసా ఏది అవసరం ఉండదు. అంతిమంగా వారిద్దరి పయనం… సాంప్రదాయిక బంధనాల నుంచి స్వేచ్చనే కాదు. సరికొత్త సోవియట్ జాతి, సోవియట్ జీవిత నిర్మాణానికి ప్రతీకగా నిలుస్తుంది. పెను మార్పు కోసం ఆలపిస్తున్న సాముహ గీతంతో శ్రుతి కలుపుతుంది.
చింగీజ్ ఐత్ మాతోవ్ రాజకీయ,సామజిక,విప్లవోద్యమ సందర్భాల్లో జీవితాలను అద్బుతంగా ఒడిసిపట్టిన రచయిత.రష్యా సంరజంలో ఒక అనామక ప్రాంతమైన కిర్గజ్ స్తాన్ సోవియట్ యూనియన్ లో కీలక దేశం గా అవిర్బవించిన పరిణామా క్రమానికి అయన ప్రత్యక్ష సాక్షి. అందుకే అయన రచనలు మధ్య ఆసియా జీవితాల్లో వచ్చిన మార్పులను సజీవంగా ఆవిష్కరిస్తాయి. రష్యన్,కిర్గిజ్ భాషలు రెంటిలోనూ రాసిన ఐత్ మాతోవ్ పలు దేశాల్లో కిర్గిజ్ స్తాన్ రాయబారి గా పనిచేసారు.
-
Janapadam – జనపదం
0₹300.00దాశరథి రంగాచార్య రచించిన మూడవ నవల ‘జనపదం’. (మొదటిది ‘చిల్లర దేవుళ్లు’, రెండవది ‘మోదుగు పూలు’.) ఈ మూడు నవలలు తెలంగాణ ప్రజాజీవిత వాస్తవములకు అద్దం పట్టినవి.
నిజాం ఆసఫ్రాహి పాలకులు, వారి ఏజంట్లయిన జాగీర్దారులు, నిరంకుశులైన వారి చిల్లర ఉద్యోగులు – వారి పాలనలో తెలంగాణా ప్రజలు అనుభవించిన బాధల గాధల బృహత్ రూపదర్శనమే వారి నవలలకు ఇతివృత్తములు.
దాశరథి మూడో నవల ‘జనపదం’ తెలంగాణా విముక్తికి తరువాత పాత సారాయాన్ని కొత్త సీసాల్లో అందిస్తున్న మన దేశవాళీ రాజకీయాల ప్రభావాన్ని వివరిస్తున్న గాధ.
గత శతాబ్దాంతమున మహాకవి గురజాడ తన ”కన్యాశుల్కం”లో సమగ్రాంధ్ర ప్రజాజీవితాన్ని దర్శింప జేసినట్లుగానే దాశరథి ఆచార్యులవారు తమ రచనల్లో సమగ్ర తెలంగాణమును దర్శింపచేశారు.
-
Khadga Srushti – ఖడ్గ సృష్టి
0₹180.00నీ తొడపై శిరస్సుంచి నే నిలా పడుకున్నప్పుడు, కామ్రేడ్
ఇదివరకు నీతో, గాలితో అన్నదే ఇప్పుడూ అంటున్నాను మళ్ళీ
ఔను నే నెరుగుదును నాకు శాంతి లేదని, ఇతరులని కూడా అశాంతిలో ముంచుతానని,
ఔను నేనెరుగుదును ఆయుధాలు నా మాటలని, ఆగ్రహపూరితాలని, మృత్యువుతో నిండినవని,
నిజానికి నేను కత్తి దూసిన సిపాయిని, కదనరంగంలోని సేనానికి మించిన కసాయిని,
ఎంచేతనంటే, అన్నింటినీ ఎదిరిస్తాను, శాంతిని, క్షేమాన్ని చట్టాలను, కట్టుదిట్టాలను, వాటిని ధిక్కరించడమే నా పని,
అందరూ నాకెంత దూరమైతే అంత బిర్ర బిగుస్తాను,
అందరూ నాతో ఏకీభవిస్తే ఇంత పట్టుదల నాకుండేది కాదేమో!
దేన్నీ లక్ష్యపెట్టను, ఎన్నడూ లక్ష్యపెట్టలేదు. అనుభవాన్ని, ఆచారాన్ని అధిక సంఖ్యాకుల్ని అవమానాలని,
నరకమనేది నన్ను భయపెట్టదు, స్వర్గం నన్నాకర్షించదు,
డియర్ కామ్రేడ్! విను! నాతో రా మునుముందుకి, ఈ
ప్రోత్సాహం ఎందుకో, ఎక్కడికో నాకూ తెలియదు. అయినా రమ్మనడం మానలేను,
జయాపజయాలతో నిమిత్తం లేదు. ఎడతెగనిది మన యాత్ర.
వాల్ట్ వైట్‌మాన్ ఆంగ్ల కవితకు శ్రీశ్రీ ‘కామ్రేడ్’ శీర్షికన చేసిన అనువాదమిది. ఇంకా ఇందులో శ్రీశ్రీ రచించిన కవితలు – మరికొన్ని అనువాద కవితలు (120) – వాటికి సంబంధించిన ఫుట్ నోట్స్ ఉన్నాయి.
-
Loya Marikonni Kathalu – లోయ మరికొన్ని కథలు
0₹140.00తెల్లని పలుచటి తడిబట్టను ముఖంమీద కప్పుకుని లోకాన్ని చూసినట్టుగా ఉంటుంది అజయ్ ప్రసాద్ కథలు చదివితే. అంతా కనబడుతూ ఉంటుంది; ఇంకా కనబడనిది ఏదో వుందని కూడా తెలుస్తూవుంటుంది. స్పష్టాస్పష్టం. అజయ్ మానసిక ప్రపంచంలోని మనుషులు ఒక దారప్పోగు లాంటి బలహీన బంధాన్ని మాత్రం ఉంచుకుని సంచరించే జీవులు. అయినా వీరందరిలోనూ ఏదో తెలియని దు:ఖం. అది పొగిలి ఏడ్చేదీ కాదు; బయటకి వ్యక్తం చేయగలిగేదీ కాదు. మొత్తంగా శరీరమంతా జీవితమంత లోతుగా వ్యాపించివున్న దిగులు. ఎక్కడో దూరంగా ఏ బైరాగో తన మొత్తం అనుభవసారాన్నంతా గొంతెత్తి తనలో తానే ఏ తత్వంగానో పాడుతూవుంటే మనకు తెలియకుండానే దానిలో లీనమై అంగీకారంగా తలవూగుతూ వుండగా కనీకనబడని చెమ్మతో కళ్ళు మసకబారే పఠనానుభవం. – పూడూరి రాజిరెడ్డి
ఈ కథల్లో తీరని దిగులుతో కల్పన సాకుగా అజయ్ తన జ్ఞాపకాల్ని నిమురుకున్న ప్రతి సందర్భమూ నాకు నచ్చింది. కల్పనలు జ్ఞాపకాలుగా మారుతున్న సందర్బాలు కూడా. – మెహెర్
పేజీలు : 166
-
Telugu Bhashaa Charitra – తెలుగు భాషా చరిత్ర
0₹600.00తెలుగుభాషకు సంబంధించిన ముఖ్యమైన అనేక అంశాలు ఇందులో చోటుచేసుకున్నాయి. గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ”తెలుగు భాషా చారిత్ర’ ను విద్యార్ధులకు బోధించిన అనుభవంతో ఈ గ్రంథం పాఠకుల ముందుకు తెచ్చారు రచయిత ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న.
”తెలుగు భాషా చరిత్ర” ఏడో ముద్రణ ఇది. ఇందులో మరికొన్ని కొత్త అంశాలు చోటు చేసుకున్నాయి. విద్యార్ధులకు, పరిశోధకులకు, ఉపాధ్యాయులకు, భాషాభిమానులకు ఈ గ్రంథం ఎంతగానో వుపయోగపడుతుంది.
విద్యార్ధుల విజయాన్ని కోరుకుంటూ ….- సిమ్మన్న