• Konni Kalaalu Konni Samayalu - కొన్ని కలాలు కొన్ని సమయాలు

    Konni Kalaalu Konni Samayalu – కొన్ని కలాలు కొన్ని సమయాలు

    సమాజంలో ఎక్కడ ఏ కొద్దిపాటి అవకతవకలు జరిగినా ముందు కవులూ, రచయితలు స్పందిస్తారు. తమ స్వరాన్ని వినిపిస్తారు. వారి వల్ల, వారి అక్షరాల వల్ల విప్లవాలు, సంస్కరణలు, మేళ్ళు నేరుగా జరగకపోవచ్చు కాని, జనాన్ని చైతన్యవంతుల్ని చేయడంలో వారు ముందుంటారు. వారి అక్షరాలు ముందుంటాయి. సృజనకారులకు అడ్డుగోడలు పనికిరావు. వారు విశ్వమానవులు! మానవీయ విలువల్ని కాపాడుతూ వచ్చిన కొంతమంది సాహితీ మహనీయుల జీవితాల్ని, వారి సృజనాత్మక కృషిని ఈ పుస్తకంలో గుర్తు చేసుకోవడం జరిగింది. ఇందులో ఎకడమిక్‌ విభజనలేవీ లేవు. ఇందులో చేర్చని మహాకవులు, రచయితలు ఇంకా ఎంతోమంది ఉన్నారు. వారి గూర్చి నేను రాయకపోవడం వల్ల చేర్చలేకపోయాను. భవిష్యత్తులో రాయగలిగితే, మరో పుస్తకంతో పాఠకుల ముందుకొస్తాను. ఇందులో తెలుగు రచయితలు, భారతీయ రచయితలు, విదేశీ రచయితలు అని మూడు విభాగాలుగా విభజించాను. పక్కపక్కనే ఉండడం వల్ల సాహిత్యకృషి పోల్చి చూసుకోవడానికి, బేరీజు వేసుకోవడానికి, అధ్యయన పరులకు ఉపయోగకరంగా ఉంటుందని అనుకున్నాను. చదవడం తగ్గించిన నేటి తరానికి వ్యక్తిత్వ వికాస దిశగా తపన గురించి, వారు నిలబెట్టాలనుకున్న జీవిత విలువల గూర్చి తెలియజేస్తుంది. – దేవరాజు మహారాజు

    280.00
    Add to cart
  • Okka Vana Chalu

    Okka Vana Chalu

    ఈ నవల రాయటంలో రెండు ఉద్దేశ్యాలున్నాయి. రాయలసీమ రైతు, రైతు కూలీల బతుకులు ఇప్పుడు వలస బతుకులయ్యాయని చెప్పటం ఒకటైతే. రెండవ విషయం ఏమిటంటే – ఎన్ని కష్టాలు వెంటాడుతూ వున్నా ఏడుస్తూ కూచోవటం ఇక్కడి మనుషుల లక్షణం కాదు. ఎంత ఆకలేసినా చేతులు చాచి అడుక్కోవటం ఇక్కడి రైతులకు అలవాటు లేదు. నిరంతరం బతికేందుకే పోరాడుతుంటారు. బండరాతి మీద అయినా సరే పిడికెడు అన్నం పుట్టించేందుకు ప్రయత్నిస్తుంటారు.

              చెతుర్లాడుకోవటంలో ఆకలిని మరుస్తారు. బూతు పదాలు కలిసిన మాటలతో హాస్య సంఘటనలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కష్టాలు మరవటానికి ప్రయత్నిస్తారు. సద్ది సేరవలో పుల్లనీళ్ళ మీద తేలే పచ్చిమిరపకాయ మీద కూడా జోకులేసుకుంటూ దుర్భరమైన ఆ తిండినే కడుపారా తిని పనికి పోగలరు. బీడీకట్టకు లెక్కలేనంత దరిద్రంలో ఉందికూడా ఒకే బీడీని నలుగురు పంచుకు తాగుతూ తమ దరిద్రం మీద తామే జోకులేసుకోగలరు. ఇక్కడి రైతు కరువుకు అలవాటు పడ్డాడు – ఆకలికి లాగే నాయకుల వాగ్దానాలకు అలవాటు పడ్డాడు – వట్టి మేఘాల ఉరుములకు లాగే.

                                                                 – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

    110.00
    Add to cart
  • Penam Meeda Nundi Poyyilo Paddam - పెనం మీద నుండి పొయ్యిలో పడ్డాం

    Penam Meeda Nundi Poyyilo Paddam – పెనం మీద నుండి పొయ్యిలో పడ్డాం

    అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది :

    నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి శాసనసభ సమావేశంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ గతంలో హైదరాబాద్‌ అభివృద్ధి పైనే కేంద్రీకరరించడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తాయని, తాను కూడా కొంతమేరకు పొరపాటు చేశానని, గతంలో వలే కాక 13 జిల్లాలలోను అభివృద్ధిని వికేంద్రీకరించి, నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రజలందరి సుఖసంతోషాలకు సౌభాగ్యానికి కృషిచేస్తానని హామీ యిచ్చారు. శ్రీకాకుళం జిల్లా నుండి అనంతపురం జిల్లా వరకు ఏయే జిల్లాలో ఏయే అభివృద్ధి పనులను తన ప్రభుత్వం చేపట్టనుందో సుదీర్ఘమైన జాబితా కూడా ప్రకటించారు. కానీ ఆ విషయాన్ని ఆయన మరచిపోయి అమరావతి, పోలవరం తన రెండు కళ్ళు అని పదేపదే ప్రకటిస్తూ వచ్చారు. నూతన ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, ఆదాయం, కేంద్రం నుండి వచ్చు నిధులు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టవలసిన పథకాలు, అభివృద్ధి పనులు మరియు కొనసాగుతున్న ఇరిగేషన్‌ పథకాలను సత్వరమే పూర్తిచేయటం మున్నగు వాటిపైన లోతుగా అధ్యయనం చేసి సరైన నిర్ణయాలు తీసుకోకవలసి వుంటుంది.  అందుకు భిన్నంగా ఆయన వ్యవహరించారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని చాలా పెద్దదిగా, చాలా గొప్పదిగా వుంటే పెట్టుబడులు ఆకర్షించబడతాయి అనేది ఆయన భావన. ఒక ప్రాంతంలో లభ్యమయ్యే ముడి వస్తువులు, భౌతిక వనరులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు మున్నగు అంశాలను దృష్టిలో పెట్టుకుని నూతన పరిశ్రమలు ఏర్పాటవుతాయేతప్ప రాజధాని నగరం పెద్దదిగా వుంటే అక్కడికే పరిశ్రమలు వస్తాయనే భావన సరికాదు.

    పేజీలు : 72

    60.00
    Add to cart
  • Pranam Unnantha Varaku - ప్రాణం ఉన్నంత వరకు

    Pranam Unnantha Varaku – ప్రాణం ఉన్నంత వరకు

    ప్రేమ ఒక అందమైన, అద్వితీయమైన, అద్భుతమైన అనుభవం.

    మాతృప్రేమ, పితృప్రేమ, సోదరప్రేమ ఇలా అనేకమైన ప్రేమలు ప్రతి ఒక్కరి జీవితంలో సహజంగా లభించేవే. అవి మానవ జీవితానికి అవసరమైనవని చెప్పేందుకు ఎలాంటి సందేహంలేదు.

    కానీ ఒక పురుషుడు, స్త్రీ మధ్య ఏర్పడే ప్రేమ, యవ్వనం నుంచి మరణం వరకు సాగే ప్రేమ, సృషఙ్టకి నాంది పలికే ప్రేమ, మిగిలిన అన్ని ప్రేమలకు ఆధారమయ్యే ప్రేమ అన్నింటికన్నా ప్రత్యేకమైనదని నా అభిప్రాయం. ముఖ్యంగా కొన్ని సంవత్సరాలు కలిసి చదువుకుని, ఒకరినొకరు అర్థం చేసుకుని, ప్రణయాన్ని వివాహం ద్వారా సార్థకపరచుకుని సాగించే ప్రయాణం అత్యుత్తమైనది.

    ప్రేమ కుల మతాలకు, భాషా ప్రాంతాలకు అతీతమైనది.

    ప్రేమించేందుకు నిజాయితీ కలిగిన ధైర్యం, ధైర్యంగా చెప్పగలిగే సత్యం, సత్యం కోసం చేసే త్యాగం, త్యాగంలో కూడా మరుగుపడని అనురాగం అనేవి నాలుగు స్తంభాలు. బలమైన ఈ నాలుగు స్తంభాలపై నిలబడిన ఒక ప్రేమ కథ ఇది.

    నిజమైన ప్రేమకు నిర్వచనం ఈ నవల. జీవితంలో వాస్తవిక దృక్పథం, ఆత్మాభిమానం, మంచిని పెంచే పట్టుదల, ఎన్ని కష్టాలు ఎదురైనా సడలని వ్యక్తిత్వంతో నిజాయితీగా, ధైర్యంగా ఉంటే అదే కష్టాల మెడలు వంచి మనకు విజయం చేకూరుస్తుందని చెప్పేదే ఈ నవల. అంతే కాదు ఈ రోజుల్లో మన దేశంలోని సాంఘిక సమస్యలపై కూడా కొరడా ఝళిపించి, మార్గదర్శం చేయిస్తుంది. కేవలం కాలక్షేపం కాదు, మీకు ఎన్నో కొత్త విషయాలు, విద్య, వైద్య, పారిశ్రామిక పురోగతి లాంటి వాటిపై ఒక కొత్త కోణంలో ఆలోచింపచేస్తుంది.

    పేజీలు : 192

    160.00
    Add to cart
  • Rekkadinantha Kaalam.. - రెక్కాడినంత కాలం...

    Rekkadinantha Kaalam.. – రెక్కాడినంత కాలం…

    అన్నంగుడ్డ’, ‘సానరాయి’ వంటి కథల్లో కంసాలుల జీవితాన్ని ప్రతిభావంతంగా చిత్రించిన దేవేంద్ర విస్తృతమైన కాలభూమికపైన మరింత విశాలంగా ఆ పనిని యీ నవలలో నిర్వహించాడు…. ఈ నవల రాజకీయాల గురించీ పెద్దగా ప్రసక్తి తీసుకురాకుండానే, ఈ దురన్యాయానికున్న సాంఘిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యాన్నంతా నిలదీసి ప్రశ్నిస్తుంది. – మధురాంతకం నరేంద్ర

    పేజీలు : 255

    200.00
    Add to cart
  • Soonyam

    Soonyam

    పంజరంలో చువ్వమీద కూర్చుని, నింపాదిగా ధాన్యం ముక్కన కరుచుకుంటున్న పక్షితో “ఎగిరిపో! నీకు స్వేచ్ఛనిస్తున్నాను” అన్నాడట ఒక యువకుడు. “ఎగిరిపోవాలనే ఉంది. ఆకాశంలో పట్టుకోవడానికి చువ్వలుంటాయా?” అని అడిగిందట పక్షి. 83లో అదీ పరిస్థితి. ఆకలికన్నా పెద్ద భయం. రోడ్డు మీద చెత్త ఏరుకునే వాళ్లతో సహా, ఉస్మాన్ గంజ్ లో బస్తాలెత్తే కూలీలతో సహా జేబుదొంగలు, ఇతర పెట్టి క్రిమినల్స్ సహా అందరూ నా ప్రతిరూపాలే. – ముక్తవరం పార్థసారథి తనకు విలువలున్నాయంటే అది ధిక్కారంలాగా కనిపిస్తుంది. తనకూ వాళ్ళకూ మధ్య యింత ఎడం ఎందుకు? ఈ నిత్య జీవితపు రొచ్చులో ఎవరూ తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోయినా రాసేటప్పటి తన నిజాయితీనయినా నమ్ముతారా? ఈ వూహలూ, ఈ అనుభవం మరపుతెరల మరుగున మాయం కాకముందే – రొటీన్ జీవితపు అడుగున పడిపోకముందే అక్షరరూపంలో వ్యక్తమయ్యే నిజాయితీయే సాహిత్యం. అటువంటి సాహిత్యం అది శూన్యంకాదు – జీవితం. అర్థవంతమైన జీవితం. – – వరవరరావు

    275.00
    Add to cart
  • Satha Vasanthala Telugu Katha - శత వసంతాల తెలుగు కథ

    Satha Vasanthala Telugu Katha – శత వసంతాల తెలుగు కథ

     తెలుగు కథకు శ్రీకారం చుట్టిన శ్రీ గురజాడ అప్పారావుగారి కలం నుంచీ ఈనాటివరకూ వచ్చిన కొన్ని వేల కథలలో ఉత్తమ కథలను ఎన్నిక చేసి ప్రచురించాలనే సంకల్పం కలిగినా, ఆ కోరిక 1974 వ సంవత్సరానికి గాని తీరలేదు. ఆ నాటి ఆ కథా సంకలనాన్ని పునర్ముద్రించమని అనేకమంది రచయితల, పాఠకుల అభీష్టం మేరకు కొద్ది మార్పులు, చేర్పులతో తిరిగి ఆనాటి ఆణిముత్యాన్ని అందిస్తున్నాం. ఆంధ్రుల సామాజిక, ఆర్థిక, కుటుంబ జీవనంలో గత వంద సంవత్సరాల్లో వచ్చిన మార్పులకు ఈ కథాసంకలనం అద్దం పడుతుంది. 

                లాటిన్ అమెరికన్ కవి పాబ్లో నెరుడా అన్నట్లు – కవితలు, కథలు అభాగ్య సోదరుల కన్నీరు తుడిచే చేతిగుడ్డలు కావాలి. వారి పోరాటాలకు సాధనాలుగా కత్తులు లాంటి కథలు కావాలి. “రుమాళ్ళుగా, సవాళ్లుగా, ఎర్రెర్రటి జెండాలు” గా ఆ కథా సంకలనాన్ని స్వీకరించి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ శాత వసంతాల తెలుగు కథను పాఠకులకు సగర్వంగా అందిస్తుంది.

    450.00
    Add to cart
  • A'nrutham

    A’nrutham

     “నువ్వు ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు శ్రీజ. మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. దానిని మనం నమ్మలేం.”

                  “మనసుని కాదు రాధిక, నన్ను చుట్టుకున్న పరిస్థితులను నమ్ము. పదమూడు ఏళ్ళకే అమ్మానాన్నలు దూరమైతే ఎలా ఉంటుందో తెలుసా? అప్పటివరకు వాళ్ళే నా ప్రపంచం… ఒక్కసారిగా ఆ ప్రపంచం కూలిపోయింది. చిన్నపిల్లని నేను… ఆ వయసులో నాకసలు ఏమీ తెలీదు. ఏదీ తెలీదు! మరో పదిహేను సంవత్సరాల తరువాత, ఇప్పుడు మళ్ళీ నా ప్రపంచం కూలిపోయింది. కానీ ఇప్పుడు నాకు ఏది తెలిసినా… తెలియకపోయినా ఒక్క విషయం మాత్రం బాగా తెలుసు… I can handle this అని.”

                       “చూడగలగాలే కానీ ప్రతి అబద్ధంలోనూ ఓ నిజం ఉంటుంది. ఆ నిజమే అబద్దానికి ఉనికి.” ఈ కథకు శీర్షిక అనృతం’. అనృతం అంటే అబద్దం. ఆ అనృతంలో కూడా ఓ నృతం (నిజం) ఉండకపోలేదు! ఆ “కొన్నిసార్లు మనం వెళ్ళాల్సిన మార్గమే మనకి తెలుస్తుంది. చేరుకోబోయే గమ్యం కాదు.” గమ్యం ఎలా ఉండబోతుందో, అసలు గమ్యమంటూ ఉంటుందో లేదో తెలియకుండానే కథ అనే గమనాన్ని ఎంచుకున్నాను, పయనించాను. ఫలితం ఈ అనృతం’.

                        “ఓదార్చే తోడు లేదనిపిస్తే బాధ కూడా మాయమైపోతుంది.” ఈ వాక్యం నేను చూసిన సంఘటనల్లో నుండి రాశాను. తుడిచే చెయ్యే లేదనిపిస్తే కన్నీళ్ళు మాత్రం ఎందుకొస్తాయి? ప్రతి చర్యా, ప్రతిచర్యను కోరే జరుగుతుందేమో!

    50.00
    Add to cart
  • Achanta Sarada Devi Kathalu - ఆచంట శారదా దేవి కథలు

    Achanta Sarada Devi Kathalu – ఆచంట శారదా దేవి కథలు

    శారదాదేవి తనకు తెలియని జీవితాన్ని అసలు ముట్టుకోరు. తన అనుభవ పరిధిలో వున్నా మనుషుల్ని, సన్నివేశాల్ని, జీవన వాతావరణాన్ని తన కథలకు ఇతి వృత్తాలుగా చేసుకున్నారు. వాటికీ నిసర్గ కోమలమైన తన భావగంధం పూసి గాఢమైన అనుభూతులుగా మలచి, పాఠకుల ముందు పరిచారు. వారి కథలు సహజంగా, స్వచ్చంగా, నిరాడంబరంగా, సరళంగా, అందంగా, మనసులోంచి అలవోకగా పుట్టినట్టు ఉంటాయి. ఎదుటి వారి మనసులను సుతారంగా తాకుతూ ఉంటాయి. ఈ కథలు చదువుతుంటే నిర్మలమైన నదిలో స్నానం చేసినట్లు ఉంటుంది.     -ఎస్వి.భుజంగరాయశర్మ.
    “జీవితం అనే తోటలో ఏరిన వివిధ పుష్పాలు, తెలుగు భారతికి పగడాలమాల ఈ కథానికలు”.
    -రాజమన్నారు.
    “వికాసోన్ముఖమైనఅనుభవ పరిణితి చాలని సీమంతిని హృదయంలోని వేదన ఇది. ‘ఇంతేనేమో’ అనికాని’ఇంతే’ అని ధైర్యంతో చెప్పలేని హృదయ దైన్యం, ధైర్యంగా వేషం వేసుకోవడానికి ముందు జీవిత నేపథ్యంలో చూపే అవ్యవస్థ, తొందర- ఈ వేదన. దాన్ని ఎంతో సహనుభూతితో ఈ ప్రబంద సంగ్రహంలోని ఒక్కొక్క ఖండికలోనూ చల్లగా సన్నని కంఠంతో చిత్రించారు. శ్రీమతి అచంట శారదాదేవి”.
    -రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ.
    “ఏ ఉత్తమ రచనకైనా అనుభవం అతి ముఖ్యం. ఈ అనుభవం వల్లనేనిజాయితి కలుగుతుంది. అతి ప్రధానమైన ఈ నిజాయితీకి అందము, అలంకరణ కోసమూ ఊహా, కల్పనా సాయపడతాయి. నిజమైన అనుభవము ఈ ఊహా, కల్పనలతో ఎంతో ఆకర్షవంతంగా అమరుతుంది అది సాధించినవారు మనకు సన్నిహితులవుతారు. శారదాదేవి ఇట్లాంటి రచయిత్రి.”    -బుచ్చిబాబు.

    280.00
    Add to cart
  • Anubandalu - Antaralu
  • Arthanareeswarudu - అర్ధనారీశ్వరుడు

    Arthanareeswarudu – అర్ధనారీశ్వరుడు

    పశ్చిమ తమిళనాడులో నమక్కాల్‌ జిల్లా తిరుచెంగోడు పట్టణ ప్రాంతంలోని ఒక సామాజిక సంప్రదాయం ఈ నవలకు నేపథ్యం. దాన్ని ఆచార్య పెరుమాళ్‌ మురుగన్‌ తమిళంలో ‘మధోరు బాగన్‌’ అనే నవలగా 2010లో రాశాడు. దాని తెలుగు అనువాదమే ‘అర్ధనారీశ్వరుడు”. 1940 సం|| నేపథ్యంలో వ్యవసాయము, పశుపోషణ జీవనంగా గల ఒక జంట కాళి, పొన్నల కథ ఇది. ఎన్ని ”గుళ్ళూ, గోపురాలు దర్శించినా” సంతానం కలగదు. పిల్లలు కలగనపుడు తిరుచెంగోడు అర్ధనారీశ్వరుడికి జరిగే రథోత్సవం వేడుకల్లో 14వ రోజున సాంఘిక కట్టుబాట్లను వదలి, ఆ రాత్రి ఎవరు ఎవరితోనైనా శృంగారంలో పాల్గొని పిల్లల్ని కనవచ్చుననే సాంప్రదాయం ఆనాడు ఉండేది. దీని నాధారంగా చేసుకొని హృద్యంగా ఈ నవల రచించబడింది. పశ్చిమ తమిళనాడులోని కొగునాడు ప్రాంతంలోని కొన్ని సామాజిక వర్గాలు మురుగన్‌ మీద కాలు దువ్వినాయి. అలజడి ప్రారంభమయింది. ఈ నవలలో ప్రస్తావించిన అంశాలు తమ సామాజిక వర్గాన్ని, స్త్రీలను కించపరచేవిగా ఉన్నదనీ, దీన్ని నిషేధించాలనీ కొన్ని హిందూ మతోన్మాద సంస్థలూ, కుల సంఘాలు వక్రమార్గంలో ఎడతెరిపి లేని ఆందోళన అన్ని రూపాల్లో కొనసాగించాయి. రచయితైన మురుగన్‌ను వేటాడారు. దాదాపుగా సాంఘిక బహిష్కరణ చేశారు. మురుగన్‌తో ప్రభుత్వ అధికారుల సమక్షంలో క్షమాపణలు చెప్పించాయి. అయినా గొడవ కోర్టుదాకా వెళ్ళింది. విచారణ సం||ర కాలం జరిగింది. మతోన్మాదుల ఉన్నాదాన్ని కోర్టు కొట్టివేసింది. ఈ రచనను తెలుగులోకి ప్రసిద్ధ రచయిత ఎల్‌.ఆర్‌.స్వామి అనువదించారు.

    పేజీలు : 152

    120.00
    Add to cart
  • Janglee - జంగ్లీ

    Janglee – జంగ్లీ

    కిషన్‌చందర్‌ రాసిన ”జంగ్లీ” (నవల) ఒకనాటి బొంబాయ్‌ నగర జీవితాన్నీ, మహానగరంగా పెరుగుతున్న ఆ నగర వైరుధ్యాలనూ ప్రత్యేకించి కూటికీ, గుడ్డకూ, గూడుకూ కరువైన సాదాసీదా జనజీవనాన్ని గురించి అత్యంత అద్భుతంగా మన కళ్ల ముందు ఆవిష్కరింపజేస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ పెరుగుదలతోపాటు దాన్ని అంటిపెట్టుకుని ఉండే దారిద్య్రం, సంపన్నతలను మనం ఈ నవల ద్వారా గమనించవచ్చు. జీవిత వైవిధ్యాన్ని, మానసిక అంతర్మథనాన్ని కిషన్‌చందర్‌ గొప్పగా చిత్రించాడు. అనామకులైన ఇద్దరు పేద యువతీయువకుల ప్రేమగాథను కష్టాలకూ, కన్నీళ్ళకూ వేదికైన బొంబాయ్‌ నగర  ”ఫుట్‌పాత్‌” అలగాజన’ జీవనస్రవంతిలో ఆ ప్రేమజంట ఏ విధంగా జీవనాన్ని సాగిస్తూ కలలు కన్న విషయాన్ని కిషన్‌చందర్‌ సాహితీలోకానికి అందిస్తాడు. అందుకే ఆయన భారతీయ సాహిత్య శిఖరంలో నిలవగలిగిన కొద్దిమందిలో ఒకరైనారు.

    పేజీలు :186

    150.00
    Add to cart