• Dindukinda Nallatachu - దిండుకింద నల్లతాచు

    Dindukinda Nallatachu – దిండుకింద నల్లతాచు

    0

    ”నవ్య నవలల పోటీలో రూ. 50,000 ల ప్రథమ బహుమతి పొందిన నవల”

    ”చూడూ కళ్యాణీ! నాకు పెళ్ళయిన ఆడాళ్లంటే చాలా ఇష్టం. అందులోనూ మొహానికి పసుపు రాసుకుని, ప్రొద్దున్నే తులసి కోటకి పూజ చేసేవాళ్ళంటే మరీ ఇష్టం. ఒక్కసారి వప్పుకో. మళ్ళీ నీ జోలికి రాను” అంటూ దగ్గరగా జరిగాడు. సరీగ్గా ఆ సమయానికి బయట నుంచి కాలింగ్‌ బెల్‌ శబ్దం వినిపించింది. కల్యాణి చిగురుటాకులా వణికిపోయింది.

    ”దేశమంతా ఒకే మతం ఉంటే గొడవలు ఉండవా? మరి లెబనాన్‌ దేశంలో హజ్‌బుల్లా షియాలు సున్నీలు ఎందుకు ఊచకోత కోస్తున్నారు? ఆఫ్ఘనిస్తాన్‌లో ఆల్‌ఖైదా సున్నీలు షియాల్ని ఎందుకు చంపుతున్నారు? మన పక్క దేశం పాకిస్థాన్లో షియాలకీ, సున్నీలకీ మధ్య ఎందుకంత రక్తపాతం?” అని ఆగి, ”మనిషి సుఖంగా బ్రతకటానికి కావల్సింది మతం కాదురా. మానవత్వం” అన్నాడు.

    ”మానవత్వం అన్నం పెట్టదు”

    ”అమెరికాలో అన్నంట ఉంటుంది. తినటానికి టైమ్‌ ఉండదు. సొమాలియాలో టైమ్‌ ఉంది. తినటానికి అన్నం ఉండదు. ఆఫ్ఘన్‌లో మతం ఉంది. అక్కడ శాంతి లేదు. అన్నీ ఉన్న భారతదేశాన్ని ఎందుకురా ఇలా పాడు చేస్తున్నారు?”…

    పేజీలు : 192

    120.00
    Add to cart
  • Idli - Orchid - Akasam - ఇడ్లి - ఆర్కిడ్‌ - ఆకాశం

    Idli – Orchid – Akasam – ఇడ్లి – ఆర్కిడ్‌ – ఆకాశం

    0

    ఆత్మహత్య చేసుకోవాలని నా స్నేహితుడి ఆఫీసు 26వ అంతస్థుకి చేరుకున్నాను. అతణ్ణి బయటకు పంపి, కీటికీలోంచి బయటకు దూకబోతుండగా ఒక సంఘటన నన్ను మార్చింది. 600 కోట్ల హోటల్‌కి అధిపతిగా చేసింది.

    ఇడ్లీ ఒక ప్లేట్లో, చట్నీలు మరొక ప్లేట్లో, సాంబార్‌ సెపరేట్‌గా గిన్నెలో సర్వ్‌ చేసేవాళ్ళం. మూడూ ఒకే దానిలో ఇచ్చేలా ‘దొప్ప’లున్న ”కామత్‌” ప్లేట్లు తయారు చేయించారు. దానితో అంట్లు తోమే వారి ఖర్చు నెలకి పాతికవేలు తగ్గింది.

    ‘నీ జీవితాశయం ఏమిటి’ అని ఓబెరాయ్‌ నన్ను అడిగారు.” మీ హోటల్‌ కన్నా పెద్దది కట్టడం” అన్నాడు. పన్నెండేళ్ళ వయసులో అది నా అహంభావం కాదు – కల!

    భారత రాష్ట్రపతికి లస్సీ కావాలని మా హోటల్‌కి కబురొచ్చింది. అందమైన ఫ్లాస్క్‌ మీద ‘కామత్‌’ అని ప్రింట్‌ చేయించి లస్సీ పోసి పంపాను. పది లక్షలు వెచ్చించినా ఇంత వ్యాపార ప్రకటన దొరకదు.

    14 భాషల్లో అనువదింపబడి – రెండు యూనివర్సిటీలకీ నాన్‌డిటెయిల్డ్‌గా ఉన్న పుస్తకం.

    ప్రపంచ ప్రతిష్ఠాత్మకమైన హోటల్‌గా ప్రథమ బహుమతి పొందిన ‘ఆర్కిడ్స్‌’ హోటల్‌ అధినేత విఠల్‌ ఆత్మకథకి శ్రీ యండమూరి వీరేంద్రనాథ్‌ విశిష్ఠ రూపకల్పన.

    ఎలా ప్రారంభించాలో, ఎక్కణ్ణుంచి మొదలుపెట్టాలో, ఎలా బ్రేక్‌త్రూ సాధించాలో ఈ పుస్తకం చెపుతుంది. ఇది చదివి ఒకరైనా స్ఫూర్తి చెందితే ఈ రచన ఆశయం నెరవేరినట్టే.

    150.00
    Add to cart
  • Lopali Daari

    Lopali Daari

    0

    Lopali Dari Short Stories by Sowbhagya సౌభాగ్య అనబడే పాలెళ్ల విజయకుమార్ ఒక బహుముఖీన ప్రజ్ఞగల సాహిత్యవేత్త. ఏదో ఒక సాహిత్య ప్రక్రియలో మాత్రమే కాకుండా కవిత్వం, కథ, నవల, విమర్శ, అధ్యయనాత్మక సాహిత్యం, వ్యక్తిత్వ వికాస ఉద్దీపక సాహిత్యం ఇలాంటి వివిధ విభిన్న రంగాల్లో విశేషమైన కృషిచేసిన ప్రతిభాశాలి. కవిగా, దాదాపు తొమ్మిది సంపుటాలను వెలువరించారు. ముప్పది తొమ్మిది సాహిత్య విమర్శ గ్రంథాలను అందించి నాణ్యమైన విమర్శకునిగా పేరుపొందారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన గొథె, ఐన్స్టీన్, జాన్ కీట్స్, రస్సెల్, ఖలీల్ జిబ్రాన్, తావో తెచాంగ్, సిసిరో వంటి వ్యక్తుల ఆసక్తికర గ్రంథాలను సరళంగా పాఠకులకు అందించిన పరిశోధకుడు. ప్రధానంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఓషో భావజాలాన్నీ, చింతననూ అనేక గ్రంథాలుగా అందించారు. సాభాగ్య అనేక దశాబ్దాలుగా అనితర సాధ్యమైన ఈ రచనా కార్యక్రమాన్ని నిష్ఠతో కొనసాగించి దాదాపు 195 గ్రంథాలను యిప్పటివరకు వెలువరించారు. ఒక సాహిత్య కారుడు ‘సాహిత్య సాధన’ను తపస్సుగా స్వీకరించి, నిరంతర యజ్ఞంగా కొనసాగిస్తే తప్ప ఇంత నాణ్యమైన, ప్రామాణికమైన అక్షర సంపదను సృష్టించడం సాధ్యం కాదు. ఏ.గంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా మోతె గ్రామానికి చెందినవారు. 2006లో UK లోని బెడ్ ఫోర్డ్ యూనివర్సిటీ నుండి MBA పూర్తి చేశారు. కొంత కాలం అక్కడే జాబ్ చేసి, తిరిగి ఇండియాకు వచ్చారు. హైదరాబాద్ లో e-tutors world పేరుతో, మొట్టమొదటి online tuitions అకాడమిని ప్రారంభించారు. 2010 లో ఓ ఫిల్మ్ స్కూల్ నుండి డైరెక్షన్ కోర్స్ చేసి, రెండు తెలుగు సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్గా, సహ రచయితగా పనిచేశారు. 2016 నుండి మాయాజూమ్ ఫిలిమ్స్ పేరుతో ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసి, యాడ్ ఫిలిమ్స్న, డాక్యుమెంటరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు. సాహిత్యం అంటే ఆసక్తి,

    250.00
    Add to cart
  • Loya Nunchi Sikharaniki - లోయ నించి శిఖరానికి

    Loya Nunchi Sikharaniki – లోయ నించి శిఖరానికి

    0

    విద్యార్ధులకి శిక్షణాతరగతులు ప్రారంభిస్తూ ”మీలో జీవితంలో పైకి వద్దామనుకునేవారు చేతులు ఎత్తండి” అని అడిగినప్పుడు అందరూ ఎత్తుతారు. కొందరు నిలబడి మరీ ఎత్తుతారు.

    ”ఏ వయసులో?” అన్న రెండో ప్రశ్నకి హాలులో నిశ్శబ్దం అలుముకుంటుంది. మూల నుంచి ఎవరో, ”ఇరవై అయిదేళ్ళకి” అంటారు.

    ”అప్పుడేమి జరుగుతుంది? ఉద్యోగం వస్తుందా? పెళ్ళవుతుందా? (నవ్వులు)

    అసలు పైకి రావటం అంటే ఏమిటి? ఒక లక్షాధికారి ముప్పై ఏళ్ళకే ముసలివాడై పోయాడు. మరొకడు తల్లి దండ్రుల్ని అనాధాశ్రమంలో చేర్చాడు. వీరు జీవితంలో పైకి వచ్చినట్టా?”

    పెద్దవాళ్ళు కూడా అంత తొందరగా సమాధానం చెప్పలేని ప్రశ్న.

    శఠగోప రహస్యాన్ని విశదీకరిస్తూ, షడ్గుణ ఐశ్వర్యాల్ని వివరిస్తూ, వ్యక్తిత్వ వికాసమంటే ”స్వార్థాన్ని పెంచడం” అన్న కొందరి అభిప్రాయాల్ని పటాపంచలు చేస్తూ, రెండు కోట్ల రూపాయలపైగా అమ్మకాలు సాధించిన ”విజయానికి అయిదు మెట్లు” రచయిత అందిస్తున్న మరో మాస్టర్‌ పీస్‌ ‘లోయ నుంచి శిఖరానికి’.

    150.00
    Add to cart
  • Manchupula Varsham - మంచుపూల వర్షం

    Manchupula Varsham – మంచుపూల వర్షం

    0

    వ్యక్తుల్ని ప్రేమించేకొద్దీ, వారి నుంచి దూరమైతే విరహం, వారికి కోపం వస్తే బాధ. వారు వేరే వారిపట్ల కాస్త ఎక్కువ శ్రద్ద చూపితే ఈర్ష్య! అదే ప్రాణంలేని సంగీతం, పెయింటింగ్‌, రచన, పఠనం మొదలైన వాటి పట్ల అభిరుచి పెంచుకుంటే మనకి మనమే వాటితో రమించవచ్చు. అవి అలగవు, కోరికలు తీర్చమని బలవంతపెట్టవు. మరికొంత సమయం తమకోసం కేటాయించమని అడగవు. అందుకే ప్రకృతితో స్నేహం ఎల్లప్పుడూ నిరపాయకరం.

    సామాన్యుడు ఎవరేం చెప్పినా నమ్ముతాడు. ఎలా ? ఎందుకు? అని ఆలోచించడు. హేతువు వున్నదాలేదా ? ఇదెలా జరుగుతుంది ? అని తెలివైనవాడు తర్కిస్తాడు. తనకి తెలియని హేతువు కూడా వుండొచ్చుకదా, కారణం వున్నదే కరెక్టనుకోవటం దేనికి ? అని మేధావి ఆలోచిస్తాడు. హేతువు కన్నా, తనకిగానీ, ప్రపంచానికి గాని ఆ పనివల్ల వచ్చే ‘ఉపయోగం’ గురించి జ్ఞాని ఎక్కువ పరిశీలిస్తాడు.

    మనిషి ఎలా సంతృప్తిగా బ్రతకాలో చెప్పేదారిలో, ఒక మైలురాయి లాంటి వాడు భగవంతుడు. కర్తవ్య నిర్వహణ మానేసి కేవలం అతణ్ణి పూజించేవాడు, ప్రయాణం మానేసి ‘మైలురాయి’ని పూజిస్తున్నవాడి కింద లెక్క.

    ఈ ప్రపంచంలో మోసగాళ్ళందరూ ఎప్పుడూ రకరకాల అబద్ధాలు ఆడుతూ వుంటారనీ, అందమైన కట్టుకథలు విపరీతంగా చెప్పేస్తూ వుంటారనీ, మామూలు మనుషుల కన్నా వాళ్ళు చాలా డిఫరెంట్‌గా వుంటారని మనమనుకుంటే అది చాలా తప్పు. వాళ్లూ మనలాగే ఉంటారు. వారి సిన్సియారిటీని హానెస్టీగా ఎప్పుడూ భావించకూడదు. సిన్సియారిటీ అంటే శ్రద్ధ. హానెస్టీ అంటే నిజాయితీ. అతడు చాలా సిన్సియర్‌ అనటానికీ, అతడు చాలా హానెస్ట్‌ అనడానికీ చాలా తేడా ఉంది. నమ్మకద్రోహులే ఒక్కోసారి చాలా శ్రద్దగా వుంటారు.

    మనో వైజ్ఞానిక సాహిత్యంలో అపూర్వ సంచలనాలను సృష్టిస్తున్న  వ్యక్తిత్వ పుస్తకాలు – తప్పుచేద్దాంరండి, విజయానికి ఆరోమెట్టు, మైండ్‌ పవర్‌ నెంబర్‌ 1 అవటం ఎలా, విజయంలో భాగస్వామ్యం, విజయానికి అయిదుమెట్లు-గెలుపుకోసం ప్రతి వ్యక్తి ఆచరించవలసిన సూత్రాల్ని పై పుస్తకాల్నుంచి క్లుప్తీకరించి పాఠకుల సౌలభ్యం కోసం శ్రీ యండమూరి వీరేంద్రనాథ్‌ అందిస్తున్న విజయ రహస్యాల సంకలనం ‘మంచుపూల వర్షం’.

    50.00
    Add to cart
  • Mind Power - మైండ్‌ పవర్‌

    Mind Power – మైండ్‌ పవర్‌

    0

    ఈ ‘మైండ్‌ పవర్‌’ పుస్తకంలో మానవ జీవితాన్ని సమూలంగా మార్చివేయగల అంశాలు వున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఒక మనోతాత్త్విక విశ్లేషణ (). సైద్ధాంతికంగా చెబితే అంత తేలిగ్గా అర్ధంకాని విశ్లేషణలను సైతం చిన్నచిన్న సంఘటనల సాయంతో విడమరచి చెప్పడంలో రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ గొప్పతనం వెల్లడయింది. పుస్తకం ఆరంభం నుంచీ, అంతం వరకూ రచయిత తన సహజశైలిలోని జిగి, బిగిని సడలనివ్వలేదు. ఇతర ‘పర్సనాలిటి డెవలప్‌మెంట్‌’ పుస్తకాల లాగా ఒకసారి చదివేసి పక్కన పెట్టేసే పుస్తకం కాదిది.

    జీవితంలోని వివిధ దశల్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు ఇందులో పొందుపరచారు. అందువల్ల ప్రతివ్యక్తీ దీనిని పదేపదే చదివి తీరాల్సిందే. అసామాన్యులు మెదడు చెప్పినట్లు చేయకుండా, తాము చెప్పినట్లు ‘మెదడు’ నడుచుకునేటట్లు ‘ట్యూన్‌’ చేసుకుంటారు. అలాంటివారే నెంబర్‌వన్‌ కాగలుగుతారు. మనిషిని మెదడు వాడుకునే దశనుండి మెదడును మనిషి వాడుకునే దశకు చేరుకోవాలంటే యండమూరి వీరేంద్రనాథ్‌ ‘మైండ్‌పవర్‌’ మంచి అక్షర సాధనం కాగలదు.

    సామ్యవాదం కోసం మనోశక్తి, మనో ప్రణాళిక, మనోధైర్యం, మనో విశ్లేషణ, మనశ్శాంతి కాక ‘ఆర్ధికావగాహనావలోకం’ కోసం అవన్నీ తెలుసుకోవాలనుకుంటే, అదే పాజిటివ్‌ థింకింగ్‌ అనుకుంటే ఇది అవశ్య పఠనీయ గ్రంథం. పాఠకుడి మానసిక స్థాయిని పెంచి తద్వారా సమస్యల్ని పరిష్కరించే ఆత్మవిశ్వాసాన్నీ, నేర్పునీ, అందించిన ఈ ప్రయత్నం ప్రశంసనీయం.

    270.00
    Add to cart
  • Padamati Koyila Pallavi - పడమటి కోయిల పల్లవి

    Padamati Koyila Pallavi – పడమటి కోయిల పల్లవి

    0

    పాశ్చాత్య కవితా ఝరిని తెలుగు సాహితీ క్షేత్రానికి తీసుకురావాలన్న ప్రయత్నంలో ‘పడమటి కోయిల పల్లవి’కి ‘తీయ తెనుగు అను పల్లవి’ జత కూర్చి శ్రీ యండమూరి వీరేంద్రనాథ్‌ సారధిగా కట్టిన కవితా వారధి ఈ పుస్తకం.

    కీట్స్‌, వర్డ్స్‌వర్త్‌, కోలరిడ్జ్‌, డన్‌మోర్‌, ఈట్స్‌ లాంటి కవుల కవితల్లో అంతర్లీనంగా ఉన్న భావం చాలా అద్భుతంగా వుంటుంది. ఇవన్నీ నారికేళ పాకాలు. మామూలుగా చదివితే అంతగా ఆకట్టుకోవు. లోతుగా వెళ్ళి పరిశీలించాలి. ముఖ్యంగా ‘ప్రాఫెట్‌’ అయితే ప్రతి వాక్యమూ ఆణిముత్యమే.

    ‘పిల్లల్ని ప్రేమించే ప్రయత్నం తప్పుకాదు. వారు తిరిగి ప్రేమను ఇవ్వాలన్న నిబంధనే మహాపాపం’. (ప్రాఫెట్‌)

    మనిషి జీవితపు విందులో పంచభక్ష్య పరమాన్నాలన్నీ వడ్డించబడతాయి. చివర – మృత్యువు వాటిని తుడిచి పెట్టుకు పోతుంది (రిచర్డ్‌ బ్రాన్‌ ఫీల్డ్‌)

    అనుభవం శయ్యమీద కలిసిన రెండు శరీరాలు. మనసు మాత్రం నీది నీదే- నాది నాదే (డి.హెచ్‌.లారెన్స్‌)

    ఇలాంటి గొప్ప భావాలు ఈ కవితల్లో వున్నాయి. భావాన్ని యధాతధంగానే అనువదించినా, కొన్ని చోట్ల తెలుగు దనం చేర్చారు. ఇంగ్లీషు కవిత్వానికి అవసరమైన ‘మాత్రల్ని’ వదిలి, వీలైన చోట్ల అంత్యప్రాసల్ని చేర్చారు.

    ఈ కవితల్ని కళ్ళతో చదవకండి. మనసుతో చదవండి. కొన్ని వాక్యాల్ని మనల్ని నిలబెట్టేస్తాయి. ఆ కవులు ఎంత మధనపడి, ఎంతచిన్న వాక్యాలలో ఎంత పెద్ద భావాల్ని పొదిగారో అర్ధమవుతుంది.

    50.00
    Add to cart
  • Parusavedi - పరుసవేది

    Parusavedi – పరుసవేది

    0

    రోజువారీ జీవితంలోని సమస్యల పరిష్కారం కోసమో, జ్ఞాన సముపార్జన కోసమో, నిరంతరం పేరుకుపోయే విసుగుని బద్దలు కొట్టడం కోసమో సాహిత్యాన్ని ఆశ్రయించే పాఠకులకు తనదైన తత్వదర్శనం చేయించి విశ్వతత్వాన్ని అర్ధం చేయిస్తూ సమాజ స్వభావాన్ని అవగాహన చేసుకోవడానికి అవకాశం ఇస్తూ స్వీయ పరిణామానికి కావలసిన మార్గాన్ని సుగమం చేయడమే సాహిత్య ప్రధాన ప్రయోజనం.

    మన బలహీనతలను రెచ్చగొడుతూ, భ్రమలలో జోకొడుతూ, భద్రతా రాహిత్యాల విముక్తి కోసం అవిటి ట్రిక్కులనీ, నిర్జీవమైన మార్గాంతరాలనీ అందించే సాహిత్యంలో పుస్తకాల సంత విలవిలలాడుతుంది. ఈ విషాద సందర్భాన మానవ తత్వాన్నీ, విశ్వతత్వాన్నీ సరళంగా, సహజంగా అర్ధం చేయిస్తూ, వాటి మధ్య ఉన్న అనుసంధానతని విపులంగా విశదీకరిస్తూ తెలుగు సాహిత్య రంగంలోకి ‘పరుసవేది’ ప్రవేశించడం ముదావహం.

    తర్కాలకీ, హేతుబద్దతకీ, ఇంద్రియాల గ్రహింపుకీ కుదరని-అందని, నిశిత నిగూఢ స్ధాయిలో అసలైన మౌలిక ప్రజ్ఞలన్నీ గుప్త నిర్మాణంగా నెలకొని ఉంటాయని, ఈ ప్రజ్ఞలు సందర్భోచితంగా వ్యక్త నిర్మాణాలుగా నైపుణ్యాలుగా ప్రకటితమౌతాయనీ అర్ధం చేసుకోకపోతే నిండైన పరిణామానికి దూరమై, మన సంకల్ప వాస్తవాలను సృష్టించుకోవడంలో విఫలమౌతామని మనకి అర్ధం అయ్యేలా చేయడమే ఈ రచన యొక్క ప్రధాన గమ్యం. పాలో కొయిలో – ది ఆల్కెమిస్ట్‌  ఇంగ్లీషు పుస్తకాన్ని తెనిగించినది శ్రీ కె.సురేష్‌. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలలో 66 భాషలలోకి అనువాదమయ్యింది.

    299.00
    Add to cart
  • Rahasyam (The Secret) - రహస్యం (ది సీక్రేట్‌)

    Rahasyam (The Secret) – రహస్యం (ది సీక్రేట్‌)

    0

    మీరు మీ చేతుల్లో ఒక గొప్ప రహస్యాన్ని పట్టుకుని ఉన్నారు

    ఎన్నో యుగాలుగా ఇది అందరూ ఎంతో ఆకాంక్షించేది, దాగివున్నది, చేజారినది, అపహరించబడినది, లెక్కలేనంత డబ్బిచ్చి కొనుగోలు చేయబడినది, తరువాతి తరాల వారికి అందించబడుతూ వస్తున్నది. శతాబ్ధాల కిందటి ఈ రహస్యాన్ని చరిత్రలో ప్రసిద్ధికెక్కిన చాలా మంది అర్థం చేసుకున్నారు. : ప్లేటో, గెలీలియో, బిథోవెన్‌, ఎడిసన్‌, కార్నేగి, ఐనస్టీన్‌ వంటి వారు. వీరితో పాటు మరికొందరు ఆవిష్కర్తలూ, వేదాంతులు, శాస్త్రవేత్తలు, గొప్ప తాత్త్వికులు కూడా దీన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ రహస్యం లోకానికి వెళ్ళడి చేయబడుతోంది.

    ”ఈ రహస్యాన్ని నేర్చుకునే ప్రక్రియలో, మీరు ఇష్టపడే వ్యక్తిత్వాన్ని ఎలా అలవరుచుకోగలరో, మీ మనస్సుకు నచ్చే పని ఎలా చేయగలరో, మీరు ఇష్టపడే వస్తువును ఎలా పొందగలరో తెలుసుకుంటారు. నిజంగా మీరెవరో మీకు తెలియవస్తుంది. జీవితంలో మీకోసం వేచివున్న దివ్యత్వం ఏమిటో మీరు తెలుసుకుంటారు”.

    పేజీలు : 198

    499.00
    Add to cart
  • Samasyalu - Parishkaralu - సమస్యలూ - పరిష్కారాలు

    Samasyalu – Parishkaralu – సమస్యలూ – పరిష్కారాలు

    0

    సమస్య రాగానే మనం పరిష్కారం ఆలోచించటం మానేసి, విచారించటం ప్రారంభిస్తాం.

    సముద్రం ఎంత పెద్దదైనా, నీళ్ళని లోపలికి రానివ్వకపోతే పడవ మునగదు. సమస్య ఎంత పెద్దదైనా, మనసులోకి రానివ్వకపోతే బాధ ఉండదు.

    పాతికశాతం సమస్యలు పరిష్కారం లేనివి. పరిష్కారం లేని ఈ పాతిక శాతం గురించీ మనం జీవితంలో సగవంతు కాలం ఆలోచిస్తూ గడిపేస్తాం. ఇంకో యాభై శాతం సమస్యలు మనకి ఇతరుల వల్ల వచ్చేవి. అవి తీరాలంటే మారవలిసింది  వాళ్ళు. మనం కాదు. తాగుబోతు భర్త, దుబారా భార్య, గయ్యాళి అత్తగారు, చెడుదార్లో సంతానం వగైరా. వాళ్ళని మార్చటం ఎలా అని నిరర్ధకంగా విచారిస్తూ మరో పాతిక శాతం కాలం గడిపేస్తాం.

    మిగిలిన పాతిక శాతం సమస్యల్నుంచి బయటపడాలంటే కఠినమైన నిర్ణయాలు అమలు జరపాలి. దురదృష్టవశాత్తూ ఇటువంటి సందర్భాల్లో మనం ఆలోచిస్తూ కూర్చుంటాము తప్ప నిర్ణయాలు తీసుకోము. తీసుకున్నా, అమలు జరపం.

    ఏ సమస్యకి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటే సమస్య తాలూకూ సాంద్రత తగ్గుతుందో ఆత్మీయంగా చెప్పే పుస్తకం.

    పేజీలు : 183

    120.00
    Add to cart
  • SANUKULA ALOCHANA SHAKTHI (The Power Of Positive Thinking(Telugu)
  • Shapthabhoomi-Rayalaseema Charitraka Navala