-
-
-
Screen Play_Vanda Satyalu
0₹300.00ఆశంస
ఎందరో మహాను భావులు. అందరికీ వందనాలు. ‘స్క్రీన్ ప్లే’ అన్న మకుటంతో కదన రచనలో వచ్చే సమస్యలేమిటి అనే విషయంపై, నూతనంగా చలన చిత్ర కథలు, సంభాషణలు, కథన రచనలో పాల్గొనే ఎందరో అధునాతన రచయితలు, సినిమా రచన చెయ్యాలని అభిలషించే యువతీ యువకుల కోసం, ఈ గ్రంథం రచించాలన్నది ఏనాటి నుంచో నా మనసులో పాతుకుపోయిన ఆకాంక్ష.
దాని కోసం అమెరికా వెళ్ళినప్పుడు చాలా ‘హాలీవుడ్ స్క్రీన్ ప్లే’ గ్రంథాలు కొని తీసుకు రావటం జరిగింది. 2007వ సంవత్సరం నుంచి తెలుగు విశ్వవిద్యాలయంలో “స్క్రీన్ ప్లే’ తరగతులు నిర్వహించి, తెలుగు సినీ రచయితల సంఘం పక్షాన కూడా ‘స్క్రీన్ ప్లే’ తరగతులు నిర్వహించడం జరిగింది.
అంతే కాకుండా రాఘవేంద్రరావు గారు, ఎ. కోదండరామిరెడ్డి గారు, బి. గోపాల్ గారు ఇలా ఎంతో మంది దర్శకులను ‘షూటింగ్ స్పాట్ లో గమనించి కొన్ని స్క్రీన్ ప్లే వాస్తవాలు తెలుసుకోవడం జరిగింది.
బొబ్బిలి బ్రహ్మన్నలో ఒక షాట్ తీసినప్పుడు ఇలా ఎందుకు చేసారు అని అడిగితే అభినయానికి విలువనిచ్చి అని చెప్పారు. అలాగే శారదగారి పాత్ర కూతురు ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు తలుపు తీసే షాట్లో ఎదురుగా కృష్ణంరాజు గారు కనిపించాలిగదా అంటే అది జనం ఊహిస్తారు. అందుకని కెమెరా లోపల పెట్టి తలుపు తియ్యగానే సజెషన్లో హీరో నిలబడి వుంటాడు. అతని అభినయం తెలిసిపోతుంది. అతను బాధగా ఉన్నాడా? కోపంగా ఉన్నాడా అనేది. తలుపు తెరిచి చూడగానే కట్రాయిలా నిలబడ్డ భర్తను చూసి వెనకడుగు వేస్తే, ఆమెకు గుండెఝల్లు మంది అన్న ఎక్స్ ప్రెషన్ ‘ఆడిటోరియా’నికి తెలుస్తుంది అన్నారు. ఇలా ఆయనను ఎన్నో సినిమాలలో చిన్న………….
-
-
-
Sri Datta Puranam
0₹450.00ఇది శ్రీ దత్తపురాణమను మహాగ్రంథము, సంస్కృతమున పరమహంస పరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీ స్వామి రచించినది, తెలుగులో టీకతో సమర్పింపబడుచున్నది. ఇది ఎన్మిది అష్టకములుగను, ఒక్కొక్క అష్టకము ఎన్మిది అద్యాయముల గుచ్చముగను రూపము దాల్చినది. ఇందు మొత్తము 3500 శోకములున్నవి.
ఈ అష్టాష్టక అష్టాధ్యాయ విషయములు సూచికలో చూడవచ్చును. సంస్కృత వ్యాఖ్యతో కూడిన నాగరిలిపి ప్రతి నాకు లభించినది. దానిని పరిశీలించి తెలుగులో ప్రతిపదార్థతాత్పర్యములను కూర్చినాను. పాఠకమహోదారులకు ఇది ప్రయోజనకారి కాగలదని నమ్మిక.
సర్దము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశ్యానుచరితము అను ఈ అయిదు లక్షణములున్నది పురాణము, అని లక్షణము చెప్పబడినది. ఈ గ్రంథమునందు ఈ లక్షణములున్నవా? అను ప్రశ్నకు శ్రీవాసుదేవానందసరస్వతీ స్వామి వారి సమాధానము : ఈ గ్రంథమున ప్రకరణవశాత్తు ప్రథమకాండమున సర్గము, అంతిమకాండమున ప్రతిసర్గము, మధ్యలో వంశము, మన్వంతరము, వంశ్యానుచరితము వర్ణింపబడినవి కావున దీనిని పురాణమనుట సార్థకమే.
ఇందు ఉపాసనాకర్మజ్ఞానకాండల విషయములను సమాచరించు భక్తుల అనుభవము ప్రతిపాదింపబడినది. తెలుగువారికీ గ్రంథవిషయము నందించుట కర్తవ్యముగా నెంచి మిత్రులు రావి మోహనరావుగారు ప్రోత్సహించగా నే నీ పనికి పూనుకొని యథాశక్తి శ్రమించినాను. నా శ్రమ ఫలవంతమైనదను నమ్మికతో దీనిని మీ ముందు ఉంచుచున్నాను. ఈ కృషిలో నా ప్రతిభావ్యుత్మతులు చాలినవో లేదఆశ్రీ దత్తునకే ఎఱుక. ఎఱుక గల పాఠకులు దతస్వరూపులై మన్నింప ప్రార్థన.
-
-
-
-
Sri Vishnu Vidya
0₹800.00(శ్రీ విష్ణు సహస్రనామ భాష్యము)
“ఇది నామ విద్య. ఈ నామాలు అక్షరాల గుంపులు కావు. నారాయణుని శబ్దాకృతులు. మొత్తంగా ఈ సహస్రనామ స్తోత్రమే విష్ణుని శబ్దమయీమూర్తి, ఇవి వేదమందు ప్రతిపాదింపబడిన పరమాత్ముని శబ్దాలు. వీటి వ్యాఖ్యానం మన వైదిక విజ్ఞానాన్ని, పరమేశ్వర జ్ఞానాన్ని స్పష్టపరుస్తాయి. అందుకే ఇది ‘విష్ణువిద్య’. .. ప్రాచీన, అర్వాచీన భాష్యాల ననుసరించి, వైదిక శాస్త్రాల సంప్రదాయాధారంగా ఒకొక్క నామానికి ఉన్న ఔచితీమంతమైన క్రమబద్ధతనీ, నిర్దిష్టమైన వ్యాఖ్యానాన్ని అందించే సమన్వయ భాష్యమిది. ప్రతినామ వ్యాఖ్యానము పారాయణయోగ్యంగా, భావనాయోగంగా సమకూర్చిన విష్ణుతేజో విలసిత గ్రంథమిది”. —-సామవేదం షణ్ముఖ శర్మ
-
Telugu Navala Sahithyamlo Manovisleshana
0₹200.00ఒక మహా వృక్షాన్ని విశ్లేషించేప్పుడు దాని మూలాల్ని తరచి చూసినట్టే తెలుగు నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణా విభాగాన్ని విశ్లేషించేప్పుడు తెలుగు నవలా పరిణామ విశ్లేషణ, మనోవైజ్ఞానికపరమైన ప్రపంచ సాహిత్యాల ప్రభావం, ప్రపంచ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల సిద్ధాంతాల పరిశీలన కూడా జరిగితేనే ఆ అధ్యయనం సమగ్రం అవుతుంది. అందుకు మనోవిజ్ఞాన శాస్త్రం పై పట్టు ఉండాలి.
– కోడూరి శ్రీరామమూర్తి