-
Soonyam
0₹275.00పంజరంలో చువ్వమీద కూర్చుని, నింపాదిగా ధాన్యం ముక్కన కరుచుకుంటున్న పక్షితో “ఎగిరిపో! నీకు స్వేచ్ఛనిస్తున్నాను” అన్నాడట ఒక యువకుడు. “ఎగిరిపోవాలనే ఉంది. ఆకాశంలో పట్టుకోవడానికి చువ్వలుంటాయా?” అని అడిగిందట పక్షి. 83లో అదీ పరిస్థితి. ఆకలికన్నా పెద్ద భయం. రోడ్డు మీద చెత్త ఏరుకునే వాళ్లతో సహా, ఉస్మాన్ గంజ్ లో బస్తాలెత్తే కూలీలతో సహా జేబుదొంగలు, ఇతర పెట్టి క్రిమినల్స్ సహా అందరూ నా ప్రతిరూపాలే. – ముక్తవరం పార్థసారథి తనకు విలువలున్నాయంటే అది ధిక్కారంలాగా కనిపిస్తుంది. తనకూ వాళ్ళకూ మధ్య యింత ఎడం ఎందుకు? ఈ నిత్య జీవితపు రొచ్చులో ఎవరూ తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోయినా రాసేటప్పటి తన నిజాయితీనయినా నమ్ముతారా? ఈ వూహలూ, ఈ అనుభవం మరపుతెరల మరుగున మాయం కాకముందే – రొటీన్ జీవితపు అడుగున పడిపోకముందే అక్షరరూపంలో వ్యక్తమయ్యే నిజాయితీయే సాహిత్యం. అటువంటి సాహిత్యం అది శూన్యంకాదు – జీవితం. అర్థవంతమైన జీవితం. – – వరవరరావు
-
-
-
Uttama Telugu Vaana Kadhalu
0₹250.00విత్తనం బొజ్జలో నుంచి మొక్క పాపాయిని నేల పొత్తిళ్ళలోకి తెచ్చి, పెంచి పెద్ద చేసే దేవతే కదా వానంటే. మేఘాలు వెండి దారాలతో భూమికి ఆకుపచ్చని జీవాన్ని నేయడమే కదా వానంటే. ప్రకృతి పసి పాపాయై చేసే అల్లరి చప్పుళ్ళే కాదు, కోపంతో ముఖం చాటేసి నిర్దాక్షిణ్యంగా జీవితాల్ని చిదిమి పారేసే మృత్యువు కూడా వానే. ఆనందం, ఆశ్చర్యం, భయం, బీభత్సం, విషాదం, దుఃఖం వానకున్న అనేక ముఖాలు. కళ్ళకు కనిపించే ప్రాణులతో పాటు, కనిపించని కోట్లాది జీవరాశుల బతుకులు శాసించేదే వాన. అలాంటి వాన నేపథ్యంలో తెలుగులో అనేకానేక కథలు వచ్చాయి. అందులో గుండెలు తడి చేసి, ఆలోచనలను తడిమే కథలన్నీ ఒక దరికి చేరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే ఈ పుస్తకం.
– కృష్ణ మోహన్ బాబు
-
Vyakthitva Vikasam
0₹200.00జీవితాన్ని సమాజాన్ని, సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనో విజ్ఞాన మాసపత్రిక రేపు వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆలోచనాధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత నరసింహారావు.
ఆందోళన, అసమర్థదత భావన, నిరాశ, నిస్సహాయత, మనస్సులోని మాట పైకి చెప్పలేని బిడియం, రకరకాల భయాలు, వైఫల్యాలు, ఏ పని చేయలేని నీరసం, అనిశ్చితి నుండి బయట పడవేసి సామాన్యులను సైతం అత్యంత శక్తివంతులుగా మార్చివేసే అసాధారణ గ్రంథం. లక్షలాది జీవితాలను అత్యున్నతంగా మార్చివేసే అసాధరణ గ్రంథం. లక్షలాది జీవితాలను అత్యున్నతంగా మార్చివేస్తున్న అత్యంత శక్తివంతమైన తెలుగు పుస్తకం.
-సి.నరసింహారావు.
-
Yaaraadakonda – యారాడ కొండ
0₹250.00జాలరుల కుగ్రామంగా మొదలైన విశాఖపట్నం, రెండో ప్రపంచ యుద్ధం తరువాత మహానగరంగా అవతరించడానికి మూలకారణమైన భౌగోళిక విశేషం యారాడ కొండ. విశాఖపట్నం ఎదుగుదలకు అదొక కొండగుర్తు. ఎంతో మందికి ఉపాధినీ, కొంత మందికి సంపదనూ ప్రసాదించిన బంగారు కొండ అది. ఆ కొండ విశాఖపట్నం కథను చెప్పుకొస్తే అది ఎలా ఉంటుంది? గడచిన వందేళ్ల కాలంలో అక్కడి మనుషులూ, వాళ్ల ఆశలూ, ఆశయాలూ, వ్యధలూ, బాధలూ, సుఖ సంతోషాలనూ, అలాగే వీటన్నింటినీ నడిపించిన శక్తులనూ యారాడ కొండ నమోదుచేసి వినిపించిన గాథకు నవలా రూపం ఈ రచన. మూలాలను తెలుసుకున్నప్పుడే ఎదుగుదల అర్థవంతం కాగలదనే నమ్మికతో ఏరికూర్చిన సృజన ఈ ‘యారాడ కొండ’ నవల.
పేజీలు : 201
-
21 Va Sathabdhi Vyaparam
0₹225.00ఆర్ధికవ్యవస్థ ఇక్కడ సమస్య కాదు.
ఆ సమస్య మీరే.
కార్పోరేట్ ప్రపంచంలోని అవినీతి మీద కోపంగా ఉందా? వాల్ స్ట్రీట్, పెద్దపెద్ద బ్యాంకుల మీద కోపంగా ఉందా? చేయాల్సిన సరైన పనులు చేయకుండా, చేయకూడని చెడ్డపనులు చేస్తున్న ప్రభుత్వం మీద కోపంగా ఉందా? లేక, మీ ఆర్ధిక పరిస్థితులను అదుపులో ఉంచుకోనందుకు, మీమీదే కోపం కలుగుతోందా?
జీవితం కఠీనంగానే ఉంటుంది. ప్రశ్న ఏమిటంటే – దాని గురించి మీరేం చేయదలుచుకున్నారు? ఆర్ధికవ్యవస్థ గురించి ఏడుస్తూ కూర్చున్నా, లేక ఇతరులను నిందించినంత మాత్రాన మీ ఆర్ధిక భవిష్యత్తుకు భద్రత కలగదు. మీరు సంపద కావాలనుకుంటే, దానిని మీరు సృష్టించాలి. మీ ఆర్ధిక భవిష్యత్తును మీ చేతుల్లోనే ఉంచుకునే ఆవశ్యకత ఉంది. దానికోసం మీరు మీ ఆదాయం మూలాన్ని అదుపులోకీ తీసుకోవాలి – ఈనాడే!
మీకో సొంత వ్యాపారం ఉండాలి.
అధిక సంఖ్యాకులకు ఆర్ధికపరంగా ఇది కష్టకాలం కావచ్చు. కాని ఎంతోమంది వ్యాపారవేత్తలకు సొంత వ్యాపారం ఏర్పరచుకోవటానికి ఇదే సరైన సమయం. దీనిని మించిన సమయం ఇంతవరకూ రానేలేదు.
రాబర్ట్రా టి. కియోసాకీ (రచయిత గురించి) :
రాబర్ట్ టి. కియోసాకీ ఒక మల్టిమిలియనేర్ మదుపరి, బిజినెస్ సొంతదారు, విద్యావేత్త, వక్త, అత్యధికంగా అమ్ముడుబోయే రిచ్ డాడ్ పూర్ డాడ్ గ్రంథమాల రచయిత. తన 47వ ఏట పదవీవిరమణ చేశాక ఆయన క్యాష్ ఫ్లో టెక్నాలజీస్ సహావ్యవస్థాపకుడుగా ఉన్నారు. రిచ్ డాడ్ కంపెనీను స్థాపించారు. ఈ కంపెనీ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కొన్నిలక్షలమంది జనానికి ఆర్ధికస్వేచ్చ ఎలా పొందాలి అన్న అంశం మీద సలహాలని అందిస్తోంది. రాబర్ట్ 16 పుస్తకాలు రాశారు. 27 కోట్లకీ పైగా అవి అమ్ముడయాయి.
జాన్ ప్లెమింగ్ (రచయిత గురించి) :
జాన్ ప్లెమింగ్ ఒక విజయవంతమైన వాణిజ్యవేత్త, సలహాదారు, వక్త. ప్రస్తుతం డైరెక్టర్ సెల్లింగ్ న్యూస్ అనే పత్రికకు ప్రచురణకర్తగా ఉంటున్నారు. జాన్ ద వన్ కోర్స్ అనే పుస్తకం కూడా రాశారు. ఆర్కిటెక్చర్ సిద్ధాంతాల్ని ఉపయోగిస్తూ విజయవంతమైన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో ఇది వివరిస్తుంది.