-
Na Jeevita Katha Maxim Gorky
0₹600.00Na Jeevita Katha Maxim Gorky
ఇరుకుగా వున్న చీకటిగదిలో కిటికీకి దగ్గరగా నేలమీద మా నాన్న పడుకున్నాడు. తెల్లని దుస్తులు తొడుక్కుని అలా పడుకుని వుంటే యెంతో పొడుగరిలాగ కనబడ్డాడాయన. కాలివేళ్ళు, అదొక మోస్తరుగా ఒకదాని కొకటి యెడమ యెడమగా వున్నాయి. ప్రశాంతంగా గుండెలమీద పెట్టుకున్న మృదువైన చేతివేళ్ళు కూడా కొంకర్లుపోయున్నాయి. కళ్ళమీద వుంచిన నల్లని రాగి నాణేలు ఆయన ఉల్లాసపు కళ్ళను కప్పుతున్నాయి. దయతో ఉట్టిపడుతూండే ఆయన ముఖం నల్లబారిపోయింది, బిర్రబిగుసుకు పోయిన ఆయన పళ్ళు మెరుస్తూండడం చూచి నాకు భయం వేసింది.
అమ్మ ఆయన దగ్గర మోకాళ్ళమీద కూచుంది. అమ్మ వంటిమీద ఎర్ర గాగరా వొక్కటే వుంది, ఆమె అలా కూచుని పట్టులాంటి ఆయన జుట్టును నల్లని దువ్వెనతో నుదుటి మీద నుండి వెనక్కి దువ్వుతూంది. నేనా దువ్వెనతోనే పుచ్చకాయ తొక్కలను రంపంతో కోసినట్టు కోసేవాణ్ణి. మంద్రమైన గొంతుకతో ఏమిటేమిటో ఆమె అలా గొణుగుతూనే వుంది. ఆమె బూడిదరంగు కళ్ళు వాచిపోయి పెద్ద కన్నీటి బొట్టుల కింద కరిగిపోతూన్నట్టని పించింది నాకు.
మా అమ్మమ్మ నా చేయి పట్టుకుంది. అమ్మమ్మ స్థూలంగా గుండ్రంగా వుంది. పెద్ద తల, పెద్ద పెద్ద కళ్ళు, మాంసపు ముక్కలా ముక్కు, ఆ ముక్కు చూస్తేనే నాకు నవ్వొచ్చేది. ఆమె అంత నల్లగా వుండికూడా మృదువుగా అద్భుతంగా కనబడుతోంది. ఆమె కూడా యేడుస్తూనే వుంది. ఆమె యేడుపు అదొక విధంగా వుండి అమ్మ యేడుపుకి వెనక పాటలా వినడానికి ఇంపుగానే వుంది. ఆమె వొళ్ళు అంతా వణికిపోతూనే నన్ను నాన్న దగ్గరకి నెట్టుతూంది. నేను మాత్రం ముందుకు రాకుండా ఆమె గాగ వెనక దాగుకున్నాను. నాకు భయంవేసి యేమిటోలా వుంది……………………….Meeru Sreelu (36 Principles for Achieving Success in Telugu)
విభాగం-1
వదిలించుకోవలసినవి
“ఉద్ధరేద్ ఆత్మనాఆత్మానం నాత్మానం అవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ||”
(శ్రీమద్భగవద్గీత – అధ్యాయం-6 శ్లోకం -5)భావం: మనం మనల్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి మనల్ని మనమే దిగజార్చు కోకూడదు – (ఎందుకంటే) మన ఆత్మే మనకు మిత్రుడు, (కావచ్చు, అదే
మన ఆత్మ మనకు శత్రువు (గా మారవచ్చు)
మన ఆత్మ (అంటే మన మనస్సు), మన ఆలోచనలు, మన అలవాట్లు – ఇవే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. మన మనస్సు మనకు మిత్రుడిగా ఉండాలంటే చెడు అలవాట్లను వదలాలి. అలా వదలకపోతే, ఈ చెడు అలవాట్లు మన ఎదుగుదలకు ప్రధాన అడ్డంకిగా మారతాయి.
మనం నాజూగ్గా కనపడాలంటే, మన శరీరంలో ఉన్న అధిక కొవ్వును వదిలించుకోవాలి. అలాగే, చురుగ్గా తయారవ్వాలంటే, భయాన్ని, పిరికితనాన్ని, ఆత్మన్యూనతను, అభద్రతా భావాన్ని, ఒత్తిడిని, జాలిని మరియు కొన్ని అపోహలను వదిలించుకోవాలి.
ఈ విభాగం మనల్ని మనం ఎలా మార్చుకోవాలో, ఎలా మలచుకోవాలో చూపిస్తుంది. మన లోపాలను గుర్తించి, వాటిని ఎలా అధిగమించాలో కూడా తెలియజేస్తుంది………… -
Nenu Nadichina Bata
0₹200.00ముందుమాట
నల్లూరి వెంకటేశ్వర్లు (అన్న) గారి స్వీయచరిత్రకు ముందుమాట రాయమని ఆయన కోరటం నాకు పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. నేను విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర బాధ్యుడిగా వున్నప్పటి నుండి నాకు నల్లూరితో పరిచయం. విద్యార్థిరంగ కార్యక్రమాలకు, ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు ఒంగోలు తరుచుగా వెళ్ళేవాడిని. ఆయన ప్రజానాట్యమండలి,
యువజన సమాఖ్య బాధ్యతలు తీసుకున్నప్పుడు కూడా తరుచుగా కలిసేవాళ్ళం. చర్చించుకునే వాళ్ళం.
నేను నడిచిన బాట” శీర్షికగా ఆయన జీవిత చరిత్ర ఆసక్తికరంగా వుంది. ఐతే | ఒక లోపం వుంది. ఆయన కుటుంబ జీవితం గురించి, సహచరి గురించి, పిల్లల గురించి సమాచారం లేదు. భార్యా పిల్లల సహకారం, మద్దతు లేకుండా ఆయన ఈ సుదీర్ఘమైన బాటలో విజయవంతంగా నడవగలిగేవారు కాదని నా అభిప్రాయం.
నిజాయితీ, నిబద్దత గల కమ్యూనిస్టు జీవితం ఎలా వుండాలో నల్లూరి వెంకటేశ్వర్లు గారి జీవితం అచ్చంగా అలా వుంది.
నల్లూరి స్వతహాగా కళాకారుడు. ఒకరకంగా ఆయన తన జీవితాన్ని, కళారంగానికి, కమ్యూనిస్టు పార్టీకి అంకితం చేశాడు. యువజన రంగంలో రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, ప్రకాశం జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా సుదీర్ఘకాలం విజయవంతంగా బాధ్యతలు నిర్వహించారు. సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు.
నల్లూరి వెంకటేశ్వర్లు గారిది చెరగని చిరునవ్వు. ఎవ్వరి మీద కోప్పడుతుండగా చూడలేదు. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎవరినీ పరుషంగా విమర్శించడం చూడలేదు. ఆయనకు బాధ కలిగినా తాను దిగమింగటం తప్ప తగువుకుగానీ, ఘర్షణకు గానీ పోలేదు. కాని కమ్యూనిస్టులకుండాల్సిన వర్గ దృక్పథం నుండి పక్కకు మరల లేదు. ఆయన జీవనశైలి, నిరాడంబరత, నిబద్ధత కారణంగా, అన్ని వర్గాల చేత గౌరవింపబడ్డాడు……..
-
NTR A Biography
0₹650.00విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి తెలియని తెలుగువారుండరు. అన్నగారి సినీ జీవితం, రాజకీయ చరిత్ర గురించి ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత తెలిసే ఉంటుంది. ఇటీవల వచ్చిన ‘యన్.టి.ఆర్ – కథానాయకుడు’ చిత్రం ద్వారా ఆయన గురించి తెలియని మరిన్ని విషయాలను నేటి యువత తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ మహానుభావుడి గురించి క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం వచ్చింది. ఎన్టీఆర్ జీవితంలో మనకు తెలియని ఎన్నో విషయాలను పొందుపరిచి ఆయన జీవిత కథను ఇద్దరు విశ్రాంత ఉన్నతాధికారులు పుస్తక రూపంలో అందిస్తున్నారు. ‘ఎన్టీఆర్ బయోగ్రఫీ’ పేరిట ప్రచురితమైన ఈ పుస్తకాన్ని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.లక్ష్మీనారాయణ, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి కె.చంద్రహాస్ సంయుక్తంగా రచించారు.
-
NTR Samagra Jeevitha Katha
0₹400.00శ్రీమంతం, సారవంతం అయిన కృష్ణాతీరాన రైతుబిడ్డగా పుట్టిన నందమూరి తారక రామారావు ఈడు రాగానే పక్వానికొచ్చిన కళాకాంతుల్ని మూటగట్టుకుని వైనతేయుడిగా రెక్కవిదిల్చి చెన్నపట్నంలో వాలారు. రాముడై, కృష్ణుడై విశ్వవిఖ్యాత నటసార్వభౌముడై వెండితెరకు సొగసులద్దారు. తెలుగునాట పూజామందిరాలలో నిలువెత్తు స్థానం సంపాదించుకున్నారు. కర్మయోగిగా జనామోదం పొందారు. మరోసారి రెక్కవిదిల్చి ప్రభంజనమై తెలుగుజాతికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. జననేతగా జేజేలందుకుని తెలుగువాడికి కొండగుర్తుగా నిలిచిన ఆ మహనీయుని జీవితాన్ని ఆవిష్కరించే పుస్తకం యన్.టి.ఆర్.
-
-
Sankellu Tenchukuntu. . . .
0₹300.00మా ఊరు.. ఆ రోజులు
అధ్యాయం – 1.
మా ఊరు.. ఆ రోజులు
ఇది నన్ను తీర్చిదిద్దిన వ్యక్తులు, అధికారులు, వారితో ముడిపడిన ఘటనలకు సంబంధించిన యథార్థ జీవితం.
నేను జన్మించాను. ‘ప్రాంతంలో’ అని ఎందుకు అన్నానంటే నా తల్లిదండ్రులు లేదా తాత, అవ్వలు నేను ఏ రోజున పుట్టానో రాసిపెట్ట లేదు. ఓ నడివేసవిలో మిట్ట మధ్యాహ్నం పూట నేను పుట్టానని అమ్మ చెప్పేది. అది ఏప్రిల్ కావచ్చు లేదా మే నెల కావచ్చు. గ్రామాల్లో నివసించే ఓ చదువురాని దళిత మహిళ సంవత్సరం, నెల, తేదీ ఎలా గుర్తుపెట్టుకుంటుంది? అమ్మలాగే నాన్నకూ చదువు అక్షరం ముక్కరాదు. నేను 1962లో ఐఏఎస్లో చేరిన తర్వాతనే వారు మాతృభాషలో అక్షరాభ్యాసం చేశారు.
తన కడుపులో ఉన్నది ఓ మగబిడ్డ అని, అతడు ఏదో ఒకరోజు ఆంధ్రప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనే ఉన్నతపదవి చేపడతాడని ఏ సోదెమ్మ అమ్మకు చెప్పలేదు? ఊళ్లో ఉండే అందరు ఇతర మహిళల్లాగే అమ్మ కూడా ఎలాంటి వైద్య సదుపాయం లేకుండా నాకు జన్మనిచ్చేందుకు మరణం అంచులదాకా వెళ్లి తిరిగివచ్చింది.
నన్ను నన్నుగా తీర్చిదిద్దడంలో అతి ముఖ్యపాత్ర పోషించిన ఇద్దరు వ్యక్తులు ఎవరంటే అమ్మ శ్రీమతి కాకి మాణిక్యమ్మ, నాన్న శ్రీ కాకి శోభనాద్రి అని చెప్పకుండా ఎలా ఉండగలను? నా తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాల్లో కూలినాలి చేసుకుని జీవనం గడిపే కోట్లాది మంది లాగే కడుపేదలు. ఆ రోజుల్లో వ్యవసాయం ఊళ్లోని కూలీలందరికీ ఏడాదికి 150 రోజుల దాకా, కొందరికైతే 200 రోజుల దాకా పని కల్పించేది. నిరంతరాయంగా కొనసాగే దయనీయమైన ఉపాధికి ఇంత కన్నా మంచి ఉదాహరణ ఉండదు. కొందరు మరికొన్ని వారాల పాటు పని వెతుక్కుంటూ పొరుగూళ్లకు వెళ్లేవారు. మా నాన్న తన జీవితమంతా ఓ భూస్వామి దగ్గర పాలేరుగా పనిచేశారు. పాలేరు అంటే ఓ ఏడాది పాటు పనికి కుదుర్చుకోవడం. ఏడాది తర్వాత ఆ ఏర్పాటు కొనసాగనూ వచ్చు లేదా ఎవరిదారి వారు చూసుకోవచ్చు.
అంతా నోటిమాట మీదే నడుస్తుంది. ఎలాంటి రాతకోతలు ఉండవు. 75 కిలోల ధాన్యపు బస్తాల రూపంలో జీతాలు ఇచ్చేవారు. మామూలుగా అయితే ఓ 15 బస్తాల………………………
-
-
Anantam
0₹240.00ఓ చెరిగిపోయిన అక్షరాల్లారా కరిగిపోయిన క్షణాల్లారా! ప్రవహించండి నా కలంలో సిరాలాగ ! సరే మరణించాను నాకు 1990లో చచ్చిపోవాలని ఉంది. బహుశ విమాన ప్రమాదంలో, లేదా జలగండం వల్ల ? అదీ ఇదీ కాకపోతే నేల మీదనే కాలధర్మం. నా శవం చుట్టూ చాలామంది చేరి ఏడుస్తున్నారు. “ఎందుకేడుస్తున్నారు, ఇప్పుడేమయిపోయిందని” అని నేనెంత ధారాపాతంగా అరుస్తున్నా ఎవరికీ నా మాటలు వినబడవు. ” అనంతర కార్యక్రమం గురించి ఆలోచించామన్నా” రెవరో! దహన సంస్కారం ఎజండాలోకి వచ్చింది. అదే వీల్లేదన్నాన్నేను. మతానికి సంబంధించిన ఏ విధమైన కర్మకాండకీ నా (సజీవ లేదా నిర్జీవ) కళేబరాన్ని అంకితం చెయ్యడం అనే పనికి నేను సుతరాము అంగీకరించను.
చుట్టూ మూగిన వాళ్ళలో కొంతమందికి నేనొకసారి రాసిన మరణశాసనం జ్ఞాపకం వచ్చింది. అందులో నేను, “నేను చచ్చిపోయాక జరగవలిసిన మొట్టమొదటి పని నా శవాన్ని విశాఖపట్టణం లోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి అప్పగించడం” అని రాశాను. ఆ తర్వాత జరగవలసిన పని అక్కడున్న మెడికల్ కాలేజి విద్యార్దుల్లోని నిరీశ్వరవాదుల ఆధ్వర్యం కింద జరగాలని నా ఆకాంక్ష.
ఏడ్చి, ఏడ్చి ఆగిపోయిన వాళ్ళు, ఆగిపోయినా, ఏడుస్తున్న వాళ్లింకా ఏడుస్తూనే ఉన్నారు. ఎడవమనండి నాకు అభ్యంతరం లేదు.
విరసం వాళ్ళు నన్నూరేగిస్తామన్నారు. నా అభ్యంతరం లేదు. నా శవం మీద ఎర్రజెండా కప్పడం మాత్రం మరిచిపోకండని మరీ మరీ అభ్యర్ధించాను.
నా కొడుకే వచ్చి తన చేతుల్తో నా తలకి కొరివి పెడతానన్నాడు. ఇది వాడికి పుట్టిన బుద్దికాదనుకుంటాను. ఎవరో చెప్పించిన ట్యూషన్ అయినా అదే వీళ్ళేదంటాన్నేను.
….. శ్రీ శ్రీ
-
Asammathi Patram
0₹120.00“వారి కవితలు మేము మొదట చదివినప్పుడు, వాటిలో ఉపయోగించిన భాష అనునిత్యమూ మాట్లాడే భాషకూ, రాసే భాషకూ పూర్తిగా భిన్నమైనదిగా అనుకోవలసి వచ్చింది.”
– సి పి బ్రౌన్
“చిన్నయసూరికి ముందు ఆంద్రసారసత్వంలో వచన రచన లేదనుకోవడం పొరపాటు. వందలకొలది గ్రంథాలు వచనంలో ఉన్నవి కనబడినవి. అవి అన్నీ వాడుకభాషలో ఉన్నవి.”
– గిడుగు రామమూర్తి
“తమిళం నేర్చుకోవాలనుకున్న విదేశీయుడిని అయిన నాకు, ఉపాధ్యాయుడు నేర్పిన తమిళం వీధుల్లో ఎన్నడూ వినిపించలేదు. నేను సర్కారు జిల్లాలకు వచ్చినప్పుడు, తెలుగు సాహిత్యానికి, వాడుకలో ఉన్న తెలుగు భాషకు సంబంధం ఏమీ లేకపోవడం గమనించాను.”
– జె ఎ ఏట్స్
“నన్నయనాటి తెలుగుభాషే నేటికిన్ని ఏ మార్పు లేకుండా ఉన్నదనడం అబద్ధం. ఉండాలనుకోవడం అవివేకం. నన్నయనాటి గోదావరే ఈనాడూ ప్రవహిస్తుంది. కాని ఆనాటి జలం ఈనాటిది కాదు.”
– గిడుగు సీతాపతి
“తెలుగు సాహిత్యానికి సంకెళ్ళు వేసి కడుపు మాడ్చడమూ , లేక దానికి స్వేచ్చ, జావాసత్వాలనిచ్చి, దాన్ని ఒక గొప్ప నాగరికతా శక్తిగా చేయడమా అనేది మనపై ఆధారపడి ఉంది.”
– గురజాడ అప్పారావు