-
Ambedkar Jeevita Charitra
0₹600.00డా|| కత్తి పద్మారావు
- రాజ్యాంగ అభిభాషణ – డా|| బాబా సాహెబ్ అంబేడ్కర్ వ్యాసాలు – ఉపన్యాసాలు వాల్యూం – 17 మూడవ భాగం (అనువాదం-పీఠిక) వ్రాశాను. వ్రాసే క్రమంలో నేను అనేక గ్రంథాలు అధ్యయనం చేశాను. ఆ అధ్యయనం నుండి ఈ బృహత్తర గ్రంథ రూపకల్పన జరిగింది. ఈ గ్రంథాన్ని మొత్తంగా రెండు వేల పేజీలు వ్రాశాను. దీన్ని మూడు భాగాలుగా విభజించాను. మొదటి భాగం నా 69వ జన్మదినం జులై 2022కి తెస్తున్నాను. ఇది నా 78వ గ్రంథంలో నేను మొదటి చాప్టర్ లో అంబేడ్కర్ మూలాలు గురించి చర్చించాను. “మహర్లకు | రత్నగిరిజిల్లా కాణాచి 1911న జనాభా లెక్కల ప్రకారం ఒక్క బొంబాయిలోనే 153 ప్రత్యేక స్థావరాలు కలిగి ఉన్నారు. మహర్లు అనే నామవాచకం వలే మహరాష్ట్ర ఏర్పడిందని చరిత్రకారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో వున్న అన్ని
గ్రామాల జీవన వ్యవస్థలకు మహర్లే పునాది వేశారు. అనేక సందర్భాలలో వచ్చిన మహర్ల ఉద్యమాలు మహారాష్ట్ర సంస్కృతిలో, పరిణామంలో భాగంగా నిలిచాయి. మహర్లు శక్తివంతమైన
జాతి, అతి ప్రాచీనకాలం నుండి వారి ఉనికి భారతదేశ మూలల్లో వుంది” అని నిరూపించాను ఇందుకు అనేక గ్రంథాలు | చదివాను. భారతదేశంలో మహర్లు శక్తివంతమైన జాతి. అంబేడ్కర్ లోని ఆ ధైర్య సాహసాలు వారి నుండి వచ్చినవే. అంబేడ్కర్ ఆత్మగౌరవం మహర్ల నుండి సంతరించుకున్నదే.
మహర్లలో ఈ ఆరు గుణాలు ఉన్నాయి. –
1. మహర్ అనే పదం నుంచి మహారాష్ట్ర ఏర్పడింది.
2. ఒకప్పటి ‘మల్ల’ రాష్ట్రం క్రమంగా మహరాష్ట్రమైంది.
3. ఆ ప్రజలకు నాటి నుండి నేటి దాకా ఆరాధ్యదైవమైన మల్లారి ఖండి పేరు నుంచి ఈ పదం ఏర్పడినది.
4. ‘రసిక’ అనే జాతి ప్రజల పేరు సంస్కృతీకరణ చెంది రాష్ట్రంలో దాని నుంచి రఠిక, మహరాష్ట్ర ఉత్పన్నమైనాయి. -
-
Inko Kothi Kommacchi
0₹225.00రమణ పత్రికారంగాన్ని విడవడంతో మొదటి భాగం పూర్తి అవుతుంది. ఆ తర్వాతి నిరుద్యోగ విజయాలు, సినీరంగ ప్రవేశం, తొలిదశలో ఎదురైనా అవమానాలు, హేళనలు, సినీరచయితగా నిలదొక్కుకోవడం, ఓ డైరెక్టర్ ప్రవర్తనతో విసిగి సినీరంగాన్ని వదిలివేసి వచ్చేసినా ఆ రంగమే రెట్టింపు పారితోషికంతో పునరాహ్వనించడం, బాపుతో కలిసి చేసిన ‘జ్యోతి’ ప్రయోగం మేలు చేయడం మానేయడంతో ఏకంగా సినీనిర్మాతలు అయిపోవడం, ప్రయోగాత్మక సినిమాల నుండి అక్కినేని అందించిన సాయంతో కమర్షియల్ సినిమా వైపు మరలడం, ‘బుద్దిమంతుడు’ సంపూర్ణ రామాయణం’ సినిమా నిర్మాణాలలో ఔత్సాహిక నిర్మాతలుగా పడిన కష్టాలు…. వీటన్నిటితో రెండవ భాగం మరింత పరిచితంగా, రసవత్తరంగా సాగింది.
-
-
Kosaru Kommachi
0₹250.00“…తన ఆత్మ కథను మూడు భాగాలుగా గ్రంధస్తం చేసిన రమణగారు చాలా సంగతులు చెప్పలేదు. సినిమాలు తగ్గినా స్థితిలో సాహితి సర్వస్వం మార్కెట్లోకి వచ్చి అదరగోట్టింది. “భాగవతం” టివి సీరియల్ వచ్చి బాపు-రమణలు ఏ మాత్రం పట్టు కోల్పోలేదని నిరూపించింది. ఆఖరి శ్వాస విడిచేదాకా అయన క్రియేటివిటి తగ్గలేదని “శ్రీరామరాజ్యం” నిరూపించింది. ఇవన్ని చెప్తేనే చరిత్రకు న్యాయం జరుగుతుందనిపించి “కోతికొమ్మచ్చి”లో అయన వదిలేసిన విషయాలతో “కొసరు కొమ్మచ్చి” తయారు చేశాం.
ఆయన కుటుంబ విషయాల గురించి వారి శ్రీమతి శ్రీదేవి, కుమారుడు శ్రీ వరా ముళ్ళపూడి, కుమార్తె శ్రీమతి అనురాధ ముళ్ళపూడి రాయగా……సాహిత్యం గురించి “సాహితి సర్వస్వం” సంకలనకర్త శ్రీ ఏమ్బియస్ రాయగా….
సినిమాల గురించి, టీవీ సీరియల్స్ గురించి శ్రీ బివియస్ రామారావు (సీతారాముడు) రాశారు. అయన రమణగారికి హైస్కూల్ నుండి స్నేహితుడు. దాదాపు వారి సినిమాలన్నిటిలోనూ పాలుపంచుకున్నారు. మంచి రచయిత; సినిమా కళపై అవగాహనా కలిగినవారు. ఆయన బాపు-రమణల సొంత సినిమాల గురించే కాకా రమణ చేసిన సినిమాలన్నిటిని చూసి, వాటి కథాసంగ్రహాలు, ఎంపిక చేసిన సంభాషణలు, తెరవెనుక విశేషాలు-తన జ్ఞాపకాలతో, అనుభవాలతో రంగరించి మరీ అందించారు.
అనేక అరుదైన ఫోటోలతో అచ్చమైన ‘బాపురమణీయంగా’ రూపొందింది……ఈ “కోసరు కోమ్మచ్చి”.
-వరప్రసాద్
-
Kothi Kommacchi
0₹225.00“కోతి కొమ్మచ్చి” పుస్తకం పాటకులనే కాదు, సమీక్షకులను మెప్పించింది. బతుకుపోరాటంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా నవ్వుతూ బతకాలని భోదించిన జీవనవేదంగా – మొక్కవోని దైర్యాన్ని,ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని నురిపోసిన వ్యక్తిత్వ వికాస పాట్య పుస్తకంగా – తెలుగునాట వెలసిన, మసలిన ఆనాటి మహానుభావులతో వ్యక్తిగత అనుభవాలను ఆవిష్కరించిన జ్ఞాపకాల మాలికగా – అడుగడుగునా తెలుగు పలుకుబళ్ళను, భాషాప్రయోగాలను వెదజల్లిన చమత్కార మంజరిగా – ఒక శకానికి ఆద్యులైన భావుకద్వయం ఎలా రుపుదిద్దుకున్నారో వివరించే చారిత్రక గ్రంధంగా – రకరకాలుగా వర్ణించారు “కోతికొమ్మచ్చి”ని.
-
Mahathmudu Aayana Sidhantaalu
0₹90.00బ్రిటీషు సామ్రాజ్యవాదానికి అర్జీలు దాఖలా చేసుకుని తన దేశప్రజల్ని విముక్తుల్ని గావించాలనుకున్న మోహన్ దాస్ కరం చంద్ గాంధీ విజయమో, వీరస్వర్గమో నినాదాన్ని ఏ విధంగా ఇవ్వగలిగాడు? ఆ పరిస్థితులకు ఆయన ఎందుకు నెట్టబడ్డాడు? కొల్లాయిగట్టి, సామాన్యజనాన్ని సహాయనిరాకరణోద్యమానికి ఏ విధంగా పురికొల్ప గలిగాడు? “అహింసా” మార్గంలో ప్రజలను కార్యోన్ముఖులను చేసి పాశవికమైన బ్రిటీషు దమనకాండ నెదిరించి కోట్లాది మంది ప్రజలు పాల్గొనే రీతిలో ఉప్పు సత్యాగ్రహానికి ఎట్లా నాయకత్వం వహించాడు?.
ప్రభుభక్తీ పారాయణ కుటుంబంలో జన్మించి, ఆ ప్రభువులనే ఎదిరించగలిగిన శక్తి ఆయనకెట్లా వచ్చింది? ఉద్యమం తీవ్రరూపం దాల్చినపుడు, తన సన్నిహిత స్నేహితులూ, శిష్యులూ నిరసించినప్పటికీ ఉద్యమాన్ని ఎందుకు వెనక్కులాగాడు? బహుశ సంస్కృతుల దేశంలో పుట్టి, ఆ దేశంలోని మతోన్మాదులను తనదైన మార్గంలో వ్యతిరేకించి హిందూ – ముస్లిం ఐక్యతకోసం తన ప్రాణాన్ని ఏ విధంగా వడాడు? కరం చంద్ గాంధీ “బాపూజీగా, జాతిపితగా” ప్రజలచేత ఏ విధంగా కొనియాడబడ్డాడు? రాజకీయాల్లో ఆయన వారసత్వం ఎవరికీ దక్కాలి?.
ఈ ప్రశ్నలన్నింటికీ కామ్రేడ్ నంబూద్రిపాద్ అద్భుతమైన రీతిలో ఈ పుస్తకంలో జవాబులిచ్చాడు. రాహకీయాల్లో ఉన్నవారేగాక, నేటితరం యువకులు సహితం ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలి.
-
Mein Kampf Adolf Hitler Aatmakatha
0₹600.00Mein Kampf Adolf Hitler Aatmakatha
‘మీన్ కాంఫ్’ తొలిసారిగా 1925-26లో రెండు సంపుటాలుగా ప్రచురించబడింది. హిట్లర్ జీవించి ఉన్న కాలంలో ఇది ఎనిమిది నుండి తొమ్మిది మిలియన్ల ప్రతులు అమ్ముడవడమే కాకుండా, విస్తృతంగా అనువదించబడింది. ఇది ఇరవయ్యవ శతాబ్దపు అత్యంత అపఖ్యాతి పాలైన రాజకీయ గ్రంథం. నమ్మశక్యంకాని ఆత్మకథ, అసంపూర్ణ రాజకీయ తత్వశాస్త్రాల కలయికతో ఇది జర్మనీకి, ప్రపంచానికి విషాదాన్ని తెచ్చిపెట్టింది.
‘మీన్ కాంఫ్’ ఒక దుష్ట గ్రంథం, కానీ హోలోకాస్ట్‌ను అర్థం చేసుకోవాలనుకునే వారికి, నిరంకుశ మనస్తత్వశాస్త్ర విద్యార్థులకు, మరియు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుకునే వారందరికీ మాన్‌హీమ్ అనువాదం తప్పనిసరిగా చదవాల్సిన గ్రంథంగా మిగిలిపోయింది.
-
-10%
Mein_Kampf -మెయిన్ కాంఫ్ (అడాల్ఫ్ హిట్లర్ ఆత్మకథ)
0Original price was: ₹620.00.₹558.00Current price is: ₹558.00.మెయిన్ కాంఫ్ (అడాల్ఫ్ హిట్లర్ ఆత్మకథ)
మెయిన్ కాంఫ్అడాల్ఫ్ హిట్లర్ ఆత్మకథ అయిన ‘మీన్ కాంఫ్’, అక్షరాలా ఒంటరిగా చరిత్ర గమనాన్ని మార్చి, తరతరాలుగా ప్రజల మనోస్థైర్యాన్ని దెబ్బతీసిన ఒక వ్యక్తి మనస్తత్వాన్ని మనకు తెలియజేస్తుంది.
మైన్ కాంఫ్ (జర్మన్: [maɪn kampf] అక్షరాలా నా పోరాటం) అనేదినాజీ పార్టీనాయకుడైనఅడాల్ఫ్ హిట్లర్రాసినఆత్మకథాత్మకమరియు రాజకీయప్రణాళికహిట్లర్ యొక్కఅనేక, అతని రాజకీయ సిద్ధాంతం, మరియుజర్మనీమరియు ప్రపంచం కోసం అతని భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తుంది. మైన్ కాంఫ్ యొక్క మొదటి సంపుటం 1925లో మరియు రెండవ సంపుటం 1926లో ప్రచురించబడ్డాయి.
నవంబర్ 1923లో మ్యూనిచ్‌లో జరిగిన తన విఫలమైన తిరుగుబాటు మరియు ఫిబ్రవరి 1924లో దేశద్రోహం ఆరోపణలపై విచారణ తరువాత , హిట్లర్ లాండ్స్‌బర్గ్ జైలులో ఖైదీగా ఉన్నప్పుడు ‘మీన్ కాంఫ్’ రాయడం ప్రారంభించాడు . ఈ విచారణలో అతనికి కోట నిర్బంధంలో ( ఫెస్టంగ్‌షాఫ్ట్ ) ఐదు సంవత్సరాల శిక్ష విధించబడింది. మొదట్లో చాలా మంది సందర్శకులు వచ్చినా, అతను త్వరలోనే పూర్తిగా ఆ పుస్తకానికే అంకితమయ్యాడు. అతను రాస్తూ ఉండగా, అది రెండు సంపుటాలుగా ఉండాలని గ్రహించాడు. ఆ సమయంలో జైలు గవర్నర్ ఇలా పేర్కొన్నారు, “[హిట్లర్] ఈ పుస్తకం అనేక ముద్రణలకు రావాలని ఆశిస్తున్నాడు, తద్వారా అతను తన ఆర్థిక బాధ్యతలను నెరవేర్చగలడు మరియు తన విచారణ సమయంలో అయిన ఖర్చులను భరించగలడు. హిట్లర్ ఒక సంవత్సరానికి పైగా జైలులో గడిపాడు మరియు విడుదలైన తరువాత వేసవిలో మొదటి సంపుటాన్ని ప్రచురించాడు. మొదట్లో అమ్మకాలు నెమ్మదిగా ఉన్నప్పటికీ, 1933లో హిట్లర్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పుస్తకం జర్మనీలో బెస్ట్ సెల్లర్‌గా మారింది.
మైన్ కాంఫ్ (జర్మన్: [maɪn kampf] అక్షరాలా నా పోరాటం) అనేదినాజీ పార్టీనాయకుడైనఅడాల్ఫ్ హిట్లర్రాసినఆత్మకథాత్మకమరియు రాజకీయప్రణాళికహిట్లర్ యొక్కఅనేక, అతని రాజకీయ సిద్ధాంతం, మరియుజర్మనీమరియు ప్రపంచం కోసం అతని భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తుంది. మైన్ కాంఫ్ యొక్క మొదటి సంపుటం 1925లో మరియు రెండవ సంపుటం 1926లో ప్రచురించబడ్డాయి.
నవంబర్ 1923లో మ్యూనిచ్‌లో జరిగిన తన విఫలమైన తిరుగుబాటు మరియు ఫిబ్రవరి 1924లో దేశద్రోహం ఆరోపణలపై విచారణ తరువాత , హిట్లర్ లాండ్స్‌బర్గ్ జైలులో ఖైదీగా ఉన్నప్పుడు ‘మీన్ కాంఫ్’ రాయడం ప్రారంభించాడు . ఈ విచారణలో అతనికి కోట నిర్బంధంలో ( ఫెస్టంగ్‌షాఫ్ట్ ) ఐదు సంవత్సరాల శిక్ష విధించబడింది. మొదట్లో చాలా మంది సందర్శకులు వచ్చినా, అతను త్వరలోనే పూర్తిగా ఆ పుస్తకానికే అంకితమయ్యాడు. అతను రాస్తూ ఉండగా, అది రెండు సంపుటాలుగా ఉండాలని గ్రహించాడు. ఆ సమయంలో జైలు గవర్నర్ ఇలా పేర్కొన్నారు, “[హిట్లర్] ఈ పుస్తకం అనేక ముద్రణలకు రావాలని ఆశిస్తున్నాడు, తద్వారా అతను తన ఆర్థిక బాధ్యతలను నెరవేర్చగలడు మరియు తన విచారణ సమయంలో అయిన ఖర్చులను భరించగలడు. హిట్లర్ ఒక సంవత్సరానికి పైగా జైలులో గడిపాడు మరియు విడుదలైన తరువాత వేసవిలో మొదటి సంపుటాన్ని ప్రచురించాడు. మొదట్లో అమ్మకాలు నెమ్మదిగా ఉన్నప్పటికీ, 1933లో హిట్లర్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పుస్తకం జర్మనీలో బెస్ట్ సెల్లర్‌గా మారింది.
-