YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 697–708 of 835 resultsSorted by latest
Talarathalu
₹80.00‘కాలక్షేపానికో, కన్నీళ్లు పెట్టించడానికో కాదు – కథకో సామాజిక ప్రయోజనం కూడా ఉంది. కేవలం సమస్యను చిత్రించడమే కాకుండా ఆలోచనను కూడా కలిగించే ప్రయత్నం చేశాను. నేనెందుకు చదవాలి? అని భావించే పాఠకులకు.. మన చుట్టూ ఉన్న సమాజాన్ని కొంతవరకైనా అవగాహన చేసుకోవడానికి ఈ కథలు దోహదం చేస్తాయి. మనిషి తనను తాను సంస్కరించుకుంటూ, తన ఆలోచనలను మెరుగు పరుచుకుంటూ ముందుకు సాగితేనే ఒక మంచి సమాజ నిర్మాణంలో భాగస్వామి కాగలడు. ఆ దిశగా చేసిన చిన్న ప్రయత్నం ఇది’.
– డా జడా సుబ్బారావు
Telugu Paryayapada Nighntuvu – తెలుగు పర్యాయ పద నిఘంటువు
₹300.00చిత్తూరు జిల్లా మహాసముద్రం గ్రామంలో జన్మించిన ఆచార్య జి.ఎన్.రెడ్డి మద్రాసులో విద్యాభ్యాసం చేశారు. ”తెలుగు సాహిత్యంపై ఆంగ్ల ప్రభావం” అన్న అంశం మీద పరిశోధించిన వీరికి 1955లో యం.లిట్. పట్టా వచ్చింది. తెలుగు సెమాంటిక్స్ మీద వీరు చేసిన కూలంష పరిశోధనకు 1962లో మద్రాసు విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టా ప్రదానం చేసింది. భాషాశాస్త్రానికి సంబంధించిన అనేక ప్రసిద్ధ సంస్థలలో వివిధ బాధ్యతలు నిర్వహించారు. రాక్ ఫెల్లర్ పరిశోధకులుగా పూనాలో కొంతకాలం పనిచేశారు. లెక్చరర్ పదవి నుండి విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుల స్థాయి వరకు ఎదిగిన సాహిత్యమూర్తి వీరు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా (1984-1987) పదవీ విరమణచేసిన తర్వాత యు.జి.సి. వీరిని ఎమిరిటస్ ప్రొఫెసర్‌గా (1988-1989) నియమించింది. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రాలను సమర్పించారు. అమెరికాలోని విస్కాన్‌సిన్ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా కొంతకాలం పనిచేశారు. వివిధ దేశాలు పర్యటించారు. వీరి పర్యవేక్షణలో సుమారు 40 మంది పరిశోధకులకు డాక్టరేట్, యం.ఫిల్. డిగ్రీలొచ్చాయి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీలలో చాలాకాలం సభ్యులుగా ఉన్నారు. వీరు తెలుగు నిఘంటువు (1973), ఇంగ్లీషు తెలుగు నిఘంటువు (1978), మాండలిక వృత్తి పదకోశం (కుమ్మరం, వడ్రంగం) వంటి ప్రామాణిక గ్రంథాలకు సంపాదకులుగా ఉన్నారు. భాషాశాస్త్రం, సాహిత్యం, సంస్క ృతులపై వివిధ మౌలిక రచనలు చేశారు.
Mana Navalalu Mana Kathanikalu – మన నవలలు మన కథానికలు
₹90.00సాహిత్య విమర్శా రంగంలో నా కృషి అటు ప్రాచీన సాహిత్యం మీదా, ఇటు ఆధునిక కవిత్వం, కథానిక, తెలుగు సాహిత్య విమర్శల మీద జరిగింది. నవల మీద నా కృషి చాలా పరిమితమని ఈ గ్రంథమే రుజువు చేస్తున్నది. తెలుగు నవలల మీద నేను రాసిన ఈ పదమూడు వ్యాసాలే నేనింకా చెయ్యవలసిన కృషిని గురించి హెచ్చరిస్తున్నాయి. వీటిలో కొన్నింటిని అఫ్సర్ రాయించగా, తక్కినవి ఇతర సందర్భాల కోసం రాసినవి. ‘జగడం’ నవలకు ముందు మాట రాయమని బోయ జంగయ్య గారు నన్ను కోరడం నాకు పరమానందమైంది. ఏ ప్రక్రియ మీద విమర్శ రాసినా వస్తు చర్చ మనక బాగా ఇష్టమైంది, అలవాటైంది. నందిని సిధారెడ్డి ‘ప్రజల మనిషి’ నవలా శిల్పం మీద వ్యాసం రాయమని కోరినప్పుడు ఆనందంగా ప్రయత్నించాను. నవలా శిల్ప శాస్త్రాన్ని ముందు బెట్టుకొని కాక, నవలలో శిల్ప విశేషాలుగా నాకు కనిపించిన వాటిని చెప్పడానికి ప్రయత్నించాను.
‘కథాంశం’ తర్వాత 2006-2008 మధ్య మూడేళ్ళలో కథానికల మీద నేను రాసిన వ్యాసాలు పది. వీటిలో కొన్ని ముందు మాటలు. అయినా విమర్శనాత్మకంగా రాయడానికే ప్రయత్నించాను. – రాచపాళెం చంద్రశేఖర రెడ్డి
ఓ పుష్కర కాలంలో వచ్చిన తెలుగు నవలలు, కథానికల మీద విమర్శనా గ్రంథం ‘మన నవలలు మన కథానికలు’. సంఘ సంస్కరణ, జాతీయ, అభ్యుదయ, విప్లవ, దళిత, బహుజన, స్త్రీ, ప్రాంతీయ అస్తిత్వవాదాలను, ఉద్యమాలను ప్రతిబింబించిన నవలలు, కథలపై సమకాలీన వాస్తవికతతో చేసిన సద్విమర్శ ఇది. రాగద్వేషాలకు అతీతంగా వస్తు వివేచనతో సాగే విమర్శనా పద్ధతికి నిలువుటద్దం ఈ పుస్తకం.
ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా..సాహిత్య, సామాజిక చైతన్యానికి నిరంతరం కృషి చేస్తున్న ఈ కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత కలం నుండి వెలువడిన ‘మన నవలలు – మన కథానికలు’ అత్యంత అసాధారణ పుస్తకం.
Nalla Chepapilla Katha – నల్ల చేపపిల్ల కథ
₹20.00చైతన్య ప్రవాహంలో ఈదులాడే ఓ చిన్న ‘నల్ల చేపపిల్ల’ కథ ఇది. ప్రపంచం అంచుల్ని చుంబించాలనే తపన. నూతన ప్రపంచంలో ఆవిష్కృతం కావాలనే తిరుగులేని పట్టుదల. ఆ అద్భుత ప్రయత్నంలో చేప పిల్ల పొందిన ఎన్నో వింత అనుభవాలు, ప్రకృతి పారవశ్యాలు, విరుచుకుపడ్డ ప్రమాదాలు, వాటితో చెలగాటాలు, ఎవరెవరితోనో పరిచయాలు. శత్రు మిత్ర భావనలు, అననుకూల పరిస్థితులు, శత్రువుపై పన్నిన యుద్ధ వ్యూహాలు, మొక్కవోని ధైర్యసాహసాలతో ముందుకు మున్ముందుకు సాగించిన స్వేచ్ఛా ప్రయాణం. అదో భయమెరుగని జీవనగమనం.
నిజంగా ఇది కేవలం చేపపిల్ల కథేనా! అవును నిజమే బెహరంగీ అల్లిన మరో ‘పంచతంత్రం’ కథ. ఇది మనిషి స్వేచ్చా పిపాసకు, జ్ఞాన తృష్ణకు ఎత్తిపట్టిన ప్రతీక.
తన జాతిజనులలో, ఇంకా చెప్పాలంటే ప్రపంచ మానవాళిలో స్వాతంత్య్రేచ్ఛని, అందుకవసరమైన చైతన్యాన్ని రగుల్గొలిపేందుకు సమద్ బెహరంగి చేసిన అద్భుత సృజన ‘నల్ల చేపపిల్ల కథ’.
Prajaa Nayakudu V.Subbayya – ప్రజా నాయకుడు వి.సుబ్బయ్య
₹60.00
ఆయన పేరు సుబ్బయ్య. ప్రజలు ముద్దుగా పిలుచుకునేది వీఎస్. ఇదేదో ఓ వ్యక్తికి సంబందించింది కాదు. ఓ స్వాతంత్య్ర సమరయోధునికి, అదీ ఫ్రెంచ్-ఇండియా విముక్తి ఉద్యమానికి అంకితమైన సర్వస్వాన్నీ త్యాగం చేసిన వ్యక్తి జీవితంతో ముడిపడి ఉన్న పేరది. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహరహారం పరితపించిన హృదయమది. సుమారు మూడు దశాబ్ధాల పాటు ప్రజల కోసం, ప్రజలతో మమేకమై సమరాంగణాన నిలబడిన మహామనిషి కామ్రేడ్ వీఎస్. వలసవాదుల గుండెల్లో నిదురించి, పాండీచ్చేరి ప్రజల మనసుల్లో స్వేచ్ఛా స్వాతంత్య్రాల కాంక్షను రగిలించి అనుకున్న లక్ష్యాన్ని సాధించిన ధీరుడు, వీరుడు. ఆయనో సామాజిక వేత్త. ఎన్ని కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా, చివరకు తన ప్రాణాలకు ముప్పొచ్చినా ఏ మాత్రం వెరవక ప్రజల పక్షాన నిలిచిన చరితార్థుడు. అటు ఫ్రెంచ్-ఇండియా ఇటు బ్రిటీష్-ఇండియా చరిత్రపుటలకెక్కిన నేతలకే ఆదర్శప్రాయుడు. అటువంటి మహనీయుని సంక్షిప్త జీవిత చరిత్ర ఈ పుస్తకం.
కావడానికిది వీఎస్ జీవిత చరిత్రే కావచ్చు గాని వాస్తవానికిది పుదుచ్ఛేరి 20 శతాబ్దపు చరిత్ర కూడా. వీఎస్ జీవిత చరిత్ర నుంచి పుదుచ్ఛేరి స్వాతంత్య్ర పోరాటాన్ని విడదీసి చూడడం అసాధ్యం. అసంభవం.
Science Vijayalu
₹75.00నిప్పును ఎవరు కనుగొన్నారు… చక్రాన్ని ఎవరు రూపొందించారు… నేడు అందరూ ఎంతో ఇష్టపడే కాఫీకి మూలం ఎవరు… దూరాన ఉన్న మనుషుల సైతం మాటలతో కలిపే టెలిఫోన్ రూపకర్తలు ఎవరు… ఇటువంటి ఎన్నో విషయాలు నాటి చరిత్రగా మిగిలిపోయినా… నేటికి… రేపటికి కూడా నూతనంగా ఉంటాయి. ఇక్కడి ఆర్యభట్ట నుండి అక్కడి ఐన్స్టీన్… ఈ పుస్తకంలో పలువురు శాస్త్రవేత్తలు రూపొందించిన పరికరాలు, వాటి కాలాలు తదితర విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసారు. ఇలా ప్రపంచంలో ఎందరో శాస్త్రవేత్తల జీవితాలే కాదు, వారి పరిశోధనలు చరిత్రలుగా మిగిలినా భవిష్యత్ ప్రగతికి కొత్త మార్గాల అన్వేషణలో సహాయపడుతూనే ఉన్నాయి. నిత్య నూతనంగా… విజ్ఞాన సంబంధమైన విషయాలకు సంబంధించిన పుస్తకాలు చదవాలని ఎంతోమందికి ఉన్నా.. క్లిష్టమైన బాష అడ్డుగా మారింది. ఆయా అంశాలు మాతృబాషలో లభిస్తే ఎంతో ఉపయుక్తం. కనీసం క్లుప్తంగానైనా మాతృబాషలో ఉండి పలు అంశాలు ఒకచోట చేర్చితే చదువరులకు ఆసక్తిని, ఇష్టాన్ని కలిగించడంతో పాటు భద్రపరచుకునేందుకు వీలుగా ఉంటుంది. ఆ ప్రయత్నమే ఇది.
– జె.ఎస్. భాస్కర్
Spoorthi
₹100.00మధ్యతరగతి కుటుంబ జీవనం చుట్టూ నడిచిన కథ. కుటుంబ జీవనంలో ఉండే ఆటుపోట్లు, అత్తగారి అసహనాలు, అన్నదమ్ముల ఆప్యాయతలు, రాగానురాగాలు, అక్కడక్కడ ప్రేమమైకాలు, ఊహాచిత్రాలతో పాఠకులను ఆకట్టుకుంటుంది ఈ నవల. హద్దుల్లో ఉండే భార్యభర్తల “శృంగారం” అక్కడక్కడ ఆనందాన్ని కలిగిస్తుంది. మనస్సును ఆహ్లాద పరుస్తుంది. వారి మధ్య తియ్యని జ్ఞాపకాల నెమరులతో వివాహబంధం ఇంకా దృఢమవుతుంది. ఉన్నత వర్గాల జీవనాన్ని అనుకరించే పాత్రలున్న కుటుంబంలో పక్కదారేపట్టే వ్యక్తులనూ, ప్రత్యేకించి యువతీ, యువకులనూ సరిదిద్దడంలో పరిణతిచెందిన ఒక యువతి పాత్ర చిత్రణ ఆమోద యోగ్యంగా ఉంది. స్త్రీ కేంద్రంగా కథ నడుస్తుంది.
భార్యాభర్తల వ్యక్తిగత జీవితంలోకి అన్ని కోణాలనూ ఈ నవలలో రమాదేవిగారు చిత్రించారు. కుటుంబ వ్యవస్థలో భార్యగా, కోడలిగా, వదినగా, సోదరిగా ఒక స్త్రీ తన పాత్రను ఎట్లా నిర్వహించాలో ఈ నవలలో ఆమె చిత్రించ ప్రయత్నించారు. తనకంటే చిన్నవారిని, పెద్దలను సహితం దారిలో పెట్టడానికి ఒక స్త్రీ పడే తపనను మన కళ్ళముందుంచారు.
Anamakudu – అనామకుడు
₹15.00ధనస్వామ్య దుర్గమైన అమెరికాలో 1876లో ఓ కటిక నిరుపేద కుటుంబంలో పుట్టాడు జాక్‌లండన్. అతని జీవితం ఒక అనుభవాల గని. అదే అతణ్ణి రచయితగా చేసింది. రచయిత కావాలనేది అతని జీవితాశయం.
జీవితం మధించి అజరామర కావ్యాలు, కథలు, నవలలు సృజించిన శిల్ప సామ్రాట్టుల్ని ఆపోశన పట్టాడు. మానవ పురోగమన మార్గాలు తెరచిన మార్క్స్ ప్రభృత ప్రవక్తల రచనలు జీర్ణించుకున్నాడు. వికసించిన శాస్త్రీయ దృష్టితో, తన బాల్య కౌమారాలలో చెరగని పదచిహ్నాలకి అద్భుతంగా అక్షరరూపం ఇచ్చాడు. ‘జీవితం, మేధస్సు కలబోసి ప్రపంచాన్ని కుదిపివేసిన యాభై సంపుటాలు రాసి’ నలభయ్యో యేట జీవితం నుంచి నిష్క్రమించాడు.
తెలుగు పాఠలోకానికి చిరపరిచితమైంది జాక్ లండన్ ‘ఉక్కుపాదం’ నవల, పెట్టుబడిదారీ వ్యవస్థ మీద ఎగరేసిన తిరుగుబాటు జండాగా ప్రజల మనోవీధుల్లో కలకాలం రెపరెపలాడుతూనే ఉంటుంది.
లక్షల మెదళ్ళను కదలించిన జాక్‌లండన్ కలం నుంచీ వెలువడ్డది ‘మెక్సికన్’ అనే ఈ కథ. ఆద్యంతం ఉత్కంఠతో చదివించే, విప్లవోద్రేకంతో కదిలించే ఈ కథ జాక్‌లండన్ రాసిన కథలన్నింట్లో గణగణమండే కాగడా లాంటిది.
Batukaata – బతుకాట
₹150.00అమెరికావారి ‘తానా’ అవార్డు పొంది, నవ్యాంధ్రప్రదేశ్ డిగ్రీ మొదటి సంవత్సరానికి పాఠ్యాంశంగా వున్న విశిష్ట నవల ‘బతుకాట’.
బతుకాట పేరుకు నవలే కానీ, నిజానికి ఇది నిజమైన వ్యక్తుల జీవిత గాథ. నిజ జీవితాలను కథాత్మకంగా మలచి, నవలీకరణ చేసినట్లు స్పష్టమవుతుంది.
జగన్నాటకంలో జీవన నాటకం ఒక అంతర్భాగం. ముఖానికి రంగులేసుకుని, రంగస్థలంపైన గొంతు విప్పి ‘అడుగులు’ వేయకపోతే తమ బతుకు బండి ఒక అడుగు కూడా ముందుకు సాగలేని కుటుంబాలు ఎన్నో వున్నాయి. తమ బతుకులు కొవ్వొత్తిలా కాలి, కరిగిపోతున్నా ప్రజల్ని ఆనందింప చేయడంలోనే పరమార్థాన్ని వెతుక్కునే… అసలు సిసలైన కళాకారుల యథార్థ వ్యథార్థ జీవనగమనమే ‘బతుకాట’. – కె.ఆర్.కె.మోహన్