Showing 1–12 of 860 resultsSorted by latest

Asamardhuni Jeeva Yatra

120.00

Asamardhuni Jeeva Yatra

     తిలక్ కవిత అభ్యుదయ కవిత్వ కొన్ని పాళ్ళు, భావకవిత్వం కొన్ని పాళ్ళు, కలసిన మిశ్రమరూపం. “నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు; నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” అని తిలక్ చెప్పుకున్నాడు. ఇందులో అతని భావమేదైనా, మొదటిది తన వస్తువును గురించీ, రెండవది తన శైలిని గురించీ చెప్పుకున్నట్లు నేనర్థం చేసుకున్నాను. తిలక్ అభ్యుదయ భావనకు అందమైన శైలిని సమకూర్చి; అభ్యుదయ కవితా కాలంలో ఉన్న దోషాన్ని తొలగించడానికి ప్రయత్నించాడని చెప్పుకోవచ్చు.

             భావకవులు శబ్ద సౌందర్యానికి, శైలీ రమ్యతకూ ప్రాధాన్యం ఇచ్చారు. అభ్యుదయ కవులు ప్రగతి కారకమయిన వస్తువుకు ఈ రెండింటిలో మంచిని ఒకచోట చేర్చుకునే ప్రయత్నంలో తప్పేమీలేదు. భావన ఎంత అభ్యుదయకరమయినదయినా సుందరంగా వ్యంగ్య విలసితంగా చెప్పలేకపోతే రాణించాడు. అభ్యుదయ కవిత్వాన్ని కూడా పేలవంగా కాకుండా అందంగా చెప్పుదాం అన్నదే – తిలక్, ఆచరణ ద్వారా చేసిన సూచన.   

Amrutham Kurisina Ratri

120.00

Amrutham Kurisina Ratri

     తిలక్ కవిత అభ్యుదయ కవిత్వ కొన్ని పాళ్ళు, భావకవిత్వం కొన్ని పాళ్ళు, కలసిన మిశ్రమరూపం. “నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు; నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” అని తిలక్ చెప్పుకున్నాడు. ఇందులో అతని భావమేదైనా, మొదటిది తన వస్తువును గురించీ, రెండవది తన శైలిని గురించీ చెప్పుకున్నట్లు నేనర్థం చేసుకున్నాను. తిలక్ అభ్యుదయ భావనకు అందమైన శైలిని సమకూర్చి; అభ్యుదయ కవితా కాలంలో ఉన్న దోషాన్ని తొలగించడానికి ప్రయత్నించాడని చెప్పుకోవచ్చు.

             భావకవులు శబ్ద సౌందర్యానికి, శైలీ రమ్యతకూ ప్రాధాన్యం ఇచ్చారు. అభ్యుదయ కవులు ప్రగతి కారకమయిన వస్తువుకు ఈ రెండింటిలో మంచిని ఒకచోట చేర్చుకునే ప్రయత్నంలో తప్పేమీలేదు. భావన ఎంత అభ్యుదయకరమయినదయినా సుందరంగా వ్యంగ్య విలసితంగా చెప్పలేకపోతే రాణించాడు. అభ్యుదయ కవిత్వాన్ని కూడా పేలవంగా కాకుండా అందంగా చెప్పుదాం అన్నదే – తిలక్, ఆచరణ ద్వారా చేసిన సూచన.   

Vidhi

150.00

Vidhi

రోజులాంటి ఒక ఉదయం, చీకట్లని తరిమే వెలుగు, తేజో ప్రకాశవంతమైన సూర్యుడు, అప్పుడే నిద్ర లేస్తున్నాడు, సూర్యుని వంశ ప్రతిష్టని పెంచిన రాముడు, ప్రపంచానికి పరిచయమున్న రాముడు, ప్రపంచంలో చాలామందికి దేవుడు. ఆ దేవుడిని స్తుతించే పాటలు, ఆ పాటల ప్రయాణం మొదలయ్యే గుడి ఆవరణం, ఆ ఆవరణం ఉన్న ఒక కాలనీ, ఆ కాలనీలోని ఒక ఇంట్లో, మరో రాముడు, పేరు రామ్. ప్రతి మనిషిలో దేవుడుంటే ఈ రామ్ కూడా రాముడేనేమో.

తండ్రికిచ్చిన మాట కోసం అడవులకు వెళ్లాడు రాముడు. మరి ఈ కథలో రామ్ ఎక్కడికెళ్తాడో చూడాలి! ఏం తెలుసుకుంటాడో, ఏం గెలుచుకుంటాడో, ఎలా మలుచుకుంటాడో చూడాలి.

రామ్, ఇరవై ఆరేళ్లు వయసు దాటిన యువకుడు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. పుట్టడానికి పది రోజుల ముందే తండ్రిని పొగుట్టుకున్నాడు. తల్లి లక్ష్మమ్మే కష్టపడి పెంచింది. పెళ్ళి చేసింది. రామ్ భార్య భువితో జీవితం హాయిగా గడుపుతున్నాడు.

ఉదయం ఆరు గంటలయింది. జాగింగ్కి, షూ లేస్ కట్టుకుంటున్నాడు రామ్. నిద్ర మత్తుతో అప్పుడే మేల్కొంది భువి. అందరికంటే ముందే లేచి కాఫీ కలుపుకుని సోఫాలో హాయిగా కూర్చొని కాఫీ తాగుతోంది లక్ష్మమ్మ.

“గుడ్ మార్నింగ్ అమ్మ,” అని రామ్ పలకరించాడు.

“గుడ్ మార్నింగ్ నాన్న,” అంది లక్ష్మమ్మ.

“గుడ్ మార్నింగ్ రామ్, గుడ్ మార్నింగ్ అత్తమ్మ,” అంటూ భువి, నిద్ర ముత్తుతో లేచి కూర్చుంది……………………

Satyajith Roy Evaru?

225.00

Satyajith Roy Evaru?

సత్యజిత్ రాయ్ ఎవరు?

* ఆటకట్టు

* గొర్రెలకాపరి

* జనం

* తూరుపు

* తెల్లారింది

* నక్సలైట్ రాత్రులు

* పెద్దల న్యాయం

* ప్రేమకు శిక్ష

* సత్యజిత్ రాయ్ ఎవరు

* మంచు పల్లకి

* ఎల్లోరాలో వాళ్లు ముగ్గురు

* కాటుక కళ్లు కథలు మూడు

* బెనారస్ చిత్రాలు

Prema ledani premincharaadani

250.00

Prema ledani premincharaadani

” ప్రేమ! మనందరి జీవితాల్లో ఏదో ఒక మలుపులో పలకరించే అతి పెద్ద మిస్టరీ. కొందరిని ఇది ఆకాశంలో నిలబెడితే, మరికొందరిని కోలుకోలేని గాయంతో మిగిల్చేస్తుంది. ఎందుకు కొందరు ప్రేమకోసం దశాబ్దాల తరబడి ఎదురుచూస్తారు? ఎందుకు కొందరు దీన్ని కేవలం ఒక భ్రమగా కొట్టిపారేస్తారు? ఈ నవల కేవలం ఒక కథ కాదు, ప్రేమ చుట్టూ మనందరికీ ఉండే ఎన్నో ప్రశ్నలకు సమాధానం. ఎన్నో సందేహాలను వెతికే ఒక అన్వేషణ. అపర్ణ అనే ప్రాక్టికల్ జర్నలిస్టుకు, అనిరుధ్ అనే ఎమోషనల్ ఫోటోగ్రాఫర్కు మధ్య జరిగే ఈ ప్రయాణం ప్రేమలోని ప్రతి పొరను తడిమి చూస్తుంది. ప్రేమ వల్ల కలిగే బాధను ఎలా అర్థం చేసుకోవాలి? ఆ గాయం నుంచి బయటపడి మళ్ళీ మనల్ని మనం ఎలా ఇష్టపడాలి? అనే విషయాలను ఈ పుస్తకం చాలా సున్నితంగా చర్చిస్తుంది. మీ గుండె లోతుల్లో దాచుకున్న పాత జ్ఞాపకాలను మళ్ళీ స్పర్శిస్తూనే, ఆ నొప్పిని నయం చేసే ఒక మధురమైన అనుభూతి ఈ నవల. ఈ పుస్తకం చదివిన తర్వాత ప్రేమ గురించి మీ ఆలోచనా విధానం ఖచ్చితంగా మారుతుంది. రండి. మళ్లీ ప్రేమను ప్రేమిద్దాం.

Shivoham

300.00

Shivoham

నా పేరు శివ ప్రసాద్. నాన్న మొక్కి మొక్కి శివయ్య దగ్గర సాధించుకున్న సంతానం నేనే. అసలే నాన్న శివ భక్తుడు. నాన్న ఎన్నో మొక్కులు మొక్కి, అమ్మ ఎన్నో నోములు నోచి నన్ను పొందారు. కానీ ప్రేమ నాపై ఎంతకాలం ఉందో నాకు గుర్తు లేదు. ఎందుకంటే నా పుట్టుకే నా కుటుంబానికి శాపం. పెట్టిన పేరు మార్చలేరు కదా అందుకే శివ ప్రసాద్ అనే పేరు అలాగే మిగిలిపోయింది. కానీ ఊరి వాళ్లు ముద్దుగా పెట్టుకున్న పేర్లు.. మూగోడు, మొండోడు, మొరటోడు.

ఆ పేర్లలో ముద్దు లేదు, నిజం మాత్రమే ఉంది, ఎందుకంటే నాకు మాట రాదు. ఈ సమాజం నాకు అర్థం కాదు, నేను ఈ సమాజానికి అర్థం కాను. మాదో బ్రాహ్మణ కుటుంబం. మాకు స్వరం లేకపోతే పొట్ట నిండదు.. పూట గడవదు. ఆ దేవుడు ఇచ్చిన స్వరంతో దేవుడిని కొలిస్తే తప్ప మనుగడ లేని కులం మాది.. వేదం చదవాలి, కీర్తన పాడాలి, గుడిలో పూజ చేయాలి కానీ ఇవేవీ చేయలేను.,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

Lankamala Daarullo

300.00

Lankamala Daarullo

అసాధారణ పధికుడు

కొంతమంది కుర్రవాళ్ళు పావన నవజీవన నిర్మాతలు అని మహాకవి అంటున్నప్పుడు ఆయన మనసులో ఎవరున్నారా అని అనుకుంటూ ఉంటాను. బహుశా తన కాలం నాటి తక్కిన యువకుల్లాగా జీవితంతో రాజీపడకుండా వ్యవస్థ మీద తిరుగుబాటు బావుటా ఎగరేస్తారనే ఆశ కల్పిస్తున్న యువకుల్ని చూసి ఆయన ఆ మాట అని ఉండవచ్చు. కాని ఇప్పుడు లంకమల వివేక్ని చూడగానే ఆ మాటలు గుర్తొస్తున్నాయి. నాకు.

నిజానికి వివేక్ చాలా సాధారణమైన నేపథ్యం నుంచి వచ్చిన చాలా సాధారణమైన యువకుడు. సాధారణమైన ఉద్యోగి. కాని మన కళ్ళముందే అతడు మన కాలపు అత్యధిక సంఖ్యాకులైన యువకులకన్నా ప్రత్యేకంగా, అసాధారణంగా తనని తాను ఆవిష్కరించుకుంటూ వస్తున్నాడు. ఆ ఆవిష్కరణ ఒక్కసారిగా హటాత్తుగా మనల్ని నివ్వెరపరిచేదిగా కాకుండా నెమ్మదిగా, ఫాల్గుణమాసంలో చెట్టు చిగిరించడం మొదలుపెట్టినంత సహజంగా కొంతకాలంగా చూస్తూ ఉన్నాను……………

Kondamallu

300.00

Kondamallu

అడవి మొగ్గల వాన గోరటి వెంకన్న

డవి మొగ్గల వాన.. చెంచు గిరుల కోన, కారుకోడి పదును, బ్రహ్మనాయుడి కదును కథావరణంలోకి మనలను అలవోకగా తీసుకుపోయే నవల ఇది. అడవిని ఆలంబన చేసుకొని, తనే ఒక ఆదివాసిగా మారి చెంచుల జీవితాన్ని చిత్రిక పట్టిన తొట్ట తొలి చారిత్రక నవల. రచనా మౌలిక తత్వాన్ని ఆకళింపు చేసుకున్న, గతాన్ని తొవ్వి ఉన్నవి, విన్నవి, వర్తమాన అధ్యయనంలో కన్నవి, ఎరుకపడినవి అన్నింటిని కుప్ప పోసి ఉద్వేగ భరిత శైలితో ప్రాణప్రతిష్ట చేసిన నవలే కొండమల్లు.

“పోసగు ముత్యపు సరులు మోహరించిన రీతి తమలోన దొరలు శబ్దముల” గూర్చి (పింగళి సూరన) అల్లిన గాథ ఇది. అడవిలో కృతక విలాసాలు ఉండవు. కానీ ఆహ్లాదమంత అడవి ఒడిలోనే ఉన్నదన్నంత గొప్పగా ఉంటుంది. ఋతువు ఋతువుకు మారే అడవి అందాలుంటాయి. ఎగిరే ఎన్నో పిట్టలు తమ భాషలో శబ్దం నొంపుతూ మనలను మురిపెంగా పలకరిస్తాయి. ఎన్నో పాకే చెట్ల తీగలు లేత మునివేళ్ళతో మనల్ని తడుముతాయి. పుటల నిండా పరుచుకున్న అడవి చెట్ల పుప్పడి సుగంధం మనల మరో లోకం మైకంలోకి తీసుకు వెళ్తుంది. ఆధునిక జీవన అవిటి తనాన్ని వెనుకకు నెట్టే శక్తి గల అక్షర పొదుగు ఈ నవల.. పసరుటాకుల నులి స్పర్శ, దేహ మాలిన్యాన్ని తొలగించే కొండ పసుపు ఇది. అలసటను మరిపించే ఇప్పపూల. అమ్మ సిరుల సామ్రాజ్యపు ఒద్దిమాను బండాగారమిది…………………………..

Kokoro

120.00

Kokoro

సెన్సే – నేను

అతనిని నేను ఇంకో పేరుతో ఎన్నడూ పిలవలేదు. అందుచేత అసలు పేరు ఎత్తకుండా ‘ సెన్సే’ అనే పేర్కొంటాను. మొట్టమొదటిసారిగా మేము కమలారాలో కలుసుకున్నాము. అప్పటికింకా నేను చదువుకుంటున్నాను. సెలవులు. కొద్దిరోజులపాటు ఒక స్నేహితునితో గడుపుదామని కమలారా వెళ్ళాను. మూడురోజులు గడిచాయో లేదో వెంటనే ఇంటికి బయలుదేరి రమ్మని నా స్నేహితునికి తల్లి దగ్గర నుంచి తంతివార్త వచ్చింది. అతను వెళ్ళాడు. నేను ఒక్కడినే కమలారాలో దిగబడిపోయాను. కాని సెలవులు పూర్తి అయ్యేవరకు మేము బసచేసిన ఇంటిలోనే ఉండాలని నిశ్చయించుకున్నాను…………………..

 

Ayn Rand Philosophy

275.00

Ayn Rand Philosophy

ఫిలాసఫీ; ఎవరికి అవసరం?

 

(మార్చి 6, 1974 నాడు వెస్ట్ పాయింట్లో యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడెమీ వాళ్ళ గ్రాడ్యుయేటింగ్ క్లాసులో చేసిన ప్రసంగం)

నేను ఫిక్షన్ రచయిత్రిని కాబట్టి ఒక చిన్న కథతో మొదలు పెడతాను. మీరొక అంతరిక్ష యాత్రికుడని అనుకోండి. మీరు ప్రయాణిస్తున్న అంతరిక్షనౌక అదుపు తప్పి వివరం తెలియని ఒకానొక గ్రహంమీద కూలిపోయిందనుకుందాం. తెలివి వచ్చాక, అంతగా దెబ్బలు తగల్లేదని గ్రహించారు మీరు. అప్పుడు మీ మనస్సులో మెదిలే మొదటి మూడు ప్రశ్నలు ఏమై ఉంటాయంటే, 1. నేనెక్కడున్నాను? 2. ఆ విషయం నాకెలా తెలుస్తుంది? 3. నేను ఏం చెయ్యాలి?

మీరు ఎరగని చెట్టూ చేమలూ ఉన్నాయక్కడ. పీల్చుకునేందుకు గాలి ఉంది. ఎండ, మీరెరిగిన ఎండకన్న లేతగానూ, చల్లగానూ ఉంది. ఆకాశం కేసి చూడబోయి ఆగిపోయారు. ఉన్నట్టుండి మీకొక ఆలోచన వచ్చింది. మనం చూడడం మానేస్తే 6 ‘భూమినుంచి చాలా దూరంలో ఉన్నాం, తిరిగి వెళ్ళడం అసాధ్యం’ అని తెలుసు కోవాల్సిన అవసరం ఉండదనుకుంటారు. తెలియనంత సేపూ ఇష్టం వచ్చినట్టు ఊహించుకునే స్వేచ్ఛ ఉంటుంది కదా అని. అప్పుడు మీకు మసకమసకగా, సంతోషదాయకంగా, కానీ ఒకరకమైన అపరాధభావనతో కూడిన, ఒక ఆశ కలుగుతుంది.

మీ పనిముట్లను చూసుకుంటారు. అవి పాడయిపోయి ఉండొచ్చు. ఎంత చెడిపోయాయి అన్నది మీకు తెలియదు. ఆగిపోతారు. ఉన్నట్టుండి భయమేస్తుంది. ఈ పనిముట్లను ఏ మేరకు నమ్ముకోవచ్చు? ఇవి తప్పుదారి పట్టించవని నమ్మక మేమిటి? మరో ప్రపంచంలో ఇవి పనిచేస్తాయో లేదో ఎలా తెలుస్తుంది? పనిముట్లు వదిలేస్తారు.

‘అవునూ! ఏమీ చెయ్యాలనిపించడం లేదేమిటి?’ అని ఆశ్చర్యపడతారు. ఎలాగో ఏదో జరిగితే బావుండునని ఎదురుచూడడం ఎంతో క్షేమం అనిపిస్తుంది. ఆ నౌకను కుదపకపోవడమే మేలనిపిస్తుంది. దూరంగా ఒకరకం జీవులేవో మీకేసి వస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్లు మనుషులవునో కాదో మీకు తెలియదు. కానీ వాళ్లు రెండు కాళ్ళజీవులే. ‘నేనేం చెయ్యాలో వాళ్లు చెబుతార్లే’ అని నిర్ధారించుకుంటారు………………

Prema Lekhalu|ప్రేమ లేఖలు-చలం

275.00

PREMALEKHALU

“తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలంది. తనను తాను అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంతదూరం ప్రయాణించగలడో అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలం. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తన ప్రయాణాన్నంతా రచనల్లో కూర్చిన వ్యక్తి.”
1894 మే 19న జన్మించిన చలం నవలలు, కథలు, కవితా రచనలు, రూపకాలు, ఏకాంకికలు, అనువాద రచనలు మిక్కిలిగా చేశారు. ఇంకా చరిత్రలు, వ్యాసాలు, లేఖలు, పీఠికలు, వేలకొలది ఉత్తరాలు వెలువరించారు. చలం జీవితం, సాహిత్యం మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి. 1979 మే 4న కనుమూశారు.
“ఉత్త సమాచారాలనే అందించేవి ఉత్తరాలు. ప్రేమలేకపోతే అది లేఖ కాదు. ఉత్తి ఉత్తరం. గుడిసె అన్నా, పర్ణశాల అన్నా అర్థం ఒకటే. మాట చుట్టూ ఉండే వాతావరణంలోనే భేదం అంతా.
చలంగారు ప్రేమలేఖలు వ్రాసేటప్పుడు మనసులో ఎవరున్నారో లేరోగాని ఎవరో ఉన్నంత వాస్తవంగా ఉంటుంది లేఖ. వాటిని పోస్టులో ఎవరూ అందుకోలేరు, పుస్తక రూపంలో పాఠకులు తప్ప. లేఖలు వ్రాయడం నేర్చుకోదలచిన వారికి ఇవ్వి ఒరవడులు.
ప్రేమలేఖలలో ఉన్న చలం మనసు, జీవిత ఘట్టాలు, ప్రేమలు, విరహాలు, సౌందర్య చర్చలు, తాత్విక ప్రశ్నలు, ఇంకా అనేకానేకం చలం జీవితంలోని వాస్తవాలే!
ఈ లేఖలు 1922 నుండి 1947 వరకు వీణ మొదలయిన పత్రికలలో ధారావాహికగా వచ్చాయి. మొత్తం లేఖలు 49