YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 709–720 of 835 resultsSorted by latest
Bujjoni Kala – బుజ్జోని కల
₹35.00‘ఉదయం రోజును ప్రతిబింబించినట్లు బాల్యం మనిషిని ప్రతిబింబిస్తుంది’ అంటాడు మిల్టన్. అందుకే నిండు నూరేండ్ల జీవితానికి ఉపయోగకరమూ, విజ్ఞానదాయకమూ అయిన ప్రాతిపదికను ఏర్పరచడంలో భాగంగా బాలసాహిత్యం ఆవిర్భవించింది. పిల్లలకు వినోదాన్ని పంచి, దాని ద్వారా విజ్ఞానాన్ని పెంచి, మానసిక వికాసాన్ని కల్గించడానికి అది ఒక మంచి సాధనమైంది.
బాలసాహిత్యంలో గేయ ప్రధానమైన రచనలకు అత్యంత ప్రాధాన్యముంది. పుట్టినప్పటి నుంచి ఇవి పిల్లలకు ఉపకరిస్తాయి. తల్లులు పాడే జోలపాటలు, లాలి పాటలు, చందమామ పాటలు ఈ కోవకు చెందినవే. పాటలు శ్రవ్య సాహిత్యానికి సంబంధించినవి. కథలు కూడా ఇందులో భాగాలే అయినా వాటిని అర్థం చేసుకోవడానికి కొంత వయసు రావాలి. కానీ పాటలలా కాదు. వీటికి తాళం, లయ, గతి, ప్రాస మొదలైన నియమాలుండడం వల్ల, నాదాన్ని ఆశ్రయించడం వల్ల శ్రవణప్రియంగా ఉంటాయి. పిల్లలకు తొందరగా పట్టుబడతాయి. ప్రాచీన బాల సాహిత్యం ఎక్కువగా గేయరూపంలో ఉండడానికి కారణమిదే. గేయాల్లోని భావం వాళ్లకు అర్థం కాకున్నా వాటిలోని లయ వాళ్ల వెంటనడుస్తుంది. నాదం పరవశింపజేస్తుంది. అందుకే ‘శిశుర్వేత్తి పశుర్వేతి వేత్తిగాన రస పణి:’ అన్నాడు.
‘బుజ్జోని కల’ గేయ సంపుటిలోని గేయాలన్నీ ఐదారేండ్ల వయసు పిల్లల్ని ఉద్దేశించి రాసినవి. పిల్లల్లోకి పరకాయ ప్రవేశం చేసి రాసినవి. అందుకే సహజంగా గోచరిస్తున్నాయి. వీటిలో వస్తువైవిధ్యముంది. చిన్న పిల్లల అందచందాలకు, ముద్దుముచ్చట్లకు, చిలిపి చేష్టలకు, చిత్త ప్రవృత్తులకు శాస్త్రి ఈ పాటల ద్వారా ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. వీటిలో ఆసక్తికరమైన పిల్లల ఆటల్ని చూడొచ్చు. తేనెలొలికే ముద్దు మాటల్ని వినొచ్చు. నిర్మలమైన వాళ్ల మనసుల్ని చదవొచ్చు. – ఆచార్య ఎం.కె.దేవకి
Konni Kalaalu Konni Samayalu – కొన్ని కలాలు కొన్ని సమయాలు
₹280.00సమాజంలో ఎక్కడ ఏ కొద్దిపాటి అవకతవకలు జరిగినా ముందు కవులూ, రచయితలు స్పందిస్తారు. తమ స్వరాన్ని వినిపిస్తారు. వారి వల్ల, వారి అక్షరాల వల్ల విప్లవాలు, సంస్కరణలు, మేళ్ళు నేరుగా జరగకపోవచ్చు కాని, జనాన్ని చైతన్యవంతుల్ని చేయడంలో వారు ముందుంటారు. వారి అక్షరాలు ముందుంటాయి. సృజనకారులకు అడ్డుగోడలు పనికిరావు. వారు విశ్వమానవులు! మానవీయ విలువల్ని కాపాడుతూ వచ్చిన కొంతమంది సాహితీ మహనీయుల జీవితాల్ని, వారి సృజనాత్మక కృషిని ఈ పుస్తకంలో గుర్తు చేసుకోవడం జరిగింది. ఇందులో ఎకడమిక్ విభజనలేవీ లేవు. ఇందులో చేర్చని మహాకవులు, రచయితలు ఇంకా ఎంతోమంది ఉన్నారు. వారి గూర్చి నేను రాయకపోవడం వల్ల చేర్చలేకపోయాను. భవిష్యత్తులో రాయగలిగితే, మరో పుస్తకంతో పాఠకుల ముందుకొస్తాను. ఇందులో తెలుగు రచయితలు, భారతీయ రచయితలు, విదేశీ రచయితలు అని మూడు విభాగాలుగా విభజించాను. పక్కపక్కనే ఉండడం వల్ల సాహిత్యకృషి పోల్చి చూసుకోవడానికి, బేరీజు వేసుకోవడానికి, అధ్యయన పరులకు ఉపయోగకరంగా ఉంటుందని అనుకున్నాను. చదవడం తగ్గించిన నేటి తరానికి వ్యక్తిత్వ వికాస దిశగా తపన గురించి, వారు నిలబెట్టాలనుకున్న జీవిత విలువల గూర్చి తెలియజేస్తుంది. – దేవరాజు మహారాజు
Neelaveni – నీలవేణి
₹100.00అవును ఇది కథన కుతూహలమే. పి.వి.సునీల్ కుమార్ కథల్లో తొంగి చూసేది, పొంగి పొరలేదీ సామాజిక అన్యాయంపై కదన కుతూహలం.
ప్రేమరాహిత్యం నుండి సామాజిక న్యాయం వరకూ, పోలీసు నుండి పొలిటీషియన్ వరకూ ఏ అంశం ఆయన కలం స్పృశించినా పాఠకుడికి వ్యంగ్యపు పంట పండినట్టే.
అంతర్జాతీయ సాహిత్యంలోనే అరుదూ, తెలుగు సాహిత్యంలో అయితే అసలు ఊసేలేకుండా పోయిన సెటైర్ (వ్యంగ్యం) సునీల్ కుమార్ కలం నుండి తీయటి గోదావరి ధారలాగా పరవళ్ళు తొక్కుతోంది ఈ కథా సంపుటిలో.
”దెయ్యాలు’ ప్రేమను పంచినా, ‘డిసిప్లి’లు సామాన్యుడి కోసం మొరిగినా అన్నీ సునీల్ కుమార్ మార్కు పంచ్ లోనే.
‘థూ’ అన్నా, ‘చీకటి’ కన్నా, ‘పరిశుద్ధంగా’ వివాహాన్ని ‘దేవదాసు’ జరిపించినా ధిక్కార స్వరమే కానీ, మరీముఖ్యంగా వినోదాలు జల్లు.
ఈ కథల్లో జీవం ఉంది, జీవితం ఉంది…. రంగుల హరివిల్లులా నవ్వులు పూయించగల హాస్య-వ్యంగ్య వైభవం ఉంది.
అక్షరాల ఇది అనితరసాధ్యం… అందుకోండి అక్షర తూణీర వ్యంగ్య నీరాజనం.
Vidyardhi Vyasalu
₹100.00ఈ గ్రంథమునందు విద్యార్థులు తప్పని సరిగా అలవరచుకోనదగిన, క్రమశిక్షణ, ఆత్మావిశ్వాసము, సమయపాలన, శారీరక, మానసిక దృఢత్వము, బాహ్యామభ్యంతర శుచి, ఒత్తిడిని అధిగమించుట, శీల నిర్మాణము, ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిత్వ వికాసము, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలూ, సమతా భావములు వంటి సద్గుణములు పెంపొందించుకొనుటకు ఉపయుక్తమైన, ఆదర్శ విద్యార్థి, ఉత్తమ గురువు, యోగాసనములు, ప్రాణాయామము, శీలము, నైతిక విలువల వంటి వ్యాసములు ఆణిముత్యములు. ప్రతి విద్యార్థియు ఈ పుస్తకము చదివి ఆ ఆణిముత్యముల విలువను పొందురుగాక!
Yevaree Chatrapati Sivaji – ఎవరీ ఛత్రపతి శివాజి
₹40.00భారతావనిలో యెంతమంది రాజులు లేరు? ఎంతమంది స్వతంత్రంగా పాలించలేదు. ముస్లిం పాలకులు, హిందూ పాలకులు సమాంతరంగా పరిపాలించిన దశలూ ఉన్నాయి. ముస్లిం పాలకులకి వ్యతిరేకంగా హిందూ పాలకులు కత్తిగట్టారనీ, హిందూ ధర్మస్థాపన కోసం కంకణబద్దులయ్యారనీ కొంతమంది చరిత్రకారులు వక్రీకరించి చెపుతూ వుంటారు. ”వక్రీకరించి” అనడం ఎందుకంటే వాళ్ళు ముస్లింలు కాబట్టే హిందువులు కత్తిగట్టనూలేదు. ముస్లిం రాజులు సాటి ముస్లింరాజుల మీద దాడులు చెయ్యకపోనూలేదు. ఇక్కడ సమస్య అల్లా మతంకాదు. పాలకుల నైజం, వ్యవహారశైలి, పాలితులపట్ల వాళ్ళ వైఖరి. హిందువు అయినా, ముస్లిం అయినా క్రూర చక్రవర్తిని ప్రజలు అసహ్యించుకున్నారు, ఎదిరించారు. దయగల ప్రభువుల్ని ఆదరించారు – వాళ్లు ముస్లింలు అయినా, హిందువులు అయినా, అలా ప్రజాదరణ పొందినవాడు శివాజి.
శివాజి దండయాత్రలు, దుర్గాల ముట్టడి, శత్రు శిబిరాల్లో పరాక్రమ ప్రదర్శన లాంటి వీరోచిత కృత్యాలన్నీ జనం నోళ్ళల్లో కథలు, గాథలుగా అల్లుకుపోయాయి.
‘రాయఘడ్’ రాజధానిగా ఆయన స్థాపించిన సామ్రాజ్యంలో ఎన్నో సంస్కరణలు కార్యరూపం ధరించాయి. ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం, వాళ్ళని పెత్తందారుల ఆగడాల నుంచి బయటపడెయ్యడం కోసం ఆయన ఎన్నో ఘనకార్యాలు నిర్వహించాడు. సైన్యాన్ని, నావికదళాన్ని నిర్మించాడు. దుర్గాలని పటిష్ట పరిచాడు. అక్షరాస్యత వ్యాప్తికి నడుంకట్టాడు. పరిపాలనా భాష సంస్కరించాడు. రాజ వ్యవహారం కోశం అనే నిఘంటువును తయారు చేయించాడు. శిక్ష్మాస్మృతి సమన్యాయంతో అమలుచేశాడు. మొత్తం మీద ”ప్రజల మనిషి” అని ప్రజల మన్నన పొందాడు.
శివాజికి ముస్లింమత విద్వేషం యేమాత్రం లేదు. ఔరంగజేబ్‌తో పోరాడినా తన కొలువులో, సైన్యంలో ముస్లింలని యే శంకలూ లేకుండా నియమించాడు. ఆయన విశాలదృక్పథం, ఏ ఒక్క మతానికి సంకుచితం కాకుండా ఆయన్ని మహనీయుణ్ణి చేసింది.
thirteen fourteen fifteen
₹100.00హృదయం గది నిండా బాధ బురద పేరుకు పోకుండా నిరంతరం ప్రక్షాళన చేయడానికి కన్నీటిని ఇచ్చాడు భగవంతుడు. ఈ పెళ్ళి అనే వ్యవస్థలో ఏదో లోపం వుంది కాబట్టే చాలా మంది స్త్రీలు రాజీపడటాన్నీ, చాలా మంది పురుషులు ఎస్కేపిజాన్నీ తమ జీవితంగా మార్చుకుని బ్రతుకుతున్నారు. దేహావసరాలు తీర్చుకోవటమే జీవితం అనే అభిప్రాయానికి మనిద్దరం బలవంతంగా తోయబడ్డాం. ఒకరికొకరు ఏమీ కాకుండా …. కేవలం భార్యాభర్తలమయి…. ఇలా అసంతృప్తితో వేగిపోతున్న ఆమె – భర్తని ఒక అర్ధరాత్రి హోటల్ గదిలో ఒకమ్మాయితో చూసిన ఆమె, అదే ఆవేశంతో వెళ్ళి తనని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే యువకుడి ఇంటి తలుపు తట్టింది. పురుషుడికొక న్యాయం స్త్రీకో న్యాయం ఎందునుకుంది.
అదొక తాత్కాలికమైన అసంకల్పిత ప్రతీకార చర్య, పర్యవసానం ? బ్లాక్ మెయిలింగ్, మానసిక సంఘర్షణ, ఊపిరి సలుపనివ్వని క్లైమాక్స్.
నకిలీ హిప్నటిజాల మాఫియా, కృత్రిమ సంతానోత్పత్తి కేంద్రాల మోసాల నేపధ్యంలో ఒక జర్నలిస్టు, ఒక రచయిత్రి, ఒక వ్యాపార వేత్త, భారతదేశపు నెంబర్‌వన్ టెన్నిస్ ప్లేయరు ఒకరు –
నాలుగువిభిన్న మనస్తత్వాలతో రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఆడుకున్న గేమ్ ’13-14-15′.
Antarmukham – అంతర్ముఖం
₹100.00తులసిదళం నవల ద్వారా నవలా సాహిత్యంలో సంచలనం సృష్టించిన యండమూరి ఈ నవలలో మానవ సంబంధాలని అత్యద్భుతంగా విశ్లేషించారు. తెలుగు నవలా సాహిత్యంలో ఈ నవల చిరస్థాయిగా ఉంటుంది. ప్రతి పుస్తకాభిమాని చదివి గుండె లోతులో దాచుకోవలసిన భావాలూ ఈ పుస్తకంలో ఉన్నాయి. ప్రతి గ్రంధాలయంలోను ఉండాల్సిన పుస్తకం ఈ నవల.
– ఇండియాటుడే
******
యండమూరి రచనా జీవితంలో ఈ పుస్తకం అత్యుత్తమ మైనదని ఆయన ప్రకటించడం అతిశయోక్తి కాదు.
– ఈనాడు
******
ప్రతి పేజీ లోనూ గొప్ప వాక్యాలు ఉన్నాయి. ప్రతి వాక్యంలోనూ గొప్ప గొప్ప భావాలున్నాయి. ప్రతి పాఠకుడి గుండెని కదిలిస్తుంది. “నేను వయసులో ఉన్న వృద్ధ శవాన్ని జ్ఞానంతో శైశవాన్ని” లాంటి గొప్ప భావాలూ ఎన్నో…”
– ఆంధ్రజ్యోతి
Abhilasha – అభిలాష
₹90.00‘మనిషి మనసంత కుత్సితమైనదీ, అనూహ్యమైనదీ. మరొకటి లేదని నా ఉద్దేశ్యం. పాతిక సంవత్సరాలు క్రిమినల్ లాయరుగా పనిచేసి నేను కనుక్కున్న దేమిటంటే, ఈ ప్రపంచంలో ప్రతి మనిషీ క్రిమినలే. కొందరు చట్టపరిధిలోకి వస్తారు, కొందరు రారు. నేను రెండో రకానికి చెందినవాణ్ని అని నాకు తెలుసు. అయినా మనసుని అదుపులో పెట్టుకోలేక పోయేవాణ్ణి. పొద్దున్నే దేవుడి పూజ చేసి బెడ్‌రూమ్‌లోకి వచ్చి పధ్నాలుగేళ్ళ అమ్మాయిని నిద్రలేపటం చిత్రమైన సంతృప్తినిచ్చేది – లేపేముందు మోకాళ్ళమీద గౌనుసర్దటం, ఇంకో రెండు మూడేళ్ళు పోయాక తొలగిన పైట సర్దకుండా లేపటానికి ప్రయత్నించటం అలవాటయింది. నేను కొద్ది కొద్దిగా ఫెటసిస్ట్‌గా మారసాగేను. ఒకరోజు బాత్‌రూమ్‌లో నాకంటిని పుల్లతో పొడిచావుకూడా”.
వింటున్న అర్చన శిలే అయింది. ఇంత నిజాన్ని ఆస్వాదించే శక్తి ఆమెకు లేకపోయింది. ప్రొద్దున్నే పూజగదినుంచి సరాసరి తన గదికి వచ్చి ‘లే అమ్మా లే, ఎనిమిదవుతుంది’ అనితట్టి లేపే మావయ్య తన స్వంతమావయ్య మనసులోనూ, చర్యవెనుక ఇంత ఘాతుకమైన ఆలోచన వుందా ?
ఆమె సిగ్గుతో కుదించుకుపోయింది. ఆయన తనగదిలో ఉన్నప్పుడు స్వంతతండ్రే ఉన్నట్టు ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించేది! అనుక్షణమూ తన కదలికల్నీ ఒంపుల్నీ పరిశీలిస్తూ ఉండేవాడన్నమాట. ఇంత కాలం బైరాగే ఫెటసిస్ట్ అనుకుంటూ వచ్చింది. తెలివి తక్కువవాడు కాబట్టి వాడు బైటపడేవాడు. అయినా ఇంత చిన్న విషయం కనుక్కోలేకపోయిందంటే ఏమైనవి తన తెలివితేటలన్నీ ?
సరికొత్త టెక్నిక్‌తో తెలుగు నవలను కొత్తదారికి మళ్ళించి పాఠకలోకాన్ని సస్పెన్సుతో పరవళ్ళు తొక్కించిన యండమూరి వీరేంద్రనాథ్ నవల ‘అభిలాష’ ఉరిశిక్షకు దగ్గరవుతున్న కొద్దీ, చిక్కనవుతున్న సస్పెన్స్ ఉరిత్రాడులా చిరంజీవి మెడకు చుట్టుకోకముందే – ఆంధ్రజ్యోతి వారపత్రిక పాఠకుల తాపత్రయాన్ని ఆకాశమంత ఎత్తుకు, నక్షత్ర సీమలపైకి, గెలాక్సీలను దాటించి, సంభ్రమాశ్చార్యానందాలలో పడగొట్టి పరవశింపచేసిన ఫెంటాస్టిక్ నవల ‘అభిలాష’.
Aharam Manchi- Chedu
₹100.00నిత్య జీవితావసరాల కోసం రోజూ ఎంతో శ్రమిస్తూ మనం సంపాదించుకున్న విలువైన డబ్బును వెచ్చించి పౌష్టికాహారం పేరుతో విషాన్ని తినాల్సి/ తాగాల్సి రావడం ఈ శతాబ్దపు గొప్ప విషాదం. ఏ ఆహారం తింటే ఆరోగ్యం చేకూరుతుందో మనకు చెప్పాల్సిన బాధ్యతలున్న ప్రభుత్వ, ప్రజారోగ్య, వైద్య పత్రికా వ్యవస్థలన్నీ కేవలం తమ స్వార్ధం కోసం ఆహార రంగంలోని బహుళ జాతి కంపెనీల ప్రలోభాలకు లొంగి తినకూడనిది తినమని ప్రచారం చేస్తూ ప్రజల ఆరోగ్యానికి కీడు చేస్తున్నాయి. వీరందరూ కలిసి శాస్త్రీయత మాటున అశాస్త్రీయతను ప్రచారం చేస్తున్న ఫలితంగా సామాన్యులు రోగగ్రస్తం అవుతున్నారు. లాభార్జనే ధ్యేయంగా నడుస్తున్న వైద్య , ఆరోగ్య శాఖలూ/వ్యక్తులూ/ప్రజల రోగాలను, మరణాలను కూడా సొమ్ము చేసుకునే ఒక క్రూరమైన వ్వవస్థను ఆవిష్కరించారు.
Agni Pravesam – అగ్ని ప్రవేశం
₹90.00
Agni Pravesam
ప్రేమలో పడటాన్నీ, ప్రేమించటాన్నీ, ప్రేమించబడటాన్నీ ఒకటేలా భావిస్తారు చాలామంది. ఇద్దరు వ్యక్తులు కలుసుకుని, ఒకర్నొకరు అద్భుతమైన వ్యక్తులుగా గుర్తించుకోవటంతో మొదలైన ఈ ప్రేమ, తన అద్భుతాన్ని కోల్పోకుండా వుండాలంటే యిద్దరికి బేసిక్‌గా కొన్ని అర్హతలు వుండాలి.
ప్రేమించటానికి ముఖ్యమైన అర్హత వ్యక్తిత్వం. ప్రేమించటానికి ముఖ్యమైన అనర్హత ఆధారపడటము.
ఒక పసివాడు ఎదుగుతుంటే, అతడి వ్యక్తిత్వాన్ని నిర్దేశించేవి అతడి తల్లిదండ్రుల తెలివితేటలు, వారసత్వం, జీన్స్, డబ్బు-ఇవేవి కావు. అతడి చుట్టూ వున్న పరిసరాలు. అందులో అన్నిటికన్నా దగ్గరయిన, అతి ముఖ్యమయిన పరిసరం తల్లి.
తల్లికడుపులోంచి బయటి కొచ్చి మొట్టమొదటిసారి స్వతంత్రంగా ఊపిరి పీల్చుకునే శిశువులాగానే, తల్లిదండ్రుల ప్రభావం నుంచి బయటికొచ్చి స్వతంత్రంగా, జీవిత సవాళ్ళను ఎదుర్కోవటం ప్రారంభించిన మనిషి, ఆ పరీక్షలో ఓడిపోతే మాడి మసైపోతాడు. గెలిస్తే పునీతుడవుతాడు, స్త్రీకయినా పురుషుడికయినా ఈ పరీక్ష జీవితంలో ఏదో ఒక స్టేజిలో తప్పదు. ఇదే అగ్ని ప్రవేశం.
భిన్నమైన కథతో, విభిన్నమైన పాత్రలతో, స్త్రీ సమస్య గురించి ఇంతకు ముందు ఏ రచయిత్రీ వ్రాయనంత సూటిగా తనదైన శైలిలో, సస్పెన్సు, టెన్షన్ మేళవించి యండమూరి వీరేంద్రనాథ్ వ్రాసిన ప్రయోజనాత్మక నవల ‘అగ్నిప్రవేశం’.
Aakhari Poratam – ఆఖరి పోరాటం
₹100.00‘కృతజ్ఞత అంటే ఏమిటి ? కనుకొలుకుల్లో అశ్రువై నిలిచేది. మాటల్లో లాంఛన రూపం దాల్చేది. అదే కదూ, అందుకే కదూ, మాటలు అందని చోటుకు వెళ్ళిపోయావు. మంచులో తడి వున్న పుష్పాన్ని నా కంటి చివరి బాష్పం చేసి, మేఘరాగం తడి చినుకు పాటచేసి, మౌనరాగం గుండె తూట్లుగా పొడిచేసి మమ్మల్నొదిలేసి అందుకే వెళ్ళిపోయావా ? నిశ్శబ్దంలో కూడా నిన్ను వినగలిగినవాడే నిజమైన స్నేహితుడట. నిజమేనేమో! ఈ నిశ్శబ్దం మరొకరి కోసం చెదరటానికి ఎంత సమయం పడుతుందో. ఇక నుంచీ నేను మాట్లాడే ప్రతి మాటల వెనుక, చదివే పుస్తకాల పుటల – వాక్యాల, శబ్దాల, అక్షరాల మధ్యంతా లీలగా విషాదమే కనపడుతుందేమో”.
స్పర్శకు ఆలోచన తెగింది
సునాదమాల –
మగవాడు పొరపాటున చెయ్యితాకితే ముందు ఇటుక పొడితో, తరువాత కొబ్బరి పీచుతో కడుక్కునే సునాదమాల అనే సనాతనాచారాల అమ్మాయిని, నికుంజ్ విహారి అనే అబ్బాయి ఒక ప్రమాదం నుంచి రక్షిస్తాడు. ఆ రాత్రినుంచీ ఒక అమ్మాయి అతడితో ఫోన్‌లో రొమాన్స్ చేయటం మొదలు పెడుతుంది. పైకి తులసి మొక్క టైపులా కనపడే సునాదమాలే ఈ విధంగా ఫోన్ చేసి ఏడిపిస్తోంది అని విహారి అనుకుంటాడు. ఫోన్ చేస్తున్నదెవరు ?
ఈ విషయం తెలుసుకోవటానికి ప్రయత్నించిన విహారి అనుకోని పరిస్థితులలో ఒక సి.బి.ఐ. ఆఫీసరును కలుసుకుంటాడు ఆ ఆఫీసర్ ఎవరు ?
సరదాగా సాగిపోతూ అనుకోకుండా అనూహ్యమైన సస్పెన్సుతో మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే యండమూరి వీరేంద్రనాథ్ నవల ‘ఆఖరిపోరాటం’.
Ankitam – అంకితం
₹80.00ఆందోళనని భూతద్దం లోంచి చూస్తే భయం అవుతుంది. అయితే ఆమె పరుగెడుతున్నది ఆందోళనతోనూ భయంతోనూ కాదు. భర్తతో కాపురం చేసిన ఏడాదికాలంలో భయమూ, ఆందోళనా లాంటి స్థాయా భావాల్ని ఆమె ఎప్పుడో దాటిపోయింది. ప్రస్తుతం ఉన్నవి కసీ, పట్టుదల. కాళ్ళలోనూ కనబడుతుంది. అయినా అతడినుంచి దూరంగా పరుగెత్తలేకపోతోంది. అతడు క్రమక్రమంగా దగ్గరవుతున్నాడు. అతన్నించి ఎలాగయినా రక్షించుకోవాలన్నదే ఆమె ప్రయత్నం. తనని కాదు, తన కొడుకుని. అంకిత్ ఎనిమిదేళ్ళ కుర్రాడు. ‘ఇలాంటి కొడుకు తమకుంటే బాగుండును’ అని ప్రతి తల్లీదండ్రీ అనుకునే లాంటి అందమైన చురుకైన కుర్రాడు. అటువంటి కుర్రాడికి ఒక సమస్య వచ్చింది. మొదట్లో అది చాలా చిన్న సమస్య అనుకున్నాడు అతడి తండ్రి.
కానీ చూస్తుండగానే అది పర్వతంలా పెరిగిపోయింది. ఉప్పెనలా కబళించి వేయటానికి ముందుకు దూకింది. అతడినీ అతడి తండ్రినీ రక్షించగలిగేది ఆ పరిస్థితుల్లో ఒక్కరే.
అంకిత్ తల్లికి తాళి కట్టిన భర్త!
తండ్రంటే ఎలా వుండాలి ? కొడుకంటే ఎలా వుండాలి ? కుటుంబమంటే ఎలా వుండాలి ? దిగజారిపోతున్న బాంధవ్యాల బంధాన్ని సున్నితపు సెంటిమెంటు తీవెల్తో బంధించి. అనురాగశృతుల్ని మ్రోగించిన నవల ‘అంకితం’.
సెంటిమెంటు, ఆర్ధ్రత, సస్పెన్సుల మేళవింపుల సంచలన రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సంతకం ‘అంకితం’.