YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 421–432 of 835 resultsSorted by latest
Pillalni Pratibhavantuluga Penchadamela – పిల్లల్ని ప్రతిభావంతులుగా పెంచడమెలా
₹200.00జీవితాన్ని, సమాజాన్ని సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనోవిజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనోవిజ్ఞాన మాసపత్రిక ‘రేపు’ వ్యవస్ధాపకులు, తెలుగు ప్రజల ఆలోచనాధోరణులను అమితంఆ ప్రభావితం చేసే రచయిత చల్లగుళ్ళ నరసింహారావు.
పిల్లల సర్వతోముఖ వికాసానికి తోడ్పడే రీతిలో తల్లిదండ్రులు తమ ప్రేమానురాగాలను సృజనాత్మకంగా, శక్తివంతంగా ఎలా మలచుకోవాలి? పిల్లల మనోభావాలను ప్రయోజనకరరీతిలో ప్రభావితం చేసే తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా వుండాలి? ఎదిగే వయస్సులో పిల్లల ఆలోచనలలో, ప్రవర్తనలో వచ్చే మార్పులను అవగతం చేసుకొని వాటికనుగుణంగా ప్రతిస్పందించడమెలా? చదువులో, పరీక్షలలో బాగా రాణించడానికి ఎటువంటి తోడ్పాటు ఇవ్వాలి? ఎలా తర్ఫీదునివ్వాలి? తాము ఆశించిన రీతిలో పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి నిరతంర తోడ్పడే అత్యంత ప్రయోజనకర గ్రంథం ‘పిల్లల్ని ప్రతిభావంతులుగా పెంచడమెలా?’
Sparsha
₹180.00అందరికీ తలలో నాలుకలా ఉండే ఆ మహిళ ఎందువల్ల మరణించిందో, కన్నతల్లి మీద అభాండం వేసిన ఆ కొడుకు ఏం బావుకున్నాడో,
పిల్లల మధ్యే పండుకుంటూ ఉన్న గృహిణికి వైద్యుడు హితబోధ చేయడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటో, చావు భయం లేదని ఢంకా భజాయించిన ఆ తల్లి జీవనయానం ఎటు సాగిందో, ఇద్దరి యువకుల జీవితాలు తీర్చిదిద్దాలని చూసిన ఆ ఉపకారికి ఎదురైన గడ్డు పరిస్థితి ఏమిటో, ఆ యువకుడిలో తన హీనమైన బాల్యం తదుపరి దశలలో ఎటువంటి రూపు దిద్దుకుందో, దయా దాక్షిణ్యాలతో ఎదిగిన ఆ యువతి తన ప్రత్యుపకారం ఎలా తీర్చుకుందో, స్పర్శతో కన్న కొడుకును ఆ తల్లి ఎలా కాపాడుకోగలిగిందో, ఆ దివాణంలో పడమటి గది చుట్టూ అల్లుకుని ఉన్న విచిత్ర భావన ఏమిటో, పెళ్ళికీ తన చావుకూ సంబంధం ఉందన్న ఆ యువకుడి గమ్యం ఏమిటో, కలికి కడగంటి చూపునకూ, ఎండవాలుకూ సంబంధం ఏమిటో, అమ్మను పిన్ని మరపించిందో లేదో… వంటి అనేక జీవిత వాస్తవాలకు అద్దం పట్టే కథా చిత్రణ, నాటకీయత, వేగవంతమైన నడక, సహజసిద్ధమైన సంభాషణలు ఇవీ… మేడా మస్తాన్ రెడ్డి “స్పర్శ” రచనలు.
VYAKTITVA DEEPAM
₹150.00వ్యక్తిత్వ దీప వికాసం
భారతీయ జీవన విధానంలో ఏ ఆచారం పాటించినా, ఏ సంప్రదాయం అనుసరించినా, ఏ పండుగ జరుపుకొన్నా అందులో భౌతిక ప్రయోజనం, మానసిక అనుభూతి, ఆధ్యాత్మిక తత్త్వం అనే మూడు కోణాలుంటాయి. “దీపావళి లో ఈ మూడు కోణాలు మరింత స్పష్టంగా వెలుగులీనుతూ ఉంటాయి.
వర్ష ఋతువుకి, శరదృతువుకి ఇది సంధికాలం. నేల తడిసిపోవడం కారణంగా, ఎండ తీక్షంగా ఉండకపోవడం మరో కారణంగా ఈ కాలంలో సూక్ష్మక్రిములు విపరీతంగా పెరుగుతాయి. ఈ దీపాల కాంతికి, వేడికి, చిటపటలకి వాటి వృద్ధి బాగా తగ్గిపోతుంది. అది ప్రజల ఆరోగ్యానికి మంచిది. ఇది భౌతిక కోణం. ఇంటింటా దీపతోరణాలు కళ్ళకు కాంతిని. మనస్సుకి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆ దీప కాంతుల్లో మనకి మనమే కొతగా, తేజోమూర్తులుగా కనపడతాం. ఇది మానసిక కోణం. బయటి చీకటిని బయటి దీపం పోగొడుతోంది. అంటే మనస్సులో ఉండే చీకటిని మనస్సులో వెలిగించే దీపం పోగొడుతుందన్నమాటే గదా! అదే జ్ఞానదీపం. | జనం అంటే అద్వైతం. అభేదభావం. అంతా ఒక్కటే అని భావించగలగదం. ఆ భావం వల్ల రాగద్వేషాలు మన మనస్సుని కలుషితం చెయ్యవు. అప్పుడు | మనం చేసే అన్ని ఆలోచనలు, మనం తీసుకొనే అన్ని నిర్ణయాలు ధర్మానికి,
డా॥ గరికిపాటి నరసింహారావు
Adhunika Andhra Kavitvam
₹600.00సెలవులు అయిపోయి బడులు తెరిచారని పిల్లలు ఏడుస్తారనే అనుకున్నానిన్నాళ్ళూ.. ఈ రోజు… తెలుగు మాట ని వదిలేసి. గేయాచార్యుడు స్వర్గం బడి లో తెలుగు నేర్పడం కోసం నిష్క్రమించాడని. తెలుగు జాతి ఏడవాల్సి వస్తుందని ఊహించలేదు. దేవుని కి నిద్ర పట్టడం లేదు అనుకుంటాను. ‘ లాలీ లాలీ ‘అని జోలలు పాడించుకోవాలనే. స్వార్థం అయి ఉంటుంది.. లేకుంటే ఈ వాగ్దేవుడీతో, వినయ విశారదుడితో ఆయన కేం పని? ఒక్క ఒక్క రోజు ఒక్క మాటైనా అనని నిగర్విని..మననుండి తీసుకెళ్ళాడు… ‘అణువూ అణువున వెలసిన దేవా’ అని కీర్తించడమే పాపమా?.. లోకంలో పాపమింకా పెరగాలి కాబోలు.. .’విశ్వంభరా’ తత్వం తో ‘భూగోళమంత మానవుడి’ పరిణామ రహస్యాలను తెనిగించి, ‘నీ ధర్మం, నీ సంఘం నువ్వు మరవద్దు’. అన్న మానవత్వ ప్రవక్త ని మన నుండి దూరమెందుకు చేస్తాడు? ‘మంచిని సమాధి చేస్తారా?’ అని మనల్ని దండించే మానవీయ మూర్తి ఇంకెవరున్నారు? ఈ దుర్వార్త తో రామప్ప నాగార్జున సాగర్ లు స్థాణువులైపోవా?. .ఓ వైశ్వానరా!- తేట తెలుగు తో. అటు అగ్ని కణాల్ని ఇటు తుహిన తుషారాల్ని కురిపించిన అభినవ కవితా సవ్యసాచీ! మేమింకా అలానే ఉన్నాం… మంచి ని సమాధి చేస్తూ… అంతరంగం లోకి కాకుండా, ఆకాశం వైపు మోరెత్తి చూస్తూ.. మరో మానవ మత ప్రవక్త కోసం ఎదురు చూస్తూ.. – :చిట్టేల. శ్రీధర్ కుమార్, సూళ్లూరుపేట
Oka Yogi Prastanam
₹200.00పుస్తకం గురించి
ఈ ఆత్మకథ యోగి ఆదిత్యనాథ్ జీవితంలోని కీలక అంశాలను నాలుగు విభాగాల్లో వివరిస్తుంది. ఈ పుస్తకం యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుత అవతారమైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మొదలై 2017 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో జరిగిన రాజకీయ సమీకరణాలు, యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రిగా నియామకం చేసేందుకు దారితీసిన పరిణామాలు, పంచమ్ తల్ – అంటే ఉత్తరప్రదేశ్ సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ తొలి రోజులు… ఈ ప్రస్తావనలతో ఈ పుస్తకం మొదటి అధ్యాయం మొదలవుతుంది. ఇక రెండవ అధ్యాయంలో ఐదుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన ఆదిత్యనాథ్ గురించి, అతని వివాదాస్పద ప్రసంగాల వెనుక దాగిన అసలు హేతువు గురించి, ఘర్ వాపసీ, హిందూ వాహిని, లవ్ జిహాదీల గురించి, బీజేపీతో యోగి ఆదిత్యనాథ్ కు ఉన్న సంబంధబాంధవ్యాల గురించి రెండవ అధ్యాయంలో చర్చించాను. ఇక మూడో అధ్యాయంలో గోరఖ్ నాథ్ మహంత్ జీవితంలోని విశేషాల మీదుగా నా పాఠకులను ముందుకు తీసుకువెళ్తాను. గోరఖ్ నాథ్ మఠ సంప్రదాయాల గురించి, వారసత్వం గురించి,
యోగిగా ఆదిత్యనాథ్ దినచర్య గురించి, వారి గురువుల గురించి, దశాబ్దాలుగా మఠం నిర్వహించే సామాజిక – రాజకీయ కార్యకలాపాల గురించి వివరించాను. ఇక చివరి అధ్యాయంలో ఉత్తరాఖండ్ లోని మారుమూల గ్రామంలో గోవుల మధ్య, పాడి పంటల మధ్య, పర్వతాల మధ్య, నదుల మధ్య కొనసాగిన ఓ యువకుడి ప్రస్థానం గురించి మాట్లాడాను. ఆ యువకుడే తదుపరి కాలంలో సన్యాసిగా, మహంగా, మఠాధిపతిగా, పార్లమెంటేరియన్‌గా, ముఖ్యమంత్రిగా ఎదిగిన క్రమాన్ని వివరించాను.
Premaragam Vintava – Marikonni kathalu
₹180.00చిమ్మ చీకటి, వాతావరణం చల్లగా ఉంది. ఆకాశంనిండా చుక్కలు గుతులుగా వేలాడుతున్నాయి. అర్ధరాత్రి దాటుతోంది. పడవ చప్పుడులేకుండా రొయ్యల చెరువులో కదులుతోంది. ఇద్దరి నల్లటి ఆకారాలు కనిపిస్తున్నాయి. ఏసు ఫాన్లెట్ వేసి నీటిపైన చూస్తున్నాడు. గన్లో తుపాకీమందు, రవ్వలుకూరి, గురిపెట్టుకొని చూస్తున్నాడు విజో. సైగచేశాడు విజో. పడవ ఆగిపోయింది. చిన్నగా ఈల లైటు ఆరిపోయింది, తుపాకీ పేలింది. రవ్వలు దూసుకు పోయాయి. ఇప్పుడు లైటు వేసి ఆచోటంతా వెతికారు, రెండు బుడబుచ్చకాయిలు తేలాయి. మరో కొంతసేపు వేట సాగింది. మరో మూడు పిట్టలు దొరికాయి, “ఈరోజుకు చాలు, మరో రెండు రోజుల్లో రాత్రివేట చేద్దాం” అన్నాడు విజో.
ఉదయానికి ఈ చంపిన పిట్టల్ని చూపిస్తే యజమాని సాయిరాజు సంతోషపడతాడని విబ్రోకి అనిపించింది. మరి ఈ వేటకోసమే విప్రోని తీసుకువచ్చింది. రొయ్యల చెరువుల్లో ఎన్నో సమస్యలు అవన్నీ సాయిరాజు చూసుకోగలడు కాని ఈ పిట్టల సంగతి తానే చూడాలి..
బుడబుచ్చకాయిలు, నీటిమీద వాలే చిన్నపిట్టలు. మహా అయితే
పిచ్చుకల కంటే కొంచెం పెద్దవి. బాతుపిల్లల సైజులో ఉంటాయి. ముదురు, లేత గోధుమరంగులలో ముదొస్తూ ఉంటాయి. నీటిమీద తేలుతూ, మధ్యమధ్యలో నీటిలో మునిగి ఓనిమిషం ఉండి, ఎదో ఒక చేపపిల్లో రొయ్యపిల్లనో నోట…
Tripuraneni Ramaswamy Rachanalu
₹400.00త్రిపురనేని రామస్వామి గురించి త్రిపురనేని రామస్వామిగారిని తరచుగా పెరియార్ రామస్వామితో (రామస్వామి నాయకర్) పోలుస్తారు. దానికి స్థూలమైన కారణం ఇద్దరూ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంలో వున్నారు అనే భ్రమ. కాని నిజానికి పెరియార్కీ, రామస్వామికీ ఏ రకమైన పోలికలూ లేవు. పెరియార్ ఆవేశపరుడు, రామాయణం అంటే కోపం, బ్రాహ్మల వల్లే తమిళనాడంతా పాడయిందని పెద్ద ఉద్యమం లేవదీశాడు. కాని రామస్వామి పెరియార్ కన్నా చాలా ముందు తన ఆలోచనలు సిద్ధాంతపూర్వకంగా చెప్పాడు. ఆ
రామస్వామి 1914లో ఐర్లాండు వెళ్లాడు. అక్కడ అప్పటికే ఉన్నవ లక్ష్మీనారాయణ ఇతర తెలుగువాళ్లని ఆకర్షించి రాజకీయంగా తయారు చేస్తున్నాడు. ఐర్లాండులో ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం మీద వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది. ఆ ఉద్యమప్రభావం రామస్వామిమీద కూడా వుంది.
రామస్వామి ఐర్లాండులో వున్న రోజుల్లో చేసిన ప్రధానమైన పని
Youth and Truth: Unplug with Sadhguru
₹157.00What happens when millennials meet a mystic? An avalanche of queries and an unflinching stream of answers. In this compilation of five talks from Youth and Truth events, Sadhguru fields questions that are quirky, personal, profound and shockingly bold from university students.
In a camaraderie bridging age, they adventure through a mind-boggling spectrum of subjects like romance and sexuality, loneliness and jealousy, parenting and education, career and business, politics and spirituality, artificial intelligence, racism, drugs, food, Yogic sciences, and god-making. Equally wide-ranging is the mood of the talks – from playfulness and hilarity to moments of gobsmacked speechlessness, dawning clarity and paradigm shifts, all infused with the fizzing energy of youth.
Here is a book not just for youth, but for the youthful in search of truth.