Showing 433–444 of 835 resultsSorted by latest

Adhiguruvu Acharya Chandala

100.00

 ఇది భారత భూమి నడిబొడ్డున హైందవ పుణ్యభూమిగా భావించబడే కాశీనగరంలో జరిగిన యథార్థ సంఘటన. భారత తాత్విక మేథోరంగాన్ని ఒక కుదుపు కుదిపిన చారిత్రక సంఘటన. హైందవ చరిత్రకారుల ప్రకారం శంకరా చార్యులు సాక్షాత్ శివ స్వరూపం. అతనికి ఒక సందర్భంలో ‘చండాలుడు’ ఎదురొచ్చి తత్వాన్ని బోధించి జ్ఞానోదయం కలిగిస్తాడు. ‘శివుడు చండాలుని రూపంలో వచ్చారు’ అనేది హైందవ చరిత్రకారుల అభిప్రాయం. ఒక శివునికి మరొక శివుడు ఎదురొచ్చి జ్ఞానోదయం కల్పించి నట్లుగా చరిత్రను వక్రీకరించారు. ఇది ఎలా సాధ్యం?

                 భారతదేశపు తాత్వికరంగంలో హైందవ, బౌద్ధ వాజ్ఞ్మయాలను ఔపోసన పట్టిన మహా తాత్వికులు, మహా విజ్ఞాని ‘ఆచార్య చండాలుడు’. ఒకే దేశంలో ఒకే సమయంలో, ఒకే ప్రదేశంలో శంకరా చార్యులు, ఛండాలుడు లాంటి ఇద్దరు తాత్వికులు వుండడం తప్పు కాదు గదా! ఇద్దరు హైందవులైతే వారిని గురించి వ్రాసేవారు. కాని ‘ఛండాలుడు’ అంటరాని కులంలో పుట్టిన వ్యక్తి. అందుకే హైందవ చరిత్రకారులు అతని గురించి వ్రాయలేదు. వాస్తవ చరిత్ర ఏమిటో తెలియజేయాలని నేను ఈ గ్రంథాన్ని వ్రాయాల్సి వచ్చినది.

                                                                                                                    – బొనిగల రామారావు

Vamsankuram – వంశాంకురం

80.00

తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.

వంశాంకురం :

కొడుకుని తమ యిష్టాయిష్టాలకు బలిచేసినా మనవడి కోసం పెద్దతరం వారు పడే ఆవేదన, ఆ ఒక్క కోరిక తీరడానికై నలిగిన రేఖలాంటి కోడల్ని ఇంటికి తెచ్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నా, ఆ అమ్మాయి అదుకు అంగీకరించక పోవడం పెద్దలకు మింగుడు పడని ప్రశ్న.

స్త్రీ జీవిత సాఫల్యం వంశాంకురాన్నిచ్చి తానుగా రాలిపోవటమేనా?

రేఖ జీవితం ఓ కన్నీటి కెరటాల వెన్నెల, ఆ వెన్నెలను తన వారికిచ్చి తాను నిశీధంలోకి నిష్క్రమించిన స్త్రీ ఎదుర్కొన్న జటిలమైన సమస్యలకు ”వంశాంకురం” నవలాదర్పణం!

పేజీలు : 175

Vantalu Pindi Vantalu – వంటలు పిండి వంటలు

150.00

మనం రోజూ తీసుకునే ఆహారంలో ఏవేని ఎలా ఉపయోగ పడుతున్నవి వివరించిన పుస్తకమిది. ఓ రకంగా ఇది వంటల పుస్తకమే కాదు వైద్య గ్రంథం కూడా.
లోగడ మూడు భాగాలుగా ప్రకటించబడిన ”వంటలు – పిండివంటలు” పుస్తకం పాఠకుల సౌకర్యం కోసం దరిమిలా రెండు భాగాలుగా ప్రకటించబడింది. ఇలా విడివిడి భాగాలకంటే అన్నీ కలిపి ఒకే సమగ్ర సంపుటంగా ఉంటే బాగుంటుందని చాలామంది పాఠకులు సూచించిన మీదట అన్నీ కలిపిన ‘కంబైన్డ్‌ ఎడిషన్‌’ ప్రచురిస్తున్నాము.
ఇంతవరకూ ఈ పుస్తకంలోని కొలతలు కొలమానాఉ పాత పద్ధతిలోనివి ఉండేవి. ఇప్పుడే తరం పాఠకులకు ఆ కొలతలు తెలియనందున, ఇప్పటి పాఠకుల కోసం అన్నీ కొత్త కొలతలు కొలమానాలివ్వడం జరిగింది. కొలతల్లో చేర్పులు మార్పులు తప్ప ఐటమ్స్‌ అన్నీ మామూలుగానే ఉన్నవి.
ఇప్పుడు ఈ పుస్తకంలో మరో విశేషం. వంటల్లో వాడే ప్రతి కూర, వస్తువు గురించి, అది మనకెలా ఉపయోగపడుతున్నదీ వివరించారు. శరీర నిర్మాణానికి, అభివృద్ధికి, మనో వికాసానికి, తేజస్సుకు – మన శరీర ఉష్ణోగ్రతను సమంగా వుంచడానికి మనం రోజూ తీసుకునే ఆహారంలో ఏవేవి ఎలా ఉపయోగపడుతున్నవీ వివరించారు. ఓ రకంగా యిది ‘వంటల పుస్తక’మే కాదు – ‘వైద్య గ్రంథం’ కూడా! ఇలాంటి పుస్తకం యింతవరకూ తెలుగులో రాలేదు. ప్రతిఒక్కరూ ఒక్కసారి చదివి తెలుసుకోవలసిన విషయాలెన్నో యిందున్నవి. ప్రతి ఇంటా తప్పక ఉండదగిన పుస్తకం.

Varasulu

90.00

తీయని కలలు కంటూ నిద్రపోతున్నది బాలామణి. యు ఫోమ్ పరుపు మీద కాదు. చింకి చాపపై పరిచిన బొంతమీద. ఆమె కలల్లోకి వచ్చేది రాకుమారుడు కాడు, జమీందారు కాడు. కనీసం అందమైన ఆరడుగుల సుందరాకారుడు కాడు. టీచర్ మార్తమ్మ కొడుకు విల్సన్. అంతకు ముందు రోజే పట్నం నుండి అతడు వచ్చినట్టు చెప్పింది టీచర్. బాలామణి మామూలుగా తలుపుతట్టింది పాలు పోద్దామని. ‘పరమ పితా, పరవినుతా!’ అనే సన్నని గొంతుతో పాటపాడుతూ మార్తమ్మ కాదు తలుపు తీసింది, చారల పైజమా వేసుకున్న ఒక యువకుడు తలుపు తీశాడు. అతను నలుపేకాని నలుపులో నాణ్యత కనిపించింది బాలామాణికి. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

Veedani Needa – వీడని నీడ

80.00

 తిరిగి యిన్నేళ్ళా కు మాదిరెడ్డి సులోచన నవలలు మీ ముందుకు వచ్చాయి. దాదాపు ఏభై ఏళ్ళ క్రితం అచ్చమైన తెలంగాణా వాతావరణం పొందికైన మానవ సంబంధాలూ కలగలిపి చక్కని యితివృత్తాలు ఆమె సాహిత్యంలో కనిపిస్తాయి. డెబ్భై పైగా నవలలు ఆమె రచించారు. వాసిలోనూ రాశిలోను కూడా సులోచన రచనలు ఎన్నతగినవే. ఆమె ప్రమాదవశాత్తు అకాలమరణం పాలు కాకుండావుంటే మరెన్ని మంచి నవలలు రాసి వుండేవారోననేది ఊహకు మాత్రమే మిగిల్చి వెళ్లిపోయారు.

        ఇప్పుడు అంటే నూతన సహస్రాబ్ది తొలిదశకంలో యీ నవలల్ని చదువుతున్నపుడు కొన్ని కొన్ని సందర్భాలలో పాఠకులకు అసహజంగా వున్నా భావన కలిగే అవకాశం వుంది. ఎందుకంటే గడచిన ఏభై సంవత్సరాలలో ఆర్థిక సాంఘిక సాంస్కృతిక రంగాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆనటి రూపాయికి నేటి రూపాయికి పొంతన లేదు. కొన్ని వూళ్ళపేర్లు కొన్ని మతాల అర్దాలు సైతం మారిపోయాయి. వేషధారణ మారింది. దూరాలు తగ్గిపోయాయి. భూగోళం గుప్పెట్లో వొదిగిపోయింది. అనడు వంద రూపాయలంటే చాలా పెద్ద మొత్తం. నేడు అది చిల్లర డబ్బు. కనుక ఇలాంటివి మాదిరెడ్డి నవలలో తారసపడినప్పుడు విజ్ఞలైన మా పాఠకులకు కాలంతో అన్వయించుకుని అర్ధం చేసుకోగలరని ఆశిస్తున్నాను.

                                                                                                  – మాదిరెడ్డి సులోచన

Veerakesari

70.00

 అరుణకాంతులు శయ్యగారమాత ఆవరించి, చీకటిని పారద్రోలుచున్నవి. అలసటగా తన అందమైన అవయములను విరుచుకున్నది అరుణసుందరి. గత రాతిరి వెలిగించిన దివ్వె గొంపో వచ్చిన దాసి మృదువుగా మందహాసము చేసినది. “యెందులకే ఆ గడుసు నవ్వు?” చిరుకోపం ప్రకటించింది యువరాణి.

                  “ఇట్టి తరుణము తమ నాథులు గాంచిన కపొలములు కందిపోవా! పాపం! శ్రీవారు ఈ దేవి దర్శనము గానక, ఆ భవాని దర్శనార్ధమై ఆలయమును కేగినారు” కొంటె చూపులు విసిరినది దాసి చండి. అరుణసుందరి అదిరిపాటున లేచినది. “చండి! సత్యము వచింపుము. వారు యేటించి యుండిరా?”

                    “అసత్యము వచించుట ఎలా? తమరు శయ్యవిడి గవాక్షము ద్వారా తిలికించడు. ప్రభువులు, శ్రీవారు, పరివారము ఆలయమున కేగుచున్నారో లేదో తెలియును.”

Zero to One: Notes on Start Ups, or How to Build the Future

490.00

What Valuable Company is Nobody Building? The next Bill Gates will not build an operating system. The next Larry Page or Sergey Brin won’t make a search engine. If you are copying these guys, you aren’t learning from them. It’s easier to copy a model than to make something new: doing what we already know how to do takes the world from 1 to n, adding more of something familiar. Every new creation goes from 0 to 1. This book is about how to get there.

Arugu

200.00

వస్తువు తజన్యమైన ఇతివృత్తమూ, రచన తదనుకూలమైన భాష, సన్నివేశ పాత్ర ప్రవర్తనాదులూ, ఆసక్తి కలిగించే ఈ లక్షణాలు శ్రీ నక్షత్రం వేణుగోపాల్ కథానికలు సంపుటి ‘అరుగు’ లో ప్రత్యక్షమై, పాఠకులు పరమానందం పొందుతారు. కథానికల్లో పరిచిత విషయం ప్రత్యక్షమయితే, పునశ్చరణతో చదువరులు ఉత్తేజితులౌతారు. అపరిచితాంశాలు ఆవిష్కృతమైతే, ఆశ్చర్యానుభూతులకు సహృదయులు లోనవుతారు. –

తెలుగు పాఠకులు తెలుగు భాషలో ఇంతకు పూర్వం అంతగా పరిచయం లేని విశేష జీవితం చెప్పే ట్రూ ఫేస్ అమెరికా కథలు, శ్రీ వేణు చెబుతుంటే విని చదివి, ఆశ్చర్యపోతారు, ఆనందిస్తారు, అర్థం చేసుకుంటారు. శ్రీ నక్షత్రం వేణుగోపాలకు కథా నిర్వహణ ఆసక్తికరంగా చేయడం బాగా పట్టుబడింది. పాత్ర సృష్టి, సన్నివేశ కల్పన, అతిశయోక్తులు లేకుండా సుందరంగా సహజంగా రాయడం తెలిసి వచ్చింది. ఈ కథానికలు సహజత, స్పష్టత, ఆర్జవం, సౌకుమార్యం సాధించుకున్న మంచి రచనలు. ఉత్తమ కథానికా మార్గంలో మునుముందుకు సాగుతున్న శ్రీ నక్షత్రం వేణుగోపాల్ ఉజ్వల భవిష్యత్తును సాధిస్తాడని పాఠకులు నమ్ముతారు.

-కొలకలూరి ఇనాక్

సరిగ్గా ఏడాది క్రితం వేణు నక్షత్రం నాకు ఫోన్ చేసి మూడు దశాబ్దాల క్రితపు మంజీరా రచయితల సంఘ సమావేశాల్లో కలిసిన జ్ఞాపకాలను తడుముతూ తనను పరిచయం చేసుకొన్నారు. మంజీరా రచయితల సంఘంతో కలిసిన అనుభవాలు ఎవరికైనా సంతోషకరమైనవే. దిశానిర్దేశం చేస్తూ తెలంగాణాలో రచయితలను తయారుచేసిన, నడిపించిన చరిత్ర ఆ సంస్థది. అలాంటి సంస్థతో సంబంధంవల్ల 90ల నాటికే రచనా రంగంలోకి ప్రవేశించిన వేణు నాకిప్పుడు ఇలా పరిచయం అయ్యారు. ముందుగా ఆయన పేరులోని నక్షత్రం నన్ను బాగా ఆకర్షించింది. ఆకాశంలోని, అనంతకోటి నక్షత్రాలలో ఒకటి ఎంత చక్కగా ఆయన పేరుకు ముందు పుట్టుకతోనే చేరిపోయిందికదా అనుకున్నా, కథలు రాయటం, లఘుచిత్రాలు తీయటం, నటించటం వంటి అభిరుచులు ప్రయత్నపూర్వకంగా ఆయన ఎన్ని నక్షత్రాలను కలగంటే, ఎన్ని నక్షత్రాలను ఆవాహన చేస్తే సాధ్యమైంది! ?

మొత్తం మీద వాస్తవికతకు దగ్గరగా ఉండే నక్షత్రం వేణుగోపాల్ కథలు చదవటం మంచి అనుభవం. జీవితాన్ని ఆవరించుకొన్న కనిపించని భీభత్సాన్ని కనిపింపచేయటం ఆయన కథల లక్ష్యం, సంపదలు, సంపాదనల యావలో మనిషి మాయం కావటం పట్ల ఆయన వేదన, వ్యష్టి నుండి సమిష్టి ఆయన కామన,

– కాత్యాయిని విద్మహే

Asatyaniki Avala

250.00

Asatyaniki Avala

ఈ యావత్ప్రపంచం అబద్ధం…

ఏది శాశ్వతం కాదు…

నేనన్నది కూడా పిచ్చి భ్రమ మాత్రమే…

సత్యమై, నిత్యమైనది వేరే వుంది,

దాన్ని పొందుదామన్నది ఎంత అసహ్యమైంది?

దీనికి, ఈ సోకాల్డ్ అసత్యానికి ఆవల ఏదైనా ఉండొచ్చు.

అది సత్యమై తీరాలా?

దాన్ని కూడా దాటి వెళ్లాలన్న కామన

మనిషన్న వాడికి కలక్కుండా వుంటుందా?

ఈ అసంబద్ధమైన ఆలోఛన్నే తుడిచి అవతల పారేసే శక్తే మనకుంటే ఎంత బావుణ్ణు..

కానీ, సుప్త చేతననబడే ఈ సబ్ కాన్షస్ మైండ్ వున్నంత వరకూ…

ఈ చీకటి అరుపులు తప్పవేమో!

Chempadebba Philosophy- Naa Istam- 2.0

250.00

  ఒక మనిషిని చుట్టూ ఉన్న పరిస్థితులే తయారు చేస్తాయి” అని కార్ల్ మర్క్స్ చెప్పినట్టు… అయాన్ రాండ్ … ఫ్రెడరిక్ నిషే, ఆర్ధర్ షోపెన్ హోవర్ , నా విజయవాడ ఫ్రెండ్ , జేమ్స్ హాడ్లి ఛేజ్, ఫ్రెడరిక్ ఫోర్సెత్, ముప్పాళ్ళ రంగనాయకమ్మ, మ్యాడ్ మ్యాగజైన్లు , సెక్స్ పుస్తకాలు, చందమామ, బాలమిత్ర కథలు, స్టీఫెన్ స్పిల్ బర్గ్, కె.బాలచందర్ లాంటి నా జీవితంలో ఎదురైనా ప్రతివ్యక్తి అనుభవాల నుంచి నాకు నచ్చి,నేను తీసుకుని   , నావి చేసుకున్నవి నాలో ఒక భాగం. అయితే ఇంకోభాగం నేను మంచి స్టూడెంట్ కాకపోవటం, నా ఇష్టమొచ్చినట్టు చేయడానికి అనుమతించిన నాన్న ఉండటం, ఐదేళ్ళు విజయవాడ  విధుల్లో వీరంగం చేయడం , నన్ను ఒక  సినిమా ఉన్మాది  చేసిన ప్రసాద్ మామయ్య, సినిమాల గురించి విశ్లేషణ అలవాటు చేసిన మురళి మామయ్య లాంటి వాళ్ళు నా జీవితంలో తారసపడటం మూలాన కూడా “నేను” నేనయ్యాను. నేను “నా” ల మిగిలాను.”నా ఇష్టం” వచ్చినట్టు బ్రతికాను, బ్రతుకుతున్నాను , బ్రతకబోతున్నాను.

Cinema Kadhalu

225.00

ఈ భూమి మీద పుటిన ప్రతి జీవి తన పరిణామ క్రమంలో ముందుకు సాగుతూ తమ జాడలను వదిలివెళ్తుంది. కానీ మనిషి వేరు. సాహిత్యం, సంగీతం, చిత్రకళ, చలనచిత్రం, శిల్పకళ లాంటి ఎన్నో కళారూపాలతో ఈ భూమి మీద తన ఉనికిని ప్రత్యేకం చేసుకున్నాడు. కళలే లేని మానవ చరిత్రని ఉహించగలమా? అటువంటి కళల్లో అన్నింటికంటే సరికొత్తది చలనచిత్రకళ. ఎన్నో శతాబ్ధాలుగా ఏదుగుతూ వచ్చిన కళారూపాలను తనలో ఇముడ్చుకొన్న శక్తివంతమైన మాధ్యమం చలన చిత్రం. వందేళ్ల క్రితం మొదలై తనకై తనగా అభివృద్ధి చెందుతూ, మిగితా కళారూపాలనుంచి స్ఫూర్తి పొందుతూ కొత్తకొత్త రూపాలను సంతరించుకుంటూ వస్తున్న ఈ కళకు, సాహిత్యంలో ఏంతో అవినాభావ సంబంధం ఉంది. మొదట్నుంచి కూడా సాహిత్యమే సినిమాకు ముడిసరుకు. సాహిత్యంలో గొప్పవిగా బావించబడ్డ ఎన్నో కధలు, నవలలు చలనచిత్రాలుగా రూపొందాయి.

                                                                             -వెంకట్ శిద్ధారెడ్డి.

Cinema Oka Alchemy

230.00

     అత్యంత ఆధునిక కళాప్రక్రియగా రూపొందిన సినిమా తన సంస్కరణవాడ, గ్రామీణ మూలాల నుంచి వేరుపడి ఇవాళ అది పూర్తి వ్యాపారాత్మకమైంది. నాటకరంగం విషాదంగా నిష్క్రమిస్తున్న వేళ, సినిమా వేయిపడగలు విప్పి హోరెత్తుతోంది. ఆధునిక వ్యాపారవేత్తలు, మాఫియా కలాపోశాకులుగా తల ఎత్తాక.. ఈ రంగం నుంచి ఇంకా ఏమైనా ఆశించగలమా? హరిపురుషోత్తమ రావు అన్నట్లు ‘యథాపాలకవర్గం, తథాసాంస్కృతిక రంగం.’

              ఈ ప్రధాన స్రవంతికి భిన్నంగా ప్రపంచంలో ప్రత్యామ్నాయ సినిమా కొత్త ఆశలతో చిగురిస్తోంది. మానవీయకోణం నుంచి సామాజిక ఆవరణంలోకి సాగిన భిన్న ప్రదేశాల, భిన్న ఇతివృత్తాల ఆశావహ చిత్రాల సమాహారమే వెంకట్ సిద్దారెడ్డి వెలువరించిన దృశ్యమాలిక ‘సినిమా ఒక ఆల్కెమీ.’