Showing 373–384 of 860 resultsSorted by latest

Sri Vishnu Vidya

800.00

(శ్రీ విష్ణు సహస్రనామ భాష్యము)
“ఇది నామ విద్య. ఈ నామాలు అక్షరాల గుంపులు కావు. నారాయణుని శబ్దాకృతులు. మొత్తంగా ఈ సహస్రనామ స్తోత్రమే విష్ణుని శబ్దమయీమూర్తి, ఇవి వేదమందు ప్రతిపాదింపబడిన పరమాత్ముని శబ్దాలు. వీటి వ్యాఖ్యానం మన వైదిక విజ్ఞానాన్ని, పరమేశ్వర జ్ఞానాన్ని స్పష్టపరుస్తాయి. అందుకే ఇది ‘విష్ణువిద్య’. .. ప్రాచీన, అర్వాచీన భాష్యాల ననుసరించి, వైదిక శాస్త్రాల సంప్రదాయాధారంగా ఒకొక్క నామానికి ఉన్న ఔచితీమంతమైన క్రమబద్ధతనీ, నిర్దిష్టమైన వ్యాఖ్యానాన్ని అందించే సమన్వయ భాష్యమిది. ప్రతినామ వ్యాఖ్యానము పారాయణయోగ్యంగా, భావనాయోగంగా సమకూర్చిన విష్ణుతేజో విలసిత గ్రంథమిది”. —

-సామవేదం షణ్ముఖ శర్మ

Ushasri Rachanalu

750.00
5 BOOKS OF SET
ఇంటింటా వుండవలిసిన ఉషశ్రీ గారి రచనలు
ఉషశ్రీ రామాయణం
ఉషశ్రీ భారతం
ఉషశ్రీ భాగవతం
ఉషశ్రీ భగవద్గిత
ఉషశ్రీ సుందరకాండ
అఖిలాంద్ర శ్రోతలను తన కంచు కంఠంతో రేడియో తరంగాల ద్వార ఉర్రుతలుగించిన సాంప్రదాయ ఘనవాచస్పతిఉషాశ్రీగారిచే ఫై రచనలు అన్ని సరళ వచనములో (అందరు తేలికగా చదువుకొనేలా) వ్రాసారు.

Kadapa Jila Vignana Deepika

300.00

చరితకు దర్పణంగా నిలిచే పుస్తకం

భూగోళం ఒక్కటే అయినా విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, వివి జీవన విధానాలు, సాంప్రదాయాలు విస్తరిల్లి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజాలు అనేక ప్రత్యేకతలతో జీవిస్తున్నాయి. ఆహారవిహారాది అం? నుండి ఆధ్యాత్మిక సంగతులు దాకా ప్రతి అంశంలోనూ విభిన్నత ఆయా సమాజ సుస్పష్టంగా కనిపిస్తాయి. మానవ వికాస చరిత్రను అధ్యయనం చేస్తే యుగాలు తరబడి జరిగిన పరిణామాలు కూడా ఆశ్చర్యపరుస్తాయి. కోటానుకోట్ల సంవత్సరాల నుండి జరిగిన జీవపరిణామం శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేసినప్పుడు ఏక కణ జీవి నుండి నేటి మనిషి దాకా జరిగిన పరిణామాలు భారతదేశ సంప్రదాయ శాస్త్రాల

కోణం నుండి చూసినప్పుడు చాలా భిన్నంగా కన్పిస్తాయి. వేద పురాణాలు, కావ్యశాస్త్రాలు బోధించిన విషయాకడప లు శాస్త్ర పరిజ్ఞానంతో విభేదిస్తుంటాయి. అయినా మనషులు సంప్రదాయాల్ని ఆరాధిస్తూనే ఆధునిక శాస్త్ర సాంకేతికత అందించే | సౌకర్యాలను అనుభవిస్తున్నారు. ఇంతటి సంక్లిష్ట భావాలు కలిగిన మానవ సమాజం | గురించి దాని చరిత్ర గురించి రాయాలంటే అంత సులువైన పని కాదు. ఇన్ని మాటలు ఎందుకు చెబుతున్నానంటే సంప్రదాయ పునాదులమీద ఆధునిక జీవనం గడుపుతున్న చారిత్రాత్మక గడ్డ అయిన ‘కడప’ గురించి రాసిన “కడపజిల్లా విజ్ఞాన దీపిక” అనే పుస్తకంపై నాలుగు మాటలు చెప్పడానికే. మిత్రుడు డా.చింతకుంట శివారెడ్డి మాతృగడ్డ రుణం తీర్చుకోవడానికై అన్నట్లు కడప జిల్లా ప్రత్యేకతలను పూసగుచ్చి ఒక గ్రంథంగా సమాజానికి అందిస్తున్నాడు. ఒక బృహత్తర కార్యక్రమంగా శివారెడ్డి సాగించిన విషయ సేకరణ, పరిశీలన, విశ్లేషణలు ‘కడప చరిత్ర’కు కొత్త గొంతును ప్రసాదించింది. కడప నామరూప చరిత్రతో మొదలు పెట్టి కడపయాసపై,

కడపజిల్లా విజ్ఞాన దీపిక

Merupula Marakalu

200.00

ఈ నవల చదివినంత సేపు ఒక రసవత్తరమైన సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది. స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే ఉషారాణి పాత్ర మొదటి నుంచి చివరి వరకు ఈ నవలని ఏకబిగిని అద్భుతమైన టెంపోలో నడిపిస్తుంది. సంభాషణలు ఇప్పటికి ఆధునీకమే. ప్రతి దృశ్యాన్ని ఆధునిక కళాఖండంగా మలిచారు నాన్న గారు. నవల ముగింపు ఒక అనూహ్యం.

                 మానవుని స్వయం శక్తీ ఒక పక్క, ఆధ్యాత్మిక సంపద మరో పక్క పెనవేసుకుని ఈ నవలకి దీప్తిని, శోభని చేకూర్చాయి. నాన్నగారి సాహితి జైత్రయాత్రలో అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి ఒక గొప్ప సజీవమైన నవల…. మెరుపుల మరకలు.