Showing 385–396 of 860 resultsSorted by latest

NTR Samagra Jeevitha Katha

400.00

 శ్రీమంతం, సారవంతం అయిన కృష్ణాతీరాన రైతుబిడ్డగా పుట్టిన నందమూరి తారక రామారావు ఈడు రాగానే పక్వానికొచ్చిన కళాకాంతుల్ని మూటగట్టుకుని వైనతేయుడిగా రెక్కవిదిల్చి చెన్నపట్నంలో వాలారు. రాముడై, కృష్ణుడై విశ్వవిఖ్యాత నటసార్వభౌముడై వెండితెరకు సొగసులద్దారు. తెలుగునాట పూజామందిరాలలో నిలువెత్తు స్థానం సంపాదించుకున్నారు. కర్మయోగిగా జనామోదం పొందారు. మరోసారి రెక్కవిదిల్చి ప్రభంజనమై  తెలుగుజాతికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. జననేతగా జేజేలందుకుని తెలుగువాడికి కొండగుర్తుగా నిలిచిన ఆ మహనీయుని జీవితాన్ని ఆవిష్కరించే పుస్తకం యన్.టి.ఆర్.

Rendu Kommula Rushi

225.00

పరిచయం

వివిధ ప్రాంతాలలో వివిధ భాషలలోని రామాయణ, మహాభారత, భాగవతాలను చదివి ఈ ఐదు భాగాల పుస్తకాలను రచించాను. అవి వేర్వేరుగా ఉన్నట్టు అనిపించినా వాటిని కలిపే మూలం ఒకే దారంగా అన్నింట్లోను కనబడుతుంది. పురాణాలలో పేర్కొన్న కొన్ని పాత్రలు వారి జీవిత కోణంలోంచి కథను చెబుతాయి. ఈ కథలలోని ప్రదేశాలు నేను దర్శించి అక్కడ చెప్పే కథల సారాంశాన్ని, సమాచారాన్ని అందించడం నా అదృష్టం,

పురాణాల్లోని వివిధ అంశాలను సేకరించి వ్రాసిన ఐదు పుస్తకాలలో ఇది చివరిది. ప్రతి పుస్తకం మరో పుస్తకంతో సంబంధం లేనిదైనా దేనికదే వివరంగా ఉంటుంది. నేను వ్రాయలేక వదిలేసినవి అనేక కథలున్నాయి. ఈ పుస్తకం చదివి మీరు స్ఫూర్తిని పొంది మిగిలిన కథలు మీ అంతట మీరే చదువుతారని ఆశిస్తున్నాను.

ఈ పుస్తకాలు రాసేటప్పుడు నా సంపాదకురాలు శృతకీర్తి ఖురానా నాకు సహకారం అందించింది. నేను పరిశోధన చేసేటప్పుడు జీవితం, ఆధ్యాత్మికత గురించి, పుస్తకాల గురించి అనేక లోతైన చర్చలు జరిపి మమ్మల్ని మేం తెలుసుకున్నాం. మా అనుబంధం సంపాదకురాలు – రచయిత కన్న ఎక్కువది. అనేక విధాలుగా ఆమె నాకు కూతురు, మరిన్ని రకాలుగా ఆమె నా విద్యార్థి, నేను చేపట్టే వితరణ కార్యక్రమాలలో చిరకాల సలహాదారు. మేం చేసే వినోదభరిత సంగీత సాహిత్య సాహసయాత్రలో నాతోబాటు ప్రయాణించిన యువనేస్తం.

పెంగ్విన్ రాండంహౌస్ లోని సోహిని మిత్రా, షాలిని అగర్వాల్, ప్రియంకర్ గుపా బృందం ఐదు పుస్తకాలు అందించడానికి ఇచ్చిన తోడ్పాటుకు, తెలుగులో తీసుకువచ్చిన అలకనంద ప్రచురణలకు నేను కృతజ్ఞురాలిని.

Varma Mana Karma The Passion Of RGV

150.00
అసలాయన్ని డిఫైన్ చేయాలంటే ఎవరికీ సాధ్యం?
ప్రపంచంలోని ఏ వస్తువునైనా, దేన్నైనా డిఫైన్ చేయగలం. మనకున్న స్పర్శ, జ్ఞానం, తెలివి అన్నింటిని బేస్ చేసుకుని… మనకి చల్లగా తగిలితే ఇది గాలి అని, వేడిగా తగిలితే ఇది సెగ, అని, నీళ్ళని చూడగానే నీళ్లు అని… ఇలా దేన్నైనా డిఫైన్ చేయగలం. పంచభూతాలని డిఫైన్ చేయగల, అర్థం చేసుకోగల మనం… ఈ వర్మని డిఫైన్ చేయమని అడిగితె మాత్రం సరిగ్గా ఇది చెయ్యలేం. ఎందుకంటే…. అతడ్ని జ్ఞాని అన్నా, పిచ్చోడన్నా, తెలివైనవాడు అన్నా ఏది అన్నా కూడా చివరికి అతను ఇదే అని చెప్పడం మాత్రం కష్టం, చాలా కష్టమైన పని. అంటే మాటలకూ, నిర్వచనాలకు అందని వ్యక్తి రామ్ గోపాల్ వర్మ.
కొంతలో కొంత ఇతడ్ని డిఫైన్ చెయ్యడానికి….
A Man beyond everything అనుకోవచ్చు…
అంటే వర్మ అన్నిటిని మించిన మనిషి అని.

Suswarala Lakshmi M S Subbalakshmi

400.00

ఇదొక జీవనరాగం. విశ్వవిఖ్యాత కర్నాటక సంగీత విద్వాంసురాలు శ్రీమతి ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి జీవితం ఆధారంగా శ్రీమతి పల్లవి రచించిన నవల. ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి తొలిదశలో చలనచిత్ర నటిగా మీరా వంటి చిత్రాలలో నటించింది. తర్వాత సదాశివంతో వివాహమై జీవితంలో స్థిరపడిన తర్వాత కచ్చేరీలకే పరిమితమైంది. ఆమె కేవలం గాయని మాత్రమే కాదు, మానవీయమైన సుగుణసంపత్తి గల వ్యక్తి – పారగాన్ ఆఫ్ వర్చూస్ అంటారు. ఒక సంగీత సామ్రాజ్ఞి జీవితాన్ని హృద్యంగా వచన కథాకావ్యంగా తీసుకుని రావడం కష్టతరమైన పనియే. ఎందుకంటే ఇందులో కల్పనకు తావులేదు. ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. అందులోని సాధక బాధకాలు రచయిత్రికే తెలుసు.

            పల్లవి లోగడ మహానటి సావిత్రి జీవిత చరిత్రను రచించింది. పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆరేడు ముద్రణలకు నోచుకుంది. అందులో కథ ‘చిత్ర’ విచిత్ర గతులతో నడుస్తుంది. ఇందులో అలా ఉండదు. ఇదొక గాంధర్వలోకం. రచయిత్రి ప్రతిభా విశేషముతోనే కథాకథనం రాణించాలి. అందులో ఈమె కృతార్థురాలయింది. అందుకు మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. సుబ్బలక్ష్మి రాగము, సదాశివం తానం, రచయిత్రి పల్లవి. మధ్యలో నా అనుపల్లవి అవసరం లేదు. అయినా ఆమె కోరికను కాదనలేక ఈ నాలుగు మాటలు రాశాను. సుబ్బలక్ష్మిగారి జీవితంపై వచ్చిన సమగ్ర ప్రామాణిక పరిశోధనా గ్రంథం ఇది.

                             – ముదిగొండ శివప్రసాద్

Bhagavathamlo Manipusalu

100.00

“భాగవత” మంటే భగవత్తత్వాన్ని తెలియచేసేదని అర్ధం. ఈ భాగవత్తత్వాన్ని తెలియచేసేవారిని “భాగవతు”లంటారు. వాళ్ళు పరమ భగవతోత్తములై తాము దర్శించిన దానిని –

ఇతరులు ధన్యత చెందాలనే వుద్దేశంతో, తమలోని భక్తీ, ఆనందం, చైతన్యం, బ్రహ్మానందం కలిపి అందిస్తారు. అది విన్న, చదివిన వారలందరు భాగవతులై, భగవత్తత్వానందుకోవాలనే సత్సంకల్పమే వారి లక్ష్యం.

అటువంటి దివ్యలక్షణాని కనుగుణంగా ఇటు భక్తీ – వేదాంత ఆధ్యాత్మిక దృష్టి, అటు వ్యాపారదృష్టి అంటే సద్గ్రంధాలను, సర్వభక్త జనానీకానికి అందించాలనే సదాశయంతో – నాతో –

“స్వామీ! కొన్ని క్రొత్త ప్రచురణలు తిసుకోవద్డామనుకుంటున్నా” నని చెప్పి – నన్ను –

1. సంక్షిప్త భాగవతం

2. సంక్షిప్త భారతం

3. సంక్షిప్త శ్రీమద్రామాయణం

చిన్న చిన్న సంపుటాలుగా వ్రాయమని కోరారు. ఆ ఆలోచనా దివ్య సరళికి – ఈ గ్రంధమొక మచ్చుతునక. అనకూడదు కాని, ఈ కధలన్నీ చదివితే (కృష్ణ) భాగవతాన్ని చదివిన “తృప్తి” – తప్పక కల్గుతుంది. కారణం –

ఆ భగవంతుడు నాకిచ్చిన “ఆవేశ – ఆదేశాలలో కొన్ని కొన్ని సమయాలలో – ఆ పాత్రలలో పాత్రనై పోయాను. బ్రహ్మానందమను భవించాను. ఆ సందర్భాలు, సంఘటనలు తప్పక, పఠీతులను భక్తులను చేస్తాయి. భక్తులను భగవంతుని చేరువ చేస్తాయి.

– రామకృష్ణ ప్రసాద్

Dasarathi Sahityam- 4

400.00

“దాశరథి అన్నిటికన్నా ముందు – మనిషి, ఏ కొద్దిపాటి వానచినుకులకైనా తబ్బిబ్బుకాగల రావిఆకు హృదయమున్నవాడు. అతనొక సంక్షుభిక తెలంగాణా ఉద్యమకాలంలో కాక, మరొక కాలంలో జన్మించినట్లయితే, ఏమి చేస్తుండేవాడో ఊహించడం కష్టం కాదనుకుంటాను.

ఇప్పుడు మన చేతుల్లో ఉన్న ‘యాత్రాస్మృతి’ అనడం కన్నా, కవిపరంపరతో కలిసి చేసిన  యాత్రాస్మృతి అనడం సముచితంగా ఉంటుంది. ఒకప్పుడు మహా రాష్ట్రదేశంలో  సంత్ జ్ఞానేశ్వర్, నామదేవ్ వంటివారు ప్రోదిచేసి పోషించిన వర్కారీ సంప్రదాయంలో లాగా, పండరియాత్ర చేసే భక్త గాయకులు తమ యాత్రనొక కావ్యయాత్రగా మార్చుకున్నాడు. అతిసున్నితమైన, మసృణకోమలమైన ఆయన హృదయం ఏ పాటలు పాడుకున్నదో అన్న పాటలూ మనం వినలేకపోయాo. క్లుప్తంగా కనిపిస్తున్న ఈ పుస్తకం పుటల్లో రాసిన వ్యాక్యాలను సంభావించుకునే యోగ్యత  ఒక్కటే మనకు మిగిలింది.

“మహారచయిత టాల్ స్టాయి ‘యుద్ధము శాంతి’గా పర్యవసించడానికి ఒక నవలగా రాసాడు. కాని దాశరథి విషయంలో ‘యుద్ధము – శాంతి’ ఆయన జీవితంగానే పెనవైచుకు పోయాయి”.

– చినవీరభద్రుడు

Dostoevsky Kathalu

125.00

ఫెయోదార్ మిఖలోవిచ్ దొస్తాయేప్ స్కీ (11 నవంబర్ 1821 – 9 ఫిబ్రవరి 1881) పీటర్స్ బర్గ్ (అప్పటి రష్యా రాజధాని)లో ఓ మధ్యతరగతి డాక్టర్ కుటుంబంలో జన్మించాడు. యవ్వనంలో ఇంజినీరింగ్ చదువుతున్న సందర్భంలో విప్లవ భావాలతోప్రేరేపితమయ్యాడు. డిశంబరిష్ట తిరుబాటు (1825 – డిసెంబర్) ఆనాటి రష్యాలోని మధ్యతరగతి, యూనివర్శిటీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ స్ఫూర్తితో ఓ యువ తాత్విక చర్చా సంఘంలో ఆయన చురుకుగా పాల్గొన్నాడు. “పేద జనం” అతని మొదటి రచన. అది సాహిత్య ప్రపంచంలో మంచి పేరు తెచ్చింది. ఈ పుస్తకం జారిప్ట్ రష్యాలో పేదల పాట్లను వివరించింది. దీనితో ప్రభుత్వం ఇతని రచనలపై నిషేధం విధించి, తిరుగుబాట్ల సమర్థకుడనే అభియోగం మోపి ఉరిశిక్ష విధించింది. పీటర్స్ బర్గ్ జైలులో వుంచారు. తరువాత జరిగిన విచారణ వల్ల చివరి క్షణంలో, సైబీరియన్ ప్రవాసానికి పంపించారు. తిరిగి వచ్చిన తరువాత వ్రాసిన కరమజోవ్ సోదరులు, నేరము – శిక్ష, శ్వేత రాత్రులు, ఈడియట్ వంటి రచనలు ప్రజల మన్ననలు పొందాయి. మానసిక విశ్లేషణలతో కూడిన వాస్తవవాద దృక్పథాన్ని అనుసరించడం వల్ల ఆయన సాహిత్యం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.

Kaala Rekha

135.00

ప్రజా భారత ఐతిహాసికుడు ఒక సహస్రాబ్ది దార్శనిక కవి శేషేంద్ర పునఃసంస్మరణ కవిత్వానికి తక్షణ ప్రయోజనం, కవిత్వాన్ని విని శ్రోత ఒక ఆత్మిక తృప్తిని పొంది వ్వాప్ అనడం, భోజనం తిని గుర్రున త్రేన్చినట్టు. అయితే తిన్న ఆన్నం జీర్ణమై శరీరాన్ని, మెదడును నడిపే ఇంధనమై రక్తప్రవాల్లోకి ప్రవేశించి, నఖశిఖ పర్యంతం వేలాది రక్తనాళాల్లో ప్రవహిస్తూ క్రమంగా మనిషిని శారీరకంగా మానసికంగా బలిష్టుణ్ణి ఎలా చేస్తుందో ఎలా సజీవునిగా నిలబెడుందో అలాగే కవిత్వం శ్రవణంచేత ప్రభావితుడౌతాడు. అలంకార బింబ ప్రతీకలు శ్రవణేంద్రియాల ద్వారా మనిషిలోని రక్తంలోకి ప్రవేశించి అనదుల్లో కరిగిపోయి సమస్త శరీరవ్యాప్తమౌతాయి. రక్తనిష్టమౌతాయి. అలా ఒక తరం మానవుల్లో రక్తనిషమైన అలంకార బింబ ప్రతీకలు తదనంతర తరానికి జన్యుకణాల ద్వారా సంక్రమింపజేయబడతాయి. అలా తరతరాలు రక్తనిష్టంగా సంక్రమింపజేయబడి, అవి మనిషి ఆలోచనల్నీ, అలవాట్లనీ, చర్యల్నీ, స్వభావాన్సీ రూపాయితం చేస్తాయి. ఒక దేశపు పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు ఆ దేశపు ప్రజలకు ఇదే చేశాయి. ఆ పార్యంతిక ఫలాల్నే ఆ దేశపు సంస్కృతి అనీ, నాగరకత అనీ అంటారు. ఈ రెంటికీ కవులే జనకులు. ఇదే కవిత్వం కలిగించే శాశ్వత ప్రయోజనం. | శేషేంద్ర, కవిసేన మానిఫెస్టో, నేటి కవిత్వం – వివిధ దృక్పథాలు- ఆగస్ట్, 1994).

1977 లో ప్రథమ ముద్రణగా వెలువడ్డ ఆధునిక కావ్యశాస్త్రం ‘కవిసేన మానిఫెస్టోను వెలువరిస్తూ శేషేంద్ర ‘అపూర్వ చైతన్య వ్యాప్తి కోసం ఐతిహాసిన పరిస్థితుల్లో ఆవిర్భవించిన | ఒక కవితోద్యమ పత్రమనీ’ మానిఫెస్టోను అభివర్ణిస్తూ… ప్రాచీన ప్రాక్ పశ్చిమ కావ్యతత్త్వ చింతన, ఆధునిక కావ్యతత్త్వ చింతన, మార్క్సిస్ట్ కావ్యతత్త్వ చింతన, అనే చింతనా చతుష్టయ శాఖల్ని కలిపి పరిశీలించి ఆ నాల్గింటిలో ఉన్న ఆశ్చర్యజనక అభిన్నతనూ, ఐకమత్యాన్ని……………

Kale neta

500.00

మనకు తెలియని మహిళల ఆత్మకథ

పాశికంటి (బల్ల) సరస్వతిగారు తన 69వ యేట (2012) మొదలు పెట్టి తన 76వ యేటకు (2019) పూర్తి చేసిన ఆత్మకత ‘కలెనేత’. ఒక బహుజన (పద్మశాలి), తెలంగాణ ఉపాధ్యాయురాలు రాసిన రెండవ ఆత్మకథ. సుమారు అటుయిటుగా నూటా ఇరువై సంవత్సరాలు ఏడుతరాల నేతపనివారి గెలుపోటముల విషాద విధ్వంసక పోరాట చరిత్ర… ‘కలెనేత’లో సరస్వతిగారు నాలుగోతరం ప్రతినిధి. భారతదేశంలో జాతీయోద్యమ పోరాటం, తెలంగాణాలో రైతాంగ సాయుధ పోరాటం రూపుదిద్దుకుంటున్న కాలంలో సరస్వతిగారు నడక నేర్చుకున్నారు. అక్కడి నుండి ఒక మహిళగా, ఉపాధ్యాయురాలిగా తన జీవితాన్ని, తన బతుకు చుట్టూ విస్తరించి యున్న గ్రామీణ జీవితాన్ని తార్కికంగా అర్థం చేసుకున్నారు… మూడు తరాలు వెనక్కి తన తల్లిదండ్రులైన పాశికంటి రామదాసు, లక్ష్మమ్మలను – తాత వీరయ్య – అతని తండ్రి ధర్మయ్యదాకా లోపలికి వెళ్లారు. అక్కడి నుండి 2019 దాకా తను, సాగిన జీవనయానం – దాని చుట్టూ విస్తరించి ఉన్న జీవితాన్ని అంటే మరో మూడు తరాల సమకాలీన జీవితాన్ని ఆత్మకథలో చిత్రించారు. తెలంగాణా సాయుధ పోరాటం ఉధృతంగా నడిచిన ఆలేరు, జనగామ, వరంగల్లు, నల్గొండ ప్రాంతాలు – అక్కడి గ్రామాలు, చిన్న పట్టణాలు ఈ ఆత్మకథలో కన్పిస్తాయి.

ఇదే ప్రాంతం నుండి ఇంతకన్నా ముందు ముదిగంటి సుజాతరెడ్డిగారు ‘ముసురు’ అనే పేరుతో ఆత్మకథగా రాశారు. సుజాతారెడ్డిగారు ఉపాధ్యాయురాలే. నకిరేకల్ (నల్గొండ) నుండి కరీంనగర్ దాకా అదే పోరాటకాలంలో దొరల జీవన నేపథ్యంలో రాశారు. తెలంగాణాలో బహుజన మహిళ సంఘం లక్ష్మీబాయమ్మ రాసిన మొట్టమొదటి

ఆత్మకథ ‘నా అనుభవములు’. ఈ ఆత్మకథను కాంగ్రెస్ రాజకీయాల నేపథ్యంలో రాసారు. తెలంగాణాలో పురుషులు రాసిన ఆత్మకథలు… సామల సదాశివ ‘యాది’, దాశరథి రంగాచార్య ‘జీవన యానం’, దాశరథి కృష్ణమాచార్య ‘యాత్రాస్మృతి’, కాళోజీ ‘నా గొడవ’, బోయి భీమన్న ‘పాలేరు నుండి పద్మశ్రీ వరకు’, పి.వి. నర్సింహారావు ‘లోపలి మనిషి’, రావినారాయణరెడ్డి స్వీయచరిత్రము’ రాశారు.

ఈ మూడు మహిళల ఆత్మకథలు తెలంగాణా మహిళా సాహిత్యంలో (సుమారుగా ఏడువందల నవలలు వచ్చినా కూడా) ప్రామాణికంగా నిలుస్తాయి………….

బల్ల సరస్వతి – in