-
Aalochinchandi Iswaryavanthulu Kandi
₹199.00సంపదకు సంసిద్ధులుకండి
డబ్బును సంపాదించే మార్గాన్ని మీకు భోదించడం ద్వారా ఈ పుస్తకం మీ జీవితాన్ని ఆసాంతం మార్చేస్తుంది. ‘ఆలోచించండి, ఐశ్వర్య వంతులు కండి’ అనే పుస్తకం, రచయిత సాగించిన పరిశోదన, విశ్లేషణ ల తాలుకు ‘విజయ రహస్యాల ‘ ఫై ఆధారపడింది. ఇది గొప్ప గొప్ప ఐశ్వర్య వంతులు, విజేతల స్వానుభవ, మేధోమధన ప్రతి ఫలాల్ని ప్రతిబింబిస్తుంది.
-
-
Bhinnamga Undataniki Sahasinchandi Sampannuluga Yedagandi
₹225.00‘భిన్నంగా ఉండటానికి సాహసించండి సంపన్నులుగా ఎదగండి’ అనే ఈ పుస్తకం’ త్వరగా ధనవంతులు అవండి’ అనే మరో కరదీపికలాంటిది కాదు. ఇది ఒక వ్యావహారిక జ్ఞానంతో ఆలోచనలని రేకెత్తిస్తూ 150 ఏళ్ళ సాంస్కృతిక, వాణిజ్య చరిత్రలోకి చేసే ఒక యాత్ర. దీన్నిండా ఎన్నో ఉపయోగకరమైన సలహాలూ, ఆసక్తిదాయకమైన వాస్తవాలు, వినోదాన్ని పంచే వృతాంతాలు ఉన్నాయి. ఈ పుస్తకం కాలిఫోర్నియాలో బంగారం గనుల కోసం అన్వేషణ కొనసాగించిన కాలం నుంచి యుద్దకాలంలోని బెర్లిన్ నంగరం దాకా వెళ్లి, మళ్ళీ ఈనాటి సిలికాన్ వ్యాలీ వరకూ వస్తుంది. డిస్నీల్యాండ్ నుండి సౌది అరేబియాకీ, లీవై స్ట్రాస్ నుంచి స్టార్ బక్స్ కాఫీ దాకా, జాన్ డి రాక్ఫెల్లర్ చమురుబావుల నుంచి వారెన్ బఫెట్ ఒమాహ దాకా మనల్ని తీసుకుపోతూ, అన్ని రకాల ప్రతికూల పరిస్థితులనీ ఎదుర్కొంటూ విజయం సాధించాలనే పట్టుదల, మరింత ఎత్తుకి ఎదిగే ప్రయత్నం చేసే స్త్రీ పురుషుల కధలని మనసుకి ఆకట్టుకునేలా రచయిత చెబుతాడు.
వాణిజ్యవేత్తలైన స్త్రీ పురుషులు, ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన క్రీడాకారులు, సంగీత విద్వాంసులు, సుప్రసిద్దులైన స్టీవ్ జాబ్స్, కోకో షనేల్, ఆర్నాల్డ్ స్వాజినేగర్ లాంటి వారి విజయగాధలను ప్రస్తావిస్తూ, జీవితంలో కొద్దోగొప్పో (లేక ఏమాత్రం)సాఫల్యం సాధించని అధికశాతం జనానికీ ఈ విజేతలకీ మధ్య ఉన్న తేడా కేవలం ఎక్కువ సంపద ఉండడం వల్ల మాత్రమే కాదని ఈ పుస్తకం విశదీకరిస్తుంది. విజయానికి అవసరమైన ఒక స్పష్టమైన తాత్వికతని అందిస్తుంది. కలలుకనే సాహసం చెయ్యగలవారందరి కోసం రాయబడిన పుస్తకం.
-
-
Developing Right Brain
₹120.00Every student has two brains, left and right. Psychologists say, Right brain is for intelligence and shrewdness; and Left is for memory.
It does not matter whether you are a left-brain student (good at Medicine, Law, Literature) or right brain oriented (Maths, Engineering, Chartered accountancy), brain is the only organ that never wears out. It works more vigilantly the more you quiz it.
For students who are not able to perform well in interviews, the reasons may be… tension and lack of spontaneity. These mystifying and funny puzzles are designed to sharpen your imagination.
This book creates interest to those, who are averse to mathematics and reasoning. It is a fun-game when family members Sit together, solve puzzles, and tease each other, parents awarding children for correct answers.
Pages : 173
-
Dindukinda Nallatachu – దిండుకింద నల్లతాచు
₹120.00”నవ్య నవలల పోటీలో రూ. 50,000 ల ప్రథమ బహుమతి పొందిన నవల”
”చూడూ కళ్యాణీ! నాకు పెళ్ళయిన ఆడాళ్లంటే చాలా ఇష్టం. అందులోనూ మొహానికి పసుపు రాసుకుని, ప్రొద్దున్నే తులసి కోటకి పూజ చేసేవాళ్ళంటే మరీ ఇష్టం. ఒక్కసారి వప్పుకో. మళ్ళీ నీ జోలికి రాను” అంటూ దగ్గరగా జరిగాడు. సరీగ్గా ఆ సమయానికి బయట నుంచి కాలింగ్ బెల్ శబ్దం వినిపించింది. కల్యాణి చిగురుటాకులా వణికిపోయింది.
”దేశమంతా ఒకే మతం ఉంటే గొడవలు ఉండవా? మరి లెబనాన్ దేశంలో హజ్‌బుల్లా షియాలు సున్నీలు ఎందుకు ఊచకోత కోస్తున్నారు? ఆఫ్ఘనిస్తాన్‌లో ఆల్‌ఖైదా సున్నీలు షియాల్ని ఎందుకు చంపుతున్నారు? మన పక్క దేశం పాకిస్థాన్లో షియాలకీ, సున్నీలకీ మధ్య ఎందుకంత రక్తపాతం?” అని ఆగి, ”మనిషి సుఖంగా బ్రతకటానికి కావల్సింది మతం కాదురా. మానవత్వం” అన్నాడు.
”మానవత్వం అన్నం పెట్టదు”
”అమెరికాలో అన్నంట ఉంటుంది. తినటానికి టైమ్ ఉండదు. సొమాలియాలో టైమ్ ఉంది. తినటానికి అన్నం ఉండదు. ఆఫ్ఘన్‌లో మతం ఉంది. అక్కడ శాంతి లేదు. అన్నీ ఉన్న భారతదేశాన్ని ఎందుకురా ఇలా పాడు చేస్తున్నారు?”…
పేజీలు : 192
-
Idli – Orchid – Akasam – ఇడ్లి – ఆర్కిడ్ – ఆకాశం
₹150.00ఆత్మహత్య చేసుకోవాలని నా స్నేహితుడి ఆఫీసు 26వ అంతస్థుకి చేరుకున్నాను. అతణ్ణి బయటకు పంపి, కీటికీలోంచి బయటకు దూకబోతుండగా ఒక సంఘటన నన్ను మార్చింది. 600 కోట్ల హోటల్‌కి అధిపతిగా చేసింది.
ఇడ్లీ ఒక ప్లేట్లో, చట్నీలు మరొక ప్లేట్లో, సాంబార్ సెపరేట్‌గా గిన్నెలో సర్వ్ చేసేవాళ్ళం. మూడూ ఒకే దానిలో ఇచ్చేలా ‘దొప్ప’లున్న ”కామత్” ప్లేట్లు తయారు చేయించారు. దానితో అంట్లు తోమే వారి ఖర్చు నెలకి పాతికవేలు తగ్గింది.
‘నీ జీవితాశయం ఏమిటి’ అని ఓబెరాయ్ నన్ను అడిగారు.” మీ హోటల్ కన్నా పెద్దది కట్టడం” అన్నాడు. పన్నెండేళ్ళ వయసులో అది నా అహంభావం కాదు – కల!
భారత రాష్ట్రపతికి లస్సీ కావాలని మా హోటల్‌కి కబురొచ్చింది. అందమైన ఫ్లాస్క్ మీద ‘కామత్’ అని ప్రింట్ చేయించి లస్సీ పోసి పంపాను. పది లక్షలు వెచ్చించినా ఇంత వ్యాపార ప్రకటన దొరకదు.
14 భాషల్లో అనువదింపబడి – రెండు యూనివర్సిటీలకీ నాన్‌డిటెయిల్డ్‌గా ఉన్న పుస్తకం.
ప్రపంచ ప్రతిష్ఠాత్మకమైన హోటల్‌గా ప్రథమ బహుమతి పొందిన ‘ఆర్కిడ్స్’ హోటల్ అధినేత విఠల్ ఆత్మకథకి శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ విశిష్ఠ రూపకల్పన.
ఎలా ప్రారంభించాలో, ఎక్కణ్ణుంచి మొదలుపెట్టాలో, ఎలా బ్రేక్‌త్రూ సాధించాలో ఈ పుస్తకం చెపుతుంది. ఇది చదివి ఒకరైనా స్ఫూర్తి చెందితే ఈ రచన ఆశయం నెరవేరినట్టే.
-
Loya Nunchi Sikharaniki – లోయ నించి శిఖరానికి
₹150.00విద్యార్ధులకి శిక్షణాతరగతులు ప్రారంభిస్తూ ”మీలో జీవితంలో పైకి వద్దామనుకునేవారు చేతులు ఎత్తండి” అని అడిగినప్పుడు అందరూ ఎత్తుతారు. కొందరు నిలబడి మరీ ఎత్తుతారు.
”ఏ వయసులో?” అన్న రెండో ప్రశ్నకి హాలులో నిశ్శబ్దం అలుముకుంటుంది. మూల నుంచి ఎవరో, ”ఇరవై అయిదేళ్ళకి” అంటారు.
”అప్పుడేమి జరుగుతుంది? ఉద్యోగం వస్తుందా? పెళ్ళవుతుందా? (నవ్వులు)
అసలు పైకి రావటం అంటే ఏమిటి? ఒక లక్షాధికారి ముప్పై ఏళ్ళకే ముసలివాడై పోయాడు. మరొకడు తల్లి దండ్రుల్ని అనాధాశ్రమంలో చేర్చాడు. వీరు జీవితంలో పైకి వచ్చినట్టా?”
పెద్దవాళ్ళు కూడా అంత తొందరగా సమాధానం చెప్పలేని ప్రశ్న.
శఠగోప రహస్యాన్ని విశదీకరిస్తూ, షడ్గుణ ఐశ్వర్యాల్ని వివరిస్తూ, వ్యక్తిత్వ వికాసమంటే ”స్వార్థాన్ని పెంచడం” అన్న కొందరి అభిప్రాయాల్ని పటాపంచలు చేస్తూ, రెండు కోట్ల రూపాయలపైగా అమ్మకాలు సాధించిన ”విజయానికి అయిదు మెట్లు” రచయిత అందిస్తున్న మరో మాస్టర్ పీస్ ‘లోయ నుంచి శిఖరానికి’.
-
Manchupula Varsham – మంచుపూల వర్షం
₹50.00వ్యక్తుల్ని ప్రేమించేకొద్దీ, వారి నుంచి దూరమైతే విరహం, వారికి కోపం వస్తే బాధ. వారు వేరే వారిపట్ల కాస్త ఎక్కువ శ్రద్ద చూపితే ఈర్ష్య! అదే ప్రాణంలేని సంగీతం, పెయింటింగ్, రచన, పఠనం మొదలైన వాటి పట్ల అభిరుచి పెంచుకుంటే మనకి మనమే వాటితో రమించవచ్చు. అవి అలగవు, కోరికలు తీర్చమని బలవంతపెట్టవు. మరికొంత సమయం తమకోసం కేటాయించమని అడగవు. అందుకే ప్రకృతితో స్నేహం ఎల్లప్పుడూ నిరపాయకరం.
సామాన్యుడు ఎవరేం చెప్పినా నమ్ముతాడు. ఎలా ? ఎందుకు? అని ఆలోచించడు. హేతువు వున్నదాలేదా ? ఇదెలా జరుగుతుంది ? అని తెలివైనవాడు తర్కిస్తాడు. తనకి తెలియని హేతువు కూడా వుండొచ్చుకదా, కారణం వున్నదే కరెక్టనుకోవటం దేనికి ? అని మేధావి ఆలోచిస్తాడు. హేతువు కన్నా, తనకిగానీ, ప్రపంచానికి గాని ఆ పనివల్ల వచ్చే ‘ఉపయోగం’ గురించి జ్ఞాని ఎక్కువ పరిశీలిస్తాడు.
మనిషి ఎలా సంతృప్తిగా బ్రతకాలో చెప్పేదారిలో, ఒక మైలురాయి లాంటి వాడు భగవంతుడు. కర్తవ్య నిర్వహణ మానేసి కేవలం అతణ్ణి పూజించేవాడు, ప్రయాణం మానేసి ‘మైలురాయి’ని పూజిస్తున్నవాడి కింద లెక్క.
ఈ ప్రపంచంలో మోసగాళ్ళందరూ ఎప్పుడూ రకరకాల అబద్ధాలు ఆడుతూ వుంటారనీ, అందమైన కట్టుకథలు విపరీతంగా చెప్పేస్తూ వుంటారనీ, మామూలు మనుషుల కన్నా వాళ్ళు చాలా డిఫరెంట్‌గా వుంటారని మనమనుకుంటే అది చాలా తప్పు. వాళ్లూ మనలాగే ఉంటారు. వారి సిన్సియారిటీని హానెస్టీగా ఎప్పుడూ భావించకూడదు. సిన్సియారిటీ అంటే శ్రద్ధ. హానెస్టీ అంటే నిజాయితీ. అతడు చాలా సిన్సియర్ అనటానికీ, అతడు చాలా హానెస్ట్ అనడానికీ చాలా తేడా ఉంది. నమ్మకద్రోహులే ఒక్కోసారి చాలా శ్రద్దగా వుంటారు.
మనో వైజ్ఞానిక సాహిత్యంలో అపూర్వ సంచలనాలను సృష్టిస్తున్న వ్యక్తిత్వ పుస్తకాలు – తప్పుచేద్దాంరండి, విజయానికి ఆరోమెట్టు, మైండ్ పవర్ నెంబర్ 1 అవటం ఎలా, విజయంలో భాగస్వామ్యం, విజయానికి అయిదుమెట్లు-గెలుపుకోసం ప్రతి వ్యక్తి ఆచరించవలసిన సూత్రాల్ని పై పుస్తకాల్నుంచి క్లుప్తీకరించి పాఠకుల సౌలభ్యం కోసం శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ అందిస్తున్న విజయ రహస్యాల సంకలనం ‘మంచుపూల వర్షం’.
-
Mind Power – మైండ్ పవర్
₹270.00ఈ ‘మైండ్ పవర్’ పుస్తకంలో మానవ జీవితాన్ని సమూలంగా మార్చివేయగల అంశాలు వున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఒక మనోతాత్త్విక విశ్లేషణ (). సైద్ధాంతికంగా చెబితే అంత తేలిగ్గా అర్ధంకాని విశ్లేషణలను సైతం చిన్నచిన్న సంఘటనల సాయంతో విడమరచి చెప్పడంలో రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గొప్పతనం వెల్లడయింది. పుస్తకం ఆరంభం నుంచీ, అంతం వరకూ రచయిత తన సహజశైలిలోని జిగి, బిగిని సడలనివ్వలేదు. ఇతర ‘పర్సనాలిటి డెవలప్‌మెంట్’ పుస్తకాల లాగా ఒకసారి చదివేసి పక్కన పెట్టేసే పుస్తకం కాదిది.
జీవితంలోని వివిధ దశల్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు ఇందులో పొందుపరచారు. అందువల్ల ప్రతివ్యక్తీ దీనిని పదేపదే చదివి తీరాల్సిందే. అసామాన్యులు మెదడు చెప్పినట్లు చేయకుండా, తాము చెప్పినట్లు ‘మెదడు’ నడుచుకునేటట్లు ‘ట్యూన్’ చేసుకుంటారు. అలాంటివారే నెంబర్‌వన్ కాగలుగుతారు. మనిషిని మెదడు వాడుకునే దశనుండి మెదడును మనిషి వాడుకునే దశకు చేరుకోవాలంటే యండమూరి వీరేంద్రనాథ్ ‘మైండ్‌పవర్’ మంచి అక్షర సాధనం కాగలదు.
సామ్యవాదం కోసం మనోశక్తి, మనో ప్రణాళిక, మనోధైర్యం, మనో విశ్లేషణ, మనశ్శాంతి కాక ‘ఆర్ధికావగాహనావలోకం’ కోసం అవన్నీ తెలుసుకోవాలనుకుంటే, అదే పాజిటివ్ థింకింగ్ అనుకుంటే ఇది అవశ్య పఠనీయ గ్రంథం. పాఠకుడి మానసిక స్థాయిని పెంచి తద్వారా సమస్యల్ని పరిష్కరించే ఆత్మవిశ్వాసాన్నీ, నేర్పునీ, అందించిన ఈ ప్రయత్నం ప్రశంసనీయం.
-
Padamati Koyila Pallavi – పడమటి కోయిల పల్లవి
₹50.00పాశ్చాత్య కవితా ఝరిని తెలుగు సాహితీ క్షేత్రానికి తీసుకురావాలన్న ప్రయత్నంలో ‘పడమటి కోయిల పల్లవి’కి ‘తీయ తెనుగు అను పల్లవి’ జత కూర్చి శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ సారధిగా కట్టిన కవితా వారధి ఈ పుస్తకం.
కీట్స్, వర్డ్స్‌వర్త్, కోలరిడ్జ్, డన్‌మోర్, ఈట్స్ లాంటి కవుల కవితల్లో అంతర్లీనంగా ఉన్న భావం చాలా అద్భుతంగా వుంటుంది. ఇవన్నీ నారికేళ పాకాలు. మామూలుగా చదివితే అంతగా ఆకట్టుకోవు. లోతుగా వెళ్ళి పరిశీలించాలి. ముఖ్యంగా ‘ప్రాఫెట్’ అయితే ప్రతి వాక్యమూ ఆణిముత్యమే.
‘పిల్లల్ని ప్రేమించే ప్రయత్నం తప్పుకాదు. వారు తిరిగి ప్రేమను ఇవ్వాలన్న నిబంధనే మహాపాపం’. (ప్రాఫెట్)
మనిషి జీవితపు విందులో పంచభక్ష్య పరమాన్నాలన్నీ వడ్డించబడతాయి. చివర – మృత్యువు వాటిని తుడిచి పెట్టుకు పోతుంది (రిచర్డ్ బ్రాన్ ఫీల్డ్)
అనుభవం శయ్యమీద కలిసిన రెండు శరీరాలు. మనసు మాత్రం నీది నీదే- నాది నాదే (డి.హెచ్.లారెన్స్)
ఇలాంటి గొప్ప భావాలు ఈ కవితల్లో వున్నాయి. భావాన్ని యధాతధంగానే అనువదించినా, కొన్ని చోట్ల తెలుగు దనం చేర్చారు. ఇంగ్లీషు కవిత్వానికి అవసరమైన ‘మాత్రల్ని’ వదిలి, వీలైన చోట్ల అంత్యప్రాసల్ని చేర్చారు.
ఈ కవితల్ని కళ్ళతో చదవకండి. మనసుతో చదవండి. కొన్ని వాక్యాల్ని మనల్ని నిలబెట్టేస్తాయి. ఆ కవులు ఎంత మధనపడి, ఎంతచిన్న వాక్యాలలో ఎంత పెద్ద భావాల్ని పొదిగారో అర్ధమవుతుంది.
-
Parusavedi – పరుసవేది
₹299.00రోజువారీ జీవితంలోని సమస్యల పరిష్కారం కోసమో, జ్ఞాన సముపార్జన కోసమో, నిరంతరం పేరుకుపోయే విసుగుని బద్దలు కొట్టడం కోసమో సాహిత్యాన్ని ఆశ్రయించే పాఠకులకు తనదైన తత్వదర్శనం చేయించి విశ్వతత్వాన్ని అర్ధం చేయిస్తూ సమాజ స్వభావాన్ని అవగాహన చేసుకోవడానికి అవకాశం ఇస్తూ స్వీయ పరిణామానికి కావలసిన మార్గాన్ని సుగమం చేయడమే సాహిత్య ప్రధాన ప్రయోజనం.
మన బలహీనతలను రెచ్చగొడుతూ, భ్రమలలో జోకొడుతూ, భద్రతా రాహిత్యాల విముక్తి కోసం అవిటి ట్రిక్కులనీ, నిర్జీవమైన మార్గాంతరాలనీ అందించే సాహిత్యంలో పుస్తకాల సంత విలవిలలాడుతుంది. ఈ విషాద సందర్భాన మానవ తత్వాన్నీ, విశ్వతత్వాన్నీ సరళంగా, సహజంగా అర్ధం చేయిస్తూ, వాటి మధ్య ఉన్న అనుసంధానతని విపులంగా విశదీకరిస్తూ తెలుగు సాహిత్య రంగంలోకి ‘పరుసవేది’ ప్రవేశించడం ముదావహం.
తర్కాలకీ, హేతుబద్దతకీ, ఇంద్రియాల గ్రహింపుకీ కుదరని-అందని, నిశిత నిగూఢ స్ధాయిలో అసలైన మౌలిక ప్రజ్ఞలన్నీ గుప్త నిర్మాణంగా నెలకొని ఉంటాయని, ఈ ప్రజ్ఞలు సందర్భోచితంగా వ్యక్త నిర్మాణాలుగా నైపుణ్యాలుగా ప్రకటితమౌతాయనీ అర్ధం చేసుకోకపోతే నిండైన పరిణామానికి దూరమై, మన సంకల్ప వాస్తవాలను సృష్టించుకోవడంలో విఫలమౌతామని మనకి అర్ధం అయ్యేలా చేయడమే ఈ రచన యొక్క ప్రధాన గమ్యం. పాలో కొయిలో – ది ఆల్కెమిస్ట్ ఇంగ్లీషు పుస్తకాన్ని తెనిగించినది శ్రీ కె.సురేష్. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలలో 66 భాషలలోకి అనువాదమయ్యింది.