• Rahasyam (The Secret) - రహస్యం (ది సీక్రేట్‌)

    Rahasyam (The Secret) – రహస్యం (ది సీక్రేట్‌)

    మీరు మీ చేతుల్లో ఒక గొప్ప రహస్యాన్ని పట్టుకుని ఉన్నారు

    ఎన్నో యుగాలుగా ఇది అందరూ ఎంతో ఆకాంక్షించేది, దాగివున్నది, చేజారినది, అపహరించబడినది, లెక్కలేనంత డబ్బిచ్చి కొనుగోలు చేయబడినది, తరువాతి తరాల వారికి అందించబడుతూ వస్తున్నది. శతాబ్ధాల కిందటి ఈ రహస్యాన్ని చరిత్రలో ప్రసిద్ధికెక్కిన చాలా మంది అర్థం చేసుకున్నారు. : ప్లేటో, గెలీలియో, బిథోవెన్‌, ఎడిసన్‌, కార్నేగి, ఐనస్టీన్‌ వంటి వారు. వీరితో పాటు మరికొందరు ఆవిష్కర్తలూ, వేదాంతులు, శాస్త్రవేత్తలు, గొప్ప తాత్త్వికులు కూడా దీన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ రహస్యం లోకానికి వెళ్ళడి చేయబడుతోంది.

    ”ఈ రహస్యాన్ని నేర్చుకునే ప్రక్రియలో, మీరు ఇష్టపడే వ్యక్తిత్వాన్ని ఎలా అలవరుచుకోగలరో, మీ మనస్సుకు నచ్చే పని ఎలా చేయగలరో, మీరు ఇష్టపడే వస్తువును ఎలా పొందగలరో తెలుసుకుంటారు. నిజంగా మీరెవరో మీకు తెలియవస్తుంది. జీవితంలో మీకోసం వేచివున్న దివ్యత్వం ఏమిటో మీరు తెలుసుకుంటారు”.

    పేజీలు : 198

    499.00
    Add to cart
  • Saanukula Aalochana Sakthi - The Power of Positive Thinking

    Saanukula Aalochana Sakthi – The Power of Positive Thinking

    ఇంటర్ నేషనల్ బెస్ట్ సెల్లర్

    ప్రపంచ ప్రసిద్ది పొందిన The Power of Positive Thinking పుస్తకమును ‘సానుకూల ఆలోచన శక్తి’ గా తెలుగులోకి తీసుకువచ్చారు.

    లక్షలాది స్త్రీ పురుషులు వాళ్ళ జీవితాలను విజయవంతం చేసుకోవడానికి సహాయపడింది ది పవర్ అఫ్ పాజిటివ్ థింకింగ్. అనూహ్యమైన అమ్మకాలు సాధించిన ఇందులో డాక్టర్ పీల్ ఆచరణలో విశ్వాసం యొక్క  శక్తిని నిరూపిస్తారు. ఈ పుస్తకంలో వివరించిన ఆచరణీయ కిటుకులతో మీరు మీ జీవితంలో బలం పుంజుకోవచ్చు. పైగా మీ కోరికలను, ఆశలను నేరవేర్చుకోవటానికి అవసరమైన ఉపదేశాన్ని పొందవచ్చు. మీరు నేర్చుకోనేవి :

    . మీ మీద ,మీరు చేసే ప్రతిదాని మీద నమ్మకం పెంచుకుంటారు.

    . గొప్ప శక్తిని, పట్టుదలని పెంచుకుంటారు.

    . మీ లక్ష్యాలను చేరుకోవటానికి అవసరమైన శక్తి పెంచుకుంటారు

    . చింతపడే లక్షణాన్ని పోగొట్టుకుని విశ్రాంతికరమైన జీవనాన్ని సాధిస్తారు.

    . మీ వ్యక్తిగత, వృత్తిపర సంబంధ బాందవ్యాలని మేరుగుపరుచుకుంటారు.

    . మీ పరిస్థితుల మీద అధికారం పొందుతారు.

    . మీ మీద మీరు దయగా ఉంటారు.

     

    పాఠకుడు ఆనందమైన, తృప్తికరమైన,ప్రయోజనకరమైన జీవితాన్ని సాధించడానికి తోడ్పడాలన్న ఏకైక లక్ష్యంతో రాయబడింది ఈ పుస్తకం.

     

    ……. నార్మన్ విన్సెంట్ పీల్

    200.00
    Add to cart
  • Sakthi Yokka 48 Sutralu
  • Sampadalu mee Hakku

    Sampadalu mee Hakku

    98.00
    Add to cart
  • Snehitulanu sampadinchdamela
  • Telugu Navala Sahithyamlo Manovisleshana

    Telugu Navala Sahithyamlo Manovisleshana

    ఒక మహా వృక్షాన్ని విశ్లేషించేప్పుడు దాని మూలాల్ని తరచి చూసినట్టే తెలుగు నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణా విభాగాన్ని విశ్లేషించేప్పుడు తెలుగు నవలా పరిణామ విశ్లేషణ, మనోవైజ్ఞానికపరమైన ప్రపంచ సాహిత్యాల ప్రభావం, ప్రపంచ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల సిద్ధాంతాల పరిశీలన కూడా జరిగితేనే ఆ అధ్యయనం సమగ్రం అవుతుంది. అందుకు మనోవిజ్ఞాన శాస్త్రం పై పట్టు ఉండాలి.

                                                                                                   – కోడూరి శ్రీరామమూర్తి

    200.00
    Add to cart
  • The Business School

    The Business School

    ఇతరులకు సాయం చేయాలనుకునే వారి కోసం

    అత్యధికంగా అమ్ముడుబోయే తన పుస్తకం రెండో ప్రచురణలో రాబర్ట్ టి. కియోసాకీ, నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో తన మౌలికమైన ఎనిమిది ‘దాగివున్న విలువలను’ అప్ డేట్ చేస్తూ, విశదీకరిస్తాడు. స్పెషల్ బోనస్ – కిమ్ కియోసాకీ, షెరాన్ లెక్టర్, డయాన్ కేన్నేడిల మూడు అదనపు ‘దాగివున్న విలువలు’.

    నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ గురించి రాబర్ట్ ఇలా వివరిస్తారు…

    ….. సంపదను పొందేటందుకు అదొక విప్లవాత్మకమైన పధ్ధతి.

    ….. అది ఎవరికైనా గొప్ప సంపదను పొందగలిగే అవకాశాన్ని ఇస్తుంది.

    ….. కోరిక, దృఢనిశ్చయం, పట్టుదల ఉన్న ప్రతివారికీ అది అందుబాటులో ఉంటుంది.

    “నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ సాయంతో నేను భాగ్యవంతుడిని కాలేదు కనుక, ఆ పరిశ్రమ గురించి నేను కొంచెం నిష్పాక్షపాతంగా ఉండగలను. నా దృష్టిలో నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ కున్న లాభాలను – కేవలం అధిక ధన సంపాదనకె పరిమితం కాని లాభాలను – ఈ పుస్తకం వివరిస్తుంది. చివరికి నేను హృదయమున్న ఒక వ్యాపారాన్ని కనుగొన్నారు.”

    225.00
    Add to cart
  • The Secret- Magic

    The Secret- Magic

    ఒక పదం అన్నింటినీ మార్చేస్తుంది

    ఇరవై శతాబ్దాలకు పైగా ఒక పవిత్ర గ్రంథంలోని కొన్ని పదాలను చదువరులందరూ అపార్థం చేసుకున్నారు. ఆ పదాలు వారిని గందరగోళపరిచాయి. చరిత్రలో కొంతమంది పాఠకులు మాత్రమే ఆ పదాలలో ఒక గూడార్థం వున్నదనీ, ఆ అర్థాన్ని కనుక్కోగలిగితే మన కళ్ళముందు ఒక నూతన ప్రపంచం సాక్షాత్కరిస్తుందనీ తెలుసుకున్నారు.

    “మ్యాజిక్” లో రోండా బర్న్ ఆ అద్భుతమైన జ్ఞానాన్ని ప్రపంచం ముందు పరిచింది. ఒక 28 రోజుల అద్భుతమైన సాధనతో ఆమె ఈ జ్ఞానాన్ని నిత్యజీవితానికి ఎట్లా అన్వయించుకోవాలో మనకు భోదిస్తున్నది.

    మీరెవరైనా కానీ మీరెక్కడున్నా కానీ మీ ప్రస్తుత పరిస్థితులెలా వున్నా గానీ ఈ “మ్యాజిక్” మీ జీవితం మొత్తాన్నీ మార్చివేస్తుంది.

    499.00
    Add to cart
  • Visuma Paramardhamu

    Visuma Paramardhamu

    ఆ పరమార్ధము – పరమార్థము

    ప్రేరణ

    కోరికలే దుఃఖమునకు కారణమా? కోరికలు పరిమితమా? లేక అపరిమితమా? దుఃఖనివారణ మానవునికి సాధ్యమేనా? అనునవి నా తొలి సందేహాలు. ప్రతి మనిషికీ జీవిత పరమార్థమును క్లుప్తముగా తెలిసికొనవలెనని ఉంటుంది. ఈ ప్రశ్నలకు నా సమాధాన సాహసమే ఈ ‘పరమార్థము’.

    ప్రతి మనిషి ఆశించేది సునాయాసంగా సుఖంగా జీవించాలని, సుఖమనగా కోరికలను సాధించడం వలన మనస్సునుంచి జనించే స్పందన. కోరికలను సాధించడానికి చేసే ప్రయత్నమే వృత్తి లేదా ఉద్యోగం. ఉద్యోగం చేయడంలో జ్ఞానము, శక్తి, మనోనిగ్రహము, రక్షణ (ధర్మము, యుద్ధము)లు అత్యంత ప్రధానములు. తద్వారా గరిష్ఠ స్థాయిలో సంపదను సృష్టించాలి. త్రికాలములలో ఎవ్వరూ సాధించనంత సంపదను సృష్టించి కీర్తిమంతులవ్వాలి. అదే మోక్షము, అదే జీవిత పరమార్దము అని తెలియజేయాలని నా ప్రయత్నము.

    ‘పరమార్థము’ అనునది పరమ’, ‘అర్థము’ అను పదములు కలసిన సంధి. పరమ’ అను పదమునకు విశిష్టము, పవిత్రము, స్వర్గము మొదలగు అర్థములు మరియు ‘అర్థము’ పదమునకు గ్రహించు, భావము, ప్రయోజనము, సంపద, ధనము మొదలగు అర్ధములు కలవు. పరమార్థమునకు పవిత్ర లక్ష్యము, విశిషాంశము, విశిష్టసంపద అను సామాన్యార్ధములు కూడా కలవు…

    ‘బాలసంగ్రహము’ అనునది బాల, సంగ్రహము అను పదములు కలిసిన సమాసము. ‘బాల’ అను పదమునకు చిన్న, బాలబాలికలు అను అర్థములు కలవు. ‘సంగ్రహము’ అనగా వివరణ, మంచిని గ్రహించునది అని అర్థములు. ‘బాలసంగ్రహము’ అనగా సంక్షిప్త వివరణ, చిన్న వివరణ, బాలబాలికలు మంచిని గ్రహించునది అని అర్ధము.

    విజయపథము’ అనగా విజయమునకు దారి అని, ‘పరమపదము’ అనగా ఉన్నత సానము లేదా మోక్షము లేదా స్వర్గము అని, ‘సోపానము’ అనగా మెట్టు అని అర్థము. ‘పరమపద సోపానములు” అనగా ఉన్నత స్థానమునకు లేదా మోక్షమునకు లేదా స్వర్గమునకు మెట్లు అని అర్థము.

    ప్రాచీన భారతీయ భాషాసంస్కృతులు అందించిన జీవిత పరమార్థాన్ని గతి తార్కిక వాదముతో సామాజిక, వైజ్ఞానిక కోణంలో దర్శించాలని నా ప్రయత్నం. మోక్షము, స్వర్గము, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇందుడు, అసము మొదలగు పదాలకు భాషాపరమైన అర్థమును, మతపరమైన ప్రామాణికతలను దృష్టిలో ఉంచుకొని వాటిని పరమారములో చేర్చడమయినది. ఈ పదాలకు, విజయపథము’లోని అంశాలకు మధ్య ఉన్న ప్రత్యక్షసారూప్యాన్నినేను ప్రత్యేకంగా విశదీకరించి చెప్పవలసిన అవసరం లేదు. ఈ ‘పరమారము నందు కొని పదములకు పై భాగములో కుడిప్రక్కన – గుర్తును ఉంచాను. అటువంటి పదములకు సనాతన సంపద అను అధ్యాయములో మరింత వివరణను ఇచ్చాను. అక్కడక్కడ వాటిపై నా అభిప్రాయములను కూడా…………

    200.00
    Add to cart
  • VYAKTITVA DEEPAM

    VYAKTITVA DEEPAM

    వ్యక్తిత్వ దీప వికాసం

    భారతీయ జీవన విధానంలో ఏ ఆచారం పాటించినా, ఏ సంప్రదాయం అనుసరించినా, ఏ పండుగ జరుపుకొన్నా అందులో భౌతిక ప్రయోజనం, మానసిక అనుభూతి, ఆధ్యాత్మిక తత్త్వం అనే మూడు కోణాలుంటాయి. “దీపావళి లో ఈ మూడు కోణాలు మరింత స్పష్టంగా వెలుగులీనుతూ ఉంటాయి.

    వర్ష ఋతువుకి, శరదృతువుకి ఇది సంధికాలం. నేల తడిసిపోవడం కారణంగా, ఎండ తీక్షంగా ఉండకపోవడం మరో కారణంగా ఈ కాలంలో సూక్ష్మక్రిములు విపరీతంగా పెరుగుతాయి. ఈ దీపాల కాంతికి, వేడికి, చిటపటలకి వాటి వృద్ధి బాగా తగ్గిపోతుంది. అది ప్రజల ఆరోగ్యానికి మంచిది. ఇది భౌతిక కోణం. ఇంటింటా దీపతోరణాలు కళ్ళకు కాంతిని. మనస్సుకి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆ దీప కాంతుల్లో మనకి మనమే కొతగా, తేజోమూర్తులుగా కనపడతాం. ఇది మానసిక కోణం. బయటి చీకటిని బయటి దీపం పోగొడుతోంది. అంటే మనస్సులో ఉండే చీకటిని మనస్సులో వెలిగించే దీపం పోగొడుతుందన్నమాటే గదా! అదే జ్ఞానదీపం. | జనం అంటే అద్వైతం. అభేదభావం. అంతా ఒక్కటే అని భావించగలగదం. ఆ భావం వల్ల రాగద్వేషాలు మన మనస్సుని కలుషితం చెయ్యవు. అప్పుడు | మనం చేసే అన్ని ఆలోచనలు, మనం తీసుకొనే అన్ని నిర్ణయాలు ధర్మానికి,

    డా॥ గరికిపాటి నరసింహారావు

    150.00
    Add to cart