• How To Win Friends And Influence People
  • Mee jeevitanni Mee vruttini anandamga  yela anubhavinchali
  • Meepai Nammakam Unchandi

    Meepai Nammakam Unchandi

      మీరు మీ కలలను నిజం చేసుకోవాలని ఆశిస్తున్నారా? మీరు మీ శక్తి సామర్థ్యాలను వాటి గరిష్ఠస్థాయిలో ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నారా? అవును, అయినట్టయితే ఈ పుస్తకం మీరు తప్పక చదవాలి!

     

                  ‘మీపై నమ్మకం ఉంచండి’ పుస్తకంలో మానవ నిక్షిప్తశక్తి ఉద్యమ పురోగాముల్లో ఒకరైన డాక్టర్ జోసెఫ్ మర్ఫీ – మీ కలలను సాకారం చేసుకుని మీ జీవితంలో ఘనవిజయం సాధించడం ఎలాగో చూపిస్తారు. మనం ప్రతి ఒక్కరం పుట్టుకతోనే బ్రహ్మాండమైన శక్తిని కలిగి ఉన్నాం. సరైన మానసిక వైఖరితో – విజయవంతం కావడానికి కావలసినవన్నీ ఉన్నాయి. అందుకు మీ సుప్తచేతనాత్మక మనసుకు శక్తినిచ్చే ఇంజనులాంటి చేతనాత్మక మనసును ఉద్దీపనం చేయగలగాలి. అప్పుడు ఇది మీ ఆశలనూ, ఆశయాలనూ పూర్తిస్థాయిలో సాధించే మార్గంలో నడవడానికి మిమ్మల్ని ఆయత్తం చేసే అసలు పనిని చేస్తుంది.

    కవులు, కళాకారులు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు – ఇలావిభిన్న రంగాలలో విజయాలు సాధించినవారు – తమ సుప్తనాత్మక మనసును ప్రోగ్రామింగ్ చేసి క్రమబద్ధంగా ఉపయోగించుకోవడం ద్వారా లక్ష్యాలను చేరుకోవడానికి తమ కలలను, భావాలను లాభదాయకమైన రీతిలో ఎలా అమలు చేసేవారో తెలుసుకుని, మీరు కూడా మీ జీవితాలను సుసంపన్నం చేసుకోవడానికి, అలాంటి మెళకువలను అమలు చేయడం సునాయాసంగా నేర్చుకోగలుగుతారు.

    95.00
    Add to cart
  • Munniti Gitalu

    Munniti Gitalu

    మున్నీటి గీతలు

    సందెకాడ సూరీడు అందగాడినన్నాడు….. కొండచాటు నుంచి కొంగుచాటుదాక వచ్చాడోయమ్మా… వెలుగుతోటలో అగ్గిపూలనే పూయించాడమ్మా…..

    మెత్తని ఎదలో పచ్చని ఆశలు రగిలించాడమ్మా…. పారవశ్యంతో కళ్లు మూసుకుని పాడుతున్నాడు జముకుల గరటయ్య. రాగం కూడా తీస్తున్నాడు.

    డురుడుక్కు.. డురుడుక్కు.. డురుడుక్కు…

    డ్రు డ్రు డ్రు డ్రు….

    చేతుల్లోని జముకు వాద్యాన్ని చిత్రమైన శబ్దాలు వెల్లువెత్తేలా మోగిస్తున్నాడు.

    అయితే అక్కడున్న పుంజీడుమందికీ ఆ పాట ఆ మోత అస్సలు నచ్చడం లేదు. మాడిపోయిన అరిసెల్లా కనిపిస్తున్న వాళ్ల మొహాలనుబట్టి దీన్ని అర్థం చేసుకోవచ్చు.

    గరటయ్యకి ఇదేం బోధపడలేదు. నేత్రాలు మూతలేసుకుని రాగప్రస్తారాలు చేస్తూనే ఉన్నాడు.

    కాబట్టే, అసహనం ముంచుకొస్తుండగా నిలుచున్న కిళ్లీ బడ్డీచోటు వదిలి పెట్టి పుక్కళ్ల ఎల్లారావు కదిలాడు. గరటయ్య దగ్గరసా నాలుగు అడుగులు విసవిసా వేశాడు. సరం తీగ చుట్టుకున్న మువ్వల కోలమీద చెయ్యివేశాడు. అదిమి పట్టేశాడు. జముకు ఆగిపోయింది. గీతం మలిగిపోయింది. ధ్వని నిలిచిపోయింది.

    కంగారుపడి రెప్పలు తెరిచాడు గరటయ్య. ఎల్లడివైపు తీక్షణంగా చూశాడు.

    “అదేంటి తండ్రీ! అడసుడిగా ఆపీసేవు, వీలయినంత మృదువుగానే అడిగాడు.

    వెర్రెక్కిపోయినట్టయ్యాడు ఎల్ల. ………….

    200.00
    Add to cart
  • Naa Bharathadesam

    Naa Bharathadesam

    ‘నా భారతదేశం: భవితకు సూచనలు’ అనే గ్రంథం డా ఎ పి జె కలాంగారి రాష్ట్రపతి పదవీవిరమణ తర్వాతి ఉపన్యాసాల నుండి గ్రహించిన సారాంశాల సంకలనం. డా కలాంగారు భారతదేశంలోనే కాక, విదేశాలలోనూ పలు పార్లమెంట్లు, విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, ఇతర సంస్థలలో చేసిన ఉపన్యాసాల నుండి సంగ్రహించిన ఈ భాగాలలో, విజ్ఞానం, దేశ నిర్మాణం, పేదరికం, కనికరం, ఆత్మవిశ్వాసాలపై వారి అభిప్రాయాలు క్రోడీకరించబడ్డాయి.
    స్థిరచిత్తం గల మహానుభావులైన మేరీ క్యూరీ, డా విక్రమ్ సారాభాయి వంటి వారి జీవితాలను, డా కలాం యువనాయకులను ప్రోత్సాహపరిచేందుకు, స్పూర్తినిచ్చేందుకు ఉదాహరించారు. ఈ ఉపన్యాసాలు ద్వారా చెప్పిన ఎన్నో విలువైన పాఠాలను వినమ్రత, ఎదురుతిరగడం, దృఢనిశ్చయం.. తదితర విషయాలపై చెప్పడం, పిల్లలు ఆలోచించడం, ఎదగడం, వికసించడానికి తోడ్పడతాయి.

    డా కలాంగారి ఆఖరి పుస్తకం వారి మనసుకు చాలా దగ్గరగా ఉండే ప్రాజెక్టు. అది ప్రతి పిల్లవాడికీ మార్గదర్శనం చేసి, వారి కలలను అన్వేషించేందుకు, ఉత్తమపౌరులుగా ఎదగడానికి, మరింత మేలైన భారతదేశాన్ని గుర్తించేందుకు సాయపడుతుంది.

    150.00
    Add to cart
  • Padakondu Pannendu Padamoodu

    Padakondu Pannendu Padamoodu

    అదృష్టం అనేది ఉందా? అది మనిషిని కాపాడుతుందా? రక్షరేకు మనిషిని రక్షించగలదా? కోయదొర ఇచ్చే రక్షరేకులో నిజంగా మహత్తు ఉంటుందా?
    ఈ నేపథ్యంలో ముప్పై ఆరు గంటల్లో జరిగే ‘పదకొండు పన్నెండు పదమూడు’ క్రైమ్ నవల, అనేక మలుపులు తిరుగుతూ ఉత్కంఠంగా సాగుతుంది.
    మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ఈ సస్పెన్స్, మిస్టరీ డైరెక్ట్ నవలకి ‘పదకొండు పన్నెండు పదమూడు’ అనే పేరు ఎందుకు పెట్టారో ఊహించగలరా?
    – మల్లాది వెంకట కృష్ణమూర్తి

    230.00
    Add to cart
  • Panigrahanam

    Panigrahanam

    పాణి తల్లి రోడ్ ఏక్సిడెంట్ కి గురైంది. ఆ ప్రమాదం చేసిన సినిమా ప్రొడ్యూసర్ కమలాకరం ఆవిడ చికిత్స కోసం డబ్బు ఇవ్వడానికి తిరస్కరించాడు. పాణి, అతని మేనమామ రోహిత్ ఎం చేసారు? అది వాళ్ళకి ఎం చేసింది?
    పోలీస్ వెంకటస్వామి, డేటిక్టివ్ సింహం, అతని అసిస్టెంట్ బ్రహ్మం, మృదుపాణిని ప్రేమించిన వరవిణ లాంటి పాత్రలతో, కామెడీ ఆఫ్ ఎర్రర్స్ తో క్రైం, ప్రేమ, సస్పెన్స్ లతో సాగె కామెడీ థ్రిల్లర్ పాణిగ్రహణం.

    295.00
    Add to cart
  • Pillalni Pratibhavantuluga Penchadamela - పిల్లల్ని ప్రతిభావంతులుగా పెంచడమెలా

    Pillalni Pratibhavantuluga Penchadamela – పిల్లల్ని ప్రతిభావంతులుగా పెంచడమెలా

    జీవితాన్ని, సమాజాన్ని సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనోవిజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనోవిజ్ఞాన మాసపత్రిక ‘రేపు’ వ్యవస్ధాపకులు, తెలుగు ప్రజల ఆలోచనాధోరణులను అమితంఆ ప్రభావితం చేసే రచయిత చల్లగుళ్ళ నరసింహారావు.

    పిల్లల సర్వతోముఖ వికాసానికి తోడ్పడే రీతిలో తల్లిదండ్రులు తమ ప్రేమానురాగాలను సృజనాత్మకంగా, శక్తివంతంగా ఎలా మలచుకోవాలి? పిల్లల మనోభావాలను ప్రయోజనకరరీతిలో ప్రభావితం చేసే తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా వుండాలి? ఎదిగే వయస్సులో పిల్లల ఆలోచనలలో, ప్రవర్తనలో వచ్చే మార్పులను అవగతం చేసుకొని వాటికనుగుణంగా ప్రతిస్పందించడమెలా? చదువులో, పరీక్షలలో బాగా రాణించడానికి ఎటువంటి తోడ్పాటు ఇవ్వాలి? ఎలా తర్ఫీదునివ్వాలి? తాము ఆశించిన రీతిలో పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి నిరతంర తోడ్పడే అత్యంత ప్రయోజనకర గ్రంథం ‘పిల్లల్ని ప్రతిభావంతులుగా పెంచడమెలా?’

    200.00
    Add to cart
  • Pipe Line Kadha

    Pipe Line Kadha

    అనగనగా ఒకనాడు పాబ్లో, బ్రూనో అనే ఇద్దరు యువకులు ఇటలీలో ఒక గ్రామం లో పక్కపక్కనే నివసించేవారు. వారు వరసకు అన్నదమ్ములు అవుతారు. ఇద్దరూ మంచి స్నేహితులు.
    వారు కనే కలలు కూడా చాల పెద్దవి.
    ఎదో ఒకనాడు ఎలాగో ఒకలా ఆ గ్రామంలో అందరికంటే ధనవంతులు కావడం గురించి వారి నిర్విరామంగా మాట్లాడుకునేవారు. ఇద్దరు తెలివైనవారు, కష్టపడి పనిచేస్తారు. వాళ్లకు కావాల్సింది ఒక అవకాశం మాత్రమే.
    ఒక నాడు ఆ అవకాశం వారిని వరించింది. దగ్గర్లో ఉన్న నదినుంచి గ్రామంలో ఉన్న ఒక పెద్దతొట్టికి నీరు చేరవేయటానికి ఇద్దరు మనుషులను వినియోగించాలని ఆ గ్రామం నిశ్చయించింది. ఉద్యోగం పాబ్లో, బ్రునోలను దొరికింది. తరువాత ఎం జరిగిందో ఈ కథను చదివి తెలుసుకొనగలరు.
    -బర్కి వాడ్జెస్.

    195.00
    Add to cart
  • Prachina Vignanam
  • Prasnale Samadhanalu

    Prasnale Samadhanalu

    199.00
    Add to cart
  • Prayanam By Malladi Venkata Krishna Mur

    Prayanam By Malladi Venkata Krishna Mur

    ‘రాజశుక. మంచి పేరు పెట్టారు.’ పూజారి మెచ్చుకున్నాడు.

    ‘నాకు కొడుకు పుట్టాడని మా నాన్నగారికి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన భాగవతం మొదటి స్కంధం చదువుతున్నారు. ఆయనే ఈ పేరు సూచించారు.’ రాజశుక తండ్రి సుబ్బరాజు వివరించాడు.

    ‘పాలు పితికినంత సేపు రాజశుక ఒక చోట ఉండడు.’ పెద్దయ్యాక రాజశుక విన్నాడు.

    ఆర్నెలల్లో 11 జ్యోతిర్లింగాలని రాజకుశ ఏ లాభం కోరి సందర్శించాడు?

    రాజశుక తన ఆథ్యాత్మిక ప్రయాణంలో, తీర్థ యాత్రల్లో ఏం నేర్చుకున్నాడు?

    అతనికి అనేక చోట్ల కలిగిన వివిధ అనుభవాలు ఏమిటి?

    హిందూ సంప్రదాయంలోని సన్న్యాసాశ్రమం నియమాలు ఏమిటి?

    ఆసక్తి కలిగించేలా, హాయిగా చదివించేలా ఆథ్యాత్మికతని రాయగల మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల ప్రయాణం.

    జయం, పరంజ్యోతి, విధాత నవలల తర్వాత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నాలుగో ఆధ్యాత్మిక నవల ప్రయాణం.

    295.00
    Add to cart