- Academic8 products
Accessories17 products
- Action & Adventure21 products
- Activity Books16 products
- Animals0 products
- Anthologies6 products
- Arts & Literature6 products
- Astrology10 products
- Bhakthi38 products
- Biography and Autobiography35 products
- Cars & Trucks2 products
- CHILDREN13 products
- Classics5 products
Clocks1 product
- Contemporary3 products
- Criticism Books1 product
- Critics & Articles8 products
- Cultural27 products
- EDUCATIONAL1 product
- Essays1 product
- European0 products
- Family and Relationships1 product
- Films and Entertainment9 products
- Foreign Language0 products
Furniture5 products
- General32 products
- GENERAL21 products
- Genre Fiction1 product
- Health & Fitness11 products
- Historical1 product
- History14 products
- History & Politics28 products
- Home Making2 products
- Humour1 product
- Inspirational7 products
Lighting1 product
- Literature41 products
- Novel279 products
- Numerology0 products
- Padya Kavyalu1 product
- Personality Development14 products
- Philosophy7 products
- Plays & Dramas6 products
- Poetry2 products
- Poetry6 products
- Professional &Subject1 product
- Pulmanology & Vastu0 products
- Puranalu3 products
- Religious1 product
- Short Stories33 products
- Short Stories133 products
- TELUGU98 products
- top20228 products
Toys1 product
Showing 85–96 of 132 resultsSorted by latest
Puranam Srinivasa Sastry Kathalu
₹150.00
కీర్తిశేషుని మాసిపోని కథాక్షరాలు
-విహారి
పురాణం శ్రీనివాసశాస్త్రి నాకు 1970ల నుంచీ మిత్రుడు. మొదట అతని కరలంటే ఇష్టం. ఆ తర్వాతి సాన్నిహిత్యంతో అతనూ ఇష్టమైనాడు. మృదువుగా మాటాడేవాడు. అసలు లోకం తెలీనివాడిలా ఉండేవాడు. కానీ, అతను లోకాన్ని చాలా దగ్గరగా చదివి తెలుసుకున్నవాడు. జీవికలోనూ, జీవితంలోనూ చాలా మునుగీతలూ, నిలువీతలూ వేసినవాడు. ఆంధ్రభూమిలోనూ ఆంధ్రప్రభలోనూ వారలోనూ పనిచేశాడు. 'కోకిలమ్' సాహిత్య సాంస్కృతిక వేదిక అతని మానస పత్రిక దాని గురించి ఎన్నో కలలుండేవి అతనికి. నేనూ, మునిపల్లెరాజు గారూ, పులిగడ్డ విశ్వనాథరావు గారి లాంటి వాళ్ళం కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాం. శాస్త్రికి వాళ్ళ నాన్నగారు పురాణం సుబ్రహ్మణ్యశర్మగారి సాహిత్యమంటే అమిత గౌరవం. ఎప్పుడూ వాటి గురించి చెబుతూ, అడపాదడపా ఏదో చేయాలని అంటూ వుండేవాడు. తాను చనిపోవటానికి ముందు తన కథాసంపుటి రావాలనే కోరికని వ్యక్తం చేశాడు. కథలన్నింటినీ బయటికి తీస్తున్నానన్నాడు. అతని కలల్ని (మరణానంతరం) వాస్తవం చేస్తూ వస్తున్న సంపుటి ఇది. దీనికి కారకులైన అందరికీ అభినందనలు.
శ్రీశా. కథల్ని పాఠకులు మెచ్చుకున్నారు. పత్రికా సంపాదకులు ఆనందించి బహుమతులిచ్చారు. (జ్యోతి, ఆంధ్రప్రభ (ప్రథమ బహుమతులు) యువచక్రపాణి నాలుగో అవార్డు, మళ్ళీ జ్యోతిలో బహుమతి... ఇలా), విమర్శకులూ, విశ్లేషకులు | ఎక్కువమంది చదవలేదు. చదివినవారు ఒకరిద్దరు ఉటంకించారు. నాకు నచ్చిన 400 తెలుగు కథల్ని విశ్లేషిస్తూ నేను ఐదేళ్ళు వివిధ పత్రికల్లో ధారావాహిక శీర్షికల్లో వాటిని పరిచయం చేశాను. వాటిలో శ్రీ. శ. 'గూడు చాలని సుఖం |...........
Allam Seshagiri Kathalu
₹275.00
శ్రీపురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు “నీలి” కథతో దేశంలోనూ శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారు “గాలివాన” కథతో ఇతర దేశాల్లోనూ తెలుగు కథకి మంచి పేరు సంపాదించిన తరవాత తెలుగు సాహిత్యంలో కథానిక ముందడుగు వేసిందని నేను తలుస్తున్నాను. కొత్త కొత్త రచయితలు కొత్త కొత్త దార్లంట వెళ్ళి, కొత్త సంగతులు కనుక్కున్నారు. అంతే కాదు చాలా మందికి తెలియని పాత సంగతుల్ని కూడా బైటికి తీసుకు వచ్పేరు. తెలుగు కథ విస్తరించింది. మధ్య తరగతి వారి గురించి కథలు వస్తున్నప్పటికీ ఇతర వర్గాల వారి గురించి కూడా కథలు వస్తూనే వున్నాయి. జీవితంలోని వైవిధ్యాన్ని ప్రతిబింబించడానికి తెలుగు కథ ప్రయత్నిస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే, జీవితంలో ముఖ్యమైన అధర్మం ఒకటుంది. అదేమిటంటే ఒక జీవిని మరొక జీవి చంపుకు తినడం. చంపి తినడం అనేది జీవితంలో ముఖ్య విశేషం. ఈ లోకాన్ని భగవంతుడలా సృష్టించేడు కాబట్టి, ఒకరు మరొకర్ని చంపుకు తినడంలో తప్పు లేదని వాదించేవారిని కదిలించి చూస్తే చాలా మంది ఉంటారు. -
ఇతర ప్రాణుల్ని పూర్వపు మానవులు వేటాడి చంపి తినే వారు. ఇప్పుడు వాటిని పెంచి చంపి తింటున్నాం . తేడా పెద్దగా ఏమీ లేదు. అయితే ఇతర ప్రాణుల్ని మనం చంపి తింటున్నప్పటికీ కూడా మనల్ని మనం చంపుకోకూడదు తినుకోకూడదు అనే ఆలోచనలోకి మానవులం కొంత వరకూ వచ్చేమని చెప్పుకోవచ్చును. కాని అందులో కూడా నిజాయితీ లేదు. బలహీనుల్ని బలవంతులు చంపుతూనే ఉన్నారు. చంపకపోతే, దోచుకుంటూనే ఉన్నారు.
Desam Emaindhi
₹300.00
కరుణారసపూరితమైన ఈ ప్రఖ్యాత నవల ఆంగ్లమూలకర్త ఎలన్పేటన్ 1903లో దక్షిణాఫ్రికా లోని పీటర్ మారిట్జ్‌బర్గ్ లో జన్మించారు. నేటాల్ విశ్వ విద్యాలయంలో పట్టా పుచ్చుకొని, ఇక్స్ హోపో పట్టణంలో కొంతకాలం ఉపాధ్యాయులుగా పని చేసారు. ఈ నవలలో ఆ పట్టణాన్ని కన్నులకు కట్టినట్లుగా వర్ణించారు.
తరువాత కాలంలో పదేళ్లు జోహెన్స్ బర్గ్ లో ఆఫ్రికా బాలాపరాద శిక్షణా సంస్థ డిప్లూఫ్ కళాశాల ప్రధానాచార్యులుగా చేస్తూ, ఆ కళాశాల లోనే కాక దేశమంతటా కూడా ఆధునిక బోధనా శిక్షణ విధానాలను ప్రవేశ పెట్టడానికి కృషి చేసాడు.
ఈ అనుభవాన్ని పురస్కరించుకుని మనోహరమైన ఈ నవల వ్రాసారు. ఇది ఈయన మొదటి ప్రయత్నమే కానీ, ఈ నవల ప్రచురించిన వెంటనే అందరి ప్రశంసలు పొంది ఈయనకు విశేష కృషినార్జించి పెట్టడం వలన అనతి కాలంలోనే ఉద్యోగ విరమణ చేసి, శేషజీవితమంతా రచయితగా, ప్రజా సేవకుడిగా జీవితం గడిపారు. ఈ నవల 1949లో 'సండే టైమ్' ప్రత్యేక బహుమానం సంపాదించుకుంది.
Katha Sravanthi
₹65.00
ఈతరం కోసం అరసం కథానికా ఉద్యమం సామాజిక జీవితాన్ని కళాత్మకంగా చిత్రిస్తూ పాఠకుడి హృదయానికి సన్నిహితమైన సాహితీ ప్రక్రియ తెలుగు కథానిక. వాస్తవికత పునాదిగా, గాఢత, క్లుప్తత, సౌందర్యాలే ప్రధాన లక్షణాలుగా జీవద్భాషలో పాఠకునితో సంభాషి స్తున్న ఉదాత్త సాహిత్య ప్రక్రియ మన కథానిక.
యవ్వనతేజంతో పురుడు పోసుకున్న తెలుగు కథానిక ఎందరో విశిష్ట కథకుల చేతుల్లో సహజ సుందర
మైన రూపురేఖలు దిద్దుకుంది. నూటపది సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం మన కథానికది. నాలుగు తరాల కథా రచయితలు తమ కలాలతో కలల్ని పంచారు, కన్నీళ్లను తుడిచారు. ఆశలను పెంచారు, ఆశయాలను అందిం చారు. జాతికి గొప్ప భవిష్యత్తును వాగ్దానం చేశారు. ఆ
దీపధారులను ప్రతి తరానికి పరిచయం చేయాలి. ఆ కథా కాంతులను ప్రసరింప జేయాలనే నిర్మాణాత్మక బాధ్యతను అరసం - గుంటూరు జిల్లా శాఖ చేపట్టింది.
1943 ఫిబ్రవరి 13, 14 తేదీలలో గుంటూరు జిల్లా తెనాలిలో ఆవిర్భవించిన అభ్యుదయ రచయితల సంఘం సకల సాహిత్య ప్రక్రియలను ప్రభావితం చేసి సాహిత్యాన్ని ప్రజాపక్షం చేసింది. మహోన్నతమైన ఆ సాంస్కృతిక వార సత్వాన్ని స్వీకరించిన అరసం గుంటూరు జిల్లా శాఖ సాహిత్యం ద్వారా సామాజికాభ్యుదయాన్ని కాంక్షిస్తూ నిరంతర కృషిని కొనసాగిస్తూనే వుంది. కథా ప్రస్థానంలో గుంటూరు సీమది, అరసం గుంటూరు జిల్లా శాఖది ప్రత్యేకపాత్ర.
చిరస్మరణీయ కథలతో 'కథాస్రవంతి' శీర్షికన 80వ దశకంలో నాలుగు కథా సంకలనాలను వెలు వరించి కథా సంకలనాల ప్రచురణకు కొత్త ఊపునిచ్చింది..............
Panchukundham RAA!
₹200.00
గూడెం గొంతు (లు)
కృపాకర్ మాదిగ ఈ పేరు వినగానే హృదయం పొనుగోటై పులకరిస్తుంది. కొండంత దండోరా ఉద్యమం కళ్ళముందు కదులుతుంది. ఇతడిని చూడగానే గూడెం గూడెమంతా గుండెలకు హత్తుకుంటుంది. “అన్నా! అంటూ ఆత్మీయంగా ఆకాశానికి ఎత్తుకుంటుంది. కృపాకర్ రాజకీయ నాయకుడు కాదు. అట్లా అని పెద్ద సినిమా స్టార్ కాదు. ఏమిటీ కృపాకర్ గొప్పదనం? దేశ వ్యాప్తంగా ఇంత గుర్తింపు ఎలా వచ్చింది? కృపాకర్ దండోరా ఉద్యమంలో చరిత్ర సృష్టించాడు. గొప్ప మేధావిగా పేరు తెచ్చుకున్నాడు. అత్యంత సంయమనంతో గడ్డుకాలంలో ఎదురొడ్డి నిలబడ్డాడు. వేలాది గ్రామాలను సందర్శించాడు. లక్షలాది కార్యకర్తలను కలిశాడు. వేలాది కిలోమీటర్లు కాలినడకన దశాబ్దాల తరబడి తిరిగాడు. ఏం తిన్నాడో, ఏం తాగాడో తెలియదు గాని అకుంఠిత దీక్షతో అంకితభావంతో వర్గీకరణ సాధించటానికి జీవితాన్నే కాదు, మళ్ళీ రాని యౌవ్వనాన్ని కూడా త్యాగం చేశాడు. మాదిగల కోసం, మాదిగల అనుబంధ కులాల సమాన హక్కుల కోసం, అనుబంధ కులాల ప్రతిఫలాల కోసం ప్రతిక్షణం తపించినవాడు. మానవీయ విలువల కోసం, అట్టడుగువర్గాల కనీస అవసరాల కోసం అధికార గణం మీద అహర్నిశలూ దండోరా వేసిన వాడు. హక్కులు సాధించినవాడు. అంటరాని వారి హక్కులకు భంగం కల్గినప్పుడు, పాలక వ్యవస్థ బాధ్యతలు మరచిపోయినప్పుడు కృపాకర్ కలాన్ని కొరడాలా ఝుళిపించాడు. తన పదునైన వ్యాసాలతో ప్రజల్ని జాగృతం చేశాడు. ఆలోచనాపరుల అభిమానాన్ని చూరగొన్నాడు. అందుకే అతను జాతికి జాతీయ నాయకుడయ్యాడు. జాతి రత్నంగా ప్రకాశించగలిగాడు. కృపాకర్ తన ఉద్యమ
పంచుకుందాం రా! .
Sparsha
₹180.00
అందరికీ తలలో నాలుకలా ఉండే ఆ మహిళ ఎందువల్ల మరణించిందో, కన్నతల్లి మీద అభాండం వేసిన ఆ కొడుకు ఏం బావుకున్నాడో,
పిల్లల మధ్యే పండుకుంటూ ఉన్న గృహిణికి వైద్యుడు హితబోధ చేయడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటో, చావు భయం లేదని ఢంకా భజాయించిన ఆ తల్లి జీవనయానం ఎటు సాగిందో, ఇద్దరి యువకుల జీవితాలు తీర్చిదిద్దాలని చూసిన ఆ ఉపకారికి ఎదురైన గడ్డు పరిస్థితి ఏమిటో, ఆ యువకుడిలో తన హీనమైన బాల్యం తదుపరి దశలలో ఎటువంటి రూపు దిద్దుకుందో, దయా దాక్షిణ్యాలతో ఎదిగిన ఆ యువతి తన ప్రత్యుపకారం ఎలా తీర్చుకుందో, స్పర్శతో కన్న కొడుకును ఆ తల్లి ఎలా కాపాడుకోగలిగిందో, ఆ దివాణంలో పడమటి గది చుట్టూ అల్లుకుని ఉన్న విచిత్ర భావన ఏమిటో, పెళ్ళికీ తన చావుకూ సంబంధం ఉందన్న ఆ యువకుడి గమ్యం ఏమిటో, కలికి కడగంటి చూపునకూ, ఎండవాలుకూ సంబంధం ఏమిటో, అమ్మను పిన్ని మరపించిందో లేదో... వంటి అనేక జీవిత వాస్తవాలకు అద్దం పట్టే కథా చిత్రణ, నాటకీయత, వేగవంతమైన నడక, సహజసిద్ధమైన సంభాషణలు ఇవీ... మేడా మస్తాన్ రెడ్డి "స్పర్శ” రచనలు.
Premaragam Vintava – Marikonni kathalu
₹180.00
చిమ్మ చీకటి, వాతావరణం చల్లగా ఉంది. ఆకాశంనిండా చుక్కలు గుతులుగా వేలాడుతున్నాయి. అర్ధరాత్రి దాటుతోంది. పడవ చప్పుడులేకుండా రొయ్యల చెరువులో కదులుతోంది. ఇద్దరి నల్లటి ఆకారాలు కనిపిస్తున్నాయి. ఏసు ఫాన్లెట్ వేసి నీటిపైన చూస్తున్నాడు. గన్లో తుపాకీమందు, రవ్వలుకూరి, గురిపెట్టుకొని చూస్తున్నాడు విజో. సైగచేశాడు విజో. పడవ ఆగిపోయింది. చిన్నగా ఈల లైటు ఆరిపోయింది, తుపాకీ పేలింది. రవ్వలు దూసుకు పోయాయి. ఇప్పుడు లైటు వేసి ఆచోటంతా వెతికారు, రెండు బుడబుచ్చకాయిలు తేలాయి. మరో కొంతసేపు వేట సాగింది. మరో మూడు పిట్టలు దొరికాయి, “ఈరోజుకు చాలు, మరో రెండు రోజుల్లో రాత్రివేట చేద్దాం” అన్నాడు విజో.
ఉదయానికి ఈ చంపిన పిట్టల్ని చూపిస్తే యజమాని సాయిరాజు సంతోషపడతాడని విబ్రోకి అనిపించింది. మరి ఈ వేటకోసమే విప్రోని తీసుకువచ్చింది. రొయ్యల చెరువుల్లో ఎన్నో సమస్యలు అవన్నీ సాయిరాజు చూసుకోగలడు కాని ఈ పిట్టల సంగతి తానే చూడాలి..
బుడబుచ్చకాయిలు, నీటిమీద వాలే చిన్నపిట్టలు. మహా అయితే
పిచ్చుకల కంటే కొంచెం పెద్దవి. బాతుపిల్లల సైజులో ఉంటాయి. ముదురు, లేత గోధుమరంగులలో ముదొస్తూ ఉంటాయి. నీటిమీద తేలుతూ, మధ్యమధ్యలో నీటిలో మునిగి ఓనిమిషం ఉండి, ఎదో ఒక చేపపిల్లో రొయ్యపిల్లనో నోట...
Tripuraneni Ramaswamy Rachanalu
₹400.00
త్రిపురనేని రామస్వామి గురించి త్రిపురనేని రామస్వామిగారిని తరచుగా పెరియార్ రామస్వామితో (రామస్వామి నాయకర్) పోలుస్తారు. దానికి స్థూలమైన కారణం ఇద్దరూ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంలో వున్నారు అనే భ్రమ. కాని నిజానికి పెరియార్కీ, రామస్వామికీ ఏ రకమైన పోలికలూ లేవు. పెరియార్ ఆవేశపరుడు, రామాయణం అంటే కోపం, బ్రాహ్మల వల్లే తమిళనాడంతా పాడయిందని పెద్ద ఉద్యమం లేవదీశాడు. కాని రామస్వామి పెరియార్ కన్నా చాలా ముందు తన ఆలోచనలు సిద్ధాంతపూర్వకంగా చెప్పాడు. ఆ
రామస్వామి 1914లో ఐర్లాండు వెళ్లాడు. అక్కడ అప్పటికే ఉన్నవ లక్ష్మీనారాయణ ఇతర తెలుగువాళ్లని ఆకర్షించి రాజకీయంగా తయారు చేస్తున్నాడు. ఐర్లాండులో ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం మీద వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది. ఆ ఉద్యమప్రభావం రామస్వామిమీద కూడా వుంది.
రామస్వామి ఐర్లాండులో వున్న రోజుల్లో చేసిన ప్రధానమైన పని