Showing 49–60 of 132 resultsSorted by latest

Kathalu Ilaa Kooda Rastaru

349.00
చాలామంది ఏం చేస్తారంటే 'నాడా' దొరికిందని గుర్రాన్ని వెతుకుతారు. కొందరు 'గుర్రం' ఉందని నాడాను వెతుకుతారు. ఈ రెండూ ఉన్నా సరే కథ కాదు. ఈ రెండూ కలిసి 'నాడా ఉన్న గుర్రం' కావాలి. దానికో రౌతు కావాలి. ప్రయాణించడానికి గమ్యం కావాలి. ప్రయాణానికి ఉద్దేశం ఉండాలి. ప్రయాణంలో సంఘర్షణ ఉండాలి. ప్రయాణానికి ఫలితం ఉండాలి. అప్పుడు కథ. ఈ పుస్తకంలో... - కథలేవారు రాస్తారు?, కథలు దేంతో రాస్తారు?, కథలకు ముందు ఏం రాస్తారు? - కథలెందుకు రాస్తారు?, కథలేప్పుడు రాస్తారు?, థీమ్ అంటే... ఫ్లాట్ అంటే... - మంచి ప్రారంభాలూ... గొప్ప ముగింపులూ.... - పుస్తకం ఎప్పుడు వేయాలి?, పుస్తకం ఎలా వేయాలి?, పరిచయాలు కోరే ప్రాణత్యాగం.... మొదలగు విషయాలు కలవు......

The Show Must Run

170.00
బంగారు వడ్లగింజలు సుమారు ఇరవై ఏళ్ళక్రితం ఒకే కవరులో 'భట్టిప్రోలు కథలు' అనే పేరుతో నవ్య వీక్లీ కార్యాలయానికి వచ్చాయి, విజయరామరాజుగారి కథలు. భట్టిప్రోలు మావూరు దగ్గరే. అది గొప్ప బౌద్ధక్షేత్రం. వాన కురవంగానే అక్కడున్న దిబ్బలమీద బంగారు వడ్లగింజలు దొరుకుతాయని స్థానిక ప్రజల నమ్మకం. ఇప్పటికీ వాన పడ్డప్పుడు జనం అక్కడ వెతుకుతూనే వుంటారు. డాక్టరుగారి కథలన్నీ భట్టిప్రోలు బంగారు వడ్లగింజల వంటివేనని నేను భావిస్తాను. పల్లెటూరియాసలో గొప్ప ఇతివృత్తాలతో రచించిన గొప్ప కథలు! దేనికదే బావున్నాయి. 'ద షో మస్ట్ రన్' కథాసంపుటిలో పల్లెటూరు, బస్తీ రెండింటినీ పట్టుకున్నారు. సురభి నాటకాల గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం. ఒక్క టిక్కెట్టు తెగకపోయినా, ఒక్క ప్రేక్షకుడు రాకపోయినా సరే, అనుకున్న టైంకి తెరలేస్తుంది. అదీ వారి ప్రత్యేకత. భమిడిపాటి కామేశ్వరరావుగారు అనేవారు, “నువ్వు రాసిన రచని పదమూడేళ్ళు ఊరబెట్టి అలానే వుంచు. తర్వాతే పత్రికలకు ఇవ్వు" అని. దేనికైనా కాలం గీటురాయి. అందుకే భట్టిప్రోలు కథలను తలచుకుంటున్నారు. ఇప్పటికీ ఇంకా కూడా తలచుకుంటారు. వాటిలో 'చూరుకుట్టు బద్ద', 'నత్తముక్కల గోంగూర' నాకు బాగా నచ్చిన కథలు................. బంగారు వడ్లగింజలు సుమారు ఇరవై ఏళ్ళక్రితం ఒకే కవరులో 'భట్టిప్రోలు కథలు' అనే పేరుతో నవ్య వీక్లీ కార్యాలయానికి వచ్చాయి, విజయరామరాజుగారి కథలు. భట్టిప్రోలు మావూరు దగ్గరే. అది గొప్ప బౌద్ధక్షేత్రం. వాన కురవంగానే అక్కడున్న దిబ్బలమీద బంగారు వడ్లగింజలు దొరుకుతాయని స్థానిక ప్రజల నమ్మకం. ఇప్పటికీ వాన పడ్డప్పుడు జనం అక్కడ వెతుకుతూనే వుంటారు. డాక్టరుగారి కథలన్నీ భట్టిప్రోలు బంగారు వడ్లగింజల వంటివేనని నేను భావిస్తాను. పల్లెటూరియాసలో గొప్ప ఇతివృత్తాలతో రచించిన గొప్ప కథలు! దేనికదే బావున్నాయి. 'ద షో మస్ట్ రన్' కథాసంపుటిలో పల్లెటూరు, బస్తీ రెండింటినీ పట్టుకున్నారు. సురభి నాటకాల గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం. ఒక్క టిక్కెట్టు తెగకపోయినా, ఒక్క ప్రేక్షకుడు రాకపోయినా సరే, అనుకున్న టైంకి తెరలేస్తుంది. అదీ వారి ప్రత్యేకత. భమిడిపాటి కామేశ్వరరావుగారు అనేవారు, “నువ్వు రాసిన రచని పదమూడేళ్ళు ఊరబెట్టి అలానే వుంచు. తర్వాతే పత్రికలకు ఇవ్వు" అని. దేనికైనా కాలం గీటురాయి. అందుకే భట్టిప్రోలు కథలను తలచుకుంటున్నారు. ఇప్పటికీ ఇంకా కూడా తలచుకుంటారు. వాటిలో 'చూరుకుట్టు బద్ద', 'నత్తముక్కల గోంగూర' నాకు బాగా నచ్చిన కథలు.................

25 Va Ganta! !

150.00
స్వీయ అస్తిత్వ ఆవిష్కరణ నుంచి మూలాల అన్వేషణ వరకు పాఠకుల పఠనానుభవం రచయిత రచనానుభవం కలిసే ఉమ్మడి క్షేత్రం వొకటి సాహిత్యతలంలో వుంటుంది. అక్కడ రచయితా పఠితా వొకరికొకరు సన్నిహితమౌతారు. సామీప్యాన్ని అనుభూతి చెందుతారు. భావాలు వినిమయం చేసుకుంటారు. దృక్పథాల్ని పంచుకుంటారు. ఒకరి మనస్సుని మరొకరు స్పృశిస్తారు. రచన మాధ్యమంగా వొక సంభాషణకు పూను కుంటారు. ఒక చైతన్యధార వొకరి నుంచి మరొకరికి ప్రవహిస్తుంది. నిజానికి రచన యేదైనా రచయిత తన పాఠకులతో యెదురెదురుగా కూర్చుని చేసే సంభాషణే. కాల్పనిక సాహిత్యంలో ఆ సంభాషణ సంవాదంగానో ప్రవచనం గానో మారకుండా దాన్ని కళాత్మక వ్యక్తీకరణగా రూపొందించటంలో రచయిత అనేక వ్యూహాలతో ముందుకు రావడం చూస్తాం. అదే ఆ రచనలో శిల్పంగా భాసిస్తుంది. ఆ యా స్థల కాలాలకు లోబడి పాఠకులకు చేరువ కావడానికి రచయిత యెంచుకుని నిర్మించుకునే సాధనం అది. నిర్దిష్ట జీవిత అనుభవాల్ని సాధారణీకరించడం ద్వారా వాస్తవాన్ని కాల్పనీకరించడం ద్వారా పాఠకుల్ని రచనలో తాదాత్మ్యం చేసే రసవిద్య అది. దాని రహస్యం. తెలుసుకోడానికి చేసే ప్రయత్నం నిరంతరం జరుగుతూనే వుంటుంది. “మీ టూ” కథాసంకలనంలో ఉమా నూతక్కి 'మిట్టమధ్యాహ్నం నీడ' కథ వచ్చినప్పుడు దాని నిర్మాణంలో చూపిన నైపుణ్యంతోపాటు వ్యక్తీకరణలో...............

9 Gantalu

250.00
ప్రారంభానికి ముందు రాజమండ్రి సెంట్రల్ జైలు. ఆ సాయంత్రం జైలు ఆవరణలో ఖైదీలకి సిటీస్ ఎం.ఎం. ప్రొజెక్టర్, నర్తనశాల సినిమాని చూపిస్తున్నారు. అంతా సినిమాని ఆసక్తిగా చూస్తున్నా ఇద్దరు మాత్రం ఆ సినిమాని చూడటంలేదు. పక్క పక్కనే కూర్చుని రహస్యంగా ఒకరితో మరొకరు గుసగుసలాడుకుంటున్నారు. ఇద్దరిలో ఎక్కువ వయసున్న వ్యక్తి పేరు అంబాజీరావు. బేంక్ దోపిడీ నేరంమీద ఆయన శిక్షని అనుభవిస్తున్నాడు. రెండో వ్యక్తి పేరు మునిస్వామి. అతను అమలాపురం నించి బయలుదేరిన ఓ లారీని తణుకు దగ్గర ఆపి అందులోని డ్రైవర్, క్లీనర్లని కొట్టి, కట్టేసి లారీలోని సరుకుని దోచుకున్న నేరానికి శిక్షపడి వచ్చి నాలుగు రోజులే ఐంది. అంతకుమునుపు మునిస్వామి, అంబాజీరావు కలసి అదే జైల్లో రెండు, మూడుసార్లు శిక్ష అనుభవించారు. ఆ ముఖపరిచయంతో ఒకరికొకరు దగ్గరయ్యారు. “ఇంపీరియల్ బేంక్ లో దొంగతనం చేయడం అంత తేలికా?” అంబాజీరావు అడిగాడు. "అవును. అశోక్ నగర్ బ్రాంచ్ గురించి, అక్కడి ఉద్యోగస్తుల గురించి చాలా సమాచారం సేకరించాను. బేంక్ లో పనిచేసే ఉద్యోగస్తుల తల్లితండ్రులు, బంధువులు ఎవరు ఎక్కడెక్కడున్నారో వివరాలు నా దగ్గర ఉన్నాయి. మనం దొంగతనం చేద్దామనుకున్న రోజు బేంక్స్టాఫ్ తక్కువ మంది ఉండటానికి అనువుగా, ముందురోజు ముగ్గురు, నలుగురు |........

Asangatham

175.00
అసంగతం నెలమీదంతా చినిగిపోయి, మసకబారి, విరిగిపోయి మాసిపోయిన పూలు... ఎప్పుడు పరిచారో లినోలియం... అరిగిపోయిన ప్యాచ్... అమసక బారిన చీకటో... ఒకప్పటి తాజా సౌందర్యం. మాసిపోయిన దిండ్లేసున్న పేము చెయిరో కూచునుంది, ఆమె జుట్టు రెండు పాయలుగా విడిపోయి ఒక పాయ ముందు భాగాన ఆమె వాలిన చన్నుమీంచి జాలువార్తోంది. రెండు పండ్లూడి పోయిన్దువ్వెన్తో దువ్వుకుంటూ దువ్వెన్ని జుత్తు మధ్యలోనే చిక్కిచ్చి "ఎన్ని రోజులిలా?" అడిగింది షమీమా పెదవి విరిచి... "అలాంటి ఆలోచన్లే వుండుంటే ఈ దినమిలా వుండేది కాదేమో" అన్నా... “కభీసోచానహీ కభీఘబ్ రాయా నహీ... బస్ యూ హీ చలే జానా హై" వెంటనే హమ్ చేసా... “మీరు సరే అరవైల్లో కొచ్చేస్తున్నారు.... నా విషయమేంటి? నిన్ననే నాకు ముప్పై రెండొచ్చాయి....” కళ్లని జుత్తు చివరనున్న చిక్కుల్లో చేర్చి ముడి వేసి అంది షమీమా..... "ఆలోచించుమరి... మనిద్దరం ఆలోచించీ ప్లాన్టేసుకుని కాన్సిక్వెన్సెస్ ఎలా వుంటాయని పూర్తి స్పృహతో కల్చుండడం లేదు కదా?" జేబులోంచీ అంచులు కుట్లూడిన పర్స్ తీసి లోపలి డబ్బు లెక్క పెడ్తూ అన్నా...

The Happiest Man On Earth

299.00
నేను 1920లో తూర్పు జర్మనీలోని లీపిగ్ పట్టణంలో జన్మించాను. నా పేరు అబ్రహం ఇంగ్లీషులో ఈ పేరును ఎడ్డీ అని పలుకుతారు. కాబట్టి దయచేసి నన్ను ఎడ్డీ అని పిలు మిత్రమా. మాది ప్రేమానుబంధాలుగల చాలా పెద్ద కుటుంబం. నా తండ్రి ఇసిడోర్కి నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్క చెల్లెళ్లు. నా తల్లి లీనా పదమూడు మంది సంతానంలో ఒకరు. ఇంతమంది పిల్లల్ని పెంచిన మా అమ్మమ్మ శక్తిని ఊహించుకోండి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఆమె తన కుమారుడిని కోల్పోయింది. జర్మనీ కోసం ఒక యూదుడు తన జీవితాన్ని త్యాగం చేశాడు. అలాగే భర్తనీ కోల్పోయింది. మా తాతయ్య సైనిక పూజారి. ఆయన యుద్ధం నుండి తిరిగి రాలేదు. మా నాన్న పోలాండ్ నుండి వలస వచ్చి జర్మనీలో స్థిరపడ్డారు. ఆయన జర్మనీ పౌరుడిగా గర్వపడేవారు. ఆయన రెమింగ్టన్ టైప్ రైటర్ సంస్థలో మెకానికల్ ఇంజినీరింగ్లో అప్రెంటిస్ గా, చేరడం కోసం మొదట పోలాండ్ని విడిచిపెట్టారు. ఆయన చక్కటి జర్మనీ భాష మాట్లాడేవారు. జర్మనీ వర్తక నౌకలో పనిచేస్తూ అమెరికా వెళ్లారు. అమెరికాలో తన వ్యాపారంలో బాగా రాణించారు గానీ తన కుటుంబానికి దూరమైయ్యారు. యూరప్ లోకి తిరిగి వచ్చి మరో జర్మన్ వ్యాపార నౌకలో పని చూసుకుందా మనుకున్నారు. సరిగ్గా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వస్తూ చిక్కుకుపోయారు. ఎందుకంటే ఆయన పోలిష్ పాస్పోర్టుపై ప్రయాణిస్తుండడంతో జర్మనీవారు ఆయనను అక్రమ చొరబాటు దారుగా భావించారు. అయితే జర్మనీ ప్రభుత్వం ఆయన్ని నైపుణ్యం గల మెకానిక్ గా గుర్తించి యుద్ధ ప్రయత్నాల కోసం భారీ ఆయుధాలు తయారుచేసే లీగ్లోని కర్మాగారంలో నిర్బంధంలో ఉండి పనిచేయడానికి అంగీకరించింది....................

Pipe Line Kadha

195.00
అనగనగా ఒకనాడు పాబ్లో, బ్రూనో అనే ఇద్దరు యువకులు ఇటలీలో ఒక గ్రామం లో పక్కపక్కనే నివసించేవారు. వారు వరసకు అన్నదమ్ములు అవుతారు. ఇద్దరూ మంచి స్నేహితులు. వారు కనే కలలు కూడా చాల పెద్దవి. ఎదో ఒకనాడు ఎలాగో ఒకలా ఆ గ్రామంలో అందరికంటే ధనవంతులు కావడం గురించి వారి నిర్విరామంగా మాట్లాడుకునేవారు. ఇద్దరు తెలివైనవారు, కష్టపడి పనిచేస్తారు. వాళ్లకు కావాల్సింది ఒక అవకాశం మాత్రమే. ఒక నాడు ఆ అవకాశం వారిని వరించింది. దగ్గర్లో ఉన్న నదినుంచి గ్రామంలో ఉన్న ఒక పెద్దతొట్టికి నీరు చేరవేయటానికి ఇద్దరు మనుషులను వినియోగించాలని ఆ గ్రామం నిశ్చయించింది. ఉద్యోగం పాబ్లో, బ్రునోలను దొరికింది. తరువాత ఎం జరిగిందో ఈ కథను చదివి తెలుసుకొనగలరు. -బర్కి వాడ్జెస్.

Katha Chanakya

195.00
రాజు , ఋషి ? నృపతి, నృపతి నిర్మాత ? మనిషి , మర్మయోగి ? చంద్రగుప్త సార్వభౌముల ఆరాధ్య గురువు చాణక్యుల జీవితం నిగూఢము, వివేచనామయం. ఆయన మాటలు, చర్యలు అత్యంత అప్రమత్తతో యంత్రవతుగా కట్టుబడి, అమలు జరిగినవి. చాణక్యులు జీవితంలో పాఠాలను సోదాహరణంగా బోధించారు. చేయి తిరిగిన రచయిత రాధాకృష్ణన్ పిళ్లే ఈ అద్భుత పుస్తకంలో అక్షరాలా అదే చేశారు. 'కధ చాణక్య' ఘనయశస్వి ఆచార్యుల జీవితంలో నించి కధలు చెప్పి, భారతావని మహోత్తమ వ్యూహాశీలి, స్వాప్నికుల సిద్ధాంతాలను, ఆచరణలను ఆధునిక సందర్భాలకు అన్వయింప జేస్తుంది. ఈ కధలలో కొన్ని యదార్థాలు, మిగతావి కల్పితాలు. అది ఒక నాయకుడి ఎన్నిక అయినా, అవినీతిని రూపుమాపటం అయినా, ఘనవిరోధిని ఓడించటం అయినా అన్నీ ప్రజాసంక్షేమం దృష్ట్యా జరిగినవే. స్రుకు ఒక స్వప్నం, ఒక ధ్యేయం ఉంటే దానిని సాకారం చేయటంలో కధ - చాణక్య తోడ్పడుతుంది రాధాకృష్ణన్ పిళ్లే ప్రఖ్యాత రచయిత. ఆయన రచనలు 'కార్పొరేట్ చాణక్య', 'చాణక్యాస్ 7 సీక్రెట్స్ టు లీడర్ షిప్', 'మీలోని చాణక్య', 'చాణక్య అలా చెప్పాడు', 'చాణక్య నీతి' అత్యుత్తమ అమ్మకాలు సాధించాయి. సంస్కృతంలో ఆయన మాస్టర్ డిగ్రీ పొందారు. కౌటిల్యుడి అర్ధశాస్త్రంలో ఆయన పిహెచ్.డి సాధించారు. ఆయన పేరుపొందిన మేనేజ్ మెంట్ సలహాదారులు, వక్త. యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో చాణక్య ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్ పిప్ స్టడీస్ (CIILS) విభాగానికి ఆయన డెప్యూటీ డైరెక్టర్. handle @rchanakyapillai ద్వారాఆయన ట్వీట్ చేస్తూ ఉంటారు. ఇతర ముఖ్య సామాజిక మాధ్యమాలలో కూడా ఆయన చురుకుగా పాల్గొంటారు.

Vidwan Viswam Panchatantram

150.00
పంచతంత్రం విను మహిలా రోప్య మను పట్టణమ్ము వెనుక, దక్షిణభూమి వెలయుచు నుండె. అమరేంద్ర వైభవుం డా యూరి రాజు; అమరశక్తి యటందు రాతని జనులు. మువ్వురు కొడుకులు మూర్ఖులై రంచు చివ్వుమన్నది రాజు చిత్తమ్ములోన చింతతో మంత్రుల చేరంగ బిలిచి మంతన మ్మొనరించి మాట్లాడె నిట్లు: తెలివిమాలిన కుమారుల పాడు నడత తెలియుగదా మీకు తీర్పరులార: | చదువుసాములు లేని చవటలై వీరు పదుగుర నవ్వుల పాలయినారు. అనగా అనగా దక్షిణాపథంలో మహిలా రోప్యం అనే పటణం కలదు. అంగ రంగ వైభవంతో ఆ నగరాన్ని అమరశక్తి అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు ముగ్గురు కుమారులు. వారు ముగురూ మూరులయినందువల్ల ఆ రాజు మనస్సు చివుక్కు మన్నది. విచారంతో ఆయన మంత్రులందరినీ పిలిపించి వారితో మంతనం సాగించినాడు. ఆ నరపాలుడు ఇట్లన్నాడు - "ఈ తెలివిలేని నా కుమారుల నడత మీకు తెలుసు గదా! మీరు న్యాయం చెప్పవలసిన వారు చదువూ, సామూ లేక చవటలె పోయి ఉన్నాడు. పాడు నడత మీకు తెలుసు గదా! మీరు న్యాయం చెప్పవలసిన వారు. చదువు, సాము లేక చావతలై పోయిన వీరు పడుగుర ముందు నవ్వుల పాలవుతారు . .....

Vallu Padina Bhupalaragam

250.00
కాలాతీత కథల కథనశిల్పం శీలా సుభద్రాదేవి, సంపాదకురాలు డా|| పి.శ్రీదేవి పేరు చెప్పగానే సాహితీలోకంలో 'కాలాతీత వ్యక్తులు' నవల గుర్తుకు రానివారు అరుదు. ఆమె కథలు రాసినట్లు తెలిసినా, ఆ కథల గురించి తెలిసినవారూ తక్కువే. పి. శ్రీదేవి రాసిన కథలు రాశిలో తక్కువే అయినా వాసిలో 'కాలాతీత వ్యక్తులు'కు దీటుగా ఉన్న కథలూ వాటిలో ఉన్నాయి. 1955 నుండి 1960 వరకూ రాసిన కథలు సుమారుగా ఇరవై వరకూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె రచనా జీవితం ఆరు సంవత్సరాలు మాత్రమే. ఆ కొద్దికాలంలోనే నవల, కథలు, కవిత్వం, వ్యాసాలతో సాహిత్యరంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రని సాధించిందామె. అరవై ఏళ్ళకు పైగా ఆ ముద్ర చెరిగిపోకుండా ఉందంటే శ్రీదేవి రచనలకు గల విశిష్టత తెలుస్తుంది. శ్రీదేవి 1929 సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో జన్మించింది. తండ్రి డాక్టర్ గుళ్ళపల్లి నారాయణమూర్తి నాటకకర్త, రచయిత, జాతీయవాది కావటాన శ్రీదేవికి బాల్యంనుండీ సాహిత్యాభిలాష, అభినివేశం అలవడ్డాయి. తండ్రితోపాటూ అనేక సమావేశాల్లో పాల్గొనటంవలన జాతీయ సమస్యల పట్లా, సాహిత్యంపట్లా స్పష్టమైన అవగాహన ఆమెకి కలిగింది.

Samakalina Bharatiya Kathalu

160.00
ఉర్దూ కథ : శిరీస్ నియాజి చిన్నచేప-పెద్దచేప అదొక చీకటి రాత్రి! ప్రకృతి నలువైపులా నల్లటి దుప్పటి కప్పుకుంది. దూరాన ఉత్తర దిక్కులోని ఓ మూలలో మాత్రం రక్తం గడ్డకట్టినట్టు ఎర్రబడింది. ఆకాశం, పగలంతా తమ కువకువలతో సందడి చేసిన పక్షులు అలసిపోయి తమ గూళ్ళలో దూరి నిశ్శబ్దంగా నిద్రిస్తున్నాయి. కుక్కలు మొరగటం, ఏడ్వటం మానేసి రోడ్లు, సందుల్లో తమ కడుపుల్లో తలలు దూర్చుకుని నిద్రకు ఉపక్రమించాయి. ఇలాంటి భయానకమైన రాత్రి ఓ నీడ తూలుతూ నది వైపు వేగంగా కదులుతోంది. అతని భుజాలు ముందుకు వంగి ఉన్నాయి. చిరిగిన దుస్తులు, అరిగిన చెప్పులతో అతను నడుస్తున్న తీరు చూస్తే అతనొక ముసలివాడని, బలహీనమైన వ్యక్తి అని ఇట్టే చెప్పొచ్చు. కాకపోతే కటిక పేదరికమే అతన్ని వయస్సుకన్నా ముందే ముసలివాడిగా మార్చేసింది. అయితే అలాంటి బలహీనమైన వ్యక్తి అర్ధరాత్రి పూట నది దగ్గరికి ఎందుకు వెళుతున్నాడు? పైగా ఈ రోజు సాయంత్రమే రేడియోలో ఒక హెచ్చరిక వెలువడింది- “ఈ రోజు రాత్రి భయంకరమైన తుఫాను వచ్చే అవకాశముంది. అందువల్ల చేపలు పట్టే జాలరులు ఎవరూ నదిలోకి వెళ్ళకూడదు" అని. ఆ వార్త అనగానే ఆ జాలరి వెంటనే చేపల కాంట్రాక్టర్ దగ్గరికి 'ఈ రోజు చేపలు పట్టలేనని చెప్పడానికి' వెళ్ళాడు. ఆ మాట వినగానే కాంట్రాక్టర్ మండిపడ్డాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ చేపలు పట్టాల్సిందేనన్నాడు. దాంతో తుఫాను రాత్రి అయినా చేపల కోసం నదిలోకి వెళ్ళక తప్పదనుకున్నాడు జాలరి. వెళ్ళకపోతే మరుసటి రోజు కాంట్రాక్టర్ తనకు డబ్బులు ఇవ్వడు. డబ్బు లేకపోతే ఇంట్లో పొయ్యి వెలగదు. తిండిలేక పిల్లలు విలవిల్లాడతారు. ఆకలిని తట్టుకునే వయసు వాళ్ళకింకా రాలేదు. | ఓ పడవ నిండా పట్టిన చేపలకి కాంట్రాక్టర్ ఇరవై రూపాయలిస్తాడు. దాంతోనే అతను తనతోపాటు భార్య, ముగ్గురు కూతుళ్ళ కడుపులు నింపుతాడు. నిజానికి అతను పడే కష్టానికి ఇరవై రూపాయలు చాలా తక్కువ. కష్టం తనది, సుఖమూ, సొమ్మూ కాంట్రాక్టర్ ని అతనికి తెలుసు. చలిలో, వర్షంలో అవస్థలుపడి నదిలో చేపలు పట్టి నిజాయితీగా చేపలన్ని కాంట్రాక్టర్ కి చేరుస్తాడు. తన పిల్లల కోసం ఒక్క చేప కూడా తీసుకెళ్ళడు. అయినా కాంట్రాక్టర్ ఎన్నడూ అతనిపట్ల సానుభూతి చూపలేదు..