Showing 61–72 of 132 resultsSorted by latest

Rayalaseema Hasya Kathalu

280.00
అతిథి దేవోభవ... ఆదోని బాష - 9440239828 “డాడీ అతిథి దేవో భవ అంటే ఏమిటి?" సాయంత్రం ఇంటికి రాగానే రాంబాబుకి అతని ఆరేళ్ళకొడుకు చంటి వేసిన ప్రశ్న ఇది. అతిథి పేరు వింటేనే మండిపడే రాంబాబుకి కొడుకు ప్రశ్న విని చిర్రెత్తుకొచ్చింది. “వెధవా.... ఆ మాత్రం తెలీదా? అతిథి దేవో భవ అంటే అతిథి దెయ్యంలా భయపెడతాడని అర్థం” కసిగా చెప్పి విసురుగా సోఫాలో కూర్చున్నాడు. ఆ అతని వేగానికి సోఫా కుయ్యో మొర్రో అంటూ టకటకమని చప్పుడు చేసింది. వంటింట్లో ఉన్న లత భర్త మాటలు విని హాల్లోకొచ్చింది. “అదేంటండీ, ఎవరి మీది కోపమో వాడి మీద చూపిస్తున్నారు. ఆఫీసులో బాసుతో గొడవపడి వచ్చారా?" అనడిగింది. "గొడవపడింది బాసుతో కాదు, బాసుగారి బాసుతో" “బాసుగారి బాసా, అదెవరు?" “ఇంకెవరు, మన బాసుగారి భార్యామణి" “ఆవిడ మీ ఆఫీసుకెందుకొచ్చింది? “బుద్ధి గడ్డి తిని మేమే పిలిచాం" “ఎందుకు?" మా కంపెనీ చాక్లెట్ల సేల్స్ పెంచటానికి మేం అప్పుడప్పుడు కస్టమర్లతో చిన్న చిన్న మీటింగులు ఏర్పాటు చేస్తుంటామని మీకు తెలుసు కదా. ఈ రోజు అలాంటిదే ఓ మీటింగ్ జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మా బాసుగారి భార్యని ఆహ్వానించాం. ఈ రకంగా సుని ప్రసన్నం చేసుకోవాలనుకున్నాం, ఆయన భార్య బిస్కెట్ కంపెనీకి సేల్స్ అడ్వయిజర్‌గా వ్యవహరిస్తోంది. ఏవో నాలుగు ఉచిత సలహాలిచ్చి మా బ్రాంచిని ప్రోత్సహిస్తుందనుకుంటే ఆవిడ మా స్టాప్ ని లక్స్ సబ్బుతో కడిగేసింది. నన్నయితే ఓబిస్కెట్ లా కరకర నమిలి తినేసింది" “ఇంతకీ ఆవిడ ఏం చెప్పింది?" “చాలా చెప్పింది. హిమాలయాల్లో ఐస్ క్రీముని అమ్మాలంది. థార్ ఎడారిలో ఇసుక వ్యాపారం చెయ్యాలని చెప్పింది. బంగాళాఖాతంలో ఉప్పుని అమ్మాలని సెలవిచ్చింది. ఇవన్నీ చెయ్యగలిగినవాడే నిజమైన స్స్మే న్ అని శ్రీకృష్ణుడిలా గీతోపదేశం చేసింది”.........

Raa Raa Samagra Sahityam 1, 2 & 3

700.00
ముందుమాట ఆధునిక భారతదేశ చరిత్రలోని భావోద్వేగ పూరితమైన రెండు ఘట్టాలు రాచమల్లు రామచంద్రారెడ్డి సాహిత్య కారునిగా, రా.రా. గా మారడానికి దోహదం చేశాయి. అందులో మొదటిది రాచమల్లు రామచంద్రారెడ్డి మద్రాసులో గిండి ఇంజనీరింగ్ కాలేజి మొదటి సం. విద్యార్థిగా (1940-41) వున్నపుడు జరిగింది. రెండవది మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రపు తొలి శాసనసభ ఎన్నికల సందర్భంగా 1955లో జరిగింది. 1940లో బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాలు ఉదృతంగా జరుగుతున్నాయి. అదే సమయంలో జర్మనీ యూరపు పై దాడి చేసి రెండవ ప్రపంచయుద్ధానికి తెరతీసి, బ్రిటీషు రాజకీయ సైనిక శక్తులను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇదే అదునుగా భారత జాతీయ వాదులూ, గాంధీ, భారత దేశానికి స్వాతంత్ర్యం ఇస్తామని వాగ్దానం చేయాలని బ్రిటీష్ పాలకులపై వత్తిడి పెంచారు. భారతదేశాన్ని యుద్ధంలోకి దించడానికి వ్యతిరేకంగా గాంధీజీ అక్టోబరు 1940లో దేశ వ్యాప్తంగా వ్యష్టి సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజానీకాన్ని సంఘటిత పరచడానికి పలువురు కాంగ్రెసు వాదుల్ని సన్నద్ధుల్ని చేశారు. దిక్కుతోచని బ్రిటీష్ ప్రభుత్వం ముందుకు ముందే దేశవ్యాప్తంగా ఇరవై వేల మందికిపైగా నాయకుల్ని జైళ్లలో కుక్కింది. ఈ బ్రిటీష్ దమనకాండకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం వీధుల్లోకి వచ్చి సమ్మెపిలుపు నిచ్చింది. ఆ సమ్మెలో భాగంగా మద్రాసులోని అన్ని కాలేజీల విద్యార్థులు సమ్మెబాట పట్టారు. వారిలో గిండీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులూ, వైద్య కళాశాల విద్యార్థులు కూడా వున్నారు. వారిలో అప్పటికే మార్క్సిస్టు భావజాలంతో పరిచయం వున్న రాచమల్లు రామచంద్రారెడ్డి గూడా వున్నాడని చెప్పనక్కరలేదు గదా! సమ్మె జరగడం వరకూ బాగానే వుంది. అయితే సమ్మె విరమించిన తర్వాత ఒక విచిత్రం జరిగింది. అదీ గిండీ ఇంజనీరింగ్ కాలేజీలోనే. సమ్మె ముగిసి విద్యార్థులందరూ వారి వారి తరగతులకు హాజరవుతున్నపుడు జరిగిన విచిత్రం అది. వైద్యకళాశాలతో సహా మిగతా అన్ని విద్యాలయాల అధికారులూ యెలాంటి............

Nela Jaarina Mugdatvam

150.00
నేల జారిన ముగ్ధత్వం "శనివారం ఉదయం పది గంటలకి మా స్కూలు ఆడిటోరియంలో ఓ చినసభ ని ఏర్పాటు చేసాము. దానికి మీరుభయులూ రావలసిందిగా కోరుతున్నాం” అని స్కూలు ప్రిన్సిపాల్ ఫోన్ చేసారు. ఓ విధంగా అర్థించారు. రిక్వెస్ట్ చేసారు. ఆ మాటలు విన్నాక విద్యా సాగర్ ఏం మాట్లాడ లేదు. జవాబివ్వడానికేం లేదు. స్కూలుకి ఎందుకు రమ్మంటున్నారో తెలుసు. వెళ్తే ఏం మాట్లాడాలి,? అసలు మాట్లాడేందుకేం ఉంది ? ఏమీ లేదనిపించింది. అందుకే నిశ్శబ్దంగా భార్య విజయని చూసాడు. మౌనం ఓ సుదీర్ఘమైన భాష . భాషతో పనిలేని కమ్యూనికేషన్. వారి మధ్య అగాధాల నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం ఎన్నింటినో మింగేసింది. అందుకే ఆమె ఫోన్ ఎవరిది, ఎక్కడ నుంచీ అని ఏం అడగలేదు. అయినా విద్యా సాగర్ ఆమెకి చెప్పాడు.. ఇప్పుడు స్కూలు ప్రిన్సిపాల్ మాటలకి , ఇప్పుడిప్పుడే ఆరుతున్న కళ్ళు మరోసారి ఊట బావులయ్యాయి. వారి గుండెల్లో పేరుకు పోయిన దుఃఖం కళ్ళల్లోకి వచ్చేసింది. ఎన్నో జ్ఞాపకాలు అప్పుడే పైపొర తొలిగిన పచ్చి పుండ్లలా సలిపేస్తున్నాయి. అవి అన్ని రాత్రింబవళ్ళు అక్కర్లేని అతిథుల్లాగా ఎప్పుడొస్తున్నాయో, ఎప్పుడు వెళ్తున్నాయో వాళ్ళకి తెలీడం లేదు. ఆ జ్ఞాపకాల లోంచి 'అమ్మా నాకు బతకాలని ఉంది, ఇప్పుడే చావాలని లేదు' అంటూ బాధ పడుతూ, ఏడుస్తున్న శ్వేత కనిపిస్తోంది. ఆమె గొంతు వినిపిస్తోంది...........

Manasuku MaroVepu

275.00
నా కథల్తో పాటు... 'గతంలో, అంటే అరవై ఏళ్ళ క్రితం జన జీవితంలో ఇంతటి విపరీత వేగం లేదు. స్థిరత్వం, స్తిమితం ఉండేవి. సమాజంలో ఒకళ్ళనొకళ్ళు పట్టించు కోటం ఎక్కువగా ఉండేది. విలువల్లో మార్పు రావటానికి చాలాకాలం పట్టేది. మెజారిటీ జన అభిప్రాయం అంటూ ఒకటి బలంగా ఉండేది. ఎవరైనా అనుభవంతో ఏదైనా చెపితే చాలామందికి నచ్చేది. ఎక్కువ మంచితనం, దానికన్నా తక్కువగానే చెడుతనం ఉండేవి. అన్ని వయసుల వాళ్ళలో సంతోషం కనిపించేది.. ముఖ్యంగా వృద్ధుల్లో, పిల్లల్లో, ఎవరేనా ఇంటికి వస్తే, ఆ కలిసి మెలిసి గడిపే జీవితం పండుగలా ఉండేది. ఇరుగు పొరుగు, బంధువులకన్నా దగ్గరగా ఉండేవారు. అధికారం, పద్ధతులు, నియమనిబంధనల కన్నా, ఆప్యాయతది పైచెయ్యిగా ఉండేది. వెరసి జీవితంలో జీవం ఉండేది. ఈనాడు అవన్నీ పలచబడిపోయాయి. ప్రస్తుతం మనం జీవిస్తున్నది. వేరే ప్రపంచం. ఎవరికీ దేనికీ ఖాళీ లేదు. ఓపిక లేదు. స్తిమితంగా తినరు. | సుఖంగా సంసారం కూడా చెయ్యరు. వాళ్ళది కాని వేరే బతుకే చాలామంది బతుకుతున్నారు. యవ్వనంలో ఉన్న ఆడ, మగ మధ్య అవసరమే తప్ప, ఆకర్షణ కరువవుతున్న దౌర్భాగ్యదశ. ఆ రోజుల్లో దుఖాన్ని వెతికి పట్టుకుని కథలు రాశాం. ఒకరి దుఖం పది మందికి తెలిస్తే, జీవితం మెరుగుపడుతుందన్న నమ్మకంతో రాశాం. ఇప్పుడు దుఖాన్ని కాదు, సుఖాన్ని, సంతోషాన్ని వెతికి పట్టుకోవాల్సి వస్తోంది. ఆమె.............

Kottha Katha 2018

149.00
చెప్పుకోవడానికి ఒక కథంటూ లేకుండా ఎలా బతుకుతున్నావ్? అంటాడు దోస్తోవ్ స్కీ, నిజమే కదా! చెప్పుకోవడానికి ఏమీ లేనివాడు అందరికంటే దురదృష్టవంతుడు. భాష తెలియని ఆది మానవుడు సైతం తన కథలను గుహలలో బొమ్మల్లా చిత్రీకరించాడు. నోటి మాటగానో, తాళపత్ర గ్రంథాల ద్వారానో, దేవాలయాల గోడలపైన చెక్కిన శిల్పాల ద్వారానో మనకి వారసత్వంగా వచ్చిన ప్రక్రియ కథ. నవ్వు తెప్పించే హాస్యకథల రూపంలోనో, ఆలోచింపజేసే నీతికథల రూపం లోనో, మనసును రంజింపజేసే శృంగారభరితమైన కథల రూపంలోనో కథ అనే ఈ పురాతన కళాప్రక్రియ నేటికీ కొనసాగుతూనే ఉంది. అయితే గత వందేళ్ళకి పైగా వచ్చిన ఆధునిక కథ సంగతి వేరు. మన జీవితాలను గతంతో అనుసంధానం చేస్తూనే, మారుతున్న సమాజానికి అనుగుణంగా మన ఆలోచనలను వ్యక్తం చేయడానికి కథ కొత్త మార్గాలను వెతుక్కుంటూనే ఉంది. అలా వెతుక్కుంటూ చేరిన విభిన్న, వినూత్న కథల సంకలనం ఈ కొత్తకథ 2018.

Kotha Katha 2022

190.00
సంపాదకుల మాట స్త్రీలు చెప్పమన్న కథలు కథ రాయాలని కూచున్నప్పుడు రచయిత ఎదురుగా ఒక స్త్రీ వచ్చి 'నా కథ రాయి' అనే సందర్భాలు గతించిపోయేలా లేవు. 1980ల తర్వాత స్త్రీవాద దృక్పథంతో కథ, నవల తెలుగులో వికసించినా నాటి నుంచి నేటి వరకూ వందల కథలు వెలువడా రచయిత ఎదురుగా స్త్రీలు కూచుని 'మా కథ రాయవేమి?' అని డిమాండ్ చేస్తూనే ఉన్నారంటే అనంత ముఖాల స్త్రీ సమస్యల ప్రాసంగికత ఎప్పటికీ గతించిపోదనే | అనిపిస్తున్నది. కొత్త కథ - 2022లో తొమ్మిది కథలు స్త్రీల మానసిక, భౌతిక, సామాజిక సమస్యలను చర్చించే ప్రయత్నం చేయడం ఒక ముఖ్యమైన పరిశీలనాంశంగా తీసుకోవాలి. ఎదగవలసినట్టుగా ఎదగలేకపోయిన అమ్మాయి' కథ నుంచి 'అవసరం లేనంతగా ఎదిగిన గృహిణి' కథ వరకూ రచయితలు ఈ సంకలనంలో కథనం చేశారు. ఇంత వైవిధ్యమైన చూపు కలిగి ఉండటంలో 'రైటర్స్ మీట్ భాగస్వామ్యం ఏ కొంచెమైనా ఉంటుందనే భావన మాకు సంతోషం కలిగిస్తున్నది......

Management

150.00
పరిచయం రెండువందల సంవత్సరాలకు పూర్వం, పారిశ్రామిక విప్లవం జరిగిన తొలి సంవత్సరాలలో, ప్రపంచంలో అత్యధికభాగం పేదరికంతో అలమటిస్తూ ఉండేది. ఇవాళ కూడా పలు ప్రపంచ దేశాలు పేదరికంలోనే మగుతున్నాయి. గత రెండువందల సంవత్సరాలలో ఆవిరియంత్రం, విద్యుత్తు కనుగొనడంతో ప్రారంభమైన సాంకేతిక విప్లవం ద్వారా ఇవాళ మనకు అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు అందుబాటులో ఉంటున్నాయి. హై టెక్నాలజీ - పాశ్చాత్య ప్రపంచంలోని పేదరికాన్ని చాలావరకు తగ్గించి, మానవ చరిత్రలోనే ఎవరూ ఎన్నడూ ఊహించలేనన్ని సంపదలను చాలా మందికి సృష్టించిందని చెప్పబడుతోంది. అయితే, నిజానికి అది టెక్నాలజీ వల్ల మాత్రమే సాధ్యం కాలేదు. అది టెక్నలాజికల్ రెవల్యూషన్ సాంకేతిక విప్లవం కాదు; యాజమాన్య విప్లవం మేనేజీరియల్ రెవల్యూషన్. ప్రగతి గొప్పగా పెల్లుబికడానికి బాధ్యులు, కారణమైనవారు ఎంటర్ ప్రైజెస్లోనూ, సంస్థలలోనూ అన్ని స్థాయుల్లోని మేనేజర్లు. మేనేజిరియల్ డెవలప్మెంటును అనుసరించే టెక్నాలజీ ఎల్లప్పుడూ నడిచింది. కావడానికి ఈ పుస్తకంలో నేను, మరింత ఎక్కువ ప్రభావశీలుడైన ఎఫెక్టివ్ మేనేజర్ నికి మీరు ఉపయోగించదగ్గ ఇరవైఒక్క కీ ఐడియాస్ కీలక అంశాల ఈ వివరించబోతున్నాను. ఈ సబెక్ ఎందుకు ముఖ్యంగా సంవత్సరాల నా అధ్యయనంలో వందలాది పుస్తకాలు చదివాను; బిజినెస్ డిగ్రీ తరబడి నా అధ్యయనంలో...........

Land Guns Caste Women

599.00
Why I had to write this book This is the story of my reckoning with myself and the world around me. I was born into a Tamil brahmin family with roots in Kerala. For over five decades, the rugged Deccan landscape of Hyderabad and its surrounding districts has been my home. While burning the bra was considered radical in the West, in my family, wearing one when I was fourteen made me a slut. My younger days were marked by small insurrections and a passion for mathematics. I gravitated towards the Naxalite movement in the 1970s and went underground during the Emergency. My parents thought I had been brainwashed. They bundled me away to Madras, and sought to 'rebrainwash' me by subjecting me to shock treatment (electroconvulsive therapy). My memory got scrambled. Rescued and returned to Hyderabad, I could not recognize the man I wanted to marry. I was disoriented. To evade arrest during the Emergency, my husband Cyril Reddy and I moved to the north of India where we lived amongst the halmikis of Ghaziabad, teaching them English among other things. I often contemplated suicide. When we returned to Hyderabad in 1980, there was no family or party waiting for us. Yet this city was home. With the help of friends, we founded the Hyderabad Book Trust, a publishing house that Specializes in low-cost books. working mostly with leftists and Ambedkarites. It worked like a drug against my depression! woon became the face of HBT and I still am. Yet I could not................

Kotta Katha 2018

149.00
సంపాదకుల మాట స్త్రీలు చెప్పమన్న కథలు కథ రాయాలని కూచున్నప్పుడు రచయిత ఎదురుగా ఒక స్త్రీ వచ్చి 'నా కథ రాయి' అనే సందర్భాలు గతించిపోయేలా లేవు. 1980ల తర్వాత స్త్రీవాద దృక్పథంతో కథ, నవల తెలుగులో వికసించినా నాటి నుంచి నేటి వరకూ వందల కథలు వెలువడా రచయిత ఎదురుగా స్త్రీలు కూచుని 'మా కథ రాయవేమి?' అని డిమాండ్ చేస్తూనే ఉన్నారంటే అనంత ముఖాల స్త్రీ సమస్యల ప్రాసంగికత ఎప్పటికీ గతించిపోదనే | అనిపిస్తున్నది. కొత్త కథ - 2022లో తొమ్మిది కథలు స్త్రీల మానసిక, భౌతిక, సామాజిక సమస్యలను చర్చించే ప్రయత్నం చేయడం ఒక ముఖ్యమైన పరిశీలనాంశంగా తీసుకోవాలి. ఎదగవలసినట్టుగా ఎదగలేకపోయిన అమ్మాయి' కథ నుంచి 'అవసరం లేనంతగా ఎదిగిన గృహిణి' కథ వరకూ రచయితలు ఈ సంకలనంలో కథనం చేశారు. ఇంత వైవిధ్యమైన చూపు కలిగి ఉండటంలో 'రైటర్స్ మీట్ భాగస్వామ్యం ఏ కొంచెమైనా ఉంటుందనే భావన మాకు సంతోషం కలిగిస్తున్నది......

Katha Naadi Mugimpu Amedi

795.00
నా రచనకు వస్తువు ప్రతి మనిషి జీవితమూ అచ్చుకాని ఒక బృహధ్రంథం. ఆ గ్రంథంలోంచి కొన్ని నవలల్నీ, కొన్ని వందల కథల్నీ ఏరుకోవచ్చు. చాలామంది తమ జీవితపుటల్ని తెరిచే వుంచుతారు. కొన్నిచోట్ల ఒడుపుగా మనమే వాటిని తెరిచి చదువుకోవాలి. నాకు ఇతరుల జీవితాల్ని చదవడమంటే సరదా. నా రచనలకు వస్తువు చాలాసార్లు అక్కడే దొరుకుతుంది. అయితే, అక్కడ దొరికేది ముడిసరుకు మాత్రమే. ముడిసరుకులో మలినాలు | అనేకం వుంటాయి. ఒక్కొక్కప్పుడు అక్కర్లేనివే చాలావుండి, కావలసినది తక్కువగా వుంటుంది. దాన్ని శుద్ధి చేసుకోవాల్సివస్తుంది. నేను ఎప్పుడూ అంచెలంచెలుగా అక్కర్లేని వాటిని తొలగించుకుంటూ, అందులోంచి కావలసిన పదార్థాన్ని వేరుచేస్తాను. ఆ తర్వాత దాన్ని నాకు కావలసినరీతిలో పోతపోస్తాను. పోతసరుకు ఎప్పుడూ మోటుగానే వుంటుంది. దాన్ని చిత్రీపట్టి నగిషీలుగా చెక్కి, నాకు తృప్తిగావుంటేనే తీసుకొచ్చి నలుగురిముందూ పెడతాను. నేనే కాదు సర్వసాధారణంగా ఏ రచయితైనా అనుసరించే పద్ధతి స్థూలంగా యిదే.... అయితే సూక్ష్మంగా పరిశీలించినప్పుడు మాత్రం ఒక రచయిత అనుసరించే పద్ధతికీ, మరో రచయిత అనుసరించే పద్ధతికీ అడుగడుగునా ఎంతో తేడా వుంటూనే వుంటుంది. ఎక్కడో ఒక సంఘటన జరుగుతుంది. అది నా జీవితంలో జరిగిందైనా కావచ్చు. మరొకరి జీవితంలో జరిగిందైనా కావచ్చు. అందులో ఆసక్తికరమైన విషయం వుంటే | దాన్ని తీసి ఓ పక్కన పెడతాను. కొంతకాలంపాటు అక్కడే వుంటుంది. తీరికవున్నప్పుడల్లా దాని గురించే ఆలోచిస్తాను. చేర్పులూ మార్పులు చేస్తాను. చక్కటి ప్రారంభమూ, మంచి | ముగింపూ ఆలోచిస్తాను. మనసు ఒక ప్రయోగశాలగా పనిచేస్తుంది. ఎన్నో వడపోతలు | జరిగి, ఎన్నో మార్పులు చేర్పులూ పొంది, ఎంతో కాలానికి చివరికి అది ఒక ఆకారాన్ని చకుంటుంది. మనస్సనే లేబరేటరీలో వుంచిన సంఘటన, చివరకు ఒక కళారూపాన్ని సంతరించుకుంటుంది. ఆలోచనఅనేది మనిషి సంపాదించుకున్న గొప్ప వరం. కల్పన అతనికి చిన్నప్పటినించీ అలవాటైన విద్య. ఒక సంఘటన జరిగి, అది నలుగురి నోటిమీదుగా కి ఒక కొత్తకథ తయారవుతుంది. దీనికి కారణం - మనిషి ఎప్పుడూ తన కాలునిక శక్తిని వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు గనక. స్వతహాగా ప్రతి మనిషిలో యీ..............

Kathalela Rastaru? ?

300.00
కాబోయే కథకులకి పనికొచ్చే చిట్కాలు - ఆరుద్ర “మనం చదివే చాలా కథలకన్నా మనం రాసే కథలే మనకి బాగుంటున్నాయి, అయినా మనం పంపించే కథలు ఈ పత్రిక వాళ్ళు ప్రచురించరేం?” అని మీ రెప్పుడైనా బాధపడ్డారా? ఇప్పుడు పడుతున్నారా? పడకండి ధైర్యం చేతబట్టుకొని, కాళ్ళు నిలదొక్కుకోండి. మీరు పంపించే కథలు మీ కొక్కరికే బాగుంటే చాలదు. అందరికీ బాగుండాలి.. అప్పుడే సంపాదకులు వాటిని ప్రచురిస్తారు. బాగున్న కథల్ని పత్రికలవాళ్ళు కళ్ళకద్దుకుని మరీ ప్రచురిస్తారు. వేసినవాటికి తృణమో, పణమో పారితోషికం కూడా ఇస్తారు. (పూర్వం రమారమి తృణమే ఇచ్చేవారు, ఇప్పుడు పణం ఇస్తున్నారు.) బాగా వుండేటట్టు కథ రాయాలంటే దానికి అనుభవం కావాలి. “చాల్లేవయ్యా! ఆపాటి అనుభవం మాకూవుంది. ఊఁ కొట్టడం వచ్చిన దగ్గర్నుంచి కథలు వింటున్నాం. కూడబలుక్కొని చదవడం మొదలెట్టిన దగ్గర్నుంచీ కథలు చదివేస్తున్నాం. కాంపోజిషన్లు రాయడం మొదలెట్టిన మర్నాటి నుంచి కథలూ రాస్తున్నాం, ఇంతకన్నా ఇంకేం కావాలి?” అని మీలో ఏ ఒక్కరైనా అనగలిగితే మీకు అనుభవ ముందని తప్పకుండా ఒప్పుకుంటాను. చిన్నప్పటినుంచి కథలు వినాలనీ, చదవాలనీ, వ్రాయాలని తహ తహ వున్నవాళ్ళు మంచి కథకులవడానికి అవకాశాలున్నాయి. భాగవతం రాసిన బమ్మెర పోతరాజుగారు మాత్రం ఎలా రాశారు? విభుదవరుల ఎల్ల విన్నంత, కన్నంత తెలియవచ్చినంత తేటపరిచారు. ఆహా! దొరికింది కిలకం. ఇది మంచి కథలు రాయడానికి సూత్రం! కథ రాసేవాడు ముందు బోలెడంత వినాలి. లాకాయి,.........