Showing 589–600 of 835 resultsSorted by latest

Bharateeya Tatvasastramlo Bhavavadam Bhoutikavadam – భారతీయ తత్వశాస్త్రం

60.00

ఈనాటి మన తాత్విక అవసరాల కోణం నుంచి మన తాత్విక సంప్రదాయాలను విశ్లేషించడమే ఈ రచన ఉద్దేశ్యం. లౌకికతత్వం, హేతువాదం, శాస్త్రీయ దృష్టి అన్నవే నేటి ఆ అవసరాలు. ఈనాడు మనం దేన్నైతే ఎదుర్కొని పోరాడుతున్నామో దానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మన తాత్వికులలో ఒక భాగం అమూల్యమైన సూచనలు అందజేశారు. వాటిని మనం పూర్తి ఆమోదంతోనూ, జాతీయ గర్వంతోనూ పెంపొందించవచ్చు.

Chiranjeevi Indiraku – చిరంజీవి ఇందిరకు

60.00

1928వ సంవత్సరం వేసవిలో హిమవత్పరతమందలి మసూరిలో ఉన్న తన కుమార్తె ఇందిరకు జవహర్‌లాల్‌ నెహ్రూ జనపద మందు ఉంటూ ఈ జాబులు వ్రాశారు.
జననం : 1889. కాశ్మీర దేశస్థులు. తండ్రి ప్రఖ్యాత న్యాయవాది మోతీలాల్‌ నెహ్రూ, తల్లి : స్వరూపరాణి. జన్మస్థానం ప్రయాగ : ‘అలహాబాద్‌’ ఇంటివద్దే కొంతకాలం ప్రైవేట్‌గా చదువుకొని హారోలో, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాలలో విద్యనభ్యసించారు. అలహాబాద్‌ హైకోర్టులో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించారు. 1918లో ఇండియన్‌ ¬మ్‌రూల్‌ లీగుకు కార్యదర్శి అయినారు. 1918 నుంచి అఖిల భారత కాంగ్రెస్‌ సభ్యుడుగా ఉన్నారు. 1921లో మొదటిసారి కారాగృహవాసాన్ననుభవించారు. రచనాకాలం నాటికి ఎనిమిది మారులు శ్రీకృష్ణ జన్మస్థానాన్ని చూచి వచ్చారు. 1929లో కాంగ్రెస్‌ కార్యదర్శి అయినారు. 1930లోను 1936, 37, 46లలోనూ కాంగ్రెస్‌ అధ్యక్షులయినారు. 1950 నుంచి 1955 వరకు కాంగ్రెస్‌ అధ్యక్షులుగా వున్నారు.

ఈయన గొప్ప ప్రజాస్వామ్యవాది. ఆంగ్లంలో అనేక గ్రంథాలను రచించారు. వీరి  రచనలలో ‘సోవియట్‌ రష్యా’, ‘ప్రపంచ చరిత్ర’, ‘డిస్కవరీ ఆఫ్‌ ఇండియా’ అన్నవి ప్రసిద్ధ రచనలు. 1947లో భారతదేశం స్వాతంత్య్రం పొందిన నాటి నుంచి 1964వ సంవత్సరం మే 27న మరణించే వరకు ఆయన భారత ప్రధానిగా ఉన్నారు. తరువాతికాలంలో ఆయన కుమార్తె శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశానికి ప్రధానిగా ఎన్నుకోబడి దేశాభివృద్ధికి ఎన్నో సంస్కరణలు చేపట్టారు.

Chirasmarana

70.00

“చిరస్మరణ” నవల రచనకు సంబంధించి ఈ సందర్భంలో ఒకటి రెండు మాటలు వ్రాయడం అప్రస్తుత మనిపించదు. భారతదేశ శ్రమజీవులు కొనసాగిస్తూ వచ్చిన వర్గ సమారా ఇతిహాసం సుదీర్ఘమయింది. దాని గగుర్పాటు కలిగించే ఒక అధ్యాయం కేరళలోని కయ్యూరు రైతుల పోరాటం. అదే ‘చిరస్మరణ’ రచనకు ప్రేరణ. ఆ ఇతివృత్తం నా మనస్సును తాకినది, తట్టినది నా విద్యార్థి దశలో.

          “చిరస్మరణ” లోని అనేక పాత్రలు వాస్తవ జీవితం నుంచే నవల పుటలకు నడిచి వచ్చాయి. అయితే అవి ఇక్కడ పాత్ర నిర్వహణ కోసం రంగ ప్రసాదన వేష భూషణాలను నిరాకరించలేదు. మాస్టర్ పాత్రకు మాధవన్ – మాధవేట్టన్ – స్ఫూర్తి, ప్రభుపాత్రకు కామత్. మరికొన్ని పాత్రల విషయంలో జనాభా లెక్కలు చెప్పమొగం వేయవచ్చు. కాని అలాంటివారు ఉండి ఉండరు – అని ఖరాఖండిగా చెప్పడం కష్టం. “చిరస్మరణ” జయప్రియతను సంపాదించాకపోయినా, అల్ప సంఖ్యాకులైన పాఠకులకు చాలా ఇష్టమయిందనితోస్తుంది.

                                                                                – తిరుమల రామచంద్ర

Chittadavilo Chinna Pranulu – చిట్టడవిలో చిన్న ప్రాణులు

50.00

అదొక చిట్టడవి. ఆ అడవి ఎప్పుడూ చిన్నా, పెద్దా జంతువుల అరుపులతో, రకరకాల పక్షుల కూతలతో సందడిగా ఉంటుంది. అక్కడక్కడా గుత్తులు గుత్తులుగా పూసిన పూల సువాసన అడవంతా తిరుగుతూ ఉంటుంది. ఆ అడవి మధ్యన చిన్న నీటి గుంట ఉంది. ఆ గుంట చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. ఒక కోతి ఆ చెట్ల కొమ్మల మీదకు దూకుతూ ఆకులన్నీ దూసి నీళ్ళలోకి విసురుతోంది. ”ఏమిటమ్మా ఆ దూకుడు? కాయలో పళ్ళో అయితే పిల్లలు తింటారు. ఈ ఆకులేమిటి… బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు” నీళ్ళలోంచి బయటకొచ్చి విసుగ్గా అంది ఓ తాబేలు.

”పళ్ళు కావాలని మర్యాదగా అడగవచ్చు కదా!” అంది కోతి. అంటూనే చకచకా అవతలి చెట్లమీదకి దూకేసింది పళ్ళ కోసం.

”కావు…కావు…” అని అరుచుకుంటూ ఆయాసంగా అక్కడ వాలింది ఓ కాకి.

కాకి పిలుపుకు నెమ్మదిగా ఒడ్డు దగ్గరకు వచ్చింది తాబేలు. ”ఏరి వీళ్ళంతా…అంతదూరం నుంచీ ఎంతో ఆత్రంగా ..ఎగురుకుంటూ వచ్చాను. తీరా చూస్తే ఇక్కడెవరూ లేరు”. అంది కాకి నిరాశగా….

Yuri Alekseyevich Gagarin – యూరీ అలెక్స్‌యేవిచ్‌ గగారిన్‌

30.00

అంతరిక్షం నుండి భూగోళాన్ని చూసిన మొదటి మానవుడు యూరీ అలెక్స్‌యేవిచ్‌ గగారిన్‌.
ఆకాశం అద్భుతాలకు నిలయం. పగలు సూర్యుడు ఉంటాడు. రాత్రి నక్షత్రాలు వస్తాయి. పెరుగుతూ, తరుగుతూ చంద్రుడు వస్తాడు. అప్పుడప్పుడూ తోకచుక్కలు కనిపిస్తాయి. ఇవి అన్నీ ప్రాచీన మానవులకు ఆశ్చర్యపరిచాయి. క్రమక్రమంగా విజ్ఞానం వికాసం చెందుతూ ఆకాశంలోని వింతల గురించి అవగాహన కలిగించింది. ఆకాశంలో పక్షలు ఎరుగుతూ ఉంటాయి. వాటిలాగా ఎగిరి పోవాలని ప్రయత్నాలు చేశారు. మొదట వేడి గాలి గుమ్మటాలు ఆకాశంలో ప్రయాణించడానికి దారి చూపించాయి. తరువాత విమానాలు వచ్చాయి. భూమి నుండి 7 మైళ్ళ ఎత్తు వరకే ఇవి ప్రయాణం చేయగలుగుతున్నాయి. ఆకాశంలో గాలిలేనిచోటు ఉన్నది. అక్కడ ప్రయాణించడానికి ప్రత్యేకమైన సాధనాలు కావాలి. దానికోసం రాకెట్లు రూపుదిద్దుకున్నాయి. ఇవి గాలిలేని ప్రదేశాలలో కూడా ప్రయాణించగలుగుతాయి. వీటితో ఆకాశం చాలావరకు అందుబాటులోకి వచ్చింది. భూమి నుండి చాలాఎత్తు పోయిన తరువాత అంతరిక్షం ఉన్నది. దీనినే రోదసి అనికూడా అంటారు. అంతరిక్షాన్ని అందుకోవాలని, దానిలో ప్రయాణం చేయాలనీ ఆకాంక్ష పెరిగింది. దానికోసం కృత్రిమ ఉపగ్రహాలు, అంతరిక్షనౌకలు అవతరించాయి. ఇక అంతరిక్షంలోకి మానవులను పంపే కార్యక్రమం మొదలయ్యింది. వోస్టాక్‌ అనే అంతరిక్ష నౌకలో రాకెట్టు సహాయంతో, అంతరిక్షంలో ప్రయాణించగల సాహసి కోసం అన్వేషణ మొదలయ్యింది. యూరీ అలెక్సేయెవిచ్‌ గగారిన్‌ ఎన్నికయ్యాడు. గగారిన్‌ రష్యాకు చెందిన వాడు. అంతరిక్షంలో ప్రయాణించిన తొలి మానవుడు. అతడి ప్రయాణం మానవ విజయానికి చిహ్నం. ఆ వీరుడి గురించి, అతడి సాహసయాత్ర గురించీ ఈ పుస్తకంలో వివరిచబడింది.

Gnapaksakthiki Maargalu

50.00

ఆధునిక , శాస్త్రీయ పద్దతుల ద్వారా జ్ఞాపకశక్తిని అపారంగా పెంచుకొనే మెళకువలు  అందిస్తుంది. అతి క్లిష్టమైన విషయాలను సైతం అవలీలగా జ్ఞాపకం వుంచుకోగల విధానాలు సూచిస్తుంది. అనేకానేక అంశాలన్నింటినీ మనస్సు పేటికలో అతిభద్రంగా దాచుకోగల అవసరం వచ్చినప్పుడు తక్షణమే గుర్తుతెచ్చుకోగల తీరును వివరిస్తుంది. మతి మరుపును చిటికెలో మటుమాయంచేసే సాధికారిక గ్రంధం.

Okka Vaana Chalu – ఒక్క వాన చాలు

110.00

ఈ నవల రాయటంలో రెండు ఉద్దేశాలున్నాయి.

రాయలసీమ రైతు, రైతుకూలీల బతుకులు ఇప్పుడు వలస బతుకులయ్యాయని చెప్పటం ఒకటైతే –

రెండవ విషయం ఏమిటంటే – ఎన్ని కష్టాలు వెంటాడుతూవున్నా ఏడుస్తూ కూచోవటం ఇక్కడి మనుషుల లక్షణం కాదు. ఎంత ఆకలేసినా చేతులు చాచి అడుక్కోవటం ఇక్కడి రైతులకు అలవాటు లేదు. నిరంతరం బతికేందుకే పోరాడుతుంటారు. బండరాతి మీద అయినా సరే పిడికెడు అన్నం పుట్టించేందుకు ప్రయత్నిస్తుంటారు. చెతుర్లాడుకోవటంలో ఆకలిని మరుస్తారు. బూతు పదాలు కలిసిన మాటలతో హాస్య సంఘటనలు చెప్పుకొంటూ నవ్వుకొంటూ కష్టాలు మరవటానికి ప్రయత్నిస్తారు. సద్ది సెరవలో పుల్లనీళ్ళ మీద తేలే పచ్చిమిరపకాయ మీద కూడా జోకులేసుకుంటూ దుర్భరమైన ఆ తిండినే కడుపారా తిని పనికి పోగలరు. బీడీకట్టకు లెక్కలేనంత దరిద్రంలో వుండికూడా ఒకే బీడీని నలుగురు పంచుకు తాగుతూ తమ దరిద్రం మీద తామే జోకులేసుకోగలరు.

ఇక్కడి రైతు కరువుకు అలవాటు పడ్డాడు – ఆఇకలికి లాగే నాయకుల వాగ్థానాలకు అలవాడు పడ్డాడు – వట్టి మేఘాల ఉరుములకు లాగే. – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

Prapancha Prasiddha Janapada Kadhalu

90.00

ఏ కాలానివైనా, ఏ దేశానివైనా, ఏ భాషవైనా జానపద కథలంటేనే చిత్రవిచిత్ర చమత్కారాలతో సాగుతూ శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసి తమ వెంట ఏ చుక్కల లోకానికో, ఏ అందాల సీమలకో తీసుకుపోతాయి. ఈ కథలు ఆశ్చర్యానందాలే కాదు. జీవితానికి అవసరమైన విలువలను అందిస్తాయి. తరతరాల అనుభవాల అనుభూతుల సారమే ఈ జానపద కథలు. ఈ జానపద కథలు రేకెత్తించే కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు. విశేషాలు…

మాటలు అమ్మే అంగడి వల్ల బాటసారి పొందిన ప్రయోజనం?

మనం కురూపులమైనా, సౌందర్యవంతులమైనా జీవితాంతం మనల్ని అంటిపెట్టుకుని ఉండేది ఏమిటి?

స్వర్గానికి కోటీశ్వరుడు వస్తే జరిగిన కోలాహలానికి కారణం?

మానవ జీవితంలో ఉండే దురాశలు, కుయుక్తులు, జిత్తులూ వాటిని పరిష్కరించే సుయుక్తులు ఈ కథల నిండా వున్నాయి. ఇంకా ఈ కథల్లో పీనాసివాళ్ళు, మంత్రగత్తేలు, వెర్రివెంగళమ్మలు, వేలెడంత పిల్లలు మీకు తారసపడతారు.

Olga Nunchi Gangaku

300.00

మనిషి నేడు ఉన్న స్థితిలో ప్రారంభం నుంచీ లేడు. ఈ స్థితికి రావడానికి ఎన్నో గట్టి పోరాటాలు చెయ్యవలసి వచ్చింది. “మానవ సమాజం” అన్న పుస్తకంలో నేను మానవ సమాజ వికాసాన్ని గురించి సిద్ధాంతపరమైన వివేచన చేశాను. దాన్నే సరళంగా చెప్పొచ్చు. ఆ సరళ చిత్రణ వల్ల మానవ సమాజం ఎలా వికాసం చెందిందో అర్థం చేసుకోవడం తేలిక అవుతుందన్న అభిప్రాయం కలిగింది. దాంతో “వోల్గా నుంచి గంగకు” రాశాను. ఇందులో నేను మనదేశపు పాఠకుల సౌలభ్యం కోసం ఇండోయూరోపియన్ జాతిని తీసుకున్నాను.

                  వికాస దృష్ట్యా ఈజిప్టు, సురియానీ లేదా సింధు జాతులు ఇండోయూరోపియను జాతి కన్నా వేల  సంవత్సరాలు ముందు ఉన్నాయి. కాని వాటిని తీసుకున్నట్లయితే రచయితకీ, పాఠకులకి కూడా ఇబ్బందులు ఎక్కువవుతాయి. ప్రతి కాలంలోని సమాజాన్నీ నేను ప్రామాణికంగా చిత్రించడానికి ప్రయత్నించాను. కాని మొదటి ప్రయత్నంలో తప్పులు దొర్లడం సహజం. ఇంకా ప్రామాణికంగా శుద్ధంగా చిత్రించడానికి ముందు ముందు రాబోయే రచయితలకి నా ప్రయత్నం దోహదపడతాయి అనుకుంటాను.

                                                         – రాహుల్ సాంకృత్యాయన్

Tenuginti Balarasalu Panuganti Sakshi Vyasalu – తెనుగింటి బాల రసాలు పానుగంటి సాక్షి వ్యాసాలు

110.00

12 అధ్యాయాలుగా సాగిన ఈ గ్రంథం – సాక్షివ్యాస విజ్ఞాన సర్వస్వంగా రూపొందింది. ఆయన విషయాలను వింగడించిన తీరు, యుక్తియుక్తంగా వాదాలను మలిచి చూపిన వైనం, లోతైన అవగాహన, సరళమైన వ్యక్తీకరణ ఇవన్నీ ఈ గ్రంథానికి వన్నెతెచ్చాయి. వర్తమాన తరానికి ఒక తాజా భోజనం వడ్డించినట్లుగా ఈ రచన ప్రాసంగిక రమ్యంగా వుంది.