YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 409–420 of 860 resultsSorted by latest
Warrior Shadow
₹120.00చారెడేసి కన్నులు, చేమంతి బంతులు
ముంగురుల ముద్దుమోము – మనస్సు నిలువనీయదే
బావికాడ కడవతో వయ్యారపు నీ నడక
గుండెపట్టి గిల్లిందే-ఒళ్ళు తిమ్మిరెక్కిందే
నా వంక చూడవా నడుమొంపు చిన్నదాన
ఒక్క నవ్వు నవ్వవా రంగపూరు నెరజాణ
ఇవ్వాళో రేపో విరిగిపోయేటట్లున్న చెక్కబల్లమీద ఎడమచేత్తో దరువు వేస్తూ పెద్ద గొంతుతో పాడటం మొదలు పెట్టాడు గంగారాం.
మాట్లాడేటప్పుడు మహా కరుకుగా ధ్వనిస్తుంది అతని కంఠం.
పాటలు మొదలు పెట్టిన మరుక్షణం మార్దవంగా మారిపోతుంది.
తలలు వంచుకుని తమదారిన తాము వెళ్ళిపోవాలనుకునే వారుకూడా ఆగిపోవాల్సిందే. పాట పూర్తి అయ్యేవరకూ ఆగి విని తీరాల్సిందే.
Panchukundham RAA!
₹200.00గూడెం గొంతు (లు)
కృపాకర్ మాదిగ ఈ పేరు వినగానే హృదయం పొనుగోటై పులకరిస్తుంది. కొండంత దండోరా ఉద్యమం కళ్ళముందు కదులుతుంది. ఇతడిని చూడగానే గూడెం గూడెమంతా గుండెలకు హత్తుకుంటుంది. “అన్నా! అంటూ ఆత్మీయంగా ఆకాశానికి ఎత్తుకుంటుంది. కృపాకర్ రాజకీయ నాయకుడు కాదు. అట్లా అని పెద్ద సినిమా స్టార్ కాదు. ఏమిటీ కృపాకర్ గొప్పదనం? దేశ వ్యాప్తంగా ఇంత గుర్తింపు ఎలా వచ్చింది? కృపాకర్ దండోరా ఉద్యమంలో చరిత్ర సృష్టించాడు. గొప్ప మేధావిగా పేరు తెచ్చుకున్నాడు. అత్యంత సంయమనంతో గడ్డుకాలంలో ఎదురొడ్డి నిలబడ్డాడు. వేలాది గ్రామాలను సందర్శించాడు. లక్షలాది కార్యకర్తలను కలిశాడు. వేలాది కిలోమీటర్లు కాలినడకన దశాబ్దాల తరబడి తిరిగాడు. ఏం తిన్నాడో, ఏం తాగాడో తెలియదు గాని అకుంఠిత దీక్షతో అంకితభావంతో వర్గీకరణ సాధించటానికి జీవితాన్నే కాదు, మళ్ళీ రాని యౌవ్వనాన్ని కూడా త్యాగం చేశాడు. మాదిగల కోసం, మాదిగల అనుబంధ కులాల సమాన హక్కుల కోసం, అనుబంధ కులాల ప్రతిఫలాల కోసం ప్రతిక్షణం తపించినవాడు. మానవీయ విలువల కోసం, అట్టడుగువర్గాల కనీస అవసరాల కోసం అధికార గణం మీద అహర్నిశలూ దండోరా వేసిన వాడు. హక్కులు సాధించినవాడు. అంటరాని వారి హక్కులకు భంగం కల్గినప్పుడు, పాలక వ్యవస్థ బాధ్యతలు మరచిపోయినప్పుడు కృపాకర్ కలాన్ని కొరడాలా ఝుళిపించాడు. తన పదునైన వ్యాసాలతో ప్రజల్ని జాగృతం చేశాడు. ఆలోచనాపరుల అభిమానాన్ని చూరగొన్నాడు. అందుకే అతను జాతికి జాతీయ నాయకుడయ్యాడు. జాతి రత్నంగా ప్రకాశించగలిగాడు. కృపాకర్ తన ఉద్యమ
పంచుకుందాం రా! .
Shivangi
₹200.00శివంగి
ఎదురుగా ఎటువంటి అడ్డంకి వున్నా, వెనుకా ముందూ చూసుకోకుండా ఎగిరి అవతలి పక్కకు దూకటం సమీరుడి అశ్వానికి వున్న పెద్ద అలవాటు.
కళ్ళేలను బిగించి పట్టుకున్నా, పళ్ళు బిగించి గట్టిగా అరిచినా, కొంచెంగా కూడా పట్టించుకోదు అది.
రాళ్ళు రప్పలు కాదు…దట్టమైన ముళ్ళ పొదలు ఇవి. కింద పడటం అంటూ జరిగితే కత్తులతో చీరినట్లు గాయాలు అవుతాయి. ‘జాగ్రత్తరా నాన్నా…’ మూడు బారల వెనుకగా తన వాహనాన్ని నడిపిస్తున్న సమీరుడి తండ్రి చిన్నగా హెచ్చరించాడు
సూర్యుడు పడమటి దిక్కుకి పడిపోతున్నాడు. పగటి సమయమంతా
శ్రాంతిగా తమతమ నెలవుల్లో పడుకుని వున్న జంతువులన్నీ వళ్ళు రుచుకుంటూ వేటలకు బయలుదేరే సమయం దగ్గరపడుతోంది.
మూడు క్రోసులుంది రహదారి… త్వరగా వెళ్ళకపోతే అడవిలో వుండగానే కటిపడిపోతుంది’ అంటూ కాలిమడమలతో తన అశ్వాన్ని కదిలించాడు మీరుడు. గట్టిగా సకిలించింది అది. అతని తండ్రి అనుమానపడుతున్నట్లుగానే ఎదుట న్న ఒక పెద్ద పొదమీద నుంచి ఎగిరి అవతలకి దూకింది.
Bidiyam Vaddu
₹300.00తమను తాము సవ్యంగా వ్యక్తీకరించుకోలేకపోతు, ఇతరులతో సమర్ధవంతంగా వ్యవహరించలేకపోతు, ఒంటరితనంలోకి కురుకుపోతూ, చొరవతీసుకోలేక, ఇబ్బందుల్ని ఎదిరించలేక, తపించుకు తిరిగే బిడియపు ప్రవృత్తిని ఈ గ్రంధం పటాపంచలు చేస్తుంది। బిడియపు తెరలు తొలిగించి నూతన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకోవడానికై నిరంతరం తోడ్పడే సమగ్ర గ్రంధం।
Navvulo Sivudunnaduraa!
₹180.00నిజం – నవ్వులో శివుడున్నాడు. నిరంతరం నవ్వేముఖంలో దైవం వుంటుంది . కొన్ని నవ్వులు ఉదయకిరణాల్లా హాయిహాయిగా వుంటయి. కొన్ని పొద్దెక్కిన సూర్యాకిరణాల్లా చురుక్కుమనిపిస్తాయి. కొన్ని నవ్వులు చంద్రుడి పై ప్రతిఫలించిన వెన్నెలమడుగుల్లా చల్లదనాలు పంచుతాయి. ఇంతకీ నవ్వులో శివుడున్నాడుగాని, శివుడులో నవ్వు కనిపించదు. ఆవేశం వచ్చినా , ఆనందం కలిగినా తాండవం చేస్తాడు.
Nenu Nadichina Bata
₹200.00ముందుమాట
నల్లూరి వెంకటేశ్వర్లు (అన్న) గారి స్వీయచరిత్రకు ముందుమాట రాయమని ఆయన కోరటం నాకు పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. నేను విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర బాధ్యుడిగా వున్నప్పటి నుండి నాకు నల్లూరితో పరిచయం. విద్యార్థిరంగ కార్యక్రమాలకు, ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు ఒంగోలు తరుచుగా వెళ్ళేవాడిని. ఆయన ప్రజానాట్యమండలి,
యువజన సమాఖ్య బాధ్యతలు తీసుకున్నప్పుడు కూడా తరుచుగా కలిసేవాళ్ళం. చర్చించుకునే వాళ్ళం.
నేను నడిచిన బాట” శీర్షికగా ఆయన జీవిత చరిత్ర ఆసక్తికరంగా వుంది. ఐతే | ఒక లోపం వుంది. ఆయన కుటుంబ జీవితం గురించి, సహచరి గురించి, పిల్లల గురించి సమాచారం లేదు. భార్యా పిల్లల సహకారం, మద్దతు లేకుండా ఆయన ఈ సుదీర్ఘమైన బాటలో విజయవంతంగా నడవగలిగేవారు కాదని నా అభిప్రాయం.
నిజాయితీ, నిబద్దత గల కమ్యూనిస్టు జీవితం ఎలా వుండాలో నల్లూరి వెంకటేశ్వర్లు గారి జీవితం అచ్చంగా అలా వుంది.
నల్లూరి స్వతహాగా కళాకారుడు. ఒకరకంగా ఆయన తన జీవితాన్ని, కళారంగానికి, కమ్యూనిస్టు పార్టీకి అంకితం చేశాడు. యువజన రంగంలో రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, ప్రకాశం జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా సుదీర్ఘకాలం విజయవంతంగా బాధ్యతలు నిర్వహించారు. సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు.
నల్లూరి వెంకటేశ్వర్లు గారిది చెరగని చిరునవ్వు. ఎవ్వరి మీద కోప్పడుతుండగా చూడలేదు. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎవరినీ పరుషంగా విమర్శించడం చూడలేదు. ఆయనకు బాధ కలిగినా తాను దిగమింగటం తప్ప తగువుకుగానీ, ఘర్షణకు గానీ పోలేదు. కాని కమ్యూనిస్టులకుండాల్సిన వర్గ దృక్పథం నుండి పక్కకు మరల లేదు. ఆయన జీవనశైలి, నిరాడంబరత, నిబద్ధత కారణంగా, అన్ని వర్గాల చేత గౌరవింపబడ్డాడు……..