YOU MAY ALSO LIKE…
-
Bharateeya Naastikavaadam - భారతీయ నాస్తికవాదం
₹300.00
-
Mein_Kampf -మెయిన్ కాంఫ్ (అడాల్ఫ్ హిట్లర్ ఆత్మకథ)
₹620.00Original price was: ₹620.00.₹558.00Current price is: ₹558.00. -
BHARATEEYA DARSANAM
₹350.00
-
BHAVADGEETA OKA AVALOHANA
₹180.00
Showing 1–12 of 14 resultsSorted by latest
Samkshipta Brahmana Charitra
₹250.00తెలుగు బ్రాహ్మణుల విస్తృతి, వైవిద్యం జగద్విదితం.
మూలాలన్ని ఒక్కటే అయినా వీరిలో శాఖలు అనేకం.
బ్రాహ్మణుల శాఖలు, గోత్రాలు, ప్రవరలు,ఋషులు
గోత్రపురుషుల గాధలు వీటన్నిటి సంక్షిప్త రూపం – ఈ పుస్తకం.
అక్షరక్రమంలో
గోత్రాలు, ప్రవరల పట్టిక, ఈపుస్తకంలో ఒక అనుబంధం.
బ్రాహ్మణులందరికీ ఇది అవస్యపటనీయం.
Mana Telugu Peddalu
₹400.00డాక్టర్ మల్లాది కృష్ణానంద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖలో అడిషనల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. శ్రీ కృష్ణానంద్ జిల్లా పౌరసంబంధాల అధికారిగా గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలలో పనిచేసారు. అనంతరం, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పేషీలో ప్రజా సంబంధాల అధికారిగా, ప్రెస్ సెక్రటరీ టు గవర్నర్ గా, గ్రామీణాభివృద్ధి సంస్థ, మున్సిపల్ కార్పొరేషన్ అఫ్ హైదరాబాద్. రాష్ట్ర పర్యాటక శాఖ, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లలో ప్రధాన పౌరసంబంధాల అధికారిగా పనిచేశారు.
పలు రంగాలలో విశిష్ఠ సేవలందించిన కీర్తిశేషులైన తెలుగు పెద్దల జీవన చిత్రాలపై శ్రీ మల్లాది రాసిన తెలుగు పెద్దలు, చరితార్థులు మన తెలుగు పెద్దలు గ్రంథాలు విశేష ఆదరణ పొందాయి.
– డా. మల్లాది కృష్ణానంద్
Chiranjeevi Indiraku – చిరంజీవి ఇందిరకు
₹60.001928వ సంవత్సరం వేసవిలో హిమవత్పరతమందలి మసూరిలో ఉన్న తన కుమార్తె ఇందిరకు జవహర్‌లాల్ నెహ్రూ జనపద మందు ఉంటూ ఈ జాబులు వ్రాశారు.
జననం : 1889. కాశ్మీర దేశస్థులు. తండ్రి ప్రఖ్యాత న్యాయవాది మోతీలాల్ నెహ్రూ, తల్లి : స్వరూపరాణి. జన్మస్థానం ప్రయాగ : ‘అలహాబాద్’ ఇంటివద్దే కొంతకాలం ప్రైవేట్‌గా చదువుకొని హారోలో, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాలలో విద్యనభ్యసించారు. అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించారు. 1918లో ఇండియన్ ¬మ్‌రూల్ లీగుకు కార్యదర్శి అయినారు. 1918 నుంచి అఖిల భారత కాంగ్రెస్ సభ్యుడుగా ఉన్నారు. 1921లో మొదటిసారి కారాగృహవాసాన్ననుభవించారు. రచనాకాలం నాటికి ఎనిమిది మారులు శ్రీకృష్ణ జన్మస్థానాన్ని చూచి వచ్చారు. 1929లో కాంగ్రెస్ కార్యదర్శి అయినారు. 1930లోను 1936, 37, 46లలోనూ కాంగ్రెస్ అధ్యక్షులయినారు. 1950 నుంచి 1955 వరకు కాంగ్రెస్ అధ్యక్షులుగా వున్నారు.
ఈయన గొప్ప ప్రజాస్వామ్యవాది. ఆంగ్లంలో అనేక గ్రంథాలను రచించారు. వీరి రచనలలో ‘సోవియట్ రష్యా’, ‘ప్రపంచ చరిత్ర’, ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ అన్నవి ప్రసిద్ధ రచనలు. 1947లో భారతదేశం స్వాతంత్య్రం పొందిన నాటి నుంచి 1964వ సంవత్సరం మే 27న మరణించే వరకు ఆయన భారత ప్రధానిగా ఉన్నారు. తరువాతికాలంలో ఆయన కుమార్తె శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశానికి ప్రధానిగా ఎన్నుకోబడి దేశాభివృద్ధికి ఎన్నో సంస్కరణలు చేపట్టారు.
Chirasmarana
₹70.00“చిరస్మరణ” నవల రచనకు సంబంధించి ఈ సందర్భంలో ఒకటి రెండు మాటలు వ్రాయడం అప్రస్తుత మనిపించదు. భారతదేశ శ్రమజీవులు కొనసాగిస్తూ వచ్చిన వర్గ సమారా ఇతిహాసం సుదీర్ఘమయింది. దాని గగుర్పాటు కలిగించే ఒక అధ్యాయం కేరళలోని కయ్యూరు రైతుల పోరాటం. అదే ‘చిరస్మరణ’ రచనకు ప్రేరణ. ఆ ఇతివృత్తం నా మనస్సును తాకినది, తట్టినది నా విద్యార్థి దశలో.
“చిరస్మరణ” లోని అనేక పాత్రలు వాస్తవ జీవితం నుంచే నవల పుటలకు నడిచి వచ్చాయి. అయితే అవి ఇక్కడ పాత్ర నిర్వహణ కోసం రంగ ప్రసాదన వేష భూషణాలను నిరాకరించలేదు. మాస్టర్ పాత్రకు మాధవన్ – మాధవేట్టన్ – స్ఫూర్తి, ప్రభుపాత్రకు కామత్. మరికొన్ని పాత్రల విషయంలో జనాభా లెక్కలు చెప్పమొగం వేయవచ్చు. కాని అలాంటివారు ఉండి ఉండరు – అని ఖరాఖండిగా చెప్పడం కష్టం. “చిరస్మరణ” జయప్రియతను సంపాదించాకపోయినా, అల్ప సంఖ్యాకులైన పాఠకులకు చాలా ఇష్టమయిందనితోస్తుంది.
– తిరుమల రామచంద్ర
Chittadavilo Chinna Pranulu – చిట్టడవిలో చిన్న ప్రాణులు
₹50.00అదొక చిట్టడవి. ఆ అడవి ఎప్పుడూ చిన్నా, పెద్దా జంతువుల అరుపులతో, రకరకాల పక్షుల కూతలతో సందడిగా ఉంటుంది. అక్కడక్కడా గుత్తులు గుత్తులుగా పూసిన పూల సువాసన అడవంతా తిరుగుతూ ఉంటుంది. ఆ అడవి మధ్యన చిన్న నీటి గుంట ఉంది. ఆ గుంట చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. ఒక కోతి ఆ చెట్ల కొమ్మల మీదకు దూకుతూ ఆకులన్నీ దూసి నీళ్ళలోకి విసురుతోంది. ”ఏమిటమ్మా ఆ దూకుడు? కాయలో పళ్ళో అయితే పిల్లలు తింటారు. ఈ ఆకులేమిటి… బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు” నీళ్ళలోంచి బయటకొచ్చి విసుగ్గా అంది ఓ తాబేలు.
”పళ్ళు కావాలని మర్యాదగా అడగవచ్చు కదా!” అంది కోతి. అంటూనే చకచకా అవతలి చెట్లమీదకి దూకేసింది పళ్ళ కోసం.
”కావు…కావు…” అని అరుచుకుంటూ ఆయాసంగా అక్కడ వాలింది ఓ కాకి.
కాకి పిలుపుకు నెమ్మదిగా ఒడ్డు దగ్గరకు వచ్చింది తాబేలు. ”ఏరి వీళ్ళంతా…అంతదూరం నుంచీ ఎంతో ఆత్రంగా ..ఎగురుకుంటూ వచ్చాను. తీరా చూస్తే ఇక్కడెవరూ లేరు”. అంది కాకి నిరాశగా….
Yuri Alekseyevich Gagarin – యూరీ అలెక్స్‌యేవిచ్ గగారిన్
₹30.00అంతరిక్షం నుండి భూగోళాన్ని చూసిన మొదటి మానవుడు యూరీ అలెక్స్‌యేవిచ్ గగారిన్.
ఆకాశం అద్భుతాలకు నిలయం. పగలు సూర్యుడు ఉంటాడు. రాత్రి నక్షత్రాలు వస్తాయి. పెరుగుతూ, తరుగుతూ చంద్రుడు వస్తాడు. అప్పుడప్పుడూ తోకచుక్కలు కనిపిస్తాయి. ఇవి అన్నీ ప్రాచీన మానవులకు ఆశ్చర్యపరిచాయి. క్రమక్రమంగా విజ్ఞానం వికాసం చెందుతూ ఆకాశంలోని వింతల గురించి అవగాహన కలిగించింది. ఆకాశంలో పక్షలు ఎరుగుతూ ఉంటాయి. వాటిలాగా ఎగిరి పోవాలని ప్రయత్నాలు చేశారు. మొదట వేడి గాలి గుమ్మటాలు ఆకాశంలో ప్రయాణించడానికి దారి చూపించాయి. తరువాత విమానాలు వచ్చాయి. భూమి నుండి 7 మైళ్ళ ఎత్తు వరకే ఇవి ప్రయాణం చేయగలుగుతున్నాయి. ఆకాశంలో గాలిలేనిచోటు ఉన్నది. అక్కడ ప్రయాణించడానికి ప్రత్యేకమైన సాధనాలు కావాలి. దానికోసం రాకెట్లు రూపుదిద్దుకున్నాయి. ఇవి గాలిలేని ప్రదేశాలలో కూడా ప్రయాణించగలుగుతాయి. వీటితో ఆకాశం చాలావరకు అందుబాటులోకి వచ్చింది. భూమి నుండి చాలాఎత్తు పోయిన తరువాత అంతరిక్షం ఉన్నది. దీనినే రోదసి అనికూడా అంటారు. అంతరిక్షాన్ని అందుకోవాలని, దానిలో ప్రయాణం చేయాలనీ ఆకాంక్ష పెరిగింది. దానికోసం కృత్రిమ ఉపగ్రహాలు, అంతరిక్షనౌకలు అవతరించాయి. ఇక అంతరిక్షంలోకి మానవులను పంపే కార్యక్రమం మొదలయ్యింది. వోస్టాక్ అనే అంతరిక్ష నౌకలో రాకెట్టు సహాయంతో, అంతరిక్షంలో ప్రయాణించగల సాహసి కోసం అన్వేషణ మొదలయ్యింది. యూరీ అలెక్సేయెవిచ్ గగారిన్ ఎన్నికయ్యాడు. గగారిన్ రష్యాకు చెందిన వాడు. అంతరిక్షంలో ప్రయాణించిన తొలి మానవుడు. అతడి ప్రయాణం మానవ విజయానికి చిహ్నం. ఆ వీరుడి గురించి, అతడి సాహసయాత్ర గురించీ ఈ పుస్తకంలో వివరిచబడింది.
Vijayaniki Aro Mettu – విజయానికి ఆరో మెట్టు
₹195.00మనిషి మంచిమనుగడకి, మరింత సుఖంగా బ్రతకడానికి, గెలుపుకి, తనను తాను తెలుసుకోవడానికి ముఖ్యమయిన ఆయుధం భారతదేశంలోనే ఉద్భవించింది. దాని పేరు ‘భగవద్గీత’. ”వారు నీ భార్య వలువలు విప్పారు. నీ ఇల్లు తగులబెట్టారు. రాజ్యం నుంచి నిన్ను తరిమికొట్టారు… లే… పిడికిలి బిగించు. కత్తి తీసుకో. వారిని హతమార్చి నీ పగ తీర్చుకో” అంటూ కృష్ణుడు అర్జునుడి ఆవేశం మీద ఆడుకోవచ్చు. కానీ అలా చెయ్యలేదు. మనిషి యుద్ధం ఎందుకు చెయ్యాలో తార్కికంగా చెప్పాడు. ఎన్నో జీవిత సత్యాల్ని విప్పాడు. కష్టాలకి దు:ఖ కారణాలు వివరించాడు. మనసు అశాంతికి, సంఘర్షణకు గురయినపుడు మానసిక వైద్యులు చేసేది. సైకోథెరపీ (టాక్ థెరపీ). ఈ నాటి మానసిక వైద్యుల కంటె ఎన్నో వేల సంవత్సరాలకు ముందే మానసిక ఆందోళనకు గురయిన అర్జునుడికి సైకోథెరపీ చేసిన మొట్టమొదటి సైకియాట్రిస్ట్ చరిత్రలో శ్రీకృష్ణుడే.
మనిషి తన జీవితకాలంలో సంపాదించుకోవలసిన ధైర్యం, సంపద, ఆరోగ్యం, కీర్తి, జ్ఞానం, శాంతి అనే ఆరు ఆస్తులను సముపార్జించటానికి భగవద్గీత ఏ విధంగా తోడ్పడుతుందో వివరించే పుస్తకమే ‘విజయానికి ఆరోమెట్టు’. త్యాగం, తత్వజ్ఞానాలను బోధించే భగవద్గీత ఉద్దేశ్యం కర్మఫలత్యాగం. ఫలితాన్ని ఆశించకుండా ఉండడం ఎలా సాధ్యమవుతుంది ? సమస్య ఎందుకు వస్తుంది ? ఎదురైన సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలి ? అంతిమంగా సాధించే ప్రయోజనాలేమిటి ? అనే విషయాలను అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లుగా గీతలోని శ్లోకాలసాయంతో సోదాహరణంగా వివరించిన యండమూరి వీరేంద్రనాథ్ ప్రతి అక్షరం ప్రతివాక్యం చాలా సూటిగా, స్పష్టంగా ఉంది. ”భగవద్గీతా ? ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే” అన్న స్థితినుంచి వచ్చేతరాన్ని పరిరక్షించుకోవటం కోసం రాసిన పుస్తకమిది.
అలనాటి అర్జునుడికి సైకోథెరపీ చేసిన కృష్ణుడిలాగే ఈ విజయానికి ఆరోమెట్టు ద్వారా వీరేంద్రనాథ్ తెలుగు సాహితీ ప్రపంచంలో మోడరన్ కృష్ణుడిగా నిలిచిపోతాడని, ఈ పుస్తకం చదివిన తర్వాత మీరనుకుంటే మే మేమీ ఆశ్చర్యపోము.
Palegadu – పాలెగాడు
₹120.00‘పాలెగాడు’ అన్న పదానికి అర్థం – పాలించేవాడు, పరాక్రమవంతుడు, శౌర్యవంతుడని, ఇది రాయలసీమ మాండలిక పదం. విజయనగర రాజులు రాయలసీమ ప్రాంతానికిగానూ కొంతమంది సామంతరాజుల్ని ఏర్పరిచి వారి ఏలుబడిలో ఉండేందుకు వ్యక్తి పరిధిని బట్టి వంద, రెండు వందల గ్రామాలను ఇచ్చి పాలింపజేశారు. అయితే వారి పాలన సామంత పాలనగా కాకా స్వతంత్ర పాలనగా ఉండేది. అలాంటి పాలెగాళ్ళ సంతతికి చెందిన వ్యక్తి రాయలసీమలో ‘రేనాటి సింహం’ గా పిలువబడే వ్యక్తి, ఒక సామూహక శక్తి ఉయ్యాలవాడ నరసింహరెడ్డి.
కుంఫీణీ ప్రభుత్వం కుటిలనీతితో, తన రాక్షస కబంధ హస్తాలతో భారతదేశాన్ని వశం చేసుకొని కిరాతక రాజ్యపాలన సాగిస్తున్న కాలంలో వారిపై 1846 లోనే విప్లవ శంఖం పూరించి, వారి అధికారుల్ని చంపి, భయభ్రాంతుల్ని చేసి రేనాటి సీమలో సంచలనం రేకెత్తించాడు. చారిత్రక సంఘటనలను వస్తువుగా స్వీకరించి రాసిన నవలలు గతంలో అనేకం వచ్చాయి. కాని అజీజ్ చిత్రించిన చారిత్రక నవల పాలెగాడు – నరసింహరెడ్డి సహసగాథ మన హృదయాలను తాకుతుంది. పుస్తకం తెరిచిన తర్వాత మూసివేయకుండా పాఠకులను చదివిస్తుంది.