-
Sri Varaha Maha Puranam
0₹700.00Sri Varaha Maha Puranam
భారతీయ వాజ్మయంలో పురాణాలు అత్యంత విశిష్టమైనవి. అవి లోకానికి మిత్రులవలె హితాన్ని ఉపదేశిస్తాయి. కాబట్టి “మిత్రసమ్మితములు” గా ప్రఖ్యాతి వహించాయి. పురాణాలు ప్రాచీనమైనవైనా ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ప్రకాశిస్తూ ఉంటాయి. అవి మన పురాతన విజ్ఞాన సర్వస్వాలు ( Encyclopaedias ) అటువంటి పదునెనిమిది పురాణాల్లో అగ్రగణ్యమైనది “శ్రీ వరాహ మహాపురణం”.
శ్రీ మహావిష్ణువు వరాహరూపమును ధరించి పాతాళ లోకము నుంచి భూమిని ఉద్దరించిన వృత్తాంతము ముఖ్య సంబంధము కలది, అయినందున ఈ పురాణమునకు వరాహపురాణము అనే పేరు వచ్చింది.
వరాహ పురాణానికి సౌకర పురాణం అని, ఆదివరాహ పురాణం అని పేర్లు కూడా ఉన్నాయి. శ్రీ మహావిష్ణు అవతారపు పేర్లతో ఉన్న మత్స్య, కూర్మ, వరాహ, వామన పురాణాలలో ఇది మూడవది. పురాణపురుషుడగు శ్రీ మహా విష్ణువు యొక్క ‘ఎడమ చీలమండలం’ గా ఈ పురాణం తెలుపబడినది. ఈ పురాణంలో విష్ణు సంబంధమైన అనేక వ్రతాలు, వాని మహత్యం, వివరణ కూడా లభ్యమవుతున్నది.
-
SRIKANAKADURGAMMA CHARITAMU
0₹252.00SRIKANAKADURGAMMA CHARITAMU
కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మావారుని గురించి తపస్సు చేసి, ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్ధిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనక దుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.
రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు
-
Andhra Pradesh Prajatheerpu
0₹300.00ఎన్నికలకు సంబంధించి పుస్తకాలు రాయడం అన్నది అంత తేలికైన విషయం కాదు. 1952 లో జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికలు మొదలు 2019 వరకు జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికల ఫలితాల వివరాలు, గెలిచినవారికి సంబందించిన విశేషాలు, వారికీ ఉండే రాజకీయ నేపథ్యం, పూర్వాపరాలు, గెలిచినవారి విశిష్టతలు మొదలైనవాటిని క్రోడీకరించి పుస్తకం తయారు చేయడం అంటే ఎంతో క్లిష్టమైన పని. అయినా రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తితో పాతికేళ్ల క్రితం ఈ పుస్తక రచనకు శ్రీకారం చుట్టడం జరిగింది.
– కొమ్మినేని శ్రీనివాసరావు