-
Mooka Pancha Sathi Telugu
0₹250.00Mooka Pancha Sathi Telugu
మూకపంచశతి (Mooka Pancha Sathi)
కాంచీపుర కామాక్షి దేవిపై మూక కవి రచించిన అద్భుతమైన 500 సంస్కృత శ్లోకాల కృతి. ఇది తెలుగులో తాత్పర్యాలతో (దోర్బల విశ్వనాథ శర్మ, కోటేశ్వర రావు వంటి వారి అనువాదాలు) లభిస్తుంది. కాటాక్ష, ఆర్య, పాదారవింద, స్తుతి, మందస్మిత శతకాలుగా విభజించబడిన ఈ పుస్తకం, దేవి కరుణను, సౌందర్యాన్ని వర్ణిస్తుంది.
-
Na Jeevita Katha Maxim Gorky
0₹600.00Na Jeevita Katha Maxim Gorky
ఇరుకుగా వున్న చీకటిగదిలో కిటికీకి దగ్గరగా నేలమీద మా నాన్న పడుకున్నాడు. తెల్లని దుస్తులు తొడుక్కుని అలా పడుకుని వుంటే యెంతో పొడుగరిలాగ కనబడ్డాడాయన. కాలివేళ్ళు, అదొక మోస్తరుగా ఒకదాని కొకటి యెడమ యెడమగా వున్నాయి. ప్రశాంతంగా గుండెలమీద పెట్టుకున్న మృదువైన చేతివేళ్ళు కూడా కొంకర్లుపోయున్నాయి. కళ్ళమీద వుంచిన నల్లని రాగి నాణేలు ఆయన ఉల్లాసపు కళ్ళను కప్పుతున్నాయి. దయతో ఉట్టిపడుతూండే ఆయన ముఖం నల్లబారిపోయింది, బిర్రబిగుసుకు పోయిన ఆయన పళ్ళు మెరుస్తూండడం చూచి నాకు భయం వేసింది.
అమ్మ ఆయన దగ్గర మోకాళ్ళమీద కూచుంది. అమ్మ వంటిమీద ఎర్ర గాగరా వొక్కటే వుంది, ఆమె అలా కూచుని పట్టులాంటి ఆయన జుట్టును నల్లని దువ్వెనతో నుదుటి మీద నుండి వెనక్కి దువ్వుతూంది. నేనా దువ్వెనతోనే పుచ్చకాయ తొక్కలను రంపంతో కోసినట్టు కోసేవాణ్ణి. మంద్రమైన గొంతుకతో ఏమిటేమిటో ఆమె అలా గొణుగుతూనే వుంది. ఆమె బూడిదరంగు కళ్ళు వాచిపోయి పెద్ద కన్నీటి బొట్టుల కింద కరిగిపోతూన్నట్టని పించింది నాకు.
మా అమ్మమ్మ నా చేయి పట్టుకుంది. అమ్మమ్మ స్థూలంగా గుండ్రంగా వుంది. పెద్ద తల, పెద్ద పెద్ద కళ్ళు, మాంసపు ముక్కలా ముక్కు, ఆ ముక్కు చూస్తేనే నాకు నవ్వొచ్చేది. ఆమె అంత నల్లగా వుండికూడా మృదువుగా అద్భుతంగా కనబడుతోంది. ఆమె కూడా యేడుస్తూనే వుంది. ఆమె యేడుపు అదొక విధంగా వుండి అమ్మ యేడుపుకి వెనక పాటలా వినడానికి ఇంపుగానే వుంది. ఆమె వొళ్ళు అంతా వణికిపోతూనే నన్ను నాన్న దగ్గరకి నెట్టుతూంది. నేను మాత్రం ముందుకు రాకుండా ఆమె గాగ వెనక దాగుకున్నాను. నాకు భయంవేసి యేమిటోలా వుంది……………………….Meeru Sreelu (36 Principles for Achieving Success in Telugu)
విభాగం-1
వదిలించుకోవలసినవి
“ఉద్ధరేద్ ఆత్మనాఆత్మానం నాత్మానం అవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ||”
(శ్రీమద్భగవద్గీత – అధ్యాయం-6 శ్లోకం -5)భావం: మనం మనల్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి మనల్ని మనమే దిగజార్చు కోకూడదు – (ఎందుకంటే) మన ఆత్మే మనకు మిత్రుడు, (కావచ్చు, అదే
మన ఆత్మ మనకు శత్రువు (గా మారవచ్చు)
మన ఆత్మ (అంటే మన మనస్సు), మన ఆలోచనలు, మన అలవాట్లు – ఇవే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. మన మనస్సు మనకు మిత్రుడిగా ఉండాలంటే చెడు అలవాట్లను వదలాలి. అలా వదలకపోతే, ఈ చెడు అలవాట్లు మన ఎదుగుదలకు ప్రధాన అడ్డంకిగా మారతాయి.
మనం నాజూగ్గా కనపడాలంటే, మన శరీరంలో ఉన్న అధిక కొవ్వును వదిలించుకోవాలి. అలాగే, చురుగ్గా తయారవ్వాలంటే, భయాన్ని, పిరికితనాన్ని, ఆత్మన్యూనతను, అభద్రతా భావాన్ని, ఒత్తిడిని, జాలిని మరియు కొన్ని అపోహలను వదిలించుకోవాలి.
ఈ విభాగం మనల్ని మనం ఎలా మార్చుకోవాలో, ఎలా మలచుకోవాలో చూపిస్తుంది. మన లోపాలను గుర్తించి, వాటిని ఎలా అధిగమించాలో కూడా తెలియజేస్తుంది………… -
Nalugu Devi Navarathrulu
0₹295.00Nalugu Devi Navarathrulu
దేవీ నవరాత్రుల విశిష్టత, పూజా విధానం, అమ్మవారి అవతారాల వివరాలతో కూడిన “నాలూగు దేవీ నవరాత్రులు” పుస్తకం, మల్లంపల్లి దుర్గా మల్లిఖార్జున ప్రసాద్ శాస్త్రి రచించినది అందుబాటులో ఉంది. ఈ పుస్తకం ప్యాపర్‌బ్యాక్ వెర్షన్‌లో లభిస్తుంది మరియు నవరాత్రుల సమయంలో చేయాల్సిన ప్రత్యేక పూజల గురించి వివరిస్తుంది.
-
-
Rugvedha Aryulu
0₹180.00మనం – మన పూర్వీకులు
నేడు మనదేశంలో మానవుని చూస్తున్నాం. అతని సాంఘిక, రాజకీయ, మున జీవితాన్ని ఎరుగుదుం, అతని ఆహారం, వేషభాషలు, నిత్యావసరాలు ఏమిటో మనకు తెలుసు. “మనకు సంబంధించిన ప్రతి విషయంలోనూ మార్పు జరుగుతూ వుంది. ఈ సంగతిని ఎవరూ కాదనలేరు. కాని ఆ మార్పు ఎంత తీవ్రంగా జరిగిందో తెలుసుకొనుట కషం. ఇందుకు నూరు సంవత్సరాల తేడాతో చారిత్రక కాలాన్ని, అంతకంటే ఎక్కువ తేడాతో చరిత్రకు పూర్వమున్న కాలాన్ని, సాంఘిక, ఆర్థిక, మతదృష్టితో పరిశీలిస్తే, మార్పు నమ్మకంగా తెలుస్తుంది. మనం క్రీ|| శ|| 1956 నుండి కాకుండా క్రీ॥ ఈ 1950 నుండి వెనక్కు పయనించుదాము. ఇక్కడ 1857 ను గురించి ఒకమాట చెప్పాలి.. 1857 లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. 1757 లో ప్లాసీ యుద్ధంలో విజయులైనందున మనదేశంలో ఆంగ్లరాజ్య స్థాపన జరిగింది. కాబట్టి చాలామంది మేధావులు •57ను చాలా చెడుగా భావిస్తారు. కాని 1657, 1557, 1457 మొదలైన సంవత్సరాల్లో అటువంటి అనిష్టాలు మనదేశంలో ఏమీ కానరావు. | క్రీశ 1950 1ఇప్పుడు మనం రాతియుగం, రాగియుగం, యినుపయుగం. తుపాకిమందు.
ఆవిరి యుగాలను దాటి పరమాణుయుగంలో ఉన్నాం. 2 వాయు మండలంపై మనకు అధికారముంది. గంటకు 500 మైళు వేగంతో పోయే విమానాలు ఆకాశంలో పరుగులు తీస్తున్నాయి. ఇక రైళ్ళు, మోటారు వాహనాల సంగతి చెప్పేదేముంది?
మనది ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ. 4మన గణరాజ్యానికి రాష్ట్రపతి డా|| రాజేంద్రప్రసాదు. ఆయన మనదేశ రాజధాని
ఢిల్లీలో వుంటారు. మనకు ముఖ్యమైన సమన్వయ భాష హింది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో అస్సామీ, బెంగాలీ, ఒరియా, తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, మరాఠీ, గుజరాతీ
మొదలైన సాహిత్య భాషలున్నాయి. ఇవే కాకుండా మైథిలీ, మాగధీ, భోజపురి, ప్రజ, మాళవీ, రాజస్థానీ, కౌరవీ, పహాడీ మొదలైనవి కూడా సాహిత్య భాషలే.
(అవికూడా సాహిత్య భాషలవుతున్నాయి.) 6. మనం పెట్టుబడిదారీ వర్గ వ్యవస్థలో వున్నాం. 7. మనచేతిలో రాజ్యాధికారాన్ని అట్టి పెట్టుకొనుటకు యుద్ధ విమానాలు, అణు
బాంబులు పరమాస్త్రాలుగా వున్నాయి. భీషణ ఫిరంగులు, మెషినుగన్నుల సంగతి
చెప్పనవసరం లేదు. 8. మనదేశంలో హిందూ మతం, ఇస్లాం మతం ముఖ్య మతాలు. కాని
విద్యావంతులకు ఆ మతాలపై పూర్వంవలె విశ్వాసం లేదు. 9. చదువుకొన్నవారు ఆహార పానీయాల్లో అంటును పాటించరు. వివాహాదుల్లో
కూడా కులగోత్రాలు కూలుతున్నాయి. 10. సాహిత్యాకాశంలో రవీంద్రుడు,
జయశంకరప్రసాదు అస్తమించారు. హిందీలో నిరాలా, సుమిత్రానంద పంతు యిప్పుడు కూడా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నారు.
-
Sraavani
0₹275.00అదొక మహోజ్వల మహాయుగం.
నేటికి రెండు వేల సంవత్సరాల నాటి ఆంధ్రుల పరాక్రమ గాధ
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే క్రీస్తుశకం 78వ సంవత్సరం.
శక కర్త, శక హర్త అయిన శాలివాహన యుగపురుషుడు
గౌతమీపుత్ర శాతకర్ణి మొత్తం భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలమది.
నేటి గుంటూరు జిల్లాలోని అమరావతి వారి రాజధాని.
ఆనాటి ఆంధ్రుల సాహిత్యానికి సంస్కృతీకి.
నాగరికతకు అద్దం పట్టిన నవల శ్రావణి.
ఇదొక గద్య ప్రబంధం.
షడ్రసోపేతమైన విందు భోజనం.
నవరసభరితమైన వచన మహాకావ్యం.
-
SREE DATTATREYA GURUCHARITRA
0₹300.00SREE DATTATREYA GURUCHARITRA
శ్రీ దత్తాత్రేయ మహాత్మ్యమ్ అనే పేరుతో సుమారు అయిదువేల శ్లోకాల గ్రంథం శకాబ్దం 1818 లో అంటే క్రీ. శ. 1896 లో ముద్రితమయ్యింది. అప్పటినుంచీ భారతదేశంలో అనేక కుటుంబాలవారికి ఇది పారాయణ గ్రంథమయ్యింది. దీని ముగింపులో – “ఇదం పుస్తకం బెళగాంవాఖ్యపుర్యాo సావంతోపాహ్యయేన అబాజీరామచంద్ర ఇత్యనేన స్వకీయ ‘శ్రీరామతత్త్వప్రకాశాఖ్య’ ముద్రణాలయే ముద్రయిత్వా ప్రకాశ్యం నీతమ్’ – అని పెద్ద అక్షరాల్లో ఉంది. తాళపత్రగ్రంథాల పద్ధతిలో అడ్డంగా అచ్చోత్తించిన గ్రంథమిది. దీనిలో అక్కడక్కడా కొన్ని శ్లోకాలకు లఘుటీకకూడా ఉంది. పుటలో పైన క్రిందా ఈ టీకను సన్నటి అక్షరాల్లో ముద్రించారు.
– ఆచార్య బేతవోలు రామబ్రహ్మం -
Sri Bhagavadgeeta – శ్రీ భగవద్గీత By Tadanki Venkata Lakshmi Narasimharao
0₹300.00Sri Bhagavadgeeta – శ్రీ భగవద్గీత By Tadanki Venkata Lakshmi Narasimharao
-
-
-