-
How To Win Friends And Influence People
₹96.00Do you feel stuck in life, not knowing how to make it more successful? Do you wish to become more popular? Are you craving to earn more? Do you wish to expand your horizon, earn new clients and win people over with your ideas? How to Win Friends and Influence People is a well-researched and comprehensive guide that will help you through these everyday problems and make success look easier. You can learn to expand your social circle, polish your skill set, find ways to put forward your thoughts more clearly, and build mental strength to counter all hurdles that you may come across on the path to success. Having helped millions of readers from the world over achieve their goals, the clearly listed techniques and principles will be the answers to all your questions.
-
Iduguru Lofarlu – ఐదుగురు లోఫర్లు
₹100.00సాధారణంగా జైలు నుండి విడుదల అయిన వ్యక్తి బాగా చిక్కిపోయి నీరసంగా బికారిలా కనిపిస్తాడు. జైలు నుండి విడుదల అయిన తాంతియా అలాకాక, వెనుకటికన్న పిక్కబలిసి, మానమర్యాదలు గల గౌరవనీయుడుగా కనిపిస్తున్నాడు. జేబులో నలభై ఎనిమిది రూపాయల పండ్రెండణాల నగదుతో, ముఖమంతా ప్రసరించిన ముసిముసి నవ్వులతో అతను జైలు నుండి బయట అడుగుపెట్టాడు.
అలా బయటకు రాగానే ”యిప్పుడింక నేను దుర్వృత్తుల జోలికి పోను మాహిమ్‌లో ఏ బంకో తీసుకొని మంచి చిల్లర వ్యాపారమేదైనా చేస్తాను” అని స్నేహితులతో చెప్పాడు తాంతియా….
పేజీలు : 120
-
Kaala Rekha
₹135.00ప్రజా భారత ఐతిహాసికుడు ఒక సహస్రాబ్ది దార్శనిక కవి శేషేంద్ర పునఃసంస్మరణ కవిత్వానికి తక్షణ ప్రయోజనం, కవిత్వాన్ని విని శ్రోత ఒక ఆత్మిక తృప్తిని పొంది వ్వాప్ అనడం, భోజనం తిని గుర్రున త్రేన్చినట్టు. అయితే తిన్న ఆన్నం జీర్ణమై శరీరాన్ని, మెదడును నడిపే ఇంధనమై రక్తప్రవాల్లోకి ప్రవేశించి, నఖశిఖ పర్యంతం వేలాది రక్తనాళాల్లో ప్రవహిస్తూ క్రమంగా మనిషిని శారీరకంగా మానసికంగా బలిష్టుణ్ణి ఎలా చేస్తుందో ఎలా సజీవునిగా నిలబెడుందో అలాగే కవిత్వం శ్రవణంచేత ప్రభావితుడౌతాడు. అలంకార బింబ ప్రతీకలు శ్రవణేంద్రియాల ద్వారా మనిషిలోని రక్తంలోకి ప్రవేశించి అనదుల్లో కరిగిపోయి సమస్త శరీరవ్యాప్తమౌతాయి. రక్తనిష్టమౌతాయి. అలా ఒక తరం మానవుల్లో రక్తనిషమైన అలంకార బింబ ప్రతీకలు తదనంతర తరానికి జన్యుకణాల ద్వారా సంక్రమింపజేయబడతాయి. అలా తరతరాలు రక్తనిష్టంగా సంక్రమింపజేయబడి, అవి మనిషి ఆలోచనల్నీ, అలవాట్లనీ, చర్యల్నీ, స్వభావాన్సీ రూపాయితం చేస్తాయి. ఒక దేశపు పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు ఆ దేశపు ప్రజలకు ఇదే చేశాయి. ఆ పార్యంతిక ఫలాల్నే ఆ దేశపు సంస్కృతి అనీ, నాగరకత అనీ అంటారు. ఈ రెంటికీ కవులే జనకులు. ఇదే కవిత్వం కలిగించే శాశ్వత ప్రయోజనం. | శేషేంద్ర, కవిసేన మానిఫెస్టో, నేటి కవిత్వం – వివిధ దృక్పథాలు- ఆగస్ట్, 1994).
1977 లో ప్రథమ ముద్రణగా వెలువడ్డ ఆధునిక కావ్యశాస్త్రం ‘కవిసేన మానిఫెస్టోను వెలువరిస్తూ శేషేంద్ర ‘అపూర్వ చైతన్య వ్యాప్తి కోసం ఐతిహాసిన పరిస్థితుల్లో ఆవిర్భవించిన | ఒక కవితోద్యమ పత్రమనీ’ మానిఫెస్టోను అభివర్ణిస్తూ… ప్రాచీన ప్రాక్ పశ్చిమ కావ్యతత్త్వ చింతన, ఆధునిక కావ్యతత్త్వ చింతన, మార్క్సిస్ట్ కావ్యతత్త్వ చింతన, అనే చింతనా చతుష్టయ శాఖల్ని కలిపి పరిశీలించి ఆ నాల్గింటిలో ఉన్న ఆశ్చర్యజనక అభిన్నతనూ, ఐకమత్యాన్ని……………
-
Kadapa Jila Vignana Deepika
₹300.00చరితకు దర్పణంగా నిలిచే పుస్తకం
భూగోళం ఒక్కటే అయినా విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, వివి జీవన విధానాలు, సాంప్రదాయాలు విస్తరిల్లి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజాలు అనేక ప్రత్యేకతలతో జీవిస్తున్నాయి. ఆహారవిహారాది అం? నుండి ఆధ్యాత్మిక సంగతులు దాకా ప్రతి అంశంలోనూ విభిన్నత ఆయా సమాజ సుస్పష్టంగా కనిపిస్తాయి. మానవ వికాస చరిత్రను అధ్యయనం చేస్తే యుగాలు తరబడి జరిగిన పరిణామాలు కూడా ఆశ్చర్యపరుస్తాయి. కోటానుకోట్ల సంవత్సరాల నుండి జరిగిన జీవపరిణామం శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేసినప్పుడు ఏక కణ జీవి నుండి నేటి మనిషి దాకా జరిగిన పరిణామాలు భారతదేశ సంప్రదాయ శాస్త్రాల
కోణం నుండి చూసినప్పుడు చాలా భిన్నంగా కన్పిస్తాయి. వేద పురాణాలు, కావ్యశాస్త్రాలు బోధించిన విషయాకడప లు శాస్త్ర పరిజ్ఞానంతో విభేదిస్తుంటాయి. అయినా మనషులు సంప్రదాయాల్ని ఆరాధిస్తూనే ఆధునిక శాస్త్ర సాంకేతికత అందించే | సౌకర్యాలను అనుభవిస్తున్నారు. ఇంతటి సంక్లిష్ట భావాలు కలిగిన మానవ సమాజం | గురించి దాని చరిత్ర గురించి రాయాలంటే అంత సులువైన పని కాదు. ఇన్ని మాటలు ఎందుకు చెబుతున్నానంటే సంప్రదాయ పునాదులమీద ఆధునిక జీవనం గడుపుతున్న చారిత్రాత్మక గడ్డ అయిన ‘కడప’ గురించి రాసిన “కడపజిల్లా విజ్ఞాన దీపిక” అనే పుస్తకంపై నాలుగు మాటలు చెప్పడానికే. మిత్రుడు డా.చింతకుంట శివారెడ్డి మాతృగడ్డ రుణం తీర్చుకోవడానికై అన్నట్లు కడప జిల్లా ప్రత్యేకతలను పూసగుచ్చి ఒక గ్రంథంగా సమాజానికి అందిస్తున్నాడు. ఒక బృహత్తర కార్యక్రమంగా శివారెడ్డి సాగించిన విషయ సేకరణ, పరిశీలన, విశ్లేషణలు ‘కడప చరిత్ర’కు కొత్త గొంతును ప్రసాదించింది. కడప నామరూప చరిత్రతో మొదలు పెట్టి కడపయాసపై,
కడపజిల్లా విజ్ఞాన దీపిక
-
-10%
Maha Prasthanam – మహా ప్రస్థానం
Original price was: ₹80.00.₹72.00Current price is: ₹72.00.”మీ కోసం కలం పట్టి ఆకాశపు దారులంట అడావుడిగ వెళ్ళిపోయే అరచుకుంటు వెళ్ళిపోయే జగన్నాధుని రథచక్రాల్, భూ మార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను ….” అని ప్రకటించినవాడు శ్రీశ్రీ. ఓ వ్యధావశిస్టులారా ! ఏడవకండి, ఏడవకండి, వస్తున్నాయొస్తున్నాయి, జగన్నాధుని రథచక్రాల్ వస్తున్నాయని ఆశ్వాసమందించినవాడు శ్రీశ్రీ. 40 కవితలతో వెలువడిన ‘మహాప్రస్థానం’ తెలుగు సాహిత్యంలో ఓ మైలు రాయి. ఓ మలుపు. ఓ డైనమేటు. ఇప్పటికి 26 ముద్రణలు పూర్తి చేసుకోవటమే దీని విశేష ఆదరణకు నిదర్శనం. 98 పుటల ఈ పేపర్‌బ్యాక్ పుస్తకానికి ‘మా గోఖలే’ కవర్ డిజైన్ అందించారు.
-
-
Premalekhalu
₹270.00ప్రేమలేఖలు అంటే ప్రియమైన మిత్రులకి రాయటం. పురుషులుగాని స్త్రీలుగాని సెక్స్ భేదమైనప్పుడు ఆ ప్రేమలోవలెనే లేఖలో కూడా రొమాన్స్ పొయెట్రీ, టెండర్ నెస్ ఎక్కువగా కనిపిస్తాయి. లేఖలు ఎక్కువ అందంగా ఆకర్షకంగా ఉంటాయి. ప్రేమలేఖలు కానివి, పోస్ట్ లో రోజువెళ్ళే లక్ష ఉత్తరాలు – అన్నీ చెత్త. చికాకు వ్యవహారాలకోసం, దొంగ మర్యాదలకోసం, తగాదాలు, నోటీసులు – ఈ రకాలు.
మొత్తానికి విసుక్కుంటో రాసేవీ, ఏడుస్తో చదివేదిగా ఉంటాయి. వాజ్మయంలో లేఖకి స్థానం ఉండాలంటే అది ప్రేమలేఖ కావాలి. లేఖ కంటిన్యువస్ థాట్ గా ఉండాలి. చాలా ప్రియమైన మిత్రుడితో చల్లని కాలవ ఒడ్డునగాని, వెచ్చని గదిలో టీ, సిగరెట్ల ముందుగాని, కూచున్నప్పుడు ఎట్లా మాట్లాడతాము! అట్లా ఉండాలి ఉత్తరం. అంత నాచురల్ గా ఉత్తరం చదివే వారికి ఆ రాసేవారిని కలుసుకుని మాట్లాడుతున్నాము అనిపించాలి. ఉత్తరం చేతుల్లో పట్టుకుని చదివేవారు డే డ్రీమ్స్ లోకి, కలలోకి వెళ్ళకపోతే, ఆ ఉత్తరం వొచ్చి ప్రయోజనం లేదు.
-
-
Ushasri Rachanalu
₹750.005 BOOKS OF SETఇంటింటా వుండవలిసిన ఉషశ్రీ గారి రచనలుఉషశ్రీ రామాయణంఉషశ్రీ భారతంఉషశ్రీ భాగవతంఉషశ్రీ భగవద్గితఉషశ్రీ సుందరకాండఅఖిలాంద్ర శ్రోతలను తన కంచు కంఠంతో రేడియో తరంగాల ద్వార ఉర్రుతలుగించిన సాంప్రదాయ ఘనవాచస్పతిఉషాశ్రీగారిచే ఫై రచనలు అన్ని సరళ వచనములో (అందరు తేలికగా చదువుకొనేలా) వ్రాసారు.