-
Homo Deyus Repati Sankshiptha Charitra
₹345.00హోమో సేపియన్స్ హోమో డేయుస్ గా మారుతుంటే మనకు మనం ఎటువంటి భవితవ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం?
పరిణామక్రమం యొక్క ప్రధాన శక్తీ – స్వాభావిక ఎంపిక – తెలివైన రూపకల్పనకు దారి ఇస్తుంటే మానవుల భవితవ్యం ఎలా మారుతుంది?
గూగుల్ ఇంకా ఫేస్ బుక్ లు మన రాజకీయ ఇష్టాయిష్టాలను గురించి మనకు తెలిసినదానికన్నా ఏక్కువగా తెలుసుకుంటే ప్రజాస్వామ్యం ఏమవుతుంది?
పేలుసయినా భూగ్రహాన్ని కడకు మానవజాతిని మన స్వoత విధ్వంసక శక్తుల నుండి ఏ రకంగా కాపాడుకుంటాము?
ఈ పుస్తకంలో ప్రొఫెసర్ పరారీ ఇటువంటి ప్రశ్నలను మన ముందు ఉంచుతారు. వాటికీ వీలైన జవాబులను ఆసక్తి కలిగించే, ఆలోచనలు పుట్టించే పద్దతిలో వెతుకుతారు.
-
Ammaki Adivaram Leda – అమ్మకి ఆదివారం లేదా
₹180.00అమ్మ’కి ఆదివారం లేదా? – రంగనాయకమ్మ (50 కథల సంపుటి)
ఇందులో యాభై కథలు ఉన్నాయి. ఈ సంపుటి ‘అమ్మ’కి ఆదివారం లేదా? అన్న టైటిల్‌తో వెలువడింది. గృహిణులు ఇంటి పనులకీ వంట పనులకీ వారంలో ఒకరోజు స్వస్తి చెప్పి విశ్రాంతి తీసుకునేందుకు వీలు కల్పించాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యురాలు సరోజ్ కపర్దే లోగడ ఒక బిల్లును ప్రతిపాదించారు. ఇల్లాళ్లకు వారానికి ఒకనాడైనా విశ్రాంతి అవసరమన్నది సదరు బిల్లు ఉద్దేశ్యం. అయితే రంగనాయకమ్మగారి వాదన అందుకు భిన్నం. ఈ బిల్లుకు సంబంధించిన వార్తని చూశాక ఆమె ‘అమ్మకి ఆదివారం లేదా? అన్న కథ రాశారు. ఒకరోజు సెలవుతోనే అంతా చక్కబడిపోయి సమస్యలు తీరుతాయా? అని ఆమె ప్రశ్నిస్తారు.
”ఆడా మగా సమానం అవ్వాలంటే సరైన ఏకైక సూత్రం ఏమిటో తెలుసా? ఇద్దరికీ బైటిపనీ, ఇద్దరికీ – ఇంటిపనీ! అదీ సూత్రం. బైటిపనికే సెలవులు వుంటాయి. అవి ఇద్దరికీ వుంటాయి. ఇంటిపనికి సెలవులుండవు” – అంటూ వేణు పాత్ర ద్వారా చెబుతారు రంగనాయకమ్మ గారు. ఇక చిన్నపిల్లల్ని ముసలివాళ్లకి యిచ్చి పెళ్లిళ్లు చేయటాన్ని నిరసిస్తూ రాసిన కథ ‘సంస్కరణ’. ‘డబ్బు’ కథ కట్నం సమస్యని చర్చిస్తుంది. ”కట్నం సమస్యలాగా కనబడే సమస్యంతా ఆస్తి సమస్యే”నంటుంది ఇందులో ఒక పాత్ర. ఇక సంకలనం మొత్తంలోకీ ఎన్నదగినదీ, చెప్పుకోదగినదీ అయిన కథ ‘కుట్ర’. భారతదేశంలో ఇంకా విప్లవం రాకపోవడానికి ఏకైక కారణం అర్థంకాని విప్లవకారుల తెలుగు రాతలేనని తీర్మానించి వారికి జడ్జిగారు పదేసేళ్ళు జైలుశిక్షలు వేసే కథ ఇది.
పెళ్లి చేసేశాం, కథా – జీవితం, మీటింగ్ పెళ్ళి, స్త్రీ, ఆర్తనాదం, ఆ రాత్రి, వానరాత్రి, అమ్మ, తల్లిమనసు, తృప్తి, క్షమ, దొంగ వొస్తే బాగుణ్ణు!, సుబ్బారావు ప్రేమకథ, ఆశ్చర్యం!, లంచం, బడిమానేశావేం? (చిన్న పిల్లల నాటిక), పార్వతమ్మ, కవిగారూ – కుర్రాళ్ళూ లాంటి మంచి కథలు ఈ సంపుటిలో వున్నాయి.
రాయల్ సైజు బాండ్. -
Anandam 24×7
₹150.00అతి సరళ, అసాధారణ ఆనందశోధనే ఈ ‘ఆనందం 24 * 7’
ఈ పుస్తకంలో ఏ మతమూ లేదు. ఏ ఆచార క్రియలూ అందించబడలేదు. ఇక్కడ ఏ ప్రగాఢ ధ్యాన ప్రక్రియలూ వివరించబడలేదు. ఎటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియల ప్రస్తావనా లేదు. ఇది మార్గనిర్దేశం చేసే పుస్తకం కాదు. ఇది సెల్ఫ్ హెల్ప్ పుస్తకం కాదు. ఇది వెంటనే పనిచేసే ఒక ఆనంద సూత్రాన్ని మీకందించదు. కాని, మీ అంతట మీరే ఆనందాన్ని ప్రత్యేక్షంగా అన్వేషించేలా తప్పకుండా ప్రేరేపిస్తుంది.
ఆనందం గురించి సద్గురు అందించిన సందేశాలకు అనుగుణంగా అల్లబడిన రోజూవారీ జీవితానికి సంబంధించిన చిన్న చిన్న కథలు మిమ్మల్ని సద్గురుతో పాటు ఆనందపు అలల మీద ఒక అద్భుత రోలర్ కోస్టర్ రైడ్ కి తీసుకేలతాయి. భావ వ్యక్తీకరణలో సద్గురుకి గల అసాధారణ స్పష్టత, ఆయన అద్భుత చమత్కార, పరిశీలనా శక్తులు, అలాగే అత్యంత ప్రగాఢ అంశాలనైనా సులభంగా, నేరుగా వివరించగలిగే ఆయన నైపుణ్యంతో నిండిన ఈ పుస్తకం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించే వారందరి కోసం.
-
Andhrapradesh Dharmika Mariyu Hindumatha Samsthala Mariyu Dharmadaya Chattamu, 1987
₹270.00ధార్మిక, మత సంస్థలు తృప్తికరముగా నిర్వహింపబడక పోవుచుండుట వలనను, వాటి ఆస్తుల నిర్వహణకు ప్రస్తుత మత లౌకిక ఆచారములను సంతృప్తిగా పాటింపబడుటకు, ఆంధ్రప్రదేశ్ ధార్మిక, హిందూ మత సంస్థల మరియు ధర్మాదాయముల చట్టము, 1966లోను, తిరుమల తిరుపతి దేవస్థానముల చట్టము, 1979లో నున్న నిబంధనలు అందుకు సరిపోవునంత మేరకు లేకపోవుటవలన, ప్రభుత్వము తిరుమల తిరుపతి దేవస్థానములతో సహా అన్ని సంస్థల ధర్మాదాయముల ఆస్తులను సమర్ధవంతముగా నిర్వహింపబడుటకు, నిధులను అర్ధవంతముగా వినియోగింప బడుటకు, ట్రస్టీలు తమకు వంశపారంపర్యానున్న ఆధారముతో చేయుచున్న క్లెయింలను, ట్రస్టీల ఎంపికకు వారి నియామకమునకు మరియు, వారు ప్రవర్తనా నియమావళిలో పాటించవలసిన విధానములను, దేవాలయములలో వంశపారంపర్యానున్న అర్చకుల మిరాసీదారుల మరియు యితర అధికార సిబ్బంది పొందుచున్న హక్కుల స్వభావము, ఆగమ శాస్త్రానుసారము, సాంప్రదాయానుసారము అట్టి సిబ్బంది పూజలు, పునస్కారములను నిర్వహించుటకు వారికి ముట్ట చెప్పవలసిన ప్రతిఫలము, మరియు ధర్మాదాయశాఖ సాధారణ పనితీరుపై తగిన మార్గదర్శక సూత్రములను సూచించుటకు ప్రభుత్వము న్యాయమూర్తి చల్లా కొండయ్య కమీషన్ ను యేర్పాటు చేసింది. కమీషను తన రిపోర్టును 28.2.1986నాడు ప్రభుత్వమునకు అందచేయగా ప్రభుత్వము దానిని పరిశీలించి కొన్ని మార్పులతో ఆ రిపోర్టును ఆమోదించింది.
-
Annamalaiku Ardhamaindi Mari Manakemaindi?
₹70.00అరుణాచల శ్రీ రమణులు – అన్నామలైస్వామి గురుశిష్య సంబంధం విశిష్టమైనది. గురువు, శిష్యనకు నేర్పవలసింది నేర్పాడు. ఇక తనని అంటి పెట్టుకొని ఉండవద్దు అని పంపించి వేశాడు. పక్షికి రెక్కలొచ్చేంత వరకే తల్లి కాపాడుతుంది. పసి పిల్లవాడు తల్లి వొళ్లో ఆడుకోవడం కొంతకాలం వరకే. ఆ తర్వాత ప్రతి ఒక్కరు, ఎదగాలి. ముందుకు సాగాలి.
పదేళ్ల తర్వాత ఆశ్రమం బయటకి వచ్చిన అన్నామలై స్వామి , ఏకాంత జీవనం గడుపుతూ, తనకు తెలిసింది పదిమందికి భోదిస్తూ సుమారు ఎనభైతొమ్మిదేళ్లు బ్రతికాడు.
శ్రీ రమణులు అన్నామలైని అడుగడుగునా మలిచిన తీరు, సాధకులకు ముచ్చట గొల్పుతుంది. అన్నామలై స్థానంలో మనల్ని మనం ఊహించుకుంటే, ఈ ఆత్మ విద్యను ఎంత సుళువుగా నేర్వగలమో తెలుస్తుంది.
-నీలంరాజు లక్ష్మీప్రసాద్.
-
-
Bahya Shakti: Antar Shakti
₹150.00మనిషి ఏమై వుండాలో అదే అయి వుంటే జంతువులు అతణ్ణి ఆరాధించి వుండేవి.
– హెన్రీ ఏమియల్ (1812-1881)
జంతువులు తర్కించగలవా అని అడగకు. మాట్లాడగలవా అని ప్రశ్నించకు. అవి బాధ పడగలిగి వున్నాయా లేదా అనేది ప్రశ్న.
– జెరెమీ బెంట్‌హోమ్ (1748-1842)
ప్రకృతితో దోషమారోపించకు; అది తన పాత్రను అద్భుతంగా పోషించింది. నీ పాత్రను నువ్వు తిన్నగా పోషిస్తే చాలు.
– జాన్ మిల్టన్ (1608-1674)
స్వేచ్ఛా జీవికి సంకెళ్ళు వుండవు. స్మృతులు, జ్ఞాపకాలు (అంటే గతకాలం)| గానీ, కోర్కెల సంకెళ్ళు (అంటే భావి కాలం)గానీ వుండవు.
నీదైన ఈ క్షణాన్ని జీవించడాన్ని నిరోధిస్తున్న నిజమైన సంకెళ్ళు ఇవే.
– రజనీష్
-
-
English Keekaranyamloki Pravesinchandi – ఇంగ్లీష్ కీకారణ్యంలోకి ప్రవేశించండి
₹150.00ఇంగ్లీషు కీకారణ్యంలోకి….
ప్రతీ పరాయిభాషా ఒక కీకారణ్యమే, చిన్నదో పెద్దదో! ఆ కీకారణ్యంలోకి ప్రవేశించే ఏకైక మార్గం, దాని నియమాల్ని నేర్చుకుంటూ వెళ్ళడమే. ఆ నియమాల్ని, మాతృభాషలో వుండే నియమాలతో పోల్చుకుంటూ కూడా వెళ్ళాలి. భాషని నేర్చుకోవటానికి దాని వ్యాకరణంతో సంబంధం లేని సులువైన మార్గాలేవి వుండవు. అలాంటి ‘కిటుకు’లేవో వుంటాయని ఎన్నడూ భ్రమ పడకూడదు. భాషని నేర్చుకోవాలని నిజంగా కోరిక వుంటే, దాని వ్యాకరణం మీద కూడా ఇష్టం కలుగుతుంది. అయితే, వ్యాకరణ నియమాలు తెలుసుకోగానే ఆ భాషని అనర్గళంగా మాట్లాడగలమని అర్థం కాదు. వ్యాకరణం అనేది భాషలోకి ప్రవేశించడానికి సాధనం మాత్రమే. ఇక మిగిలినదంతా తర్వాత జరిగే కృషిమీదే ఆధారపడి ఉంటుంది.
కానీ, వ్యాకరణ నియమాలు తెలియడంవల్ల వెంటనే జరిగే మేలు ఏమిటంటే, ఇంగ్లీషు పుస్తకాలు చదివితే అర్థమవుతూ వుంటాయి. ‘ఇంగ్లీషు పుస్తకాలు’ అంటే, విద్యార్థుల స్థాయికి తగిన పుస్తకాలు. అంటే, విద్యార్థులు చదివే ఇంగ్లీషు పాఠాలు. అంతకుముందు అర్థంకాని వాక్యాలు, అక్కడవున్న నియమాలు తెలిసినప్పుడు ఎంతో తేలికగా అర్థమవుతాయి. అప్పుడు, ఆ భాష అంటే భయం పోతుంది. పైగా, కొత్త భాషని అర్థం చేసుకోగలుగుతున్నామనే ధైర్యం, సంతోషం ప్రారంభమవుతాయి. క్రమంగా అ భాషలోకి ప్రవేశం జరిగిపోతుంది.
ఒక పరాయిభాష పట్టుపడిందంటే, ఆ భాషలో నియమాలు నేర్చుకుంటేనే అది జరుగుతుంది. లేకపోతే, అది ఎవ్వరికీ, ఎప్పటికీ, సాధ్యం కాదు. కాబట్టి, ఒక భాష నేర్చుకోదల్చినవాళ్ళు మొట్టమొదట తెలుసుకోవలసింది ‘దాని వ్యాకరణం జోలికి పోకుండా అది సాధ్యం కాదు’ అని. ఈ సంగతి సరిగా అర్థం చేసుకుంటేనే భాషలు నేర్చుకోడం గురించి పొరపాటు అభిప్రాయాలన్నీ వదులుకుంటారు. ఏ భాష నేర్చుకోవాలనుకుంటున్నారో దాని వ్యాకరణం నేర్చుకోవటానికి తమని తాము సిధ్ధం చేసుకుంటారు.