Avadhana Sathakam- 1
ప్ర: పెళ్ళయిన ఆడవాళ్ళకు తాళిబొట్టు గుర్తు మరి పెళ్ళయిన మగవాళ్ళకు?
జ. ఏడుపుగొట్టు మొహం. హాయిగా నవ్వలేక పోవడం.
ప్ర: దయ్యాలు రాత్రిపూటే ఎందుకు తిరుగుతాయి?
జ. పగలు మనం తిరుగుతామనే భయంతో
ప్ర: పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకను పెట్టుకుని వెళ్ళడం అంటే...
జ. అవధానానికి వెళ్తూ అప్రస్తుతం వారిని చంకన బెట్టుకుపోవడం.
ప్ర: కరిచే కుక్క మంచిదా? మొరిగే కుక్క మంచిదా?
జ. మా యింట్లో కరిచే కుక్క మంచిది. మీ యింట్లో మొరిగే కుక్క మంచిది.
ప్ర: పిల్ల ముందా? గుడ్డు ముందా?
జ. పిల్లే ముందు. పిల్ల పుట్టి బడిలో చేరి పరీక్ష రాశాక కదా మార్కుల్లో గుడ్డు పెట్టేది.
ప్ర: పద్యా నికీ, శ్లోకానికీ తేడా ఏమిటి?
జ. పద్యం వేగంగా వస్తుంది, శ్లోకం నెమ్మదిగా వస్తుంది.
ఎందుకంటే అది slow ......... come
ప్ర: 'మండే'ని ఆ పేరుతో ఎందుకు పిలుస్తారు?
జ. సండే సెలవు అనుభవించిన వారికి మర్నాడు పనిచేయాలంటే
ఒళ్లు “మండే" - అందుకే
ప్ర: అంటరానితనం మహాపాపం. మరి వంటరాని తనం?
జ. మొగుడు పాపం
ప్ర: ఎక్స్ ప్రెస్ బస్ ను నాన్ స్టాప్ అంటారు. ప్యాసింజరు బస్ ను ఏమనాలి?
జ. నానాస్టాప్ అనాలి.
Chivaraku Migiledi
చివరకు మిగిలేది - ఏమిటి? అన్నదానికి వెంటనే దేని చివరకు? అన్న ప్రశ్న పుడుతుంది. ఆ వెంటనే మిగిలేది ఎవరికి? - అన్న జిజ్ఞాసా రాక తప్పదు. వ్యక్తికా - జీవితానికా - వ్యక్తులతోనూ వాళ్ళ మధ్య అనేకానేక ఉత్పతి, పునరుత్పతి సంబంధాలతోనూ ఆవిష్కారమైన సమాజానికా - అన్నదే అది. ఈ ప్రశ్న భావనామాయమైంది. దీనికి సమాధానం భౌతిక రూపంలో వెదకడం సులువేనా? అసలీ "మిగలటం" - అన్న సమస్య గురించి విశ్వనాథ 'వేయిపడగల' లో చర్చించాడు. అలాగే చలం తన "మ్యూజింగ్స్" లో కొంత ఆలోచన చేశాడు.
ఒకానొక విశ్వాసం మిగులుతుందని విశ్వనాథ అంటే, మిగులుతుందనుకోవటం భ్రమగా తేల్చేశాడు చలం. వీరి తాత్త్విక విశ్వాసాలకు సృజనాత్మకరూపం కల్పించి నవలగా రూపొందించిన ఘనత బుచ్చిబాబుది. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కొత్త విలువల రూపుకడ్తున్నాయి. నిరాశా నిస్పృహల్లో మునిగిన సమాజాన్ని "లోచూపు" లో చూడటం అన్న వాస్తవికతలకు నవలారూపమే ఈ రచన. పురుషస్వామ్య సామాజిక భావాజాలం - అది సృష్టించిన పాత్రలు - వీటి ప్రవర్తన ఈ నవలలో బొమ్మకడుతుంది.
ప్రపంచంలోని వ్యక్తులే సాహిత్యంలో పాత్రలౌతారు. అలాగే బుచ్చిబాబు ఈ నవలలో సృష్టించిన పాత్రలు; ఆ కాలంలో తెలుగు దేశంలోని ఆధునిక సాహిత్య - సామాజిక - తాత్విక ధోరణుల ప్రతిబింబాలనిపిస్తాయి. రాధాకృష్ణన్ - రసెల్ - జిడ్డు కృష్ణమూర్తుల సమాహార తాత్వికతే బుచ్చిబాబు దార్శనికత్వం అనిపిస్తుంది. ఆధునిక తెలుగు నవలల్లో మంచివేవి? అని ఏ సాహిత్య విద్యార్థిని ప్రశ్నించినా ముందుగా చెప్పేది; తెలుగు కల్పనా సాహిత్యంలో చివరికంటా మిగిలేది ఈ "చివరకు మిగిలేది".
Henectus tincidunt
Ornare auctor
Consequat a scelerisque suspendisse vel et eget eu vitae adipiscing nibh scelerisque semper cum adipiscing facilisis adipiscing est accumsan lorem vestibulum. Aliquet mus a aptent ullam corper metus accumsan. Habitasse a purus nec ipsum a urna ac ullamcorper varius metus blandit posuere.
Select options
This product has multiple variants. The options may be chosen on the product page