Showing 1–12 of 17 resultsSorted by latest

Warrior Shadow

120.00
చారెడేసి కన్నులు, చేమంతి బంతులు ముంగురుల ముద్దుమోము - మనస్సు నిలువనీయదే బావికాడ కడవతో వయ్యారపు నీ నడక గుండెపట్టి గిల్లిందే-ఒళ్ళు తిమ్మిరెక్కిందే నా వంక చూడవా నడుమొంపు చిన్నదాన ఒక్క నవ్వు నవ్వవా రంగపూరు నెరజాణ ఇవ్వాళో రేపో విరిగిపోయేటట్లున్న చెక్కబల్లమీద ఎడమచేత్తో దరువు వేస్తూ పెద్ద గొంతుతో పాడటం మొదలు పెట్టాడు గంగారాం. మాట్లాడేటప్పుడు మహా కరుకుగా ధ్వనిస్తుంది అతని కంఠం. పాటలు మొదలు పెట్టిన మరుక్షణం మార్దవంగా మారిపోతుంది. తలలు వంచుకుని తమదారిన తాము వెళ్ళిపోవాలనుకునే వారుకూడా ఆగిపోవాల్సిందే. పాట పూర్తి అయ్యేవరకూ ఆగి విని తీరాల్సిందే.

Gangs Of Bangalore Naa Dadagiri Rojulu

375.00

 నా బయటి ప్రపంచానికి లోపలి ప్రపంచానికి సముద్రమంత వెలితి ఉండేది. బయటి ప్రపంచంలోని నా కార్యలాపాలను నా లోపలి సున్నితత్వం అంగీకరించేది కాదు. అక్కడి క్రౌర్యం, భయం, హింసా, మోసం కుట్రలు నా ఆత్మసాక్షిని ప్రశ్నించేలా ఉండేవి, దాన్ని ఎలా మార్చాలి? మార్చటానికి సాధ్యమా? ఒంటరిగా , గాఢంగా జీవితాన్ని ఆ ప్రశ్నల కొలిమిలో మధించ సాగాను. అప్పుడు అర్ధమయ్యింది , మారవలసింది ప్రపంచం కాదు. నేనని . ప్రపంచం అద్భుతంగా ఉంది. అక్కడ అంత క్రమబద్ధంగా మేళవించి ఉంది. తేడా నాలోనే ...

                                                                                                  - అగ్ని శ్రీధర్.

Intelligent Idiot

175.00
దీన్ని రాయడానికి ప్రవీణ్ ఎంచుకున్న రచనా పద్ధతి విశిష్టంగా కనిపిస్తుంది. తెలుగు సాహిత్యంలోని ఒక కవితనో, ఒక కథనో, ఒక పద్యాన్నో, ఒక సన్నివేశాన్నో వివరిస్తాడు. దాన్ని రామ్ గోపాల్ వర్మ జీవితానికి, అతని జీవితంతో ముడిపడిన జీవితాలకు అన్వయించే ప్రయత్నం చేస్తాడు. అంతలోనే ఏ ఇంగ్లీష్ కవి చెప్పిన వాక్యంగాని, ఒక ఫిలాసఫర్ గాని చెప్పిన అభిప్రాయంతో గానీ దాన్ని ముడి పెడతాడు. అదీ సరిపోదనుకుంటే ఏవో కొన్ని నవలల్ని చెప్పి, వాటిలోని సన్నివేశాలతో కూడా కలిపి విశ్లేషిస్తుంటాడు. దీని ద్వారా ప్రవీణ్ అధ్యయన విస్తృతి తెలుస్తూనే, రామ్ గోపాల్ వర్మ అప్పటికైనా తనకు దొరుకుతాడో లేదోననే అన్వేషణతో మరికొన్ని మార్గాల్ని కూడా వెతుకుతూ ముందుకి వెళ్తుంటాడు. - ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆర్జీవి ఒక బుద్ధిహీనుడైన మేధావి' అని ప్రవీణ్ ఒక పుస్తకం రాశాడు...చాలా ' విషయాల్ని ఎంతో విపులంగా చర్చించాడు... RGV కొత్తసీసాలో ఉన్న పాత బాగుంది.మందులాంటి వాడు... చప్పరించే కొద్దీ బావుంటుంది.... ఒకదశలో అలవాటైపోతుంది.. కొన్నాళ్ళకి మనం మెల్లి మెల్లిగా RGVలైపోతాం అదే వర్మ మ్యాజిక్..! -తనికెళ్ళ భరణి Evolution లో కోతులన్నీ మనుషులైపోయాయి. కానీ ఒక్కటి మాత్రం తిరిగి కోతిగా మారిపోయింది. ఆ కోతి పేరు ఆర్జీవి. అది తెలివైన కోతి. దానికన్నీ తెలుసు. బాగా చదువుకుంది. దానికి లాజిక్ తెలుసు, మనుషుల ఎమోషన్స్ తెలుసు, సైకాలజీ తెలుసు, అడ్డమైన విషయాలన్నీ తెలుసు. అందుకే అది మనుషులతో ఆడుకోవడం మొదలెట్టింది. -పూరి జగన్నాథ్

Bharateeya Tatvasastramlo Bhavavadam Bhoutikavadam – భారతీయ తత్వశాస్త్రం

60.00
ఈనాటి మన తాత్విక అవసరాల కోణం నుంచి మన తాత్విక సంప్రదాయాలను విశ్లేషించడమే ఈ రచన ఉద్దేశ్యం. లౌకికతత్వం, హేతువాదం, శాస్త్రీయ దృష్టి అన్నవే నేటి ఆ అవసరాలు. ఈనాడు మనం దేన్నైతే ఎదుర్కొని పోరాడుతున్నామో దానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మన తాత్వికులలో ఒక భాగం అమూల్యమైన సూచనలు అందజేశారు. వాటిని మనం పూర్తి ఆమోదంతోనూ, జాతీయ గర్వంతోనూ పెంపొందించవచ్చు.

Matruthvam

200.00
డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి వైద్య సాహిత్య రంగాలలో సుప్రసిద్ధులు. గైనకాలజీ మరియు ఆబెట్రిక్స్ నిపుణులైన వీరు కాకినాడలో "విజయలక్ష్మి నర్సింగ్ హోమ్" ప్రారంభించి గత 38 సంవత్సరాలుగా వైద్య సేవలందిస్తున్నారు. వైద్య రంగంలోనే కాక, సాహిత్య రంగంలో కూడా ప్రసిద్ధి గాంచిన వీరి రచనలు - "మీరు ప్రేమించలేరు", "మాకీ భర్త వద్దు", "పేషంట్ చెప్పే కధలు", "జ్వలిత" - కధానికా సంపుటాలు : 'సజీవ స్వప్నాలు', 'చైతన్య దీపాలూ', 'ప్రత్యూష పవనం', 'వెలుతురు పువ్వులు' - నవలలు : 'మన దేహం కధ', 'కౌమార బాలికల ఆరోగ్యం' - వైద్య పరిజ్ఞానానికి సంబంధించిన రచనలు : 'వైద్యడు లేని చోట', 'మనకు డాక్టరు లేని చోట', 'రక్తం కధ' - అనువాదాలు ఉన్నాయి. 'డా. ఆలూరి విజయలక్ష్మి రచనలు' అను అంశంపై నాగార్జున యూనివర్సిటీ తెలుగు విభాగం విద్యార్ధిని పరిశోధనా పత్రాన్ని సమర్పించి ఎమ్.ఫిల్. డిగ్రీ పొందారు. డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి అనేక సుప్రసిద్ధ సాహితీ సంస్థల నుండి, సామాజిక సంస్థలనుండి ఎన్నో సాహితీ పురస్కారాల్ని, సామాజిక సేవా పురస్కారాల్ని పొందారు. తెలుగు పాఠకులకు డాక్టర్ విజయలక్ష్మిగారు ఇచ్చిన మరో వినూత్న కానుక - 'మాతృత్వం : ప్రసూతి సమస్యలు - సలహాలు'. ఈ పుస్తకం గతంలో అశేష పాఠకుల ఆదరణపొంది పలు ముద్రణలు పొందింది. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది మరెన్నో మార్పులు, చేర్పులతో కూడిన పరిస్కృత ముద్రణ. - ఆలూరి విజయలక్ష్మి