Showing 757–768 of 835 resultsSorted by latest

Rushi – ఋషి

50.00

‘ఏమిటాలోచిస్తున్నావ్‌ ?”  అలవోకగా పక్క మీదకు వాలి అంది అమ్మాయి. మాట్లాడలేదు నేను – ఆమెనే చూస్తూ వుండిపోయేను. చీరెకి, జాకెట్టుకి మధ్య, సముద్రపు తీరానే స్థిరంగా నిలబడి యుగయుగాలుగా, ఆ అలల తాకిడికి సున్నితత్వాన్ని ఆపాదించుకున్న కొండరాళ్ల నునుపు సెక్స్‌ కాదు, ఉద్విగ్నత.

”ఏమిటి కొంపదీసి ఈ గంటా యిలా ఏదో ఆలోచిస్తూనే గడిపేస్తావేమిటి బాబూ?”

అడుగు ముందుకేసి – ఆమె చేరువై – ఆ స్పర్శలో – ఆ గుండె చలనపు సవ్వడి. తరతరాలుగా స్త్రీని పురుషుణ్ణి ఏకం చేసే రాగబంధం – లయ. ఏ వాద్యకారుని వేళ్లు సుతారంగా మీటుతున్నాయో –

ఆమె చెయ్యి లైట్‌ మీదకు వెళ్లబోయింది – వారించాను. లైటార్పితే – ఇంత ఆనందం ఎక్కడుంది ?……..

అతడు ప్రకాశం. అతడు ప్రేమించిన అమ్మాయి. అతడ్ని ప్రేమించిన మరో అమ్మాయి. ఈ వలయం నుంచి చూస్తే అన్నీ సజావైన ప్రేమ వ్యవహారాలే. కానీ హిపోక్రసీ అతడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. నవ నాగరికతలో ఈతడు ఇమడలేకపోయాడు. ఆత్మవంచనతో బతకలేకపోయాడు. ఐయామ్‌ ఆల్సో బికమింగ్‌ ఎస్కేపిస్ట్‌ లైక్‌ యు!- అననైతే అన్నాడు కానీ – చెడిపోవడం కూడా అందరికీ చేతకాదు. అదీ ఒక ఆర్టు! మన బ్రతుకుల్లోని వంచనాశిల్పాన్ని ఎత్తిచూపే యండమూరి వీరేంద్రనాథ్‌ సమస్యాత్మక నవల – ఋషి.

Sampurna Premayanam – సంపూర్ణ ప్రేమాయణం

75.00

‘నాకు అర్థం కావటం లేదు” అన్నాడు వేణు. ఆమె ఎందుకలా ప్రవర్తించిందో.. అంత చనువు ఎందుకు ప్రదర్శించిందో”.

”నాకు నిన్న రాత్రి అర్థం కాలేదు. కానీ రాత్రి రూమ్‌కొచ్చాక ఆలోచిస్తే అర్థమయింది” అన్నాడు ప్రసాదరావు.

”ఏమిటి?”

”ప్రసాద్‌తో గొడవవల్ల ఆమె మానసికంగా బాగా కృంగిపోయింది. అటువంటి పరిస్థితుల్లో మనుష్యులు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఏ చిన్న ఆధారం దొరికినా చాలనుకుంటారు. నిన్న రాత్రి అది కలిసొచ్చింది. ఇక కథ క్లయిమాక్స్‌కి వచ్చేసినట్టే”.

తన చెల్లెలి జీవితంతో ఆడుకున్న సర్‌ జగపతిరావు బహదూర్‌ అనేవాడి మీద పగతీర్చుకునే నిమిత్తం..

ప్రసాదరావు అనే కౌటిల్యుడిలాంటి వృద్ధుడు జీవితంలో ఎప్పుడూ అబద్ధమాడని వేణు అనే అందమైన కుర్రవాడిని నియమించాడు.

వాళ్ళ కాంట్రాక్టు ప్రకారం జగపతిరావు కూతుర్ని ప్రేమలోకి దింపి, ఆమెను గర్భం వచ్చాక వదిలెయ్యాలి. వేణు రంగంలోకి దిగాడు. దిగాక తెలిసింది. – చూస్తే నాలుగు పెదవుల కలయిక చాలా సులభం, ఆలోచిస్తే రెండు మనసుల కలయిక చాలా కష్టం అని – అప్పటికే ప్రేమ వలలో పూర్తిగా ఇరుక్కుపోయిన వేణు ఎలా బయటపడ్డాడు?

మొదటిపేజీ నుంచి చివరి పేజీ వరకూ సస్పెన్సుతో మిమ్మల్ని మరోలోకంలోకి తీసుకుపోయే శైలిలో, అత్యద్భుతమైన శిల్పంతో, పరిపూర్ణమైన పాత్రల చిత్రణతో యండమూరి వీరేంద్రనాథ్‌ కలం నుంచి వచ్చిన మరో హరివిల్లు ‘సంపూర్ణ ప్రేమాయణం’.

Siggestondi – సిగ్గేస్తోంది

75.00

ఆరోజు సోమవారం !

క్రితంరోజు ‘శలవు బద్ధకం’ లోంచి బయట పడటానికి ఇష్టంలేనట్టుగా మత్తుగాపడుకుని ఉన్నారు కొంతమంది.

సూర్యుడికి, గృహిణికి అది కుదరదు కదా !

ఉదయభానుడు ఉరుకులూ పరుగులూ మీద పైకి పొడుచుకొచ్చేస్తున్నాడు. ప్రాత:కాలాన్నే లేచి, పెరట్లో రాత్రి కురిసిన పారిజాతాలు ఒళ్లో నింపుకుంటూ, ముంగిట్లో రంగవల్లులు తీర్చే అతివలు ఆ లొకాలిటీలో లేరు !

గేట్లమీద పాలపేకెట్లు చూస్తున్నాయి. మెట్లమీద న్యూస్‌పేపర్లు అడ్డంగా పడివున్నాయి.

కిలకిలారావాల్తో నిద్రలేచి, కూనిరాగాలతో పనులు ప్రారంభించవలసిన సుందరవదనలు, ఆదరాబాదరా పనుల్లో జొరబడి, తిరిగిపోతున్న గడియారపు ముళ్ళకేసి నిస్పృహగా చూస్తున్నారు.

కలలు కంటే, నిద్రలేని రాత్రి కరిగిపోయి, మండే కళ్ళతో పగలు ఆఫీసుల కెళ్ళాల్సొస్తుందని కలలను సైతం త్యాగం చేసే ఉద్యోగస్తురాళ్లు!

మధ్య తరగతి మహిళలు !

పునీత పువ్వులాంటి పాప బస్‌పాస్‌ కోసం ఫోటో తీయించుకోవాలని స్టూడియో కెళ్ళింది. అక్కడ!

వనజ పదహారేళ్ళ అమ్మాయి. బస్‌లో కాలేజికెళ్తోంది. కండక్టర్‌ ‘పీఛేజావ్‌’ అంటూ చెయ్యివేసి వెనక్కి తోసాడు. ఎక్కడ!?

ధరణి ఒక ఇంజనీరింగ్‌ కంపెనీలో ఉద్యోగస్తురాలు. సైటుకి రమ్మన్నాడు బాస్‌. ఎందుకో తెలుసు. కాదంటే

మంచినీళ్ళు పుట్టని సైటుకి బదిలీ చేస్తాడు. అదీ పరిస్థితి. మరేం చెయ్యాలి ? ఇక్కడ!? – పైకి కనబడకుండా – మూడోకంటికి అస్సలనుమానం రాకుండా-కేవలం తెలియాల్సిన వ్యక్తికే తెలిసేలా-ఆ వ్యక్తి మనసులోనే దు:ఖపడేలా-మరొకరికి చెప్పుకోవటానికి సిగ్గు పడేలా – ఓ అంతరంగవేదనా తరంగం యండమూరి వీరేంద్రనాథ్‌ సృష్టి ‘సిగ్గేస్తోంది’.

Swarabhetalam – స్వరబేతాళం

80.00

‘మారా …. మరా….. బచావ్‌” (చంపుతున్నాడు – చంపుతున్నాడు – రక్షించండి)

జనవరి 31, 1982 పొద్దున్న 7-50కి నాంపల్లి రైల్వేస్టేషను పక్కనున్న ఇంటినుంచి వినిపించిన కేకలవి.

హోటల్లో టీ తాగుతున్న ఒకరిద్దరు. రాయల్‌ లాడ్జి బయటున్న ఆటోడ్రైవర్లు ముగ్గురు అటువైపు పరుగెత్తారు.

కత్తి పట్టుకుని బయటకు వచ్చిన యువకుడిని చూసి అందరూ నిశ్చేష్టులై ఆగిపోయారు. సాహసవంతులైన నలుగురైదుగురు యువకులు మాత్రం అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ళను కూడా పొడిచి అతడు స్టేషనువైపుకు పరుగెత్తాడు.

లోపల ఇంట్లో కత్తిపోట్లుకు గురి అయిన వ్యక్తి రక్తంలో గిల గిల కొట్టుకుంటూ మరణించాడు. ఆ వ్యక్తి పేరు మొహిసిన్‌. అతడొక పోలీసు. హంతకుడి పేరు ధర్మదాస్‌. ధర్మదాస్‌ పరుగెడుతూ అడ్డుగా వచ్చిన వాళ్ళను పొడవగా గాయపడిన వాళ్ళు మొయినుద్దీన్‌, సయ్యద్‌ బాషా, పద్మనాభం, అన్వర్‌, జబ్బర్‌ (చివరి ఇద్దరూ ఆటో డ్రయవర్లు). చివరికి జనం ఆ హంతకుడిని పట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. అతడి దగ్గర రక్తంతో తడిసిన పొడవాటి కత్తి లభించింది. అతడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు.

అతడు హత్య చేసాడని అందరికీ తెలుసు. నలుగురూ చూస్తూ వుండగానే హత్య చేసాడు. లోయర్‌ కోర్టు అతడికి ఉరిశిక్ష వేసింది. కానీ హైకోర్టు అతడిని నిర్దోషిగా విడుదలచేసింది.

కారణం ? ఐ.పి.సి. సెక్షన్‌ 84 నిచీశ్‌ీష్ట్రఱఅస్త్ర ఱర aఅ శీటటవఅషవ షష్ట్రఱషష్ట్ర ఱర సశీఅవ పవ a జూవతీరశీఅ, షష్ట్రశీ, a్‌ ్‌ష్ట్రవ ్‌ఱఎవ శీట సశీఱఅస్త్ర ఱ్‌, పవ బీతీవaరశీఅ శీట బఅరశీబఅసఅవరర శీట ఎఱఅస, ఱర ఱఅషaజూaపశ్రీవ శీట సఅశీషఱఅస్త్ర ్‌ష్ట్రవ అa్‌తీబవ శీట ్‌ష్ట్రవ ూష్‌కు. ూవష.84-Iఅసఱaఅ ూవఅaశ్రీ జశీసవ.

ఉరితీత మీద ధ్వజమెత్తి ‘అభిలాష’ నవల ద్వారా పాఠకుల్ని ఉర్రూతలూపినరచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్‌ ఈసారి లాజిక్‌తో హారర్‌ కలిపి న్యాయశాస్త్రపు మరోకోణాన్ని స్పృశించటానికి చేసిన ప్రయత్నం ‘స్వరబేతాళం’.

The Dairy Of Misses Sarada – ది డైరీ ఆఫ్‌ మిసెస్‌ శారద

100.00

ఏమిట్రా అంత దీక్షగా చదువుతున్నావ్‌ ?’ గ్లాసులో మందుపోస్తూ ఒకడు రెండో వాడిని అడిగాడు. పచ్చి మిరపకాయల బజ్జీల పొట్లం విప్పి, బజ్జీల్ని ప్లేట్లో పడేసి, కాగితం పారెయ్యబోతూ ఆగి దాన్ని చదువుతున్న రెండో వాడు తలెత్తి ”ఇదేదో ఇంటరెస్టింగుగా వుందిరా, డైరీలో కాగితంలా వుంది’ అన్నాడు. ఎప్పటిదో పాత డైరీలో కాగితం. ‘ఇదేదో ఆడపిల్ల డైరీలో కాగితంలా వుంది. క్రింద శారద అని వుంది’. మూడోవాడు ఆ కాగితాన్ని లాక్కుని బిగ్గరగా చదవడం ప్రారంభించాడు.

‘మనుష్యులు రెండు రకాలు. తెలివైనవాళ్ళు. తెలివితక్కువ వాళ్ళు – మనుష్యులు రెండు రకాలు. బలమున్న వాళ్ళు. బలం లేని వాళ్ళు – తెలివిగానీ బలముగానీ లేనివాళ్ళు సామాన్యులౌతారు – బలం వున్నవాడు నీతిని వదిలేస్తే పొలిటీషియన్‌ అవుతాడు – తెలివి వున్నవాడు నీతిని వదిలేస్తే కాపిటలిస్టు అవుతాడు – తెలివైన వాడు నీతిని వదిలెయ్యకపోతే టీచరో మేధావో అయిసంతృప్తి పడతాడు – బలమైన వాడు నీతిని వదిలెయ్యకపోతే శ్రామికుడై శక్తిని ధారపోస్తాడు – నా జీవితాన్ని దర్పణంగా చేసి, నలభై సంవత్సరాల చరిత్రని అందులో ప్రతిబింబంగా చేసి చూస్తే నాకు తెలిసిన సత్యం ఇది. ఎందుకో ఈ రాత్రి నా జీవితంలో ఆఖరిరోజు అనిపిస్తుంది. ఇదే నా డైరీలో ఆఖరిపేజీ అనిపిస్తుంది – శారద”.

రెండు విభిన్నలోకరీతుల్ని రెండు విభిన్న కోణాల్లో యండమూరి వీరేంద్రనాథ్‌ వివరించిన విలక్షణమైన నవల ‘ది డైరీ ఆఫ్‌ మిసెస్‌ శారద’.

Amma (Maxim Gorki)

300.00

“గోర్కిని నేను వ్యక్తిగతంగా ఎరుగుదను. యూరోపియన్ రచయితల్లో ప్రజ్ఞావంతుడైనట్టి, ఘనుడైనట్టి రచయితగానే కాకుండా బుద్ధిశాలి, దయాళుడు, సానుభూతిపరుడైన మానవుడిగా కూడా నేనతన్ని అభిమానిస్తాను”.

– లియో టాల్ స్టాయ్ డైరీ నుండి.

“గోర్కి ప్రతిభా భాండారానికి ఒకటే పేరు – సత్యం”

– సైఫాన్ జ్వైగ్.

“నూతన సారస్వత పతాకపైన చిత్రించి వుంది – గోర్కి హృదయం. మరి ఈ హృదయంలో వుంది – సర్వ ప్రపంచ శాంతి.”

– కృష్ణచంద్ర

విశ్వ విఖ్యాత రష్యన్ రచయిత, సుప్రసిద్ధ రచనా విజ్ఞానవేత్త మక్సీమ్ గోర్కి (1868 – 1936) నవల “అమ్మ” తెలుగు పాఠకుల అపారాభిమానాన్ని చూరగొంది. ఈ నవలను చదివి కమ్యునిస్టులైన వాళ్ళు ఎంతోమంది వున్నారు. ఈ అభిమానాన్ని పురస్కరించుకొని తిరిగి ఈ నవలను వెలువరించారు.

– రచయిత గురించి 

Sweet Home

200.00

Sint magnam sed optio est ut. Rerum facilis eos voluptatum non. Eius asperiores nulla amet.

Indian

200.00

  చందు రచనల్లో జీవితరంగ సాన్నిహిత్యం ఉంటుంది. అది అతని అనుభవ ప్రపంచానికీ లోకానుశీలతకు గుర్తు. తీవ్రమైన భావుకత్వం ఉంటుంది. అది కవిత్వ హృదయానికుండే సాంద్రమైన అనుభూతికి సంకేతం. ప్రగాఢమైన సాహిత్య పరిచయం చందూ రచనల్లో కనిపిస్తుంది. సామాజిక శాస్త్రాలతో బాటు విజ్ఞాన శాస్త్రాల మేలనం ఉంటుంది. ఉదార వామపక్షానుకూల ప్రాపంచిక దృక్పథం ఉంటుంది. చాలామంది తెలుగు నవలాకారులకు, రచయితలకు, పండితులకు లేని శక్తివంతమైన శైలి చందూ నవలల్లో కనిపిస్తుంది. సూటిదనం, స్పష్టతా, గాంభీర్యం, హాస్యం, కొంటెతనం, వ్యంగ్యం చందూ కంఠస్వరంలో చూడవచ్చు. కథనంలో ప్రసన్నత ఉంటుంది. వేగం ఉంటుంది. ఈ రెండింటి వెనుక పాఠకుణ్ణి ఆలోచనాత్మకమైన జీవనాంశాలవైపు  సామాజిక పరివర్తన వైపు సామూహిక సద్వర్తన వైపు మానవుడు సాధించగలిగే శాస్త్ర విజ్ఞానాంశాలపై మళ్ళించే లక్షణం ఉంటుంది.

                                               – కేతు విశ్వనాథరెడ్డి

Jamilya

50.00

జమీల్య

జమీల్య ఓ అపురూపమైన ప్రేమకధ. తరచూ దీన్ని ‘ ప్రపంచంలోనే బహు సుందరమైన ప్రేమకధగా’ అభివర్ణించినా….. అంతకు మించిన బలీయమైన సామజిక సందర్భం , సంస్కృతుల సంఘర్షణ,సమకాలీనజీవన సంక్లిష్టతలను ప్రతిఫలించడం దీని గాడతను మరింత పెంచింది. అందుకే ఇప్పటికీ ఐత్ మాతోవ్ రచనలన్నింటి లోకి ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన నవలగా, నిలబడుతోంది.దీన్ని ఆయన ౧౯౫౮ లో కిర్గిజ్, రష్యన్ భాషలు రెంటిలోనూ రాసారు. ౫౯ లో లూయీ ఆరగాన్ చేసిన ఫ్రెంచ్ అనువాదంలో జమీల్యా యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షించింది. తర్వాత ఎన్నో భాషల్లోకి అనువాదమైంది. తొలినాళ్ళలో ఈ నవల కిర్గ్ స్తాన్ లో ఎన్నో ప్రకంపనలు సృష్టించింది. ఈ సాంప్రదాయ సమాజానికి ప్రతినిధి జమీల్యా భర్త. స్త్రీ గా ఆమె పట్ల ప్రేమ చూపడం కంటే కూడా … ఆమెను తన అస్తిలా, సొత్తులా భావిస్తాడాయన. అందుకే ధనియార్ దగ్గర తనకు కావల్సినా ప్రేమ దొరికినప్పుడు ఆమె వెనుదిరిగి చూడదు. దనియార్ నుంచి ఆమెకు ప్రత్యేకమైన భరోసా ఏది అవసరం ఉండదు. అంతిమంగా వారిద్దరి పయనం… సాంప్రదాయిక బంధనాల నుంచి స్వేచ్చనే కాదు. సరికొత్త సోవియట్ జాతి, సోవియట్ జీవిత నిర్మాణానికి ప్రతీకగా నిలుస్తుంది. పెను మార్పు కోసం ఆలపిస్తున్న సాముహ గీతంతో శ్రుతి కలుపుతుంది.

చింగీజ్ ఐత్ మాతోవ్ రాజకీయ,సామజిక,విప్లవోద్యమ సందర్భాల్లో జీవితాలను అద్బుతంగా ఒడిసిపట్టిన రచయిత.రష్యా సంరజంలో ఒక అనామక ప్రాంతమైన కిర్గజ్ స్తాన్ సోవియట్ యూనియన్ లో కీలక దేశం గా  అవిర్బవించిన పరిణామా క్రమానికి   అయన ప్రత్యక్ష సాక్షి. అందుకే అయన రచనలు మధ్య ఆసియా జీవితాల్లో వచ్చిన మార్పులను సజీవంగా ఆవిష్కరిస్తాయి. రష్యన్,కిర్గిజ్ భాషలు రెంటిలోనూ రాసిన ఐత్ మాతోవ్ పలు దేశాల్లో కిర్గిజ్ స్తాన్ రాయబారి గా పనిచేసారు.

Janapadam – జనపదం

300.00

దాశరథి రంగాచార్య రచించిన మూడవ నవల ‘జనపదం’. (మొదటిది ‘చిల్లర దేవుళ్లు’, రెండవది ‘మోదుగు పూలు’.) ఈ మూడు నవలలు తెలంగాణ ప్రజాజీవిత వాస్తవములకు అద్దం పట్టినవి.

నిజాం ఆసఫ్రాహి పాలకులు, వారి ఏజంట్లయిన జాగీర్దారులు, నిరంకుశులైన వారి చిల్లర ఉద్యోగులు – వారి పాలనలో తెలంగాణా ప్రజలు అనుభవించిన బాధల గాధల బృహత్‌ రూపదర్శనమే వారి నవలలకు ఇతివృత్తములు.

దాశరథి మూడో నవల ‘జనపదం’ తెలంగాణా విముక్తికి తరువాత పాత సారాయాన్ని కొత్త సీసాల్లో అందిస్తున్న మన దేశవాళీ రాజకీయాల ప్రభావాన్ని వివరిస్తున్న గాధ.

గత శతాబ్దాంతమున మహాకవి గురజాడ తన ”కన్యాశుల్కం”లో సమగ్రాంధ్ర ప్రజాజీవితాన్ని దర్శింప జేసినట్లుగానే  దాశరథి ఆచార్యులవారు తమ రచనల్లో సమగ్ర తెలంగాణమును దర్శింపచేశారు.