YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 601–612 of 835 resultsSorted by latest
Achanta Sarada Devi Kathalu – ఆచంట శారదా దేవి కథలు
₹280.00శారదాదేవి తనకు తెలియని జీవితాన్ని అసలు ముట్టుకోరు. తన అనుభవ పరిధిలో వున్నా మనుషుల్ని, సన్నివేశాల్ని, జీవన వాతావరణాన్ని తన కథలకు ఇతి వృత్తాలుగా చేసుకున్నారు. వాటికీ నిసర్గ కోమలమైన తన భావగంధం పూసి గాఢమైన అనుభూతులుగా మలచి, పాఠకుల ముందు పరిచారు. వారి కథలు సహజంగా, స్వచ్చంగా, నిరాడంబరంగా, సరళంగా, అందంగా, మనసులోంచి అలవోకగా పుట్టినట్టు ఉంటాయి. ఎదుటి వారి మనసులను సుతారంగా తాకుతూ ఉంటాయి. ఈ కథలు చదువుతుంటే నిర్మలమైన నదిలో స్నానం చేసినట్లు ఉంటుంది. -ఎస్వి.భుజంగరాయశర్మ.
“జీవితం అనే తోటలో ఏరిన వివిధ పుష్పాలు, తెలుగు భారతికి పగడాలమాల ఈ కథానికలు”.
-రాజమన్నారు.
“వికాసోన్ముఖమైనఅనుభవ పరిణితి చాలని సీమంతిని హృదయంలోని వేదన ఇది. ‘ఇంతేనేమో’ అనికాని’ఇంతే’ అని ధైర్యంతో చెప్పలేని హృదయ దైన్యం, ధైర్యంగా వేషం వేసుకోవడానికి ముందు జీవిత నేపథ్యంలో చూపే అవ్యవస్థ, తొందర- ఈ వేదన. దాన్ని ఎంతో సహనుభూతితో ఈ ప్రబంద సంగ్రహంలోని ఒక్కొక్క ఖండికలోనూ చల్లగా సన్నని కంఠంతో చిత్రించారు. శ్రీమతి అచంట శారదాదేవి”.
-రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ.
“ఏ ఉత్తమ రచనకైనా అనుభవం అతి ముఖ్యం. ఈ అనుభవం వల్లనేనిజాయితి కలుగుతుంది. అతి ప్రధానమైన ఈ నిజాయితీకి అందము, అలంకరణ కోసమూ ఊహా, కల్పనా సాయపడతాయి. నిజమైన అనుభవము ఈ ఊహా, కల్పనలతో ఎంతో ఆకర్షవంతంగా అమరుతుంది అది సాధించినవారు మనకు సన్నిహితులవుతారు. శారదాదేవి ఇట్లాంటి రచయిత్రి.” -బుచ్చిబాబు.
A’nrutham
₹50.00“నువ్వు ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు శ్రీజ. మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. దానిని మనం నమ్మలేం.”
“మనసుని కాదు రాధిక, నన్ను చుట్టుకున్న పరిస్థితులను నమ్ము. పదమూడు ఏళ్ళకే అమ్మానాన్నలు దూరమైతే ఎలా ఉంటుందో తెలుసా? అప్పటివరకు వాళ్ళే నా ప్రపంచం… ఒక్కసారిగా ఆ ప్రపంచం కూలిపోయింది. చిన్నపిల్లని నేను… ఆ వయసులో నాకసలు ఏమీ తెలీదు. ఏదీ తెలీదు! మరో పదిహేను సంవత్సరాల తరువాత, ఇప్పుడు మళ్ళీ నా ప్రపంచం కూలిపోయింది. కానీ ఇప్పుడు నాకు ఏది తెలిసినా… తెలియకపోయినా ఒక్క విషయం మాత్రం బాగా తెలుసు… I can handle this అని.”
“చూడగలగాలే కానీ ప్రతి అబద్ధంలోనూ ఓ నిజం ఉంటుంది. ఆ నిజమే అబద్దానికి ఉనికి.” ఈ కథకు శీర్షిక అనృతం’. అనృతం అంటే అబద్దం. ఆ అనృతంలో కూడా ఓ నృతం (నిజం) ఉండకపోలేదు! ఆ “కొన్నిసార్లు మనం వెళ్ళాల్సిన మార్గమే మనకి తెలుస్తుంది. చేరుకోబోయే గమ్యం కాదు.” గమ్యం ఎలా ఉండబోతుందో, అసలు గమ్యమంటూ ఉంటుందో లేదో తెలియకుండానే కథ అనే గమనాన్ని ఎంచుకున్నాను, పయనించాను. ఫలితం ఈ అనృతం’.
“ఓదార్చే తోడు లేదనిపిస్తే బాధ కూడా మాయమైపోతుంది.” ఈ వాక్యం నేను చూసిన సంఘటనల్లో నుండి రాశాను. తుడిచే చెయ్యే లేదనిపిస్తే కన్నీళ్ళు మాత్రం ఎందుకొస్తాయి? ప్రతి చర్యా, ప్రతిచర్యను కోరే జరుగుతుందేమో!
Arthanareeswarudu – అర్ధనారీశ్వరుడు
₹120.00పశ్చిమ తమిళనాడులో నమక్కాల్ జిల్లా తిరుచెంగోడు పట్టణ ప్రాంతంలోని ఒక సామాజిక సంప్రదాయం ఈ నవలకు నేపథ్యం. దాన్ని ఆచార్య పెరుమాళ్ మురుగన్ తమిళంలో ‘మధోరు బాగన్’ అనే నవలగా 2010లో రాశాడు. దాని తెలుగు అనువాదమే ‘అర్ధనారీశ్వరుడు”. 1940 సం|| నేపథ్యంలో వ్యవసాయము, పశుపోషణ జీవనంగా గల ఒక జంట కాళి, పొన్నల కథ ఇది. ఎన్ని ”గుళ్ళూ, గోపురాలు దర్శించినా” సంతానం కలగదు. పిల్లలు కలగనపుడు తిరుచెంగోడు అర్ధనారీశ్వరుడికి జరిగే రథోత్సవం వేడుకల్లో 14వ రోజున సాంఘిక కట్టుబాట్లను వదలి, ఆ రాత్రి ఎవరు ఎవరితోనైనా శృంగారంలో పాల్గొని పిల్లల్ని కనవచ్చుననే సాంప్రదాయం ఆనాడు ఉండేది. దీని నాధారంగా చేసుకొని హృద్యంగా ఈ నవల రచించబడింది. పశ్చిమ తమిళనాడులోని కొగునాడు ప్రాంతంలోని కొన్ని సామాజిక వర్గాలు మురుగన్ మీద కాలు దువ్వినాయి. అలజడి ప్రారంభమయింది. ఈ నవలలో ప్రస్తావించిన అంశాలు తమ సామాజిక వర్గాన్ని, స్త్రీలను కించపరచేవిగా ఉన్నదనీ, దీన్ని నిషేధించాలనీ కొన్ని హిందూ మతోన్మాద సంస్థలూ, కుల సంఘాలు వక్రమార్గంలో ఎడతెరిపి లేని ఆందోళన అన్ని రూపాల్లో కొనసాగించాయి. రచయితైన మురుగన్‌ను వేటాడారు. దాదాపుగా సాంఘిక బహిష్కరణ చేశారు. మురుగన్‌తో ప్రభుత్వ అధికారుల సమక్షంలో క్షమాపణలు చెప్పించాయి. అయినా గొడవ కోర్టుదాకా వెళ్ళింది. విచారణ సం||ర కాలం జరిగింది. మతోన్మాదుల ఉన్నాదాన్ని కోర్టు కొట్టివేసింది. ఈ రచనను తెలుగులోకి ప్రసిద్ధ రచయిత ఎల్.ఆర్.స్వామి అనువదించారు.
పేజీలు : 152
Cartoonlalo Marx – కార్టూన్లలో మార్క్స్
₹100.00కార్టూన్లలో మార్క్స్ రచనలను,
సిద్ధాంతాలను క్లుప్తంగా వివరించడం సాధ్యమేనా?
సాధ్యమేనని నిరూపించాడు ‘ర్యూస్’!
ఈ పుస్తకం ఒక ‘డైజస్ట్’!… మార్క్సిస్ట్ సిద్థాంతమూ,
దాని చరిత్రా; ఆర్థిక వ్యవస్థా, పెట్టుబడి, శ్రమ,
వర్గ వైరుధ్యం, వర్గపోరాటం, సోషలిజం మొదలైన
విషయాలను సామాన్యులకు సైతం సులభంగా అర్థం అయ్యేట్టు
విడమరిచే మార్క్సిస్ట్ సిద్ధాంత సంగ్రహ దర్పణం!…
మార్క్స్ జీవిత చరిత్రను కూడా
విపులీకరించే బొమ్మల కథ…
‘ర్యూస్’ అంతర్జాతీయ కార్టూనిస్ట్
‘ఎడువార్డో డెల్ రియో’ కలం పేరు.
Chinta Deeskhitulu – Balasaahityam – చింతా దీక్షితులు బాల సాహిత్యం
₹230.00పూర్వం రేడియోలో పిల్లల కోసం ‘బాలానందం’ కార్యక్రమం వుండేది. ఇప్పుడు అనేక తెలుగు టీవి ఛానళ్లున్నాయి, ఏ ఒక్క ఛానలైనా బాలసాహిత్యం ఊసెత్తుతుందా? కొన్ని ఛానళ్లు బాలలకి పాటల పోటీలు నిర్వహిస్తున్నాయి. వాటిల్లో అన్నీ సినిమా పాటలే పాడతారు, బూతుపాటలకక్కడ నిషేధం లేదు.
మాతృభాష నిరంతరాయంగా మనుగడ సాగిస్తేనే బాలసాహిత్యం కూడా విలసిల్లుతుంది. తెలుగులో మాట్లాడటమే నామోషీ అనుకునే జనంలో మాతృభాష పట్ల చైతన్యాన్ని పెంచేందుకు కృషి జరగాలి. ఏవో కొన్ని ప్రభుత్వ సంస్థలు తెలుగు భాషను ఉద్ధరిస్తాయని అనుకోవటం అత్యాశే!
ఇలాంటి విషమ పరిస్ఠితుల్లో ‘చింతాదీక్షితులు’ మనకు స్ఫూర్థి కావాలి. తెలుగులో వున్న తరతరాల బాలసాహిత్యాన్ని శోధించి, సాధించి తెలుగు సాహిత్యానికి వెలుగులద్దిన వారు చింతాదీక్షితులుగారు. ఆయన ఒక్కరే ఆనాడు ఆ మహత్తర కార్యానికి, పూనుకుని మరుగున పడిన లేదా మేధోచౌర్యానికి గురౌతున్న బాలసాహిత్యాన్ని తల్లిబిడ్డలకందించిన వారు చింతాదీక్షితులు గారు.
KarunaKumara Kathalu
₹150.00గ్రామజీవనమే కథా వస్తువుగా తీసుకుని మోతుబరీ భూస్వాముల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి పూటకు గతిలేని కష్టజీవుల దయనీయ జీవిత గాధలను కండ్లకు కట్టినట్లు చిత్రీకరిస్తూ బలవంతులు బలహీనులపై చూపే పాశవిక ప్రవృత్తినీ, కర్కశ కఠిన మనస్తత్వాలను తూర్పారపట్టి, ఎంతో రసభరితంగా బహిర్గతం చేసిన పరమ కరుణారస హృదయులు శ్రీ కరుణ కుమార. అయన గతించగా ఇక ఆంధ్ర కథా సాహిత్యానికి మిగిలినవి ఆయన కథలే. అప్పుడీ కథలు ఉదయిని, భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, కిన్నెర, స్వతంత్ర మొదలైన పత్రికలలో ప్రచురితమైనాయి. అప్రకటితములుగా కూడా మిగిలిపోయాయి కొన్ని.
ఆంధ్రదేశంలో అడుగునపడియున్న ఉత్తమ సాహిత్యాన్ని అచ్చోత్తించి పాఠక లోకానికి అందించడం వారి ఉన్నతాశయం. ముందు కూడా తెలుగు సాహిత్య లోకాన్ని మరింత సుసంపన్నం చేయగలరని విశ్వసిస్తున్నాను.
– ఇవటూరి కామేశ్వరరావు
Kasyapa Yodhudu – కశ్యప యోధుడు
₹200.00మాతృభూమి రక్షణకై యోధుడుగా మారిన ఒక బ్రాహ్మణ యువకుని కథ. మహారాజు క్షమాపణలు చెప్పటాన్ని అక్కడి ప్రజలు ఊహించలేదు. వారందరూ అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటూ మౌనంగా ఉన్నారు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సముద్రఘోషగా ఖాసి సైన్యం సూర్యదేవాలయాన్ని చేరుకుంది. నిరాయుధులైన అందరినీ వధించిన తరువాత నిశ్ఛేష్టులై విగ్రహాల్లా నిల్చొని ఉన్న రాజును, రాజగురువును ఖాసిం స్వయంగా తన ఖడ్గంతో వధించాడు. అద్భుతమైన సౌందర్యం, ఆధ్యాత్మికత వెల్లివిరిసిన దేవాలయ ప్రాంగణం రక్తసిక్తమై ఒక్కసారిగా భయానకంగా తయారైంది. సూర్యుడు కూడా ఈ ఘోరాన్ని చూడలేనట్టు మబ్బుల వెనకాల దాక్కున్నాడు. కొద్దిసేపటికే వర్షం ముంచెత్తి ఆకాశం తన బాధను తీర్చుకుంది. ఎంతో పవిత్రమైనదిగా చెప్పుకునే మాతృభూమి ముస్లింల వశమైంది.
కశ్యపాపుర మహాసామ్రాజ్యానికి రాజు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్తితి ఎందుకొచ్చింది? యోధానుయోధులను కన్న భరతభూమి పోరాటపటిమ లేకుండా ఖాసిం సైన్యానికి ఎందుకు దాసోహమైంది? కట్టుబాట్లు, సాంప్రదాయాలు అంటూ వేదమంత్రాలు వల్లెవేసుకునే సౌమ్యుడైన బ్రాహ్మణ యువకుడు యుద్ధమే ఊపిరిగా బ్రతికే ఖాసింని ఎదుర్కొనే యోధుడుగా ఎలా మారాడు..? ”మాతృభూమిని రక్షించటం అంటే పరాయి దాస్య శృంఖలాల నుండి విముక్తి చేయటమేనా? తరతరాలుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న అతి ముఖ్యమైన సమస్యకు పరిష్కారం కనుగొనగలిగాడా?”… తెలుసుకోవాలంటే ఈ నవల చదవక తప్పదు.
Kishan Chandar Rachanalu – 1 Gadidala Kathalu – కిషన్ చందర్ రచనలు – 1 గాడిదల కథలు
₹100.00సాహిత్యంలో వ్యంగ్యానికున్న శక్తి అందరికీ తెలిసిందే! వ్యంగ్యం అనండి; అవహేళన అనండి; అందులో కిషన్ చందర్ పెట్టింది పేరు. శరీరానికి దెబ్బ తగలకుండా మనస్సుకు మెత్తగా చురుకపెట్టే శక్తి కిషన్ చందర్ రచనకుంది. గాడిదను ఆసరగా తీసుకొని ఢిల్లీ రాజనీతినీ, బొంబాయి వ్యాపారనీతినీ ఎండ గట్టాడు కిషన్ చందర్ ”ఒకానొక గాడిద ఆత్మకథ”లోనూ ‘తిరిగి వచ్చిన గాడిద”లోను. అదే గాడిద మరో దేశానికి ప్రయాణం చేసి తన అనుభవాలను పాఠకుల కందించేలా రాశాడు ”నేఫాలో గాడిద”లో.
పేజీలు : 216
Padi Rupaayala Notu – పది రూపాయల నోటు
₹100.00పది రూపాయల నోటు అనేది డబ్బుకు గుర్తు.
దాని చుట్టూ సమాజంలో ఎన్నో విభిన్నమైన పాత్రలను
రచయిత అద్బుతంగా ప్రవేశపెట్టాడు. పెట్టుబడిదారీ
అనంతర సమాజంలో అవసరమైన ఉన్నత మానవ
విలువలకు పెట్టుబడిదారీ సమాజంలోనే
పునాదులేర్పడతాయని ఈ నవలలోని కొన్ని పాత్రల
ద్వారా రచయిత మనకు చూపిస్తాడు.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలపై
ఆధారపడి వుంటాయన్న సత్యాన్ని తెలియజేశాడు.
కిషన్ చందర్ రచనలు సమాజ స్వరూపానికి అద్దం
పడతాయి. మ¬దాత్త శ్రమకి, ప్రేమకీ నీరాజన
మిస్తాయి. పాఠకుణ్ణి ఆకట్టుకునే శైలీ, జీవిత వైవిధ్యం,
మానసిక అంతర్మథనానికీ మాటలతో రూపమివ్వటం
ఆయన ప్రతిభా సంపన్నతకు ప్రతీకగా నిలుస్తాయి.
పేజీలు : 136
Janglee – జంగ్లీ
₹150.00కిషన్‌చందర్ రాసిన ”జంగ్లీ” (నవల) ఒకనాటి బొంబాయ్ నగర జీవితాన్నీ, మహానగరంగా పెరుగుతున్న ఆ నగర వైరుధ్యాలనూ ప్రత్యేకించి కూటికీ, గుడ్డకూ, గూడుకూ కరువైన సాదాసీదా జనజీవనాన్ని గురించి అత్యంత అద్భుతంగా మన కళ్ల ముందు ఆవిష్కరింపజేస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ పెరుగుదలతోపాటు దాన్ని అంటిపెట్టుకుని ఉండే దారిద్య్రం, సంపన్నతలను మనం ఈ నవల ద్వారా గమనించవచ్చు. జీవిత వైవిధ్యాన్ని, మానసిక అంతర్మథనాన్ని కిషన్‌చందర్ గొప్పగా చిత్రించాడు. అనామకులైన ఇద్దరు పేద యువతీయువకుల ప్రేమగాథను కష్టాలకూ, కన్నీళ్ళకూ వేదికైన బొంబాయ్ నగర ”ఫుట్‌పాత్” అలగాజన’ జీవనస్రవంతిలో ఆ ప్రేమజంట ఏ విధంగా జీవనాన్ని సాగిస్తూ కలలు కన్న విషయాన్ని కిషన్‌చందర్ సాహితీలోకానికి అందిస్తాడు. అందుకే ఆయన భారతీయ సాహిత్య శిఖరంలో నిలవగలిగిన కొద్దిమందిలో ఒకరైనారు.
పేజీలు :186
Mrutyunjayulu – మృత్యుంజయులు
₹80.00జనంలోంచే వస్తారు ‘మృత్యుంజయులు’
ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా, ఏ వ్యవస్థలోనైనా పాలకవర్గం పాలితవర్గం నడుమ పోరాటమంటూ ప్రారంభమయితే నాటి పరిస్థితుల అనుకూల్యతను అనుసరించి అంతిమ విజయం ఉంటుంది. ఇది చారిత్రక సత్యం. అలాటి సత్యావిష్కరణకు సృజన రూపం ‘మృత్యుంజయులు’ నవల.
1946లో తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైంది. ఆ పోరాటం వస్తువుగా 1947లో ‘మృత్యుంజయులు’ నవల అచ్చయింది. ఆ పోరాటానికి తొలి అక్షరరూపం ఈ నవల. రచనా కాలానికి రచయిత బొల్లిముంత శివరామకృష్ణ వయసు 27 ఏళ్ళు. యువకుడుగా తన కాలంలో తన సమీప ప్రాంతం తెలంగాణలో ప్రారంభమైన ప్రజాపోరాట నేపథ్యాన్ని అవగాహన చేసుకొని, దాని ఆంతర్యాన్ని అర్థం చేసుకొంటూ, ఆ పోరాటం జరుగుతున్న తీరుతెన్నుల్ని గమనిస్తూ, ప్రజలపక్షమే అంతిమ విజయమని వైతాళిక గీతికగా ఆవిష్కరించిన కథా కథనం ‘మృత్యుంజయులు’ నవల.