YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 577–588 of 835 resultsSorted by latest
Anandam 24×7
₹150.00అతి సరళ, అసాధారణ ఆనందశోధనే ఈ ‘ఆనందం 24 * 7’
ఈ పుస్తకంలో ఏ మతమూ లేదు. ఏ ఆచార క్రియలూ అందించబడలేదు. ఇక్కడ ఏ ప్రగాఢ ధ్యాన ప్రక్రియలూ వివరించబడలేదు. ఎటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియల ప్రస్తావనా లేదు. ఇది మార్గనిర్దేశం చేసే పుస్తకం కాదు. ఇది సెల్ఫ్ హెల్ప్ పుస్తకం కాదు. ఇది వెంటనే పనిచేసే ఒక ఆనంద సూత్రాన్ని మీకందించదు. కాని, మీ అంతట మీరే ఆనందాన్ని ప్రత్యేక్షంగా అన్వేషించేలా తప్పకుండా ప్రేరేపిస్తుంది.
ఆనందం గురించి సద్గురు అందించిన సందేశాలకు అనుగుణంగా అల్లబడిన రోజూవారీ జీవితానికి సంబంధించిన చిన్న చిన్న కథలు మిమ్మల్ని సద్గురుతో పాటు ఆనందపు అలల మీద ఒక అద్భుత రోలర్ కోస్టర్ రైడ్ కి తీసుకేలతాయి. భావ వ్యక్తీకరణలో సద్గురుకి గల అసాధారణ స్పష్టత, ఆయన అద్భుత చమత్కార, పరిశీలనా శక్తులు, అలాగే అత్యంత ప్రగాఢ అంశాలనైనా సులభంగా, నేరుగా వివరించగలిగే ఆయన నైపుణ్యంతో నిండిన ఈ పుస్తకం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించే వారందరి కోసం.
Aalochinchu – ఆలోచించు
₹50.00‘ఆలోచించుకో, నిన్ను నువ్వు తరచి ప్రశ్నించుకో, భగవంతుడు ఉన్నాడూ లేడు, అతనిలో నమ్మకం ఉంది, లేదు – ఇదికాదు ముఖ్యం. నీకు మంచితనంలో నమ్మకం ఉందా?”
‘భగవంతుని ప్రతీక మంచితనం. అయితే మంచి అనే దాని నిర్వచనం ఏమిటి? నీకు మంచిది అనిపించిది యితరులకు మంచి కాకపోవచ్చు. అది వారికి చెడుగా పరిణమించవచ్చు.”
”అందుకనే ప్రతీదానికీ కారణం వెతకమంటాను. ప్రతి పనికీ వెనుక కారణం ఉంటుంది. ప్రతి బాధకూ, ప్రతి దు:ఖానికీ ఎక్కడో ఒకచోట కారణం ఉంటుంది. ప్రతి రుగ్మతకీ కారణం వెదకి మందువేసినట్లే మన బాధలు ఏ కారణం వల్ల మొలకెత్తాయో – ఎక్కడ పుట్టాయో తెలుసుకోవాలి., అందుకనే ఆలోచించమంటున్నాను’ స్వామీజీ లలితతో అన్న మాటలివి.
ఏమని ఆలోచించాలి? ఏం అర్ధం చేసుకోవాలి? తనే ఇటువంటి పనిచేస్తే అతను అర్ధం చేసుకుంటాడా? ఏ భర్తా ఇటువంటి సందర్భాల్లో భార్యని అర్థం చేసుకున్నట్లు తను వినలేదు. అన్ని కావ్యాల్లో, అన్ని నవలల్లో – పురుషుడు స్త్రీని అర్ధం చేసుకోమని, మరో స్త్రీతో తనని పంచుకొమ్మని భార్యని కోరాడే తప్ప ఇటువంటి కోర్కె ఏ భార్యా భర్తని కోరలేదు.
స్త్రీ అబల! ఎందుకని? పవిత్రత, పాతివ్రత్యం, ప్రకృతి – యిలా ఎన్నో కారణాలు చెబుతారు. ప్రతీసారీ స్త్రీని సహించు. సహనం కోల్పోకు, అర్ధం చేసుకో అంటూ అడుగుతారు. తానెందుకు అర్ధం చేసుకోవాలి?
స్త్రీ పురుష ప్రకృతులను ఢీకొని చేసి మిమ్ములను ఆలోచింప చేసే నవల. ప్రతి స్త్రీ తప్పక చదవాలి. ఇది మాలతీచందూర్ అపూర్వసృష్టి.
Aadhunika Mahabharatham
₹500.00“ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు… కలలు ఖనిజాలతో చేసిన యువత, మన దేశ భవిష్యత్తుకు సేవకులు”, అన్న ‘మహాకవి శేషేంద్ర గారి మాటలు ఆయన్నంత అమితంగా ఇష్టపడేలా చేసినాయి. ‘నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా?’ అన్న ఆయన వేసిన ప్రశ్న నాకు ‘మహావాక్యం’ అయింది. నీకు అత్యంత ప్రీతిపాత్రమయిన ‘ఆధునిక మహాభారతం’ అనే ఈ మహాగ్రంథాన్ని దేశ, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపనపడే వారికోసం అందుబాటులో ఉండాలన్న నీ ఆకాంక్ష. ఈ మహాగ్రంథాన్ని ఇంకోసారిలా మీ ముందుకు తీసుకొచ్చింది. నాకీ అవకాశాన్ని కల్పించిన ‘మహాకవి’ శేషేంద్ర గారి అబ్బాయి, కవి అయిన ‘సాత్యకి’ గారికి నాకు ఈ ‘మహాకవిని’ పరిచయం చేసిన నా మిత్రుడు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ గారికి నా కృతఙ్ఞతలు…
– పవన్ కళ్యాణ్
Andhakaramlo… – అంధకారంలో…
₹50.00అంధకారంలో …. రంగనాయకమ్మ నవల ………. ‘రాజేశ్వరి’ని చాలమంది చూసే ఉంటారు. చూస్తూనే ఉంటారు. జనసమ్మర్దం లేని ఏ రోడ్డువారో, ఏ చెట్టుకిందో, సంతోషమూ, విచారమూ ఏదీ వ్యక్తం చెయ్యదు. ఊరికే నించుని వుంటుంది. కొంచెం అక్కడక్కడే తచ్చాడుతూ ఉంటుంది. ఎవరన్నా వెకిలి నవ్వు నవ్వి పోకిరీమాట విసిరితే ఆశపడి దగ్గరికొస్తుంది. నిరాశ కలిగితే నెమ్మదిగా కదిలి నిశ్శబ్దంగా నడుస్తూ మన దృష్టికి దూరమౌతుంది.
శరీరాన్ని అమ్ముకోకపోతే బతకలేని స్థితి స్త్రీకి కలగటం, అనాగరికతకీ, సంఘ పతనానికీ నిదర్శనం. ఈ నవలలో రాధ-రాజేశ్వరి-మహలక్ష్మమ్మ-సుందరమ్మ వంటి పాత్రలమీద మనకు సానుభూతి కలుగుతుంది. అదొక్కటే చాలదు. అట్లాంటి పరిస్థితులు సంఘంలో ఎందుకు వున్నాయో కారణాలు గ్రహించాలి. మనిషి నవ్వుకీ, నిట్టూర్పుకు కూడా సంఘంతో సంబంధం ఉంది. ఏ నిర్మల హృదయాల ప్రేమ విఫలతకైనా, ఏ నిస్సహాయుల మానసికక్షోభకైనా ఏ నిరుపేదల కష్టపరంపరకైనా సంఘంతో సంబంధం ఉంది.
మనం మన బిడ్డలకు ఉగ్గుపాలతో నూరిపోసే ధర్మ కషాయాలూ, తల్లిదండ్రుల వికార సంసార శోభలూ, పాఠశాలల్లో పిల్లల చైతన్యాన్ని వేళ్ళతో సహా ఊడబీకే విద్యావిధానాలూ, బయట సమాజ ఆరోగ్య ప్రభావాలూ-ఇన్ని కలసి జీవితం తయారవుతున్నప్పుడు, వ్యక్తుల్నీ, వారి స్వభావాల్నీ, వారి చేష్టల్నీ, నిందించీ, విమర్శించీ సాధించేదేమీ ఉండదు. ఏ సుఖశాంతులకోసమైతే సంఘధర్మాలకు కట్టుబడాలో, ఆ సుఖశాంతులకోసమే అవసరమైతే సంఘధిక్కారమూ చేయాలి. నిజమైన మేలుచేసే వారెప్పుడూ దాన్ని ప్రశ్నించి ధిక్కరించేవారే.
ఈ నవల పూర్తిగా చదివిన తర్వాత చిన్న రాజేశ్వరి అయినా మంచి జీవితం జీవిస్తే ఎంత బాగుండును అనిపిస్తుంది. ఆ చిన్న రాజేశ్వరి మంచి జీవితం జీవించాలంటే, మనుషుల మెదళ్ళూ, వ్యవస్థలూ, ప్రభుత్వాలూ, ఇజాలూ, అన్నీ కదిలే సమస్య ఇది. అర్ధవంతమైన ‘బాపు’ ముఖచిత్రంతో, ప్రఖ్యాత రచయిత్రి రంగనాయకమ్మగారు రాసిన నవలకిది ఐదవ ముద్రణ.
555 Suruchi Vantakaalu – 555 సురుచి వంటకాలు
₹120.00555 రకాల శాకాహార, మాంసాహార సురుచి వంటలు.
ఇంకా కూరలు, పచ్చళ్ళు, వడియాలు, ఊరగాయలు, స్వీట్స్, హాట్స్, కూల్డ్రింక్స్, సూప్స్, సలాడ్స్, యిలా ఎన్నో వంటలు గురించిన గ్రంథం యిది.
ఇంచుమించు ఆంధ్రులు, కొందరాంద్రేతరులు నిత్య జీవితంలో ఉపయోగించే వంటలన్నింటినీ ఒక గ్రంథంలోకి తేవాలని గడచిన మూడు సంవత్సరాల మా కృషి యిప్పటికి ఫలించినది.
అనేక మంది చేతులు యిందులో ఉన్నవి. ఇంకా అనేక మంది పాకశాస్త్ర ప్రవీణులు వీటిని పరీక్షించడం జరిగింది. పుస్తకం వ్రాయడం కంటే వీటిని అనుభవజ్ఞులు పరిశీలించడానికే యింత కాలం పట్టినది.
తెలుగులో యింత సమగ్రమైన పుస్తకం యిదే. ఇన్ని రకాల వంటలున్న పుస్తకం కూడా యిదే.
శాకాహార, మాంసాహారులకిది ఎంతో ఉపయోగకరమైనది.
Andari Manishi – అందరి మనిషి
₹95.00‘అందరి మనిషి’ లోని కథలను శశిశ్రీ 2011-2014 మధ్య రాశారు. కొన్ని ఎప్పుడు రాసింది తెలియడం లేదు. ‘రాతిలో తేమ’ కథల సంపుటిలో శశిశ్రీ తన కథలను తానే రెండు భాగాలుగా విభజించారు. అవి 1. అంతర్లోకం 2. బహిర్లోకం. ముస్లిముల జీవితాన్ని, హిందువులతో ముస్లిముల సంబంధాలను చిత్రించేవి మొదటి విభాగం. పూర్తిగా ముస్లిమేతర జీవితాలమీద రాసినవి బహిర్లోకం. ‘అందరి మనిషి’ లోని పదకొండు కథలను కూడా అలాగే విభజించుకోవచ్చు. ‘పెద్దల పండగ’, ‘పురానా హవేలి’ పూర్తిగా ముస్లిం జీవిత ప్రతిఫలనాలు, ‘ఆరాత్రి ఆపాట’, ‘ఫో’, ‘అరుపు’ హిందూ ముస్లిం సంబంధ కథలు, ‘గుండెతడి’, ‘అందరి మనిషి’, ‘కిర్రుచెప్పులు’, ‘యెమ్టీఫెలో’, ‘గురువింద’, ‘కూపం’, ముస్లిమేతర జీవిత ప్రతిబింబాలు.
Helavathi
₹35.00‘హేలావతి’ తొలి తెలుగు దళిత నవల. మన దేశంలోని సామాజిక నిరంకుశత్వాన్ని, అమానుషత్వాన్ని నిరసించిన తొలి నవల. హైందవ సమాజ సంస్కరణ కోసం పొలికేక వేసిన నవల. ఇప్పటి దాకా తెలుగులో వచ్చిన 100 కి పైగా దళిత నవలలకు ఈ నవల పునాది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సంస్కర్తలు, ఉద్యమకారులు, ఆధునికులు, సంప్రదాయవాదులు, సామాన్యులు, మేధావులు – అందరూ చదవాల్సిన నవల. అందరికన్నా ముందే మేల్కొన్న నవల. వైతాళిక నవల. ఇది కాలంచెల్లిన నవలకాదు, నేటికీ తాజాగా ఉన్న నవల. పరిమాణంలో చిన్నది. ప్రభావంలో పెద్దది.
Mahathmudu Aayana Sidhantaalu
₹90.00బ్రిటీషు సామ్రాజ్యవాదానికి అర్జీలు దాఖలా చేసుకుని తన దేశప్రజల్ని విముక్తుల్ని గావించాలనుకున్న మోహన్ దాస్ కరం చంద్ గాంధీ విజయమో, వీరస్వర్గమో నినాదాన్ని ఏ విధంగా ఇవ్వగలిగాడు? ఆ పరిస్థితులకు ఆయన ఎందుకు నెట్టబడ్డాడు? కొల్లాయిగట్టి, సామాన్యజనాన్ని సహాయనిరాకరణోద్యమానికి ఏ విధంగా పురికొల్ప గలిగాడు? “అహింసా” మార్గంలో ప్రజలను కార్యోన్ముఖులను చేసి పాశవికమైన బ్రిటీషు దమనకాండ నెదిరించి కోట్లాది మంది ప్రజలు పాల్గొనే రీతిలో ఉప్పు సత్యాగ్రహానికి ఎట్లా నాయకత్వం వహించాడు?.
ప్రభుభక్తీ పారాయణ కుటుంబంలో జన్మించి, ఆ ప్రభువులనే ఎదిరించగలిగిన శక్తి ఆయనకెట్లా వచ్చింది? ఉద్యమం తీవ్రరూపం దాల్చినపుడు, తన సన్నిహిత స్నేహితులూ, శిష్యులూ నిరసించినప్పటికీ ఉద్యమాన్ని ఎందుకు వెనక్కులాగాడు? బహుశ సంస్కృతుల దేశంలో పుట్టి, ఆ దేశంలోని మతోన్మాదులను తనదైన మార్గంలో వ్యతిరేకించి హిందూ – ముస్లిం ఐక్యతకోసం తన ప్రాణాన్ని ఏ విధంగా వడాడు? కరం చంద్ గాంధీ “బాపూజీగా, జాతిపితగా” ప్రజలచేత ఏ విధంగా కొనియాడబడ్డాడు? రాజకీయాల్లో ఆయన వారసత్వం ఎవరికీ దక్కాలి?.
ఈ ప్రశ్నలన్నింటికీ కామ్రేడ్ నంబూద్రిపాద్ అద్భుతమైన రీతిలో ఈ పుస్తకంలో జవాబులిచ్చాడు. రాహకీయాల్లో ఉన్నవారేగాక, నేటితరం యువకులు సహితం ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలి.