YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 541–552 of 835 resultsSorted by latest
Bhaarya Kopavati
₹60.00కాఫీ గ్లాసుల్లో పోస్తున్న ఉమకు కాలింగ్ బెల్ అదే పనిగా వినిపించడంతో, అవి అక్కడ వదిలి తలుపు తీయక తప్పలేదు.
“యెవరు?” విసుగ్గా అడిగింది.
“నేను కస్తూరి గారింటినుండి వచ్చాను. వారి తమ్ముడు బాబ్జిని ఒక్కసారి పిలుస్తారా?” అన్నాడు ఆదుర్దాగా.
ఆడబడుచు పేరు వింటూనే ముడుచుకుపోయింది ఉమ.
“యెందుకు?” ముఖం చిట్లించింది.
“అరగంట క్రితం కస్తూరిగారి భర్త పోయారండి…”
అతని మాట పూర్తికాకముందే బాబ్జి వచ్చాడు. విషయం విని నోట మాటరానట్టు క్షణం నిలబడిపోయాడు.
“ఇక్కడ ఆటోలు దొరకవని ఆటోరిక్షా తెచ్చానండి.” ఆ వచ్చిన కుర్రాడు చెప్పాడు. బాబ్జి యాంత్రికంగా వెళ్ళి ఆటోలో కూర్చున్నాడు. తరువుత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
Be The Best – బీ ది బెస్ట్
₹140.00”పక్కింటి చిన్నూకి ఏ రేంక్ వచ్చింది?”
”నువ్వు రోహిత్ కన్నా ఇంగ్లీష్‌లో వెనకబడ్డావు. ఇలా ఐతే ఎలా?”
”గీత ఎంత చక్కగా పాడుతుందో! నువ్వూ ఉన్నావు ఎందుకు?”
పిల్లలు వెనకబడి పోతున్నారనే బాధతో తల్లితండ్రులు సాధారణంగా చేసే విమర్శలు ఇవి. కానీ వాల్ళు ఎదగడానికి ఏ ముడి సరుకు, ఏ ఆలోచనలు ఇస్తున్నారో గ్రహించరు. పిల్లలకి తల్లితండ్రులు చిన్నప్పటి నించే స్ఫూర్తి నివ్వాలి. లైఫ్ స్కిల్స్‌ని బోధించాలి.
ఇలాంటి అవసరం తీర్చడానికే మల్లాది వెంకటకృష్ణమూర్తి కథల రూపంలో రాసిన ‘బీ ది బెస్ట్’ కథల సంపుటి మీ చేతుల్లో ఉంది. దీనిలోని దాదాపు 150 పైగా చిన్న కథల ద్వారా లైఫ్ స్కిల్స్‌ని మీ పిల్లలకి బోధించవచ్చు. ఐఐటిలో సీట్ ఒక్కటే ముఖ్యం కాదు. జీవితంలో అన్ని రంగాల్లో విజ్ఞతగా, తెలివిగా ‘బీ ది బెస్ట్’గా ఎదిగేలా మీ పిల్లలు తయారవడానికి ఈ పుస్తకం సహకరిస్తుంది.
పేజీలు : 160
Intelligent Idiot
₹175.00దీన్ని రాయడానికి ప్రవీణ్ ఎంచుకున్న రచనా పద్ధతి విశిష్టంగా కనిపిస్తుంది. తెలుగు సాహిత్యంలోని ఒక కవితనో, ఒక కథనో, ఒక పద్యాన్నో, ఒక సన్నివేశాన్నో వివరిస్తాడు. దాన్ని రామ్ గోపాల్ వర్మ జీవితానికి, అతని జీవితంతో ముడిపడిన జీవితాలకు అన్వయించే ప్రయత్నం చేస్తాడు. అంతలోనే ఏ ఇంగ్లీష్ కవి చెప్పిన వాక్యంగాని, ఒక ఫిలాసఫర్ గాని చెప్పిన అభిప్రాయంతో గానీ దాన్ని ముడి పెడతాడు. అదీ సరిపోదనుకుంటే ఏవో కొన్ని నవలల్ని చెప్పి, వాటిలోని సన్నివేశాలతో కూడా కలిపి విశ్లేషిస్తుంటాడు. దీని ద్వారా ప్రవీణ్ అధ్యయన విస్తృతి తెలుస్తూనే, రామ్ గోపాల్ వర్మ అప్పటికైనా తనకు దొరుకుతాడో లేదోననే అన్వేషణతో మరికొన్ని మార్గాల్ని కూడా వెతుకుతూ ముందుకి వెళ్తుంటాడు. – ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆర్జీవి ఒక బుద్ధిహీనుడైన మేధావి’ అని ప్రవీణ్ ఒక పుస్తకం రాశాడు…చాలా ‘ విషయాల్ని ఎంతో విపులంగా చర్చించాడు… RGV కొత్తసీసాలో ఉన్న పాత బాగుంది.మందులాంటి వాడు… చప్పరించే కొద్దీ బావుంటుంది…. ఒకదశలో అలవాటైపోతుంది.. కొన్నాళ్ళకి మనం మెల్లి మెల్లిగా RGVలైపోతాం అదే వర్మ మ్యాజిక్..! -తనికెళ్ళ భరణి Evolution లో కోతులన్నీ మనుషులైపోయాయి. కానీ ఒక్కటి మాత్రం తిరిగి కోతిగా మారిపోయింది. ఆ కోతి పేరు ఆర్జీవి. అది తెలివైన కోతి. దానికన్నీ తెలుసు. బాగా చదువుకుంది. దానికి లాజిక్ తెలుసు, మనుషుల ఎమోషన్స్ తెలుసు, సైకాలజీ తెలుసు, అడ్డమైన విషయాలన్నీ తెలుసు. అందుకే అది మనుషులతో ఆడుకోవడం మొదలెట్టింది. -పూరి జగన్నాథ్
Bava Bava Panneru
₹70.00“హలో…” అన్నారు ఫోన్ యెత్తి. నవల మంచి రసపట్టులో ఉంది. “హలో అర్చన! నేను శ్రీధర్ని. నువ్వు వెంటనే ట్యాంకుబండ్ కు వచ్చేయి. నీతో అర్జoటు గా మాట్లాడాలి” అన్నాడు బావ.
నాకు నవ్వు వచ్చింది.
“మరో పెళ్లి చూపుల తంతా బావా? ” అన్నాను నవ్వుతు.
“అలాగే అనుకో. వెంటనే వచ్చేయి. శైలుకు చెప్పవలసిన అవసరం లేదు” అన్నాడు.
“జి హుజూర్!” అని ఫోన్ పెట్టేశాను. అలాగే ఆలోచిస్తూ నిలబడిపోయాను. అయితే నిన్నటి సంబంధం బావకు నచ్చలేదు? వరుడు ఆరడుగుల యెత్తు, అందగాడు కాకపోయినా, ఫర్వాలేదు. తెలుపు, నలుపుగాని రంగుతో ఆకర్షణీయంగానే ఉన్నాడు. అతను బ్యాంక్ లో పనిచేస్తున్నడట. తండ్రికి మెడికల్ షాపుంది. ఇద్దరే కొడుకులట. అదికాక శారదత్త కొడుకు అన్ని విధాల తగినవాడు, అనిల్ కుమార్. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
-“మాదిరెడ్డి సులోచన.”
Attagari Kadhalu
₹300.00ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన కధలు
సాహిత్య అకాడమీ వారు ఆమె రచించిన “అత్తగారి కధలు”కు బహుమతి ఇచ్చారు.1994లో ఆమె రచన “నాలో నేను” పుస్తకానికి జాతీయ బహుమతి లభిస్తుంది.
తెలుగు కాల్పనిక సాహిత్యంలో ఆద్యంతం ఉత్తమమైన హాస్యాన్ని చిందించే అపూర్వమైన కధలు బహుముఖ ప్రజ్ఞాశాలిని శ్రీమతి భానుమతి రామకృష్ణ రచించిన “అత్తగారి కధలు”. అత్తగారి అలవాట్లు ఇతరులను అక్షేపించేందుకు వాడె పదజాలం రచయిత్రి నిశిత పరిశీలనలోంచి జాలువారి ప్రవాహవేగంతో సాగే సరళ సుందరమైన ఆమె శైలిలో అత్తగారు ఎల్లప్పుడు సజీవమూర్తిగా దర్శనమిస్తుంది. అత్తగారి పాత్ర నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో ఆవిర్భవించిన ఉత్తమ ఏకైక తెలుగు హాస్య స్త్రీ పాత్ర.
మన తెలుగు కుటుంబాలలో దాదాపుగా అంతరించి పోతున్న ఒక గొప్ప ఇనిస్టిట్యూషన్ కు అత్తగారి పాత్ర సాహిత్యంలో ఏకైక ప్రతినిధి. భానుమతి గారు వాక్యవిన్యాసం ఎంతో మనోహరము గా ఉంటుందో ప్రతి వాక్యం ఎంత హాస్య స్పోరకంగా ఉంటుందో “అత్తగారి కధలు” పుస్తకంలో యాధృచ్చికంగా ఏ పేజి చదివినా సుభోధకం అవుతుంది.
Apuroopa
₹100.00రూపసుందరీ, గుణసుందరీ, చదువుల సరస్వతీ, సంస్కారవతీ అయిన అమ్మాయికి కుడి ఎడమల అన్నీ సమస్యలే.. అన్నీ చికాకులే. తను ఇష్టపడిన యువకుడ్ని పైకి తీసుకురావాలనే తాపత్రయం. చెల్లెలికి చదువు. తనచుట్టూ ఉన్న చిన్న ప్రపంచంలో మళ్ళీ సంతోష తరంగాలు వెళ్లివిరియాలనీ. నవ్వుల పువ్వులు పూయాలనీ. తన కుటుంబాన్ని సర్వనాశనం చేసిన వంశంలోని సర్వాలక్షణ సంపన్నుని వివాహమాడి తనవారికి రక్షారేఖై, తన సౌభాగ్యానికి తానే వెలియై. అపురూపంగా జీవించి. ఇంటికి దీసమై కంటికి వెలుగై విలసిల్లిన ఓ చక్కని చుక్క జీవనరాగ విపంచి ఈ అపురూప చదివి ఆనందించండి!!
Aparanji
₹100.00ఓ పుత్తడి బొమ్మ అపరంజి! పడిలేచే కడలి తరంగం ఆమె జీవితంలోని ఒక్కొక్క సంఘటన. తండ్రి కఠినాత్ముడు, కర్కోటకుడు. తన మొదటి భార్య సంతానాన్ని సొంత బిడ్డలుగా చూసుకుంటున్న తల్లిని వేదించాడు. ఆ నికృష్టుని బారి నుండి పరమతస్థుడు కాపాడి, కాల భ్రమణంలలో తన తల్లిని ఆయన అర్ధాంగిగా చేసుకున్నాడు. అపరంజిని వయసుతోబాటు తీర్చి దిద్ది నిండయిన సిసలైన అపరంజిని చేశాడు. ఆమె ఆనాడు విదేశీయాత్రకు పయనమైంది. సరదాకోసం కాదు హనీమూన్ కి అంతకంటే కాదు. తెలుగు పడుచులు మాత్రమే బాధ్యతగా గుర్తించే రక్త సంబంధీకుల క్షేమం కోసం, వారి ఉన్నతికోసం. జాలి, కరుణ, బాధ్యతల హద్దులను, ప్రేమ, త్యాగం, దీక్షల సరిహద్దులను తెలుసుకోవాలంటే అపరంజి కథకంటే ఏం కావాలి…