Showing 181–192 of 860 resultsSorted by latest

Kothi Kommachi

750.00

సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ అన్నారు పండిత కవి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు.

మేము ఒప్పుకోలేదు. మేం తీశాం. “స్నేహం” అనే సినిమా తీశాం. మాకు ముందు హిందీలో “దోస్తీ” అనే సినిమా తీశారు తారాచంద్

బ్యా

పంచదార కన్నపరదార లేపి….

“తీయని అంటే సినిమా తీయకపోవడం కాదండి – తీయనిది అంటే తీపిగా ఉండేది. ‘స్నేహం మధురమైనది అని కదా” అన్నారు స్వాతి బలరామ్

“ఓహో అదా- అయితే అలాటి తీపివి చాలానే ఉన్నాయి. వేసవి వెళ్ళగానే వచ్చే తొలకరి వానజల్లుకి మట్టి గుబాళించే వాసనల జల్లు తీయన… అమ్మానాన్నల ముద్దులు తీయన ఆలుమగల తొలిముద్దు అంతకంటే… మసక సంజెలో తొలి గిలి తగిలీ తగలని చేతులూ కలిసి కలియని చూపులూ- కృష్ణశాస్త్రిగారన్నట్లు పంచదారకన్న పరదార తీపిరా అని…

Emotional Pregnancy

290.00

 

అనగనగా ఒక చెట్టు. ఆ చెట్టు కింద ఒక అబ్బాయికి కూర్చుని ఉండడం అలవాటు. అటుగా వెళ్తూ, చెట్టుకింద కూర్చున్న అబ్బాయిని చూసి నవ్వుతూ దగ్గరకొచ్చి కూర్చుంటుంది ఒక అమ్మాయి. నవ్వూ నవ్వూ, మాటా మాటా, చేయీ చేయీ కలిశాక ఆడుకుందాం రమ్మని అడుగుతుంది. ఆ అబ్బాయి కదలడు. సరేలే అని అనుకుని వెళ్ళిపోతుంది.

మళ్ళీ మరుసటి రోజున వస్తుంది. నవ్వుతుంది. పలకరిస్తుంది. ఆడుకుందామని అడుగుతుంది. నవ్వుతాడు, పలకరిస్తాడు, కానీ కదలడు.

మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. నవ్వుతుంటుంది. పలకరిస్తుంటుంది.

ఆడుకుందామని అడుగుతూ ఉంటుంది. వాడు కదలడు.

మళ్ళీ వస్తుంది. నవ్వకుండానే, పలకరించకుండానే ఆడుకుందామని

అడుగుతుంది.

వాడు కదలకపోయేసరికి దానికి కోపం వస్తుంది. ఒక మాట అంటుంది విసురుగా. ఆడకపోతే మళ్ళీ రానని బెదిరిస్తుంది. అయినా వాడు కదలడు. దానికి ఓపిక నశించి ఇంకో రెండు మాటలనేసి వెళ్ళిపోతుంది.

అయినా మళ్ళీ తిరిగొస్తుంది. ఈ సారి ఏడుస్తుంది. ఒక్కసారైనా కదలవూ

అని బతిమాలుతుంది.

 

Cini Katha

275.00

డా. పాలకోడేటి సత్యనారాయణరావు

ప్రపంచ సినిమా చరిత్రలో ఎన్నెన్నో మైలురాళ్లు. ఈనాడు మనం చూస్తున్న సినిమా ఒక్కరోజులో రూపు దిద్దుకున్నదీ కాదు, ఒక్క వ్యక్తివల్ల సాధ్యమయిందీ కాదు. నేటి మన సినిమా ఒకనాడు, వెలుగునీడలపట్ల మనిషి ఆసక్తితో ఆరంభం అయిందనీ, కేవలం కొన్ని ఫొటోలతో మొదలయిందనీ జ్ఞప్తికి తెచ్చుకుంటే, సినిమా పురోగతి అబ్బురం అనిపిస్తుంది. దేశవిదేశాలలో సినిమా పరిశ్రమ పురోగతిని పరిశీలించడం ఒక అద్భుతమయిన అనుభూతిని కలిగిస్తుంది. ఒక్కో అడుగుగా సినిమా పరిశ్రమ నడక – అనేక దిశలనుంచీ, బహుముఖంగా సాగింది. ఈ అడుగుజాడలను అనుసరిస్తూ ముందుకు సాగటం అనేకమందిలో ఆలోచనలనూ, గత వైభవ మధురస్మృతులనూ కలుగజేస్తాయి.

సినిమా వేసిన తొలి అడుగులనుంచీ, నేటివరకూ జరిగిన శాస్త్ర సాంకేతిక పురోగతినీ, ప్రపంచంలో విడుదల అయిన ఉత్తమ చిత్రాలనూ గుర్తు చేస్తూ, మనపై ఆ చిత్రాల ప్రభావాన్నీ వివరిస్తూ, కేవలం ఒక్క నిమిషం నిడివితో ఉండేలా – ఈటీవి సినిమా ఛానల్ కోసం రూపొందించిన కార్యక్రమం ‘సినీ కథ’.

ప్రతీ దినం – ఆ క్యాలండర్ తేదీనాడు సినిమారంగంలో ఏం జరిగిందీ అనేది … సినిమాప్రపంచవీక్షణంగా, ప్రధానంగా తెలుగు సినిమా చరిత్ర కేంద్రంగా, నాటి చరిత్రకు నేటి దర్పణంగా ఈటీవి ప్రేక్షకులముందుకు వచ్చిన కార్యక్రమం ‘సినీ కథ’. ఈ కార్యక్రమం – 2017 డిసెంబర్ 1 నుంచి ధారావాహికంగా ప్రతిదినమూ ఈటీవి సినిమా ఛానల్లో ప్రసారం అవుతున్న విశిష్ట కార్యక్రమం ఇది. సినిమా చరిత్రను విభిన్నమైన దృష్టికోణంలో చూడదలిచేవారికి – ఇదొక వినూత్నమైన సమాచార విందుభోజనం. ఆరగించండి!!…………..

Anton Chekhov Kathalu 1

600.00

కథలు రాయడం నేర్పే పాఠాలు

చెహెూవ్ కథలన్నీ తెలుగులోకి తీసుకువస్తున్నామని కుమార్ కూనపరాజు గారు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషమనిపించింది. అది ఇంత తొందరలో కార్యరూపం ధరిస్తుందనీ, మొదటి వంద కథలు ఇలా పుస్తక రూపంలో మీ చేతుల్లోకి వస్తాయనీ నేను ఊహించలేకపోయాను. ఇది తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా కథా ప్రక్రియకి అపురూపమైన కానుక అని భావిస్తున్నాను.

సాధారణంగా కొత్తగా కథలు రాస్తున్నవాళ్ళు కొన్నాళ్ళు గడిచేక, తాము రాస్తున్న కథల వస్తువు పట్ల కాక, శిల్పం గురించి ఆలోచిస్తూ ఉండటం సహజం. కథలు ఎలా రాయాలి, కథని నిర్మించడంలో పాటించవలసిన నియమాలు, పద్ధతులూ ఉన్నాయా అనే విచికిత్స వాళ్ళల్లో మొదలవుతూండటం సహజం. ఈ మధ్య నేను పాల్గొన్న రైటర్స్ మీట్ లో కూడా నన్ను ఈ విషయం మీదనే మాట్లాడమని అడిగారు. కూడా.

కథ అంటే ఆధునిక కథానిక, ముఖ్యంగా, పాశ్చాత్య ప్రభావంతో రూపుదిద్దుకున్న చిన్నకథ అనుకుంటే, ఆ కథాశిల్పం గురించి తెలుగులో చెప్పుకోదగ్గ పుస్తకాలు లేవు. ఉన్న ఒకటీ అరా కూడా కొత్తగా కథలు రాస్తున్నవాళ్ళని చేయిపట్టుకు నడిపించడానికి ప్రయత్నిస్తాయి తప్ప, దారి చూపించేవిగా లేవు. ఈ నేపథ్యంలో చెహెూవ్ కథలు మొత్తం తెలుగులోకి అనువాదం కావడం నిస్సందేహంగా ఎంతో

ప్రయోజనకారి.

ఒకప్పుడు బ్రిటిష్ యువరాజు ఒక ప్రసిద్ధ నీటిరంగుల చిత్రకారుణ్ణి తనకు చిత్రాలు ఎలా గియ్యాలో నేర్పమని అడిగాడట. అందుకు ఆ చిత్రకారుడు తనకి బొమ్మలు వెయ్యడం మాత్రమే తెలుసనీ, ఎలా వెయ్యాలో నేర్పడం తెలియదనీ, రాకుమారుడు చిత్రాలు గియ్యడం నేర్చుకోదలచుకుంటే, తాను బొమ్మలు వేస్తుండగా చూడటమొక్కటే మార్గమనీ చెప్పాడట. ఈ మాట కథానికా ప్రక్రియకి కూడా వర్తింపచెయ్యవచ్చు. కథలు ఎలా రాయాలో ఎవరో చెప్తే నేర్చుకోవడంకన్నా చెహెూవ్ కథలు మనమే నేరుగా చదవడం వల్ల కథా రచన సూత్రాలు సులభంగా పట్టుబడతాయి. ఇవి కథలు రాయడమెలానో నేర్పే పాఠాలు. జీవితాన్ని ఒక కథకుడు………..

Naa Jeevana Gamanam

175.00

  అత్యంత గౌరవనీయుడు, మేధావీ, రాజకీయవేత్త అయిన అబ్దుల్ కలామ్ జీవితంలోని స్పూర్తిదాయకమైన ఉదంతాలు.

రామేశ్వరంలో గడిపిన బాల్యంతో మొదలు పెట్టి దేశాధ్యక్షుడిగా ఎదగడం వరకు అబ్దుల్ కలామ్ నడిచిన దారి అసాధారణమైనది. పట్టుదలా, కృతనిశ్చయం, ధైర్య సాహసాల రహదారి……..ఈ పుస్తకంలో అయన తన గతంలోని కొన్ని ముఖ్యమైనవి, కొన్ని సాధారణమైనవి అయిన అనుభవోదాంతాలను, కొందరి వ్యక్తిత్వాలను స్మరించుకుంటూ, అవి తనకు ఎట్లా స్పుర్తినిచ్చాయో సుందర సులభమైన శైలిలో చెప్పారు. తాను పెరిగి పెద్దవాడువుతున్నప్పుడు తన వ్యక్తిత్వంపై ముద్ర వేసిన వ్యక్తులను వాత్సల్య గౌరవాలతో తలుచుకున్నారు. వారితో తనకు గల సాంగత్యంలో తాను నేర్చుకున్న విలువైన పాఠాలను నెమరువేసుకున్నారు. తనకు అత్యంత ప్రేమ పాత్రుడైన తన తండ్రిని, ఆయన దైవభక్తిని వివరంగా జ్ఞాపకం చేసుకున్నారు. ఒక దేశాధ్యక్షునిగా ఎదిగిన క్రమంలో ఎదుర్కొన్న సమస్యలను, సంఘర్షణలను, చేసిన త్యాగాలను ఒక్కసారి వెనుతిరిగి చూసుకున్నారు.

వెనుకటి తీపి జ్ఞాపకలతోను, మరెంతో నిజాయితితో చెప్పిన ఈ వ్యక్తిగత అనభవ పరంపర ఒక అసాధారణమైన వ్యక్తి జీవిత కథ. ఇందులోంచి నేర్చుకోవలసిన విలువైన పాఠాలతో సహా………

Bhinnamga Undataniki Sahasinchandi Sampannuluga Yedagandi

225.00

‘భిన్నంగా ఉండటానికి సాహసించండి సంపన్నులుగా ఎదగండి’ అనే ఈ పుస్తకం’ త్వరగా ధనవంతులు అవండి’ అనే మరో కరదీపికలాంటిది కాదు. ఇది ఒక వ్యావహారిక జ్ఞానంతో ఆలోచనలని రేకెత్తిస్తూ 150 ఏళ్ళ సాంస్కృతిక, వాణిజ్య చరిత్రలోకి చేసే ఒక యాత్ర. దీన్నిండా ఎన్నో ఉపయోగకరమైన సలహాలూ, ఆసక్తిదాయకమైన వాస్తవాలు, వినోదాన్ని పంచే వృతాంతాలు ఉన్నాయి. ఈ పుస్తకం కాలిఫోర్నియాలో బంగారం గనుల కోసం అన్వేషణ కొనసాగించిన కాలం నుంచి యుద్దకాలంలోని బెర్లిన్ నంగరం దాకా వెళ్లి, మళ్ళీ ఈనాటి సిలికాన్ వ్యాలీ వరకూ వస్తుంది. డిస్నీల్యాండ్ నుండి సౌది అరేబియాకీ, లీవై స్ట్రాస్ నుంచి స్టార్ బక్స్ కాఫీ దాకా, జాన్ డి రాక్ఫెల్లర్ చమురుబావుల నుంచి వారెన్ బఫెట్ ఒమాహ దాకా మనల్ని తీసుకుపోతూ, అన్ని రకాల ప్రతికూల పరిస్థితులనీ ఎదుర్కొంటూ విజయం సాధించాలనే పట్టుదల, మరింత ఎత్తుకి ఎదిగే ప్రయత్నం చేసే స్త్రీ పురుషుల కధలని మనసుకి ఆకట్టుకునేలా రచయిత చెబుతాడు.

వాణిజ్యవేత్తలైన స్త్రీ పురుషులు, ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన క్రీడాకారులు, సంగీత విద్వాంసులు, సుప్రసిద్దులైన స్టీవ్ జాబ్స్, కోకో షనేల్, ఆర్నాల్డ్ స్వాజినేగర్ లాంటి వారి విజయగాధలను ప్రస్తావిస్తూ, జీవితంలో కొద్దోగొప్పో (లేక ఏమాత్రం)సాఫల్యం సాధించని అధికశాతం జనానికీ ఈ విజేతలకీ మధ్య ఉన్న తేడా కేవలం ఎక్కువ సంపద ఉండడం వల్ల మాత్రమే కాదని ఈ పుస్తకం విశదీకరిస్తుంది. విజయానికి అవసరమైన ఒక స్పష్టమైన తాత్వికతని అందిస్తుంది. కలలుకనే సాహసం చెయ్యగలవారందరి కోసం రాయబడిన పుస్తకం.

Saanukula Aalochana Sakthi – The Power of Positive Thinking

200.00

ఇంటర్ నేషనల్ బెస్ట్ సెల్లర్

ప్రపంచ ప్రసిద్ది పొందిన The Power of Positive Thinking పుస్తకమును ‘సానుకూల ఆలోచన శక్తి’ గా తెలుగులోకి తీసుకువచ్చారు.

లక్షలాది స్త్రీ పురుషులు వాళ్ళ జీవితాలను విజయవంతం చేసుకోవడానికి సహాయపడింది ది పవర్ అఫ్ పాజిటివ్ థింకింగ్. అనూహ్యమైన అమ్మకాలు సాధించిన ఇందులో డాక్టర్ పీల్ ఆచరణలో విశ్వాసం యొక్క  శక్తిని నిరూపిస్తారు. ఈ పుస్తకంలో వివరించిన ఆచరణీయ కిటుకులతో మీరు మీ జీవితంలో బలం పుంజుకోవచ్చు. పైగా మీ కోరికలను, ఆశలను నేరవేర్చుకోవటానికి అవసరమైన ఉపదేశాన్ని పొందవచ్చు. మీరు నేర్చుకోనేవి :

. మీ మీద ,మీరు చేసే ప్రతిదాని మీద నమ్మకం పెంచుకుంటారు.

. గొప్ప శక్తిని, పట్టుదలని పెంచుకుంటారు.

. మీ లక్ష్యాలను చేరుకోవటానికి అవసరమైన శక్తి పెంచుకుంటారు

. చింతపడే లక్షణాన్ని పోగొట్టుకుని విశ్రాంతికరమైన జీవనాన్ని సాధిస్తారు.

. మీ వ్యక్తిగత, వృత్తిపర సంబంధ బాందవ్యాలని మేరుగుపరుచుకుంటారు.

. మీ పరిస్థితుల మీద అధికారం పొందుతారు.

. మీ మీద మీరు దయగా ఉంటారు.

 

పాఠకుడు ఆనందమైన, తృప్తికరమైన,ప్రయోజనకరమైన జీవితాన్ని సాధించడానికి తోడ్పడాలన్న ఏకైక లక్ష్యంతో రాయబడింది ఈ పుస్తకం.

 

……. నార్మన్ విన్సెంట్ పీల్

Madhurantakam Rajaram Samagra Katha Sankalanam 5 Parts Of Set

3,000.00

సర్కసు డేరా

ఏ పుట్టలో పాములుంటాయో, ఏ పుట్టలో ఈసిళ్ళుంటాయో యిర్లవాడికి తెలిసినట్టు మరొకరికి తెలియదు. భుజాన మోపెడు ఈతపుల్లలతోనూ, చేత నీళ్ళదుత్తతోనూ వాడొకడు మీకు పల్లెపట్టుల్లో ఎదురైతే, అతగా డక్క డెక్కడో పుట్టమూసి ఈసిళ్ళు పట్టబోతున్నాడన్న మాట! కీటక సంహారకాండలో నాందీ వాచకంగా అతడు పుట్టలో ముఖ్యరంధ్రాన్ని మాత్రం మినహాయించి, మిగిలిన వాటిని మూసేస్తాడు. ఆ తరువాత చిక్కగా నీళ్ళు చిలకరిస్తాడు. రంధ్రానికి చేరువగా ఒక దిగుడు అమర్చి అందులో దివ్వె వెలిగిస్తాడు. ఎండుమట్టి పైన చల్లటి నీళ్ళు పడ్డంతో నీటి ఆవిరి పైకెగిరి, పుట్టలోపలి కీటకాలకు వాన కురుస్తున్నట్టో లేక కురిసి వెలిసినట్టో భ్రమ కలుగుతుంది. బారులు బారులుగా అవి పైకొస్తాయి. వచ్చీరాగానే మృత్యుదేవత క్రూర దంష్ట్రలాంటి దీపశిఖ వాటిని ఆహ్వానిస్తుంది. అవి మొదట రెక్కలు రాల్చుకుంటాయి. తరువాత యిర్లవాడికి మరునాటి ఎరగా మారిపోతూ కుప్పగా కూలిపోతాయి.

పూర్తిగా కాకపోయినా, కొంతవరకూ ఈ ‘పుట్టమూత’తో పోలికలున్న సంఘటన ఒకటి పట్టణంలో జరిగింది.

గంటల కల్లా భోజనాలు ముగించి, జంబుచాపలు పరచుకోవడం తరువాయిగా దీపాలు ఆర్పేసి, వెచ్చగా వక్కాకు నములుతూ అరుగులపైన కూర్చున్న పల్లెటూళ్ళవాళ్ళకు ఆకాశంలో ఓ కాంతిపుంజం కనిపించింది. అది అచ్చంగా కాంతిపుంజం కూడా కాదు. భువినుండి దివికి ఏటవాలుగా ప్రసరిస్తున్న వెలుగుబాట. ‘ఎన్నడూ లేంది, ఏనాడూ వినంది, ఏమిటీ విడ్డూరం’ అని ఒక వైపున జానపదులు వెరగుపడిపోతున్నారు, మరొకవైపున ఆ వెలుగు వినువీధిలో నాలుగైదుసార్లు వలయాలు తిరిగి, అంతటితో తన పని తీరిపోయినట్టు అంతర్ధానమైపోయింది.

మెరుపూ, ఉరుమూ ఒకేసారి ఉద్భవించినప్పటికీ శబ్దవేగం కన్నా కాంతివేగం ఎక్కువ గనుక మెరుపు ముందుగా కనిపిస్తుందని చెబుతుంది విజ్ఞాన శాస్త్రం. ఇక్కడగూడా సరిగ్గా అలాగే జరిగింది. రాత్రి ఎనిమిది గంటలు, ఆ ప్రాంతంలో వెలుగు కనిపించింది……………

Asurudu

450.00

జయ పరాజయాల పురాణ గాధ

రామాయణ కధని ఇంతవరకూ లెక్కలేనన్ని సార్లు చెప్పటం జరిగింది. ఇది భగవంతుడి అవతారం అయిన రాముడి ఆసక్తికరమైన కధ. దుష్ట రాక్షసుడు రావణుడిని అతను సంహరిస్తాడు. ఇది ప్రతి భారతీయుడికీ సుపరిచితమే. చరిత్ర పుటలలో కూడా ఎప్పుడూ కధనం విజేతల పక్షానే ఉంటూ వస్తోంది. పరాజితుల గొంతు మౌనంగా ఉండి ఎవరికీ వినిపించదు. ఒకవేళ రావణుడూ, అతని ప్రజలూ ఈ కధని వేరేవిధంగా చెప్పాలనుకుంటే ఏమవుతుంది ?

రావణాయణ కధని ఎప్పుడూ ఎవరూ చెప్పలేదు.

‘అసరుడు’ పరాజితులైన అసురుల గాధ. 3000 సంవత్సరాలుగా వెలివేయబడ్డ పిడితులు ఎంతో ప్రేమగా కాపాడుకుంటూ వస్తున్న కధ ఇది. ఇంతవరకూ ఈ కధ చెప్పే సాహసం ఏ అసురుడూ చెయ్యలేదు. బహుశా పరాజితులైన వారూ, మరణించిన వారూ కధ చెప్పే సమయం ఆసన్నమైందేమో.

“కొన్ని వేల సంవత్సరాల వరకూ నన్ను ఒక దుర్మార్గుడిగా, ప్రతినాయకుడిలా చిత్రిస్తూ వచ్చారు. భారతదేశమంతటా నా మరణాన్ని పండగలా జరుపుకుంటారు. ఎందుకు? నా కుమార్తెకోసం దేవతలని ఎదిరించాననా? కులవ్యవస్థమీద ఆధారపడిన దేవతల పరిపాలన నా ప్రజలని కాడిలా అణచివెయ్యకుండా వారిని కాపాడాననా? మీరు విజేత కధ రామాయణం విన్నారు. నా కధ రావణాయణం కూడా వినండి. నా పేరు రావణుడు, నేను అసురుడిని, నాది పరాజితుడి కధ.”

“నేను ఉనికిలేని వాడిని – కళ్ళకి కనిపించను, అశక్తుడిని, లెక్కలోకి రానివాడిని, ఎన్నడూ, ఎవరూ నా గురించి ఎటువంటి గాధలూ రాయరు. నేను రావణుడి చేతిలోనూ, రాముడి చేతిలోనూ బాధలు అనుభవించాను – ఒకరు నాయకుడు, మరొకరు ప్రతినాయకుడు. ఆ పాత్రలని అటూ ఇటూ మార్చుకోవటం కూడా సాధ్యమే. గొప్ప వ్యక్తుల కధలు చెప్పేటప్పుడు, నా గొంతు మరీ బలహీనంగా ఉండి ఎవరికీ వినిపించకపోవచ్చు. అయినా ఒక్క క్షణం నాకోసం వెచ్చించి నా కధ కూడా వినండి. నా పేరు భద్రుడు, అసురుజాతి నాది, నాది ఓటమికీ గురైన వాడి కధ.”

ప్రాచీనకాలం నాటి అసుర సామ్రాజ్యం విచ్చిన్నమై పోయింది. ఎన్నో చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి దేవతల పాదాలకింద నలిగిపోసాగింది. అసహాయ స్థితిలో అసురులు తమ రక్షకుడూ, యువకుడూ అయిన రావణుడిని ఆశ్రయించారు. రావణుడి నియంతృత్వంలో తమకి మెరుగైన భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో భద్రుడిలాంటి సామాన్య జనం ఆ యువనాయకుడిని అనుసరించాలని అనుకున్నారు. దృఢ నిశ్చయంతోనూ, విజయం సాధించాలన్న ఆకాంక్షతోనూ రావణడు విజయ పరంపరలతో తన ప్రజలని ముందుకీ తీసుకువెళ్లాడు. దేవతల రాజ్యాలన్నిటినీ హస్తగతం చేసుకుని, ఒక సువిశాల సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. రావణుడు అద్భుతమైన విజయాలు సాధించినప్పటికీ, అసురులలో పేదవారు తమ పరిస్థితిలో పెద్దమార్పేమీ జరగలేదని గ్రహించారు. సరిగ్గా ఆ సమయంలో రావణుడు ఒక్క దెబ్బతో ప్రపంచ చరిత్రనే మార్చివేశాడు.

Anandanni Ponde Margam

225.00

ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ అరుదైన పుస్తకం ఇప్పుడు 10 వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ప్రపంచంలోని గొప్ప ఆధ్యాత్మిక మార్గదర్శకుల్లోని ఒకరు దైనందిన సమస్యలని అధిగమించి శాశ్వత ఆనందాన్ని ఎలా పొందవచ్చో తన వ్యవహారిక జ్ఞానంతో ఇందులో వివరిస్తారు. దలైలామా ప్రాచ్య ఆధ్యాత్మిక సంప్రదాయమూ, కట్లర్ పాశ్చాత్య దృక్కోణమూ పొందుపరచబడ్డ ఆనందాన్ని పొందే మార్గం అందరికీ అందుబాటులో ఉండే కరదీపిక. ఇందులో మన అనుభావాలలోని కీలక అంశాలన్నిటినీ స్పృశిస్తూ, వాటికి టిబెట్ బౌద్ధమత సిద్ధాంతం సూచించే పరిష్కారాలని అన్వయిస్తూ, సమతూకాన్నీ, సంపూర్ణ మానసిక స్వేచ్చనీ పొందుతూ ఆధ్యాత్మికతని మనిషి ఎలా సాధించవచ్చో వారు వివరించారు. జీవితం పట్ల దలైలామాకి గల దృక్పథాన్ని వివరంగా తెలుసుకోవాలని కోరుకునేవారికి, ఆయన విశ్వాసాలని వాస్తవ ప్రపంచానికి ఇంతకన్నా స్పష్టంగా తెలియజేసే పుస్తకం మరొకటి లేదు.

Cinema Oka Alchemy

300.00

 అత్యంత ఆధునిక కళాప్రక్రియగా రూపొందిన సినిమా తన సంస్కరణవాడ, గ్రామీణ మూలాల నుంచి వేరుపడి ఇవాళ అది పూర్తి వ్యాపారాత్మకమైంది. నాటకరంగం విషాదంగా నిష్క్రమిస్తున్న వేళ, సినిమా వేయిపడగలు విప్పి హోరెత్తుతోంది. ఆధునిక వ్యాపారవేత్తలు, మాఫియా కలాపోశాకులుగా తల ఎత్తాక.. ఈ రంగం నుంచి ఇంకా ఏమైనా ఆశించగలమా? హరిపురుషోత్తమ రావు అన్నట్లు ‘యథాపాలకవర్గం, తథాసాంస్కృతిక రంగం.’

              ఈ ప్రధాన స్రవంతికి భిన్నంగా ప్రపంచంలో ప్రత్యామ్నాయ సినిమా కొత్త ఆశలతో చిగురిస్తోంది. మానవీయకోణం నుంచి సామాజిక ఆవరణంలోకి సాగిన భిన్న ప్రదేశాల, భిన్న ఇతివృత్తాల ఆశావహ చిత్రాల సమాహారమే వెంకట్ సిద్దారెడ్డి వెలువరించిన దృశ్యమాలిక ‘సినిమా ఒక ఆల్కెమీ.’