• Aagamanam - ఆగమనం

    Aagamanam – ఆగమనం

    మరింత శ్రద్దగా వింటే ఆ మూలుగు మూసివున్న ఆ గది తలుపుల వెనుక నుంచి వస్తున్నట్టు తెలుస్తోంది. అద్దాల తలుపుల వెనుక కర్టేన్స్ వున్నాయి.
    లోపల ప్రసన్న కుర్చీని కట్టేసి వున్నాడు. చేతులు – పెడరెక్కలు విరిచి కట్టేసి వున్నాయి. నోటికి గుడ్డ బిగించి వుంది. ఆ మూలుగు వస్తున్నది అతని దగ్గి నుంచే అతడు కట్లు విదిపిమ్చ్కోవటానికి పెనుగులాడుతున్నాడు…
    జమున గబ గబా గది తలుపులు తెరిచింది.
    ప్రసన్నా ! ప్రసన్నా ! అంటూ పరుగెత్తుకెళ్ళి అతడి చేతులకి కట్టిన కట్లు విప్పింది. అతని నోటికి కట్టేసిన బట్ట లాగేసింది.
    నేను రాకపోతే ఎంత ప్రమాదం జరిఎది ? ఆ పని కుర్రాడు, ఆ రాస్కెల్ – ఆవేశంగా అంటోంది.
    కట్లు ఊడిపోగానే ప్రసన్న కుర్చీలో నుంచి లేచాడు. అతని శరీరం నిటారుగా అయింది.జమునని చూడగానే అతడు పళ్ళు బిగించాడు. అతని చేతులు వచ్చి జమున భుజాల్ని గట్టిగా పట్టుకున్నాయి….
    ప్రసన్న గతం అతణ్ణి వెన్నాడింది. ఇష్టపడి చేసుకున్న శోభ తన అనైతిక ప్రవర్తనతో ప్రసన్నకు మనశాంతి లేకుండా చేసింది. అయితే జమున అతడికి చేరువ అవుతుంది. ఆమె అందరిలాంటిది కాదు ఆమె వ్యక్తిత్వం ప్రసన్నను  ఆకర్షిం చింది .
    కొందరి ఆగమనం ఆనంద శిఖరాలకి చేరిస్తే, మరికొందరి ఆగమనం పతనపు లోయలలోకి తోసేస్తుంది. జమున ఆగమనం ప్రసన్న జీవితాన్ని ఏ మలుపు తిప్పింది? యద్దనపూడి సులోచనా రాణి అధ్బుత పరిశీలనాత్మక నవల.

    70.00
    Add to cart
  • Anuraga Toranam,అనురాగ తోరణం

    Anuraga Toranam,అనురాగ తోరణం

      “ప్రియమైన శ్రీవారికి

                                                               లక్ష్మి నమస్కరించి వ్రాయునది : నేను రాత్రంతా బాగా ఆలోచించాను. ఒక్కసారి మన పెళ్ళి అయినా యూ పది సంవత్సరాల నుంచి, మనం గడిపిన జీవితం, యూ సంసారంలో నేను పొందిన సుఖం, ఆనందం యేమిటో, యిందులో నేను పడిన శ్రమ ఏమిటో, కూలంకషంగా నాలో నేనే తర్కించుకుని, చర్చించుకున్నాను! కానీ డబ్బు సంపాయించటం నాకు చేతకాని మాట నిజమేకాని, న శరీరశక్తితో, మీ సంపాదనలో యెంత భాగం కూడబెట్టేట్టు చేయగలిగానో, నా ఒక్కదానికే తెలుసు. అది మీకు గుర్తుచేయటం, నన్ను నేను కించపరుచుకొనటం అని భావిస్తున్నాను! “పనిపాట లేకుండా కూర్చుని తింటుంటే నీకు కష్టం తెలియటం లేదు” అని మీరు మాటిమాటికి విసుక్కుంటుంటే విని భరించటం, నన్ను కాదని ఉరుకోవటం నాకు శక్తికి మించినపని అవుతోంది.”

                                                                                                           -యద్దనపూడి సులోచనారాణి.

    60.00
    Add to cart
  • Ashala Sikharalu
  • Bangaru Kalalu
  • Dampatyavanam
  • Ee Desam Maakemichhindi - ఈ దేశం మాకేమిచ్చింది

    Ee Desam Maakemichhindi – ఈ దేశం మాకేమిచ్చింది

    ప్రభు సబ్‌ఇన్‌స్పెక్టర్‌, బిందు అతని భార్య, రచయిత్రి. వారికి నలుగురు పిల్లలు. విధి నిర్వహణలో అనికాతనే సాటి. తన పర భేదం లేదు. ఎవరు చెప్పినా వినడు. వేటికీ లొంగడు. యిలాంటి వారివల్లనే ప్రభుత్వ యంత్రాంగానికి తుష్టి పుష్టి వచ్చేది. న్యాయం, ధర్మం సక్రమంగా పాలింపబేది. అయితే ఒక్కోసారి తన ధర్మమే తన న్యాయమే ఆ ఉద్యోగికి, అతని కుటుంబానికి ప్రాణాంతకమైతుంది. చట్టాలు, న్యాయస్థానాలు అతనిని రక్షించలేవు. అతని సేవకు గుర్తింపేమిఇ? ఏ దేశ సౌభాగ్యం కోసం అతను అహరహం శ్రమించాడో ఆ దేశం వారికేమిచ్చింది?
    నిశిత సూక్ష్మ పరిశీలనలో తనకుతానే సాటియైన శ్రీమతి సులోచకనా రాణిగారి మరో ప్రయజనాత్మక, ప్రయోగాత్మక నవల.
    మనోహరమైన ఆమె శైలి నందనవనంలో విహరిస్తున్నట్లు కమనీయమైన సంగీతం వింటున్నట్లు, వేదనాభరిత హృదయాలకు స్వాంతన వచనాలు పలుకుతున్నట్లు వుంటుంది. ఈ ఏటి నవలలో దీనికి సాటి, పోటీ లేదు అని ఇప్పటికే వేలాది పాఠకులు మెచ్చిన నవల.

    80.00
    Add to cart
  • Ee Jeevitham Nadhi
  • Ee Taram Kadha
  • Hrudaya Ganam - హృదయ గానం

    Hrudaya Ganam – హృదయ గానం

    నేనంటే నీకు ఇష్టం ఉందా? నిజం చెప్పు” – మృదుల అంది .
    హర్షకిరణ్ మాట్లాడలేకపోయాడు.
    చెప్పు చెప్పు మృదుల అతన్ని చేతులతో తన మీదకి లాక్కుంది. హర్శకిరాన్ తోలి మంచం మీద కూలబడ్డాడు. మృదుల అతని మీదకి జరిగి అతని మెడ ఓంపులో ముఖం దాచుకుంది. “నేనెంత నరకం పద్తున్నానో నీకు తెలుసా ! నీకు తెలియదు. నీకెలా తెలుస్తుంది ! అంది. మృదుల అతని మెడ చుటూ చేతులు పెనవేసి ,, అతని గుండెల్లో తలదాచేసుకుంది.
    మృదుల ఓ పాతికేళ్ల అమ్మాయి. హిస్టరీ లెక్చరర్ గా భవానిపురం వెడుతుంది. అక్కడ తన స్టూడెంట్ శాంత అన్నయ్య హర్షకిరణ్ తో పరిచయం అవుతుంది. అది అనురాగంగా మారుతుంది. క్లాసులో మరో స్టూడెంట్ రమేష్ మృదుల పట్ల అభిమానం పెంచుకుంటాడు. మధ్యలో శాంత రేప్ కి గురవుతుంది. కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది.
    నాదంటూ ఒక చిన్న ఇల్లు, నన్ను ప్రేమించి ణా ప్రేమని పొందే భర్త, మా అనురాగానికి ప్రతీకగా ఇద్దరు పిల్లలు అంటూ ఒక కలల గూడు కట్టుకున్నాడు. కానీ .. విధి రాకాసిలా తన భయంకరమైన పాదంతో దాన్ని తోక్కివేసింది. ఆ గూడు పడిపోయింది. ణా జీవితం ఎడారి అయిపొయింది. .. అంటూ వాపోతుంది మృదుల . ఇష్టం వేరూ ప్రేమ వేరూ అనీ, వాటి అర్ధాలు వేరు వేరనీ మృదుల కు నెమ్మది మీద స్పష్టంగా అర్ధం అవుతుంది. సున్నితమైన ఆడపిల్ల మనసుని అతి సున్నితంగా చిత్రించిన నవల హృదయగానం .

    100.00
    Add to cart
  • Ontari Nakshatram - 1 - ఒంటరి నక్షత్రం - 1

    Ontari Nakshatram – 1 – ఒంటరి నక్షత్రం – 1

    అందరినీ క్రిటి సైజ్ చేస్తానేమో తెలియదు కానీ, నిన్ను అర్ధం చేసుకోవాలని అనుకుంటాను.
    డాడి మళ్ళి నవ్విది.
    అ నవ్వు డ్రెవర్ కి కూడా చిత్రంగా అనిపించింది. కారు ఆఫీస్ దగ్గర ఆగింది. శివా వచ్చాడు. అతను ముందు డోర్ తెరుస్తుంటే అర్జున్ దాస్ స్వయంగా తనే వెనక డోర్ తెరిచాడు. వెల్ కమ్ మై బాయ్ అన్నారు. శివా క్షణం తటపటా యించాడు. తర్వాత తప్పదన్నట్టుగా వచ్చి వెనుక సీట్లో కూర్చున్నాడు.
    ఇదేమిటి కోత్త  బట్టలు వేసుకోలేదా ! ఆయన అడిగారు.
    ఊహు ! నాకు ఇవే హాయిగా ఉంటాయి. అన్నాడు. ఆ కంఠం సూటిగా సమాధానం చెబుతున్నట్లుగా వుంది.
    అతనికి అర్జునదాస్ ఖరీదైన సూటు పంపించారు. శివా వాటిని వేసుకోలేదు. ఫైజమా లాల్చి , భుజాల చుట్టూ షాల్ . ఆ షాల్ ఎక్కడో కల్యాణి కొని యిచ్చిందట. చచ్చినా దాన్ని వదలదు. ఎంత పెద్ద ప్రోగ్రాం అయినా సే, అది భుజాల చుట్టూ ఉండాల్సిందే.
    ఆయన ” బేబి , శివా తో మాట్లాడలేదు ” అన్నారు.
    సౌందర్య ఉలిక్కి పడింది.
    శివా వైపు తిరిగింది. ఈ రోజు మీ బర్త్ డే  కదూ ! మేని హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే. అంది.
    అర్జున్ దాస్ గార ఇద్దరి చేతుల  మీద చెరో చెయ్యి ఆనిస్తూ, మీరిద్దరూ ఫ్రెండ్స్ గా వుండాలి అని ణా అభిమతం. అన్నారు. ఇద్దరూ నవ్వారు. ఆ నవ్వులో జీవం లేదు. ఇద్దరి మనసులు  , వెళుతున్న ఆ కారులోంచి దూకి పారిపోవాలని తహ తహలాడుతున్నాయి.
    అంటూ శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారు తమ నవల ఒంటరి నక్షత్రం.

    75.00
    Add to cart
  • Pardhu - పార్ధు

    Pardhu – పార్ధు

    “…పది సంవత్సరాలు అతనితో కాపురం చేసిన నాకు నీతో మళ్ళి పెళ్ళా ! ఇది జరిగే పనేనా !
    రాంబాబు ముఖం ఎర్రబడింది. ఆగ్రహం అదిమిపెట్టాడు.
    “ఈ విషయం నీతో సంబంధం పెట్టుకునే టప్పుడు నీక గుర్తు రాలేదా! అంత నీతి గలదానివి. అంతనంటే అంత గౌరవం ఉన్నదానివి, నన్నెందుకు తిరస్క రించలేక పోయావు? నీ కడుపులో పెరుగుతున్ననా  శిశువుని  సత్యం సంతోషంగా చెలామణి చేయటం నీకు న్యాయంగా ఉందన్నమాట.
    “నువ్వు ఈ కుశంకలన్ని మానేయి! నీ మనసులో అసలు భయం నాకు తెలుసు, పరువు మర్యాద కోసం పెనుగులాడు తున్నావు నువ్వు. అవి మనిద్దరి సంతోషం కంటే విలువైనవి కావ. సత్యం వెళ్ళి పోమన్నపుడు నీకింక సందేహం ఎందుకు?
    “పార్ధు వున్నాడు. వాడినేం చెయ్యను. వాడు తండ్రిని విడిచి రాదు”
    పెద్దవాళ్ళ చేడునడతలకు పిల్లలు ఎలా బలి అవుతారో చిత్రించే నవల పార్ధు . ఓ పదకొండేళ్ళ పసివాడు. తల్లి లక్ష్మి, తండ్రి సత్యం. లక్ష్మి పిన్ని కొడుకుకని చెప్పుకుని రంగ ప్రవేశం చేస్తాడు రాంబాబు. అతడొట్టి జులాయి మనిషి. లక్ష్మి కి రాంబాబుకి  అక్రమ సంబంధం ఏర్పడుతుంది. వారిద్దరూ కలిసి ఉండగా , అది ఒకనాడు పార్ధు కంటపడుతుంది . అక్కడి నుండీ ఆ పసి మనసులో అలజడి మొదలవుతుంది.
    పెద్దవాళ్ళ అనైతిక వర్తన పసి హృదయాలనేలా ప్రవ్యలు చేస్తుందో అత్యంత ప్రతిభావంతంగా చిత్రించే యద్దనపూడి సులోచనా రాణి నవల – పార్ధు.

    75.00
    Add to cart
  • Pelli + Pillalu = Jeevitam - పెళ్లి + పిల్లలు = జీవితం

    Pelli + Pillalu = Jeevitam – పెళ్లి + పిల్లలు = జీవితం

    చెందు నీరసంగా వచాడు. దానితో ఒకటే శాపనార్ధాలు. అసలే నల్లటి మనిషి , అందులో ఎత్తు పళ్ళు . కాస్త ఎత్తు. ముఖం ఎంతయినా వికారంగా అన్పిస్తుంది.
    సవితకి తన మీద తనకే అపరితమైన జాలి వేసింది. వెల్లువలా సానుభూతి పొంగి వచ్చింది. ఛీ ! ఏం మొగుడు. వద్దు మొర్రో అంటుంటే వినకుండా అమ్మ అన్నయ్య కలిసి కానీ కట్నం ఇవ్వనవసరం లేదు కదా అని ఈ మృగానికి తనని కట్టబెట్టారు. ఈ గంగిరెద్దు ఎవరో కాదు. స్వయంగా తనకి మేనత్త కొడుకే ! ఈ చంద్రమోహన్ చిన్నప్పటినుంచీ అంతే ! అడంగిలా వాళ్ళమ్మ వెనుక చేరి ఇంటి పనుల్లో సాయం చేయమంటే ఫస్ట్.
    తను ఎండమావుల వెంట పరుగేడుతోందన్న సంగతి తెలుసుకోవడానికి సవిత కి చాలా సమయమే పట్టింది. అందం, ఆకర్షణ, గ్లామర్ , పేరు లాంటి వాటిని నమ్ముతూ బ్రతికేవారు ఎప్పుడో ఒకప్పుడు బంగపడక  తప్పదు . పెళ్లి , పిల్లలు లేని లోటు ఈ ప్రంపంచంలో ఏదీ తీర్చలేదు. ఈ బందం జీవితానికి ఇరుసు లాంటిది. అది లేకపోతె చక్రం ఉండదు. గమనమూ ఉండదు. జీవితంలో ఈ రెండింటి అవసమేమిటో చిత్రించే యద్దనపూడి సులోచనా రాణి నవల   పెళ్లి !+ పిల్లలు !! = జీవితం.

    50.00
    Add to cart