• 16 Yuva Rachayithala Tholiprema Kathalu

    16 Yuva Rachayithala Tholiprema Kathalu

    ఈ కథలన్నీ కాలాల మీదగా వీచిన హాయితనపు   గాలులు కాదు. వీటిలో ఈదురు గాలులున్నాయి, ఇప్పటికి ఎదల్ని కొస్తోన్న అంతుపట్టని సమాజపు   సజీవావవశేషాల  ఛాయలున్నాయి. ముళ్ళకంపల మీదగా నడిచొచ్చిన పాదాలు భద్రంగా దాచుకున్న గాయాల  తాలుకా ముద్రాలున్నాయి. పసివయసులో ఒక్కోరూపాయిని ముంతలో వేసుకున్నట్టే…. ఆనందాలని , ఆశ్చర్యాలని, నిరంకుశత్వాన్ని మూసినా నిర్మలత్వాని, కళ్ళల్లో అట్టే పెట్టుకున్న కన్నీళ్లని, అంటిపెట్టుకున్న పసితనపు అరోమా వాసన్లని  , కొనసాగుతోన్న కౌమారపు కాలాల కార్యాల లొలకపు కంపానలా  అవర్తనాలను, శిథిల జ్ఞాపకాల పుటల మీద కొత్తజీవితాలను నిర్మించుకుంటున్న కోట నీడల రెపరెపల పాటలను ఈ పుస్తకం సాక్షిగా వలపోసుకున్నారు.

    165.00
    Add to cart
  • Cinema Kadhalu

    Cinema Kadhalu

    ఈ భూమి మీద పుటిన ప్రతి జీవి తన పరిణామ క్రమంలో ముందుకు సాగుతూ తమ జాడలను వదిలివెళ్తుంది. కానీ మనిషి వేరు. సాహిత్యం, సంగీతం, చిత్రకళ, చలనచిత్రం, శిల్పకళ లాంటి ఎన్నో కళారూపాలతో ఈ భూమి మీద తన ఉనికిని ప్రత్యేకం చేసుకున్నాడు. కళలే లేని మానవ చరిత్రని ఉహించగలమా? అటువంటి కళల్లో అన్నింటికంటే సరికొత్తది చలనచిత్రకళ. ఎన్నో శతాబ్ధాలుగా ఏదుగుతూ వచ్చిన కళారూపాలను తనలో ఇముడ్చుకొన్న శక్తివంతమైన మాధ్యమం చలన చిత్రం. వందేళ్ల క్రితం మొదలై తనకై తనగా అభివృద్ధి చెందుతూ, మిగితా కళారూపాలనుంచి స్ఫూర్తి పొందుతూ కొత్తకొత్త రూపాలను సంతరించుకుంటూ వస్తున్న ఈ కళకు, సాహిత్యంలో ఏంతో అవినాభావ సంబంధం ఉంది. మొదట్నుంచి కూడా సాహిత్యమే సినిమాకు ముడిసరుకు. సాహిత్యంలో గొప్పవిగా బావించబడ్డ ఎన్నో కధలు, నవలలు చలనచిత్రాలుగా రూపొందాయి.

                                                                                 -వెంకట్ శిద్ధారెడ్డి.

    225.00
    Add to cart
  • Cinema Oka Alchemy

    Cinema Oka Alchemy

         అత్యంత ఆధునిక కళాప్రక్రియగా రూపొందిన సినిమా తన సంస్కరణవాడ, గ్రామీణ మూలాల నుంచి వేరుపడి ఇవాళ అది పూర్తి వ్యాపారాత్మకమైంది. నాటకరంగం విషాదంగా నిష్క్రమిస్తున్న వేళ, సినిమా వేయిపడగలు విప్పి హోరెత్తుతోంది. ఆధునిక వ్యాపారవేత్తలు, మాఫియా కలాపోశాకులుగా తల ఎత్తాక.. ఈ రంగం నుంచి ఇంకా ఏమైనా ఆశించగలమా? హరిపురుషోత్తమ రావు అన్నట్లు ‘యథాపాలకవర్గం, తథాసాంస్కృతిక రంగం.’

                  ఈ ప్రధాన స్రవంతికి భిన్నంగా ప్రపంచంలో ప్రత్యామ్నాయ సినిమా కొత్త ఆశలతో చిగురిస్తోంది. మానవీయకోణం నుంచి సామాజిక ఆవరణంలోకి సాగిన భిన్న ప్రదేశాల, భిన్న ఇతివృత్తాల ఆశావహ చిత్రాల సమాహారమే వెంకట్ సిద్దారెడ్డి వెలువరించిన దృశ్యమాలిక ‘సినిమా ఒక ఆల్కెమీ.’

    230.00
    Add to cart
  • Soul Circus

    Soul Circus

    మంచి పుస్తకం చదివి ఆస్వాదిస్తే కలిగే ఆనందమేంటో నాకు తెలుసు. తెలుగు సాహిత్యం మాత్రమే కాకుండా ఇతర భారతీయ భాషల్లోనూ, ఆంగ్ల భాషలోనూ వచ్చే సాహిత్యాన్ని విరివిగా చదవడం నాకు అలవాటు. ఒక తరం వేరొక తరానికి తమ అనుభవపరంపరను నిరంతరం అందించే శాశ్వత విజ్ఞాననిధులు పుస్తకాలు.

                   కానీ నా తర్వాత తరంలో పుస్తకాలు చదవడం తగ్గిపోతుందనే ఆలోచన నాకు కొంత బాధ కలిగించింది. పుస్తకాలు చదవడంలోని ఆనందాన్ని కొత్త తరానికి పరిచయం చెయ్యాలన్న ఆలోచన నాలో ప్రస్ఫుటంగా నాటుకుంది.

    2018 డిసెంబర్ లో ఒక రోజు మా శ్రీవారు సత్యదేవ్ నాతో మాట్లాడుతూ మనమొక పబ్లిషింగ్ హౌస్ స్థాపించబోతున్నామనగానే నాకు పాలో కొయిలో చెప్పిన ఒక సత్యం గుర్తొచ్చింద

    275.00
    Add to cart