• Money Purse

    Money Purse

    డబ్బులు చెట్లకు కాస్తున్నాయా?… అవును కాస్తాయి!! విత్తునాటే నేలనుబట్టి చెట్టు పెరుగుదల ఫలాలు ఉంటాయి. రూపాయి కూడా అంతే! నువ్వు దాన్ని పోస్టాఫీసులో నాటుతావా? బ్యాంకులో నాటుతావా? షేర్స్ లో నాటుతావా? ఇంటిపై నాటుతావా? బీమాలో నాటుతావా? లేదా అన్నీకలిపిన నేలలో నాటుతావా? అన్నదాన్ని బట్టి ఫలం. మరి ఎక్కడ నాటాలి? మీరు ఎవరినీ అడగాల్సిన పని లేకుండా వంగా రాజేంద్రప్రసాద్ చెబుతారు. ‘ఫీజు’ రూపాయలు. ‘చదువులు మనకన్నీ నేర్పుతాయి. డబ్బును ఎలా వాడుకోవాలో తప్ప’ అన్న ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి చెప్పిన మాటలు మిమ్మల్ని ఆలోచనల్లో పడేసి ఉంటే ఆ మిగిలిన ఒక్క నైపుణ్యాన్ని నేర్పే టీచరే ఈ పుస్తకం. పత్రికల్లో ఆర్ధిక సలహాలు అందిస్తున్న రాజేంద్రప్రసాద్ వృధా వాక్యాలు వాడకుండా ఇంత సరళంగా ఆర్ధిక పాఠాలెలా చెప్పారన్నదే పెద్ద ప్రశ్న.

    – సాక్షి దినపత్రిక

    250.00
    Add to cart
  • Money Purse 2

    Money Purse 2

    సంపాదించడానికి ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తూనే ఉన్నారు. భూమ్మీద లెక్కలేనన్ని ఆదాయ మార్గాలున్నాయి. కానీ మనలో చాలామంది – సంపాదించిన దానిని వృధా కాకుండా పొదుపు చేయడానికి, మంచి ఆదా మార్గమేదో తెలుసుకోవడానికి శోధించడం లేదు పూర్తిస్థాయిలో. అందుకే ఆదాయ మార్గాల గురించి కాకుండా, అనవసర వ్యయాల గురించి, ఆధిక లాభాలనిచ్చే ఆదా మార్గాల గురించి చర్చించా ఈ పుస్తకంలో.

    చిట్ ఫండ్స్  లాభమా? నష్టమా?

    నేలను నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడా…?

    రియల్ ఎస్టేట్ పెట్టుబడికి ఏ జాగ్రత్తలు తీసుకొవాలి?

    వంద రూపాయలతో పది వేల కోట్లు……. ఎలా?

    ఏడాదికి 9% వడ్డీ గిట్టబాటయ్యే ఎండోమెంట్ బీమా పాలసీ ఏది?

    ఎల్ ఐ సి ఎండోమెంట్ పాలసీ లో రాబడి ఎంత?

    ఏది ఉత్తమ పెట్టుబడి?

    నమ్మకానికి అమ్మ వంటిది ఎల్ ఐ సి మాత్రమేనా?

    ప్రైవేటు బీమా కంపెనీలను నమ్మ వచ్చా?

    ఏజంటు లేకుండా పాలసీ తీసుకోవచ్చా?

    పిల్లలని కోటిశ్వరులను చేయడం ఎలా?

    పోస్టల్ అర్ డి, బ్యాంక్ అర్ డి ల లో ఏది ఎక్కువ లాభం?

    వేయి రూపాయలు= లక్ష రూపాయలు

    బంగారానికీ కల్తీ కావాలి

    ఆరోగ్య మహాభాగ్యానికి ఏమి చేయాలి?

    బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ లాభమా? నష్టమా?

    బంగారం ఎలా కొంటే మంచిది?

    జీవిత బీమా తక్కువయితే నేరం, ఎక్కువయితే ప్రమాదం

    ….ఇంకా ఎన్నో ఆర్ధిక సందేహాలకు చదవండి….

    ఇది 5వ ముద్రణ…

    300.00
    Add to cart
  • Money Purse 3

    Money Purse 3

    ఏడాదికోసారి ‘హెల్త్ చెకప్’ చేయించుకుంటే రోగాలు రాకుండా జాగ్రత్తపడొచ్చు. ‘వెల్త్ చెకప్’ చేయించుకుంటే ఆర్ధిక సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. కానీ వెల్త్ చెకప్ ఎవరు చేస్తారు? మనీపర్స్ చదివితే వెల్త్ చెకప్ అయి ఆర్ధికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకాలు.

                                                  – గంపా నాగేశ్వరరావు గారు

                   లక్ష్మీదేవి తన భార్యే అయినా వెంకటేశ్వర స్వామి నిత్యం నిలబడి సంపాదిస్తున్నాడు. కానీ కుబేరుడు..? కుబేరుడిలా కూర్చొని, పడుకుని, నిద్రపోతూ కూడా సంపాదించాలి అనుకుంటారా? కుబేరుడిలా శ్రమలేని ఆదాయం రావాలంటే ఆయనలా మీ డబ్బుని ఎక్కడ, ఎప్పుడు, ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియాలి. ఆ ఆర్ధిక అక్షరాశ్యతలో భాగంగానే మనీపర్స్ 1 & 2 వచ్చాయి. ఇప్పుడు మనీపర్స్ – 3 మీ చేతిలో ఉంది. చదవండి…

    ఈ పుస్తకం ద్వారా ఎక్కువ లాభం పొందాలి అనుకుంటున్నారా మీరు? ఐతే, కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాం అనే ఉద్దేశ్యంతో చదవకండి. తెలుసుకుంటే జీవితాలు మారవు. తెలిసిన విషయాలను ఎంతవరకు ఆచరిస్తున్నారని మిమ్మల్ని మీరు సమీక్షించుకోవడానికి చదవండి. పొద్దున్నే లేచి ఓ గంట నడిస్తే లాభం అని నాకు తెలిస్తే… ఏం లాభం? నడిస్తే లాభం. అలా రోజూ నడిచేంత వరకు నడక వల్ల ప్రయోజనాలు తెలుసుకుంటూనే ఉండాలి నేను. అలాగే మన జీవిత ఆర్ధిక ఆరోగ్యం ఎలా ఉందో మనకి మనం తెలుసుకునేందుకు మన ఫైనాన్స్ ని మనమే స్కానింగ్ చేసుకోవాలి. అందుకు ఈ పుస్తకం కొంతవరకు పనికొస్తుందని నమ్ముతున్నా.

    ఈ పుస్తకంలో…

    ఎంత సంపాదించాలి?

    ఇల్లుకొందామా? అద్దెకుందామా?

    పర్స్ లో పైసా తీయకుండా ఫ్లాట్ ఋణం తీర్చవచ్చా?

    ఇంటి రుణ వాయిదాలు భారం అయితే.. ఏం చేయాలి?

    అద్దెకారు తీయన… సొంతకారు పుల్లన ?

     

    300.00
    Add to cart