బరువు తగ్గాలన్న, ఆరోగ్యంగా జీవించాలన్నా ఆహారంలో కొవ్వులు, మాంసకృత్తులు సరైన పాళ్లలో వుండాలి. పిండి పదార్ధాలను 10 నుండి 20 శాతానికి పరిమితం చేసి, మాంసకృత్తులు 20 నుండి 40 శాతానికి, కొవ్వులను 60 శాతం రోజువారీ ఆహారంలో వుండేలా చూసుకోవాలి.
జంతుమూలాల నుండి వచ్చే మాంసకృత్తులు మంచివి. శరీరానికి కావలసిన అన్ని కొవ్వు అమలలు అందులో వుంటాయి. పాలు, పాల ఉత్పత్తులలో కూడా.
మన దేశ జనాభాలో ఊబకాయం వస్తున్నది ప్రధానంగా పిండిపదార్ధాలు ఎక్కువగా తినడం వల్లనే. కొవ్వులు తినడం వలన కాదు. నిజానికి తగుపాళ్లలో కొవ్వులు, ప్రోటీన్లు తీసుకుంటే అదనంగా శరీరంలో వున్న కొవ్వులు తగ్గుతాయి.
మన శరీరంలో ప్రతికోణం బ్రతకడానికి, పని చెయ్యడానికి కొలెస్ట్రాల్ ఎంతో అవసరం.
-డా|| జాసన్ ఫంగ్.
₹100.00
నిత్య జీవితావసరాల కోసం రోజూ ఎంతో శ్రమిస్తూ మనం సంపాదించుకున్న విలువైన డబ్బును వెచ్చించి పౌష్టికాహారం పేరుతో విషాన్ని తినాల్సి/ తాగాల్సి రావడం ఈ శతాబ్దపు గొప్ప విషాదం. ఏ ఆహారం తింటే ఆరోగ్యం చేకూరుతుందో మనకు చెప్పాల్సిన బాధ్యతలున్న ప్రభుత్వ, ప్రజారోగ్య, వైద్య పత్రికా వ్యవస్థలన్నీ కేవలం తమ స్వార్ధం కోసం ఆహార రంగంలోని బహుళ జాతి కంపెనీల ప్రలోభాలకు లొంగి తినకూడనిది తినమని ప్రచారం చేస్తూ ప్రజల ఆరోగ్యానికి కీడు చేస్తున్నాయి. వీరందరూ కలిసి శాస్త్రీయత మాటున అశాస్త్రీయతను ప్రచారం చేస్తున్న ఫలితంగా సామాన్యులు రోగగ్రస్తం అవుతున్నారు. లాభార్జనే ధ్యేయంగా నడుస్తున్న వైద్య , ఆరోగ్య శాఖలూ/వ్యక్తులూ/ప్రజల రోగాలను, మరణాలను కూడా సొమ్ము చేసుకునే ఒక క్రూరమైన వ్వవస్థను ఆవిష్కరించారు.
₹100.00