-
21 Va Sathabdhi Vyaparam
₹225.00ఆర్ధికవ్యవస్థ ఇక్కడ సమస్య కాదు.
ఆ సమస్య మీరే.
కార్పోరేట్ ప్రపంచంలోని అవినీతి మీద కోపంగా ఉందా? వాల్ స్ట్రీట్, పెద్దపెద్ద బ్యాంకుల మీద కోపంగా ఉందా? చేయాల్సిన సరైన పనులు చేయకుండా, చేయకూడని చెడ్డపనులు చేస్తున్న ప్రభుత్వం మీద కోపంగా ఉందా? లేక, మీ ఆర్ధిక పరిస్థితులను అదుపులో ఉంచుకోనందుకు, మీమీదే కోపం కలుగుతోందా?
జీవితం కఠీనంగానే ఉంటుంది. ప్రశ్న ఏమిటంటే – దాని గురించి మీరేం చేయదలుచుకున్నారు? ఆర్ధికవ్యవస్థ గురించి ఏడుస్తూ కూర్చున్నా, లేక ఇతరులను నిందించినంత మాత్రాన మీ ఆర్ధిక భవిష్యత్తుకు భద్రత కలగదు. మీరు సంపద కావాలనుకుంటే, దానిని మీరు సృష్టించాలి. మీ ఆర్ధిక భవిష్యత్తును మీ చేతుల్లోనే ఉంచుకునే ఆవశ్యకత ఉంది. దానికోసం మీరు మీ ఆదాయం మూలాన్ని అదుపులోకీ తీసుకోవాలి – ఈనాడే!
మీకో సొంత వ్యాపారం ఉండాలి.
అధిక సంఖ్యాకులకు ఆర్ధికపరంగా ఇది కష్టకాలం కావచ్చు. కాని ఎంతోమంది వ్యాపారవేత్తలకు సొంత వ్యాపారం ఏర్పరచుకోవటానికి ఇదే సరైన సమయం. దీనిని మించిన సమయం ఇంతవరకూ రానేలేదు.
రాబర్ట్రా టి. కియోసాకీ (రచయిత గురించి) :
రాబర్ట్ టి. కియోసాకీ ఒక మల్టిమిలియనేర్ మదుపరి, బిజినెస్ సొంతదారు, విద్యావేత్త, వక్త, అత్యధికంగా అమ్ముడుబోయే రిచ్ డాడ్ పూర్ డాడ్ గ్రంథమాల రచయిత. తన 47వ ఏట పదవీవిరమణ చేశాక ఆయన క్యాష్ ఫ్లో టెక్నాలజీస్ సహావ్యవస్థాపకుడుగా ఉన్నారు. రిచ్ డాడ్ కంపెనీను స్థాపించారు. ఈ కంపెనీ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కొన్నిలక్షలమంది జనానికి ఆర్ధికస్వేచ్చ ఎలా పొందాలి అన్న అంశం మీద సలహాలని అందిస్తోంది. రాబర్ట్ 16 పుస్తకాలు రాశారు. 27 కోట్లకీ పైగా అవి అమ్ముడయాయి.
జాన్ ప్లెమింగ్ (రచయిత గురించి) :
జాన్ ప్లెమింగ్ ఒక విజయవంతమైన వాణిజ్యవేత్త, సలహాదారు, వక్త. ప్రస్తుతం డైరెక్టర్ సెల్లింగ్ న్యూస్ అనే పత్రికకు ప్రచురణకర్తగా ఉంటున్నారు. జాన్ ద వన్ కోర్స్ అనే పుస్తకం కూడా రాశారు. ఆర్కిటెక్చర్ సిద్ధాంతాల్ని ఉపయోగిస్తూ విజయవంతమైన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో ఇది వివరిస్తుంది.
-
Rich Dad Poor Dad
₹399.00రిచ్ డాడ్ పూర్ డాడ్….
* ధనికులు అవాలనుకునే వారు ఆదాయాన్ని అధికంగా సంపాదించాలి అనే కట్టుకధని పటాపంచలు చేస్తుంది.
* మీ ఇంటిని మీరొక ఆస్తి అనుకునే నమ్మకాన్ని సవాలు చేస్తుంది.
* తమ పిల్లలకి డబ్బు గురించి నేర్పించటానికి నేటి విద్యా విధానం మీద ఎందుకు ఆధారపడకూడదో తల్లిదండ్రులకు తెలియజేస్తుంది.
* ఆస్తి, అప్పులకు ఆర్ధికపరమైన శాశ్వత నిర్వచనాలను ఇస్తుంది.
* మీ పిల్లలు భవిష్యత్తులో ఆర్ధికంగా విజయం సాధించటానికి, వాళ్ళకు ఏం నేర్పాలో మీకు బోధిస్తుంది.
రాబర్ట్ కియోసాకీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమంది జనానికి డబ్బు గురించి ఎలా ఆలోచించాలో నేర్పి, వాళ్ళ జీవితాలను సమూలంగా మార్చారు. సూటిగా మాట్లాడడం లోనూ, ధైర్యంగా మూసభావాలని ఎదుర్కోవడంలోనూ అతను పేరు పొందారు. తరచూ అతని వైఖరి సాంప్రదాయక వివేకాన్ని ధైర్యంగా ఖండిస్తూంటుంది. ఆర్దిక స్వాతంత్ర్యాన్ని ఆవేశపూరితంగా సమర్ధించే వ్యక్తీగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు.
రిచ్ డాడ్ పూర్ డాడ్ అత్యుత్తమ వ్యక్తిగత ఆర్ధిక గ్రంథం
“భవిష్యత్తులో భాగ్యవంతులవాలనుకునేవాళ్ళు రిచ్ డాడ్ పూర్ డాడ్ తోనే మొదలుపెట్టాలి.”
– యు.ఎస్.ఎ.టుడే
“జనం డబ్బు కోసం కష్టాలు పడటానికి ముఖ్యకారణం, వాళ్ళు ఎన్నో ఏళ్ళు విద్యాలయాల్లో చదువుకున్నప్పటికీ, డబ్బు గురించి అక్కడ ఏమీ నేర్చుకొకపోవటమే! దాని ఫలితం – వాళ్ళు డబ్బు కోసం పనిచేయటం నేర్చుకుంటారు…. కాని, డబ్బు చేత పనిచేయించటం వాళ్ళెన్నడూ నేర్చుకోరు.”
– రాబర్ట్ కియోసాకీ
-
The Business School
₹225.00ఇతరులకు సాయం చేయాలనుకునే వారి కోసం
అత్యధికంగా అమ్ముడుబోయే తన పుస్తకం రెండో ప్రచురణలో రాబర్ట్ టి. కియోసాకీ, నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో తన మౌలికమైన ఎనిమిది ‘దాగివున్న విలువలను’ అప్ డేట్ చేస్తూ, విశదీకరిస్తాడు. స్పెషల్ బోనస్ – కిమ్ కియోసాకీ, షెరాన్ లెక్టర్, డయాన్ కేన్నేడిల మూడు అదనపు ‘దాగివున్న విలువలు’.
నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ గురించి రాబర్ట్ ఇలా వివరిస్తారు…
….. సంపదను పొందేటందుకు అదొక విప్లవాత్మకమైన పధ్ధతి.
….. అది ఎవరికైనా గొప్ప సంపదను పొందగలిగే అవకాశాన్ని ఇస్తుంది.
….. కోరిక, దృఢనిశ్చయం, పట్టుదల ఉన్న ప్రతివారికీ అది అందుబాటులో ఉంటుంది.
“నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ సాయంతో నేను భాగ్యవంతుడిని కాలేదు కనుక, ఆ పరిశ్రమ గురించి నేను కొంచెం నిష్పాక్షపాతంగా ఉండగలను. నా దృష్టిలో నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ కున్న లాభాలను – కేవలం అధిక ధన సంపాదనకె పరిమితం కాని లాభాలను – ఈ పుస్తకం వివరిస్తుంది. చివరికి నేను హృదయమున్న ఒక వ్యాపారాన్ని కనుగొన్నారు.”