-
Ammaki Adivaram Leda – అమ్మకి ఆదివారం లేదా
₹180.00అమ్మ’కి ఆదివారం లేదా? – రంగనాయకమ్మ (50 కథల సంపుటి)
ఇందులో యాభై కథలు ఉన్నాయి. ఈ సంపుటి ‘అమ్మ’కి ఆదివారం లేదా? అన్న టైటిల్‌తో వెలువడింది. గృహిణులు ఇంటి పనులకీ వంట పనులకీ వారంలో ఒకరోజు స్వస్తి చెప్పి విశ్రాంతి తీసుకునేందుకు వీలు కల్పించాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యురాలు సరోజ్ కపర్దే లోగడ ఒక బిల్లును ప్రతిపాదించారు. ఇల్లాళ్లకు వారానికి ఒకనాడైనా విశ్రాంతి అవసరమన్నది సదరు బిల్లు ఉద్దేశ్యం. అయితే రంగనాయకమ్మగారి వాదన అందుకు భిన్నం. ఈ బిల్లుకు సంబంధించిన వార్తని చూశాక ఆమె ‘అమ్మకి ఆదివారం లేదా? అన్న కథ రాశారు. ఒకరోజు సెలవుతోనే అంతా చక్కబడిపోయి సమస్యలు తీరుతాయా? అని ఆమె ప్రశ్నిస్తారు.
”ఆడా మగా సమానం అవ్వాలంటే సరైన ఏకైక సూత్రం ఏమిటో తెలుసా? ఇద్దరికీ బైటిపనీ, ఇద్దరికీ – ఇంటిపనీ! అదీ సూత్రం. బైటిపనికే సెలవులు వుంటాయి. అవి ఇద్దరికీ వుంటాయి. ఇంటిపనికి సెలవులుండవు” – అంటూ వేణు పాత్ర ద్వారా చెబుతారు రంగనాయకమ్మ గారు. ఇక చిన్నపిల్లల్ని ముసలివాళ్లకి యిచ్చి పెళ్లిళ్లు చేయటాన్ని నిరసిస్తూ రాసిన కథ ‘సంస్కరణ’. ‘డబ్బు’ కథ కట్నం సమస్యని చర్చిస్తుంది. ”కట్నం సమస్యలాగా కనబడే సమస్యంతా ఆస్తి సమస్యే”నంటుంది ఇందులో ఒక పాత్ర. ఇక సంకలనం మొత్తంలోకీ ఎన్నదగినదీ, చెప్పుకోదగినదీ అయిన కథ ‘కుట్ర’. భారతదేశంలో ఇంకా విప్లవం రాకపోవడానికి ఏకైక కారణం అర్థంకాని విప్లవకారుల తెలుగు రాతలేనని తీర్మానించి వారికి జడ్జిగారు పదేసేళ్ళు జైలుశిక్షలు వేసే కథ ఇది.
పెళ్లి చేసేశాం, కథా – జీవితం, మీటింగ్ పెళ్ళి, స్త్రీ, ఆర్తనాదం, ఆ రాత్రి, వానరాత్రి, అమ్మ, తల్లిమనసు, తృప్తి, క్షమ, దొంగ వొస్తే బాగుణ్ణు!, సుబ్బారావు ప్రేమకథ, ఆశ్చర్యం!, లంచం, బడిమానేశావేం? (చిన్న పిల్లల నాటిక), పార్వతమ్మ, కవిగారూ – కుర్రాళ్ళూ లాంటి మంచి కథలు ఈ సంపుటిలో వున్నాయి.
రాయల్ సైజు బాండ్. -
Andhakaramlo… – అంధకారంలో…
₹50.00అంధకారంలో …. రంగనాయకమ్మ నవల ………. ‘రాజేశ్వరి’ని చాలమంది చూసే ఉంటారు. చూస్తూనే ఉంటారు. జనసమ్మర్దం లేని ఏ రోడ్డువారో, ఏ చెట్టుకిందో, సంతోషమూ, విచారమూ ఏదీ వ్యక్తం చెయ్యదు. ఊరికే నించుని వుంటుంది. కొంచెం అక్కడక్కడే తచ్చాడుతూ ఉంటుంది. ఎవరన్నా వెకిలి నవ్వు నవ్వి పోకిరీమాట విసిరితే ఆశపడి దగ్గరికొస్తుంది. నిరాశ కలిగితే నెమ్మదిగా కదిలి నిశ్శబ్దంగా నడుస్తూ మన దృష్టికి దూరమౌతుంది.
శరీరాన్ని అమ్ముకోకపోతే బతకలేని స్థితి స్త్రీకి కలగటం, అనాగరికతకీ, సంఘ పతనానికీ నిదర్శనం. ఈ నవలలో రాధ-రాజేశ్వరి-మహలక్ష్మమ్మ-సుందరమ్మ వంటి పాత్రలమీద మనకు సానుభూతి కలుగుతుంది. అదొక్కటే చాలదు. అట్లాంటి పరిస్థితులు సంఘంలో ఎందుకు వున్నాయో కారణాలు గ్రహించాలి. మనిషి నవ్వుకీ, నిట్టూర్పుకు కూడా సంఘంతో సంబంధం ఉంది. ఏ నిర్మల హృదయాల ప్రేమ విఫలతకైనా, ఏ నిస్సహాయుల మానసికక్షోభకైనా ఏ నిరుపేదల కష్టపరంపరకైనా సంఘంతో సంబంధం ఉంది.
మనం మన బిడ్డలకు ఉగ్గుపాలతో నూరిపోసే ధర్మ కషాయాలూ, తల్లిదండ్రుల వికార సంసార శోభలూ, పాఠశాలల్లో పిల్లల చైతన్యాన్ని వేళ్ళతో సహా ఊడబీకే విద్యావిధానాలూ, బయట సమాజ ఆరోగ్య ప్రభావాలూ-ఇన్ని కలసి జీవితం తయారవుతున్నప్పుడు, వ్యక్తుల్నీ, వారి స్వభావాల్నీ, వారి చేష్టల్నీ, నిందించీ, విమర్శించీ సాధించేదేమీ ఉండదు. ఏ సుఖశాంతులకోసమైతే సంఘధర్మాలకు కట్టుబడాలో, ఆ సుఖశాంతులకోసమే అవసరమైతే సంఘధిక్కారమూ చేయాలి. నిజమైన మేలుచేసే వారెప్పుడూ దాన్ని ప్రశ్నించి ధిక్కరించేవారే.
ఈ నవల పూర్తిగా చదివిన తర్వాత చిన్న రాజేశ్వరి అయినా మంచి జీవితం జీవిస్తే ఎంత బాగుండును అనిపిస్తుంది. ఆ చిన్న రాజేశ్వరి మంచి జీవితం జీవించాలంటే, మనుషుల మెదళ్ళూ, వ్యవస్థలూ, ప్రభుత్వాలూ, ఇజాలూ, అన్నీ కదిలే సమస్య ఇది. అర్ధవంతమైన ‘బాపు’ ముఖచిత్రంతో, ప్రఖ్యాత రచయిత్రి రంగనాయకమ్మగారు రాసిన నవలకిది ఐదవ ముద్రణ. -
-
Chalam Sahityam – చలం సాహిత్యం
₹40.00చలం సాహిత్యంలో స్త్రీ స్వేచ్ఛ’ని తీసుకుంటే, దానికి అనుకూలించే పాజిటివ్ అంశాన్ని, దానికి హాని కలిగించే నెగిటివ్ అంశాన్నీ వేరుపరచి, దేన్ని స్వీకరించాలో, దేన్ని తిరస్కరించాలో గుర్తించడం చాలా అవసరం.
ఈ సాహిత్యం మీద, ప్రారంభం నించీ చర్చలు సాగుతూనే వున్నాయి. మూడు రకాల ధోరణులు ఈనాటికీ వున్నాయి. చలంలో ఉన్న ఏ సానుకూలాంశాన్నీ పట్టించుకోకుండా, వ్యతిరేకాంశాల్ని మాత్రమే పట్టించుకొని, ‘చలం, పూర్తిగా తిరస్కరించదగ్గ రచయిత’ అని తేల్చే ధోరణి కొందరిది.
చలంలో వున్న ఏ వ్యతిరేకాంశాన్నీ గమనించకుండా ప్రతిదాన్నీ నిర్విమర్శగా స్వీకరించే ధోరణి మరికొందరిది.
గాఢంగా ఇష్టాలూ, తీవ్రమైన సందేహాలూ – రెంటితోనూ సతమతమయ్యే మూడో ధోరణి మిగతావాళ్ళది!
ఈ స్పందనలన్నీ ఈనాటికీ వున్నాయి.
చలం జయంతి సంవత్సరానికి వెనకటి నుంచీ ఆ మూడు ధోరణులూ కాని వింత ధోరణి ఇంకొకటి ప్రారంభమైంది. ‘స్త్రీ స్వేచ్ఛ’ పట్ల చలంలో దొరికే నెగిటివ్ అంశాలనే ఆదర్శాలుగా, ఆచరణీయాలుగా భావిస్తూ, చలం అవగాహన అంతా అదే అయినట్టు ప్రచారం చేసే ధోరణి అది!‘స్త్రీ స్వేచ్ఛ’ గురించి ఏ తెలుగు రచయితలోనూ సరైన అవగాహనలేని కాలంలో జరిగిన తప్పుల పట్ల చూపే సహనం, ఈనాటి తప్పులపట్ల చూపకూడదు. ఆనాటి తప్పులకు వర్తించిన క్షమాపణ, ఈనాటి తప్పులకు వర్తించదు.
-
-
Donga Tallidandruluntaaru Jaagrattha
₹150.00దొంగ తల్లిదండ్రులూ, దొంగ అత్త మామలూ, పాత కాలం నుంచీవున్నారు. “సతీ సహగమనాల” ముచ్చట్లు నిర్వహించిన వాళ్ళందరూ తల్లిదండ్రులూ, అత్తామామలూ, కారూ? ఈనాడు కూడా ‘పరువు హత్యల’ పేరుతో ఆడ పిల్లల్ని నరికివేసేది తల్లిదండ్రులు కారూ? పిల్లలు, హిమాలయ పర్వ్ఫతాలేక్కే ఘన కార్యాలు చేసి డబ్బు సంపాదించాలనీ పిల్లలు అక్కడ కొండల మధ్య రాలిపడి చచ్చినా, కొంత డబ్బు వస్తే చాలనీ చూసే తల్లిదండ్రులు కూడా, తల్లిదండ్రులు కారూ? కొండ ఎక్కడంలో బోలెడు మంది పడిపోతున్నారానీ, చస్తున్నారానీ, తెలీదు? – తెలుసు! కానీ డబ్బు రావాలి. పిల్లలు పొతే పోతారు! వాళ్ళే మరి తల్లిదండ్రులు.
ప్రతీ తల్లీ, ప్రతీ తండ్రి, దొంగలు గానే ప్రవర్తిస్తారని చెప్పడమూ ఇది? – కాదు. అలా చెప్పడం అయితే, నేనూ ఒక ‘దొంగ తల్లి’ నే అవుతాను. ప్రతీ ఒక్కరి గురించి అదే అర్ధంతో చెప్పడం కాదు ఇది. దొంగ తల్లిదండ్రుల పిల్లలు, తమ అవమానాలన్నీ ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. పెద్ద వాళ్ళయాక, దేన్నీ సాహించాలో, దేన్నీ తిరస్కరించాలో, ఆ రకంగా నడవాలి. తమ ప్రవర్తనలోకి క్రూర లక్షణాలు చేరనివ్వకుండా తమని తాము ధృఢ పరచుకోవాలి. ఇదే, కొత్త తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్త!.
-
English Keekaranyamloki Pravesinchandi – ఇంగ్లీష్ కీకారణ్యంలోకి ప్రవేశించండి
₹150.00ఇంగ్లీషు కీకారణ్యంలోకి….
ప్రతీ పరాయిభాషా ఒక కీకారణ్యమే, చిన్నదో పెద్దదో! ఆ కీకారణ్యంలోకి ప్రవేశించే ఏకైక మార్గం, దాని నియమాల్ని నేర్చుకుంటూ వెళ్ళడమే. ఆ నియమాల్ని, మాతృభాషలో వుండే నియమాలతో పోల్చుకుంటూ కూడా వెళ్ళాలి. భాషని నేర్చుకోవటానికి దాని వ్యాకరణంతో సంబంధం లేని సులువైన మార్గాలేవి వుండవు. అలాంటి ‘కిటుకు’లేవో వుంటాయని ఎన్నడూ భ్రమ పడకూడదు. భాషని నేర్చుకోవాలని నిజంగా కోరిక వుంటే, దాని వ్యాకరణం మీద కూడా ఇష్టం కలుగుతుంది. అయితే, వ్యాకరణ నియమాలు తెలుసుకోగానే ఆ భాషని అనర్గళంగా మాట్లాడగలమని అర్థం కాదు. వ్యాకరణం అనేది భాషలోకి ప్రవేశించడానికి సాధనం మాత్రమే. ఇక మిగిలినదంతా తర్వాత జరిగే కృషిమీదే ఆధారపడి ఉంటుంది.
కానీ, వ్యాకరణ నియమాలు తెలియడంవల్ల వెంటనే జరిగే మేలు ఏమిటంటే, ఇంగ్లీషు పుస్తకాలు చదివితే అర్థమవుతూ వుంటాయి. ‘ఇంగ్లీషు పుస్తకాలు’ అంటే, విద్యార్థుల స్థాయికి తగిన పుస్తకాలు. అంటే, విద్యార్థులు చదివే ఇంగ్లీషు పాఠాలు. అంతకుముందు అర్థంకాని వాక్యాలు, అక్కడవున్న నియమాలు తెలిసినప్పుడు ఎంతో తేలికగా అర్థమవుతాయి. అప్పుడు, ఆ భాష అంటే భయం పోతుంది. పైగా, కొత్త భాషని అర్థం చేసుకోగలుగుతున్నామనే ధైర్యం, సంతోషం ప్రారంభమవుతాయి. క్రమంగా అ భాషలోకి ప్రవేశం జరిగిపోతుంది.
ఒక పరాయిభాష పట్టుపడిందంటే, ఆ భాషలో నియమాలు నేర్చుకుంటేనే అది జరుగుతుంది. లేకపోతే, అది ఎవ్వరికీ, ఎప్పటికీ, సాధ్యం కాదు. కాబట్టి, ఒక భాష నేర్చుకోదల్చినవాళ్ళు మొట్టమొదట తెలుసుకోవలసింది ‘దాని వ్యాకరణం జోలికి పోకుండా అది సాధ్యం కాదు’ అని. ఈ సంగతి సరిగా అర్థం చేసుకుంటేనే భాషలు నేర్చుకోడం గురించి పొరపాటు అభిప్రాయాలన్నీ వదులుకుంటారు. ఏ భాష నేర్చుకోవాలనుకుంటున్నారో దాని వ్యాకరణం నేర్చుకోవటానికి తమని తాము సిధ్ధం చేసుకుంటారు.
-
-
Idi Manava Samajamena
₹50.00మానవులు ఉన్నది, ‘మానవ సమాజమే’ అవుతుంది. అయితే, ఆ సమాజంలో ఉన్న తీరు తెన్నుల్ని చూస్తే, అడుగడుగునా, ‘ఇది మానవ సమాజమేనా?’ అనే ప్రశ్న రావలసి ఉంటుంది. సమాజంలో ఉన్న మొత్తం సమస్యల్లో, తక్షణం మొట్టమొదట పరిష్కారం కావలసిన కౄర సమస్య ఒకటి ఉంది. మానవుల మనస్సుల్నీ, మేధస్సుల్నీ, అతి కౄరత్వంలోకి ఈడ్చిన ఈ సమస్య, అట్టడుగు కులపు హిందూ స్త్రీ పురుషుల్నీ, అతి బీద స్థితిలో ఉన్న ముస్లిం స్త్రీ పురుషుల్నీ, కొన్ని తెగల ఆదివాసీ స్త్రీ పురుషుల్నీ, యజమానుల ఇళ్ళల్లో ఉండే పాయిఖానా దొడ్లలోని మలమూత్రాల్నీ తమ స్వంత చేతులతో ఎత్తివేస్తూ శుభ్రాలు చేసే ‘పాకీ చాకిరీ’కి కట్టిపడేస్తుంది!
‘పాకీ చాకిరీ’ అనే దాన్ని, రోడ్లని ఊడ్చే పని లాగానో, చచ్చిన జంతువుల్ని పాతిపెట్టే పని లాగానో, జమ కడితే, పాకీ పనిలో ఉండే బాధల్నీ, అవమానాల్నీ, దుఃఖాల్నీ, అర్ధం చేసుకునేదేమీ ఉండదు. ధనిక మానవుల ఇళ్ళల్లో కుక్కులూ పిల్లులూ ఉంటే, వాటి మల మూత్రాల్ని ఎత్తడం కూడా ఆ ఇంటి సేవకులైన బీద మానవుల పనే కదా?
మానవులు నివసించే సమాజాన్ని గురించి, ‘ఇది, మానవ సమాజమేనా?’ అని ప్రశ్నించుకోవచ్చునా? అటువంటి ప్రశ్న ఎందుకు వచ్చిందో ఈ పుస్తకం చదివి తెలుసుకోండి..
– రంగనాయకమ్మ
-
-
Oka Vasthuvu Dhara Ki Aa Vasthuvu Kosam Jarigina Srama Ki Sambandam Ela Vuntundi?
₹50.00అసలు , ఏ ఉత్పత్తి కైనా “ధర” ఎందుకు , దేన్నీ బట్టి, ఏర్పడుతుంది? కొన్ని ఉత్పత్తులకు తక్కువ ధరా, కొన్ని ఉత్పత్తులకు ఎక్కువ ధరా, ఎందుకు ఉంటాయి? – ఈ రకంగా , ధరని గురించిన కారణం తెలుసుకోవాలనే ఆసక్తితో , వేల సంవత్సరాల నించి ఉత్సాహవంతులు, ఆలోచిస్తూనే వున్నారు. ఈ పరిశోధన, అరిస్టాటిల్ తో ప్రారంభమమై , 2 వేల సంవత్సరాలు గడిచే నాటికీ, రికార్డో దగ్గరికి వచ్చేటప్పటికి, ఒక చిన్న విషయం దొరికింది. అదేమిటంటే, “ఏ ఉత్పత్తి అయినా శ్రమల తోటే తయారవుతుంది: ఆ శ్రమల వల్ల తయారైన ఉత్పత్తిలో కొంత భాగం, పెట్టుబడి పెట్టిన వాడికి లాభంగా ఆందాల్సిందే” – ఇదే రికార్డో అన్నది! శ్రమల వల్ల తయారు కానీ వడ్డీలు , లాభాలు వంటివి, సరుకు ధరని ఏర్పరిచే :”శ్రమ కొలత” కి ఎలా కారణం అవుతాయి? — మర్క్స్ అవగాహన ఈ తర్కాలతో సాగింది.