-
Sraavani
₹275.00అదొక మహోజ్వల మహాయుగం.
నేటికి రెండు వేల సంవత్సరాల నాటి ఆంధ్రుల పరాక్రమ గాధ
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే క్రీస్తుశకం 78వ సంవత్సరం.
శక కర్త, శక హర్త అయిన శాలివాహన యుగపురుషుడు
గౌతమీపుత్ర శాతకర్ణి మొత్తం భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలమది.
నేటి గుంటూరు జిల్లాలోని అమరావతి వారి రాజధాని.
ఆనాటి ఆంధ్రుల సాహిత్యానికి సంస్కృతీకి.
నాగరికతకు అద్దం పట్టిన నవల శ్రావణి.
ఇదొక గద్య ప్రబంధం.
షడ్రసోపేతమైన విందు భోజనం.
నవరసభరితమైన వచన మహాకావ్యం.
-
Sri Lekha
₹275.00“ఖారమేలా! నీకు మనిషంటే భయం. నీ నీడంటేనే నీకు భయం. అందుకే నిరంతరం అప్రమత్తతో నిద్రలేకుండా బ్రతుకుతుంటావు. ఇనుప కవచాల కటకటాల మధ్య నిన్ను నీవే బంధించుకుంటూ, చుట్టూ వందలాది సైనికులను నీకు నీవే కాపలా పెట్టుకుని స్వేచ్ఛలేని జీవంలా అరుస్తూ, రోదిస్తూ జీవిస్తున్నావు. ఖారమేలా! ఇదీ ఒక జీవితమేనా? నీవు నిజంగా వీరుడవైతే ఈ పావురం కాలికి దెబ్బ తగిలింది. దీని కంటినీరు తుడవగలవా?” అని ప్రశ్నించింది. శ్రీలేఖ.
“ఏమే సీతలా, సావిత్రిలా ధర్మోపదేశాలు చేస్తున్నావు?”
“అనవసరంగా పౌరాణికపు పోలికలు వద్దు. నేను సీతనైతే, నీవు రావుణుడివి కావలసివస్తుంది.”
“ఓరోరి! ధాన్యకటకపు వన్నెల చిలక కూనిరాగాలు పాడుతుందిరా! దీనిని కట్టేసి మనం జరపబోయే సింహక్రీడలో ఆహారంగా పడేయండి”
“రసవత్తరమైన ఇటువంటి సంభాషణలతో నిండిన ఈ చారిత్రక నవల క్రీ.పూ.200సంవత్సరాలకు పూర్వం నేటి గుంటూరు జిల్లాలోని అమరావతి (ధాన్యకటకము) రాజధానిగా చేసుకుని పరిపాలించిన ఆంధ్ర శాతవాహనుల గాధ.
– ముదిగొండ శివప్రసాద్