• Andamaina Jeevitam - అందమైన జీవితం

    Andamaina Jeevitam – అందమైన జీవితం

    సృష్టిలోని అలౌకికమైన తీయదనాలలో ముఖ్యమైంది స్నేహం. దానిని అనుభవించ గలిగినవారికే దాని ప్రాముఖ్యత అర్ధమవుతుంది.

    అది ఇద్దరు మగవాళ్ళ మధ్య కావచ్చు. ఇద్దరు ఆడవాళ్ళ మధ్య కావచ్చు. లేక అరుదుగా ఓ మగ, ఓ ఆడ మధ్య కావచ్చు. అంతేకాదు వివాహితులైన ఆడ, మగ మధ్య కూడా కావచ్చు. స్నేహం విషయంలో వాళ్ళు ఆడ, మగ అవడం యాదృచ్ఛికం అవుతుంది.

    శృంగారపరమయిన భావాలకి లోను కాకుండా స్నేహం చేయగలగడం ఆడ, మగలకి సాధ్యం కాదా ? ఆ స్నేహంలోని మాధుర్యాన్ని నిష్కల్మషంగా చవి చూడగలగడం అనుభవం లోకిరాకూడదా ?

    పై బెర్త్‌లోంచి వినపడుతున్న భర్త గురక. రైలు ఏదో స్టేషనులో ఆగింది. బయట ఆరి వెలుగుతూ ఎగిరే మిణుగురు పురుగులు. శాంతి చేతిని బయటి పెట్టి ఎగురుతున్న మిణుగురు పురుగులను పట్టుకుని తన జుట్టు మీద ఉంచుకోసాగింది. చిన్నప్పుడు రాత్రిళ్ళు దొడ్లొకి వెళ్ళి మిణుగురు పురుగులని గ్లాసులో పట్టుకున్న సంఘటన గుర్తుకు వచ్చింది శాంతికి.

    సిగ్నల్‌ ఇవ్వడంతో రైలు మళ్ళీ బయలుదేరింది. శాంతి తన పెట్టె అందులోంచి తనడైరీ తీసి, అందులోంచి రెండు తెల్లకాగితాలని తీసి ఓ ఉత్తరం రాయడం మొదలుపెట్టింది.

    ‘డియర్‌ ప్రియతమ్‌,

    మీరు ఉత్తరం రాసి నాకు మీ చిరునామా తెలియగానే దానికి జవాబు రాయబోయే ముందు ఈలెటర్‌ మీకు పోస్ట్‌ చేస్తాను……..

    తన భర్త ‘ఇంక పడుకోరాదు’ అని పై బెర్త్‌లోంచి అరిచేదాకా శాంతి కిటికీకి ఆనుకుని కూర్చుని, కిటికిలోంచి పడే వెన్నెల వెలుగులో ప్రియతమ్‌కి తన మొదటి ఉత్తరం రాస్తూనే ఉంది – అంటూ ముగించారు శ్రీమల్లాది వెంకట కృష్ణమూర్తి గారు తమ అందమైన జీవితం నవలని.

    స్త్రీ పురుషుల మధ్య సెక్స్‌కి దారితీయని సుగంధ స్నేహసుధ సాధ్యమని నిరూపించే నవల ‘అందమైన జీవితం’.

    220.00
    Add to cart
  • Be The Best - బీ ది బెస్ట్‌

    Be The Best – బీ ది బెస్ట్‌

    ”పక్కింటి చిన్నూకి ఏ రేంక్‌ వచ్చింది?”

    ”నువ్వు రోహిత్‌ కన్నా ఇంగ్లీష్‌లో వెనకబడ్డావు. ఇలా ఐతే ఎలా?”

    ”గీత ఎంత చక్కగా పాడుతుందో! నువ్వూ ఉన్నావు ఎందుకు?”

    పిల్లలు వెనకబడి పోతున్నారనే బాధతో తల్లితండ్రులు సాధారణంగా చేసే విమర్శలు ఇవి. కానీ వాల్ళు ఎదగడానికి ఏ ముడి సరుకు, ఏ ఆలోచనలు ఇస్తున్నారో గ్రహించరు. పిల్లలకి తల్లితండ్రులు చిన్నప్పటి నించే స్ఫూర్తి నివ్వాలి. లైఫ్‌ స్కిల్స్‌ని బోధించాలి.

    ఇలాంటి అవసరం తీర్చడానికే మల్లాది వెంకటకృష్ణమూర్తి కథల రూపంలో రాసిన ‘బీ ది బెస్ట్‌’ కథల సంపుటి మీ చేతుల్లో ఉంది. దీనిలోని దాదాపు 150 పైగా చిన్న కథల ద్వారా లైఫ్‌ స్కిల్స్‌ని మీ పిల్లలకి బోధించవచ్చు. ఐఐటిలో సీట్‌ ఒక్కటే ముఖ్యం కాదు. జీవితంలో అన్ని రంగాల్లో విజ్ఞతగా, తెలివిగా ‘బీ ది బెస్ట్‌’గా ఎదిగేలా మీ పిల్లలు తయారవడానికి ఈ పుస్తకం సహకరిస్తుంది.

    పేజీలు : 160

    140.00
    Add to cart
  • Chantabbai

    Chantabbai

    తెనాలి రామకృష్ణ.
    షెర్లాక్ హోమ్స్.
    సాహిత్యంలో వీళ్ళద్దరి లక్షణాలని కలిపితే వచ్చే పాత్రే ఏకదంతం. డిటెక్టీవ్ యుగంధర్ ఏకలవ్య శిష్యుడైన ఏకదంతానికి, చాల ఏళ్ళ క్రితం దత్తత కెళ్ళిన చెంటబ్బాయ్ ని వెదికే పని అప్పగించబడింది.
    ఆ అన్వేషణ చుట్టూ జరిగే అనేక సంఘటనలు, పాత్రలతో అల్లిన “చంటబ్బాయ్” నవల ఉత్కంఠంతో సాగుతుంది. హాయిగా నవ్విస్తుంది.
    సస్పెన్స్. హాస్యం మిళితమైన “చంటబ్బాయ్” చిరంజీవి హీరోగా సినిమాగా కూడా వచ్చింది .
    స్టోరీ టెల్ లో శ్రవణనవలగా కూడా రూపొందింది.
    నలభై ఏళ్ళ క్రితం ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన “చెంటబ్బాయ్:” ఈ నాటికీ పాఠకులని అలరిస్తోంది.

    230.00
    Add to cart
  • Connect To God

    Connect To God

    మీ బిడ్డకి పేరు పెట్టాలనుకుంటే వీటిలో ఏ పేరుని ఎన్నుకుంటారు? రాముడు, రావణుడు.

    నిస్సందేహంగా మీరు మీ బిడ్డకి రావణుడు అనే పేరు పెట్టరు. మీ కుక్కకి కూడా రావణుడు అనే పేరు పెట్టరు. కుక్కకి కూడా గౌరవనీయమైన పేరు అవసరం. మరి మీ బిడ్డని పెంచేప్పుడు ఇదే శ్రద్ధని తీసుకుంటున్నారా? రావణుడిలోని ఏ లక్షణాల వల్ల మీ బిడ్డకి ఆ పేరు పెట్టకూడదని మీరు భావించారో, అవి మీ కొడుకులో కూడా కలగకుండా మీరు వాటిని నిరోధించేలా పెంచుతున్నారా? అలా పెంచకపోతే ఏ పేరు పెట్టినా గొడవే లేదు. ఈ పుస్తకంలో కథలు మీ బిడ్డల్లో మంచితనాన్ని పెంచి రాముడు లేదా సీతలా పెరిగేలా చేస్తాయి. రావణుడి, దుర్యోధనుడి లక్షణాలని తుంచేస్తాయి.
    210.00
    Add to cart
  • Dooram

    Dooram

    రచయితది హైద్రాబాద్. అభిమాన పాఠకురాలిది వైజాగ్.
    వ్యక్తిగత సమాచార మార్పిడికి ఉత్తరాలే ప్రధాన ఆధారమైన సంవత్సరం అది. 1976.

    అభిమాని, రచయితల మధ్య ఆరంభమైన ఉత్తరాలు చివరికి వారి పెళ్ళికి ఎలా దారి తీసాయి? ఆ ఉత్తరాల్లో ఏం రాసుకున్నారు?

    ఒకరితో మరొకరికి ముఖపరిచయం కూడా లేని వారి సంబంధం పెళ్ళి దాకా ఎలా వెళ్ళింది?.

    ఈ ప్రేమ నవలంతా కేవలం ఉత్తరాల ద్వారానే నడవడం విశేషం.

    ఆంధ్రభూమి వీక్లీకి మీ అభిమాన రచయిత మల్లాది తొలుత రాసిన ఈ రొమాంటిక్ సస్పెన్స్ సీరియల్ ద్వారా పాఠకులని ఆకట్టుకుని తర్వాత ధర్మయుద్ధం, ఈ గంట గడిస్తే చాలు లాంటి ఎన్నో నవలలని అందించారు.

    షరా : ఇతరుల ఉత్తరాలు చదవడంలోని ఆనందం, వాటికి సమాధానాలు ఇవ్వనవసరం లేదు.

    ఈ నవలతో పాటు మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ఒకటి ఒంటరి అంకె అనే నవల కూడా ఉంది.

    చదవండి! చదివించండి!!

    230.00
    Add to cart
  • Misrani

    Misrani

    ఇది సస్పెన్స్ నవల కాదు. క్రై0 నవల కాదు.

    ఇది స్వతంత్రానికి పూర్వం జైపూర్ సంస్థానానికి చెందిన 84 ఏళ్ళ ఓ మహిళ కథ. కాబట్టి విభజనకి పూర్వం భారతీయ చరిత్ర ఇందులో చదవచు.

    ఇంకా సినిమా అవుట్ డోర్ షూటింగ్ విశేషాలు , వివిధ భారతీయ వంటకాల గురించి, ఓ మహిళ జీవితంలోని అనేక మలుపు తిప్పిన సంఘటనల గురించి ఇందులో చదవచ్చు.

    ఒకటి ఒంటరి అంకె , అందమైన జీవితం, మందాకినీ , జాబిలి మీద సంతకం నవలల్లా ఇది కూడా ఓ మహిళ జీవిత కథ.

    మీ అభిమాన రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి అందిస్తున్న 108 వ నవల మిస్రాణి

    260.00
    Add to cart
  • Oh My God

    Oh My God

    దైవ భక్తి, ధ్యానం, దాన్ని నేర్పే గురువులు, వారి ధ్యాన పద్ధతులు, ఆ సంస్థల వివరాలతో పాటు నిత్య జీవితంలో చేయగలిగే కొన్ని సాధనల గురించి మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ఆధ్యాత్మిక వ్యాస సంకలనమే ‘ఓ మై గాడ్.

    ఈ పుస్తకం ఆధ్యాత్మిక సాధకులకే కాక దాని మీద అభిరుచి గల పాఠకులకి కూడా ఉపయోగిస్తుంది. సాధనలో కలిగే అనేక సందేహాలని నివృత్తి చేస్తుంది.

    200.00
    Add to cart
  • Prayanam

    Prayanam

     ‘రాజశుక. మంచి పేరు పెట్టారు.’ పూజారి మెచ్చుకున్నాడు.

    ‘నాకు కొడుకు పుట్టాడని మా నాన్నగారికి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన భాగవతం మొదటి స్కంధం చదువుతున్నారు. ఆయనే ఈ పేరు సూచించారు.’ రాజశుక తండ్రి సుబ్బరాజు వివరించాడు.

    ‘పాలు పితికినంత సేపు రాజశుక ఒక చోట ఉండడు.’ పెద్దయ్యాక రాజశుక విన్నాడు.

    ఆర్నెలల్లో 11 జ్యోతిర్లింగాలని రాజకుశ ఏ లాభం కోరి సందర్శించాడు?

    రాజశుక తన ఆథ్యాత్మిక ప్రయాణంలో, తీర్థ యాత్రల్లో ఏం నేర్చుకున్నాడు?

    అతనికి అనేక చోట్ల కలిగిన వివిధ అనుభవాలు ఏమిటి?

    హిందూ సంప్రదాయంలోని సన్న్యాసాశ్రమం నియమాలు ఏమిటి?

    ఆసక్తి కలిగించేలా, హాయిగా చదివించేలా ఆథ్యాత్మికతని రాయగల మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల ప్రయాణం.

    జయం, పరంజ్యోతి, విధాత నవలల తర్వాత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నాలుగో ఆధ్యాత్మిక నవల ప్రయాణం.

    295.00
    Add to cart